For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తెలుపు..ఎరుపు..గ్రే ..అసలు జుట్టు రంగు ఎలామారుతుంది...?

|

How to get White Hair..
మనకు వయస్సు పెరుగుతున్న కొద్దీ నల్లగా ఉండే జుట్టు నెమ్మదిగా రంగు మారి తెల్లగా, వెండిలా మెరవడం మొదలెడుతుంది. ఇది సహజ లక్షణమే అయినా, జుట్టు రంగు మారడం వల్ల మనలో వృద్ధాప్యం వచ్చేసిందినే భావనతో ఆందోళన ఆరంభమవుతుంది. నల్లగా నిగనిగలాడే జుట్టు కోసం అప్పటినుంచి జుట్టుకు రంగు వేయడం మొదలెడతాయి.

అసలు జుట్టు రంగు ఎలా వస్తుంది? రంగు ఎందుకు మారుతుందనే విషయాలు మనకు ఆసక్తికరంగా ఉంటాయి. మన తల మీద ఉండే ప్రతి వెంట్రుకా రెండు భాగాలతో నిర్మితమై ఉంటుంది. మొదటి భాగం పైకి మనకు కనిపించేది. దీనిని షాప్ట్ అంటారు. రెండవ భాగం చర్మం కింద ఉంటుంది. దీనిని వెంట్రుకల మూలం లేదా రూట్ అంటారు. ప్రతి వెంట్రుక మూలం చుట్టూ ఒక గొట్టం లాగా కణజాలం చుట్టుకుని ఉంటుంది. దీనిని ఫాలిక్ అంటారు. ఇందులో పిగ్ మెంట్మ సెల్స్ ఉంటాయి. ఈ కణాలు నిరంతరంగా మెలానిన్ అనే రసాయనాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ మెలానిన్ కారణంగా మన జుట్టు బ్రౌన్, ఎరుపు మొదలైన రంగుల్లో కనిపిస్తుంటి.

మనిషి చర్మానికి రంగును ఇచ్చే మెలానిన్ పదార్థమే జుట్టుకు కూడా రంగును ఇస్తుంది. ఒక వ్యక్తి ఎండలో తిరిగిన్పుడు నల్లగా అవుతాడా?లేదా? అనే అంశాన్ని నిర్ధారించేది ఈ మెలానినే. మనిషి వృద్ధాప్యం వస్తున్న కొద్దీ ఫాలికిల్స్ లో ఉండే పిగ్మెంట్ కణాలు క్రమంగా నశిస్తాయి. ఫాలికిల్ లో కొద్దిపాటి పిగ్మెంట్ కణాలే మిగిలినప్పుడు జుట్టుకు అవసరమైన స్థాయిలో మెలానిన్ అందదు. దీనితో జుట్టు నెమ్మదిగా రంగు మారుతుంది.

గ్రే, సిల్వర్, తెలుపు రంగుల్లోకి మారుతుంది. వృద్ధాప్యం మీద పడుతున్న కొద్దీ పిగ్మెంట్ కణాల సంఖ్య బాగా తగ్గి, కొద్దిపాటి స్థాయిలోనే మెలానిన్ ఉత్పత్తి అవుతుంది. దీనితో జుట్టు పూర్తిగా గ్రే లేదా తెలుపు రంగులోకి మారుతుంది. జుట్టు తెల్లబడటమనేది ఏ వయస్సులోనైనా జరుగవచ్చు. చిన్నప్పుడు స్కూల్ కు వెళ్లే వయస్సులోనో, కాలేజీకి వెళ్లే వయస్సులోనో జుట్టు తెల్లబడవచ్చు. కొంతమందికి ముప్పై నుంచి నలభై సంవత్సరాల వయస్సులోనే జుట్టు తెల్లబడవచ్చు. ఒక వ్యక్తి జుట్టు ఎంత త్వరగా తెల్లబడుతుందనేది ఆ వ్యక్తి జన్యువులపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా తల్లిదండ్రులకు ఏ వయస్సులోకి అడుగు పెట్టగానే జుట్టు తెల్లబడటం ఆరంభమవుతుంది.

English summary

How to get White Hair....? | అసలు జుట్టు రంగు ఎలామారుతుంది...?

Having white hair is usually regarded as a sign of aging. While graying hair and white hair can look distinguished on some people, for many the prospect of their hair turning white is something that is not appealing at all. It is quite common for hair to turn white and among people above thirty; it is not rare to find white hair and a balding pate as well.
Story first published:Friday, April 27, 2012, 18:45 [IST]
Desktop Bottom Promotion