For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కేశ సంరక్షణకు ఉసిరి, నిమ్మ....!

|

Lemon -Gooseberry in Hair Care
కేశాలు పట్టుకుచ్చులా ఉండి పొడవాటి జడతో మురిసిపోవాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. కానీ ఎంతకీ ఎదగని జడ మదిలో కలవరపెతుంటుంది. రకరకాల ప్రయోగాలు చేయాలని ఉన్న కేశాలు ఒత్తుగా లేక ఊరికుండిపోతారు. ముఖ్యంగా కేశసంరక్షణలో చుండ్రు, పొడిబారిపోవడం వంటి సమస్యలు మహిళలని కలవరపరిచే సమస్యలే..ఒత్తిడి, అనారోగ్యాలు, జీవనశైలి మార్పులు ఈ పరిస్థితికి ప్రధాన కారణం. ముఖ్యంగా మొదటగా కేశాలు ఆరోగ్యంగా పెరగాలనుకుంటే చుండ్రు లేకుండా చూసుకోవాలి అప్పుడే వెంట్రుకలు బాగా పెరుగుతాయి.

నిత్యం నూనె రాస్తూ ఎన్ని జాగ్రత్తలు తీసుకొంటున్నా చుండ్ర సమస్య వేధిస్తుంటే దానికి జింక్ లోపం కూడా ఒక కారణమే. జింక్ పుష్కలంగా లభిస్తే తలలో చుండ్రు బాద తప్పుతుంది. దాంతో పాటు జుట్టు పొడిబారే సమస్యా తగ్గుతుంది. గుమ్మడి గింజల్లో జింక్ పుష్కలంగా ఉంటుంది. ఆహారంలో వీటిని జోడించుకోవడం వల్ల పొడవైన ఆరోగ్యవంతమైన కేశాలు మీసొంతమవుతాయి. వీటితోపాటు తణధాన్యాలు, బాదం, సారడైన్ సముద్ర చేపలు నుంచి జింక్ లభిస్తుంది. రోజుకూ 8 నుండి 10 గ్లాసుల నీళ్ళు తాగి సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఫలితం ఉంటుంది.

1. రాత్రిళ్లు అరకప్పు వేప నూనెను వేడిచేసి అందులో నాలుగు చెంచాల కర్పూరం పొడిని కలపి తలకు మర్ధన చేసి షవర్ క్యాప్ పెట్టుకోవాలి. మర్నాడు గోరువెచ్చటి నీళ్లతో తలస్నానం చేస్తే చుండ్రు సమస్య తగ్గి వెంట్రుకలు బాగా పెరుగుతాయి.

2. ఒక కప్పు గంధం పొడిలో తగినంత నిమ్మరసం కలిపి మిశ్రమంలా తయారు చేయాలి. తలస్నానం చేసిన మర్నాడు పూతలా వేసి రెండు గంటలయ్యాక కడిగేయాలి. ఇలా తరచూ చేస్తుంటే చుండ్రు క్రమంగా దూరమవుతుంది.

3. వేపాకులను వెండబెట్టి పొడి చేసి అందులో తగినన్ని నీళ్లు కలిపి మరిగించాలి. చల్లారక వడపోసి వచ్చిన డికాషన్ మాడుకు రాయాలి. అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది.

4. అర లీటర్ నీళ్లలో కప్పు ఉసిరిపొడి కలిపి రాత్రంతా నానబెట్టాలి. మర్నాడు పొయ్యి మీద పెట్టి బాగా మరిగించాలి. నీళ్లు బాగా ఇంకిపోయేవరకూ ఉంచి దింపుకొని చల్లరాక అందులో పెరుగు కలిపి శిరోజాలకు రాసి గంట తర్వాత కడిగితే సరిపోతుంది. ఇలా రెండు వారాకోసారి చేయడం వల్ల చుండ్రు సమస్య నియంత్రణలో ఉంటుండి.

5. వాడేసిన నిమ్మచెక్కలను ఎండబెట్టి పొడిచేసి కొన్ని నీళ్లు కలిపి మాడుకు పూతలా వేయాలి. కడిగిన తర్వాత తలకు ఆవిరి పడితే కుదుళ్లు బలంగా పెరుగుతాయి. నెలలో రెండు సార్లైనా ఇలా చేయడం వల్ల మెరుగైన ఫలితం కనిపిస్తుంది.

English summary

Lemon -Gooseberry in Hair Care....| కేశ సంరక్షణకు ఉసిరి, నిమ్మ....!


 Everybody experience hair loss. But it is a big concern if the rate of hair loss is eventually higher than the rate of hair growth. Excessive use of chemicals for styling/ washing your hair, lack of nutrition, dirty scalp, exposure of dust and heat are some of the reasons of hair fall.
Story first published:Wednesday, April 11, 2012, 17:16 [IST]
Desktop Bottom Promotion