For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టు రాలడాన్ని తగ్గించే మన వంటగది వస్తువులు

|

ప్రస్తుత రోజుల్లో హెయిర్ ఫాల్ అనేది ఒక ప్రధానమైన సమస్యగా మారింది. హెయిర్ ఫాల్ కు అనేక కారణాలున్నాయి. వాతావరణ మార్పుల నుండి డైట్ వరకూ, జుట్టుకు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, జుట్టు రాలడానికి అనేక కారణాలున్నాయి. జుట్టు రాలడానికి ఎన్ని కారణాలున్నా, జుట్టు సంరక్షణకు అంతకంటే ఎక్కవ మార్గాలే ఉన్నాయి. జుట్టు సంరక్షణ కోసం అనేక వస్తువులను బ్యూటీ ప్రొడక్ట్స్ గా ఉపయోగిస్తుంటాం. ఉదాహరణకు పెరుగు, నిమ్మరసం, నూనె లేదా ఉడికించిన మందారపువ్వులు మరియు మరికొన్ని వస్తువులను మీ జుట్టుకు పట్టించాలనుకొన్నప్పుడు మీరు వంద శాతం తప్పనే చెప్పాలి!

ఖరీదైన హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్స్ తీసుకొనే బదులు, నేచురల్ గా హెయిర్ ఫాల్ తగ్గించడానికి కొన్ని హోం రెమడీస్ ను ఉపయోగించండి. కొన్ని సాధారణ, సింపుల్ వంటగది వస్తువులతోనే జుట్టు రాలడాన్ని తగ్గించుకొని, జుట్టు పెరుగుదలను ప్రోత్సహించుకోవచ్చు. హెయిర్ కేర్ వస్తువుల్లో ఆమ్లా(ఉసిరి), ఆముదం, గుడ్డు, పెరుగు, వెనిగర్, మెహింది, వేపాకు, ఆలివ్ ఆయిల్ వంటివి వివిధ ప్రయోజనాలకు కొరకు ఉపయోగిస్తుంటారు. ఉదాహరణకు గుడ్లు, కొబ్బరి మరియు ఆమ్లా వంటివి మన వంటగదిలో చాలా సులభంగా లభ్యం అవుతాయి. జుట్టు రాలడాన్ని అరకట్టడం కోసం వీటిని హోం మేడ్ హెయిర్ ప్యాక్ లలో ఉపయోగించుకోవచ్చు.

జుట్టు రాలడాన్ని నేచురల్ గా తగ్గించడం కోసం వేప ఆకులను ఉడికించి ఉపయోగించుకోవచ్చు. మరియు దీన్ని మరికొన్ని ప్రయోజనాలకు కూడా ఉపయోగించుకోవచ్చు. వేపాకులలో యాంటీబ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ సెప్టిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ గుణాలు తలలో పేలను తగ్గించడమే కాదు, చుండ్రును కూడా వదలగొడుతుంది. అదేవిధంగా ఉల్లిపాయ, ఉల్లిపాయ రసాన్ని కేశాలకు పట్టించడం ద్వారా జుట్టు మంచి పోషణ లభిస్తుంది.

మెంతులను హెయిర్ ఫాల్ తగ్గించికోవడానికి మరియు జుట్టు తగ్గించడానికి ఉపయోగించుకోవచ్చు. హాట్ ఆయిల్ మసాజ్ తో పాటు ఈ క్రింది స్లైడ్ లో ఇవ్వబడిన నేచురల్ బ్యూటీ ప్రొడక్ట్స్ ను కూడా ఉపయోగించుకోండి....

మెంతులు:

మెంతులు:

మెంతుల్లో అనేక హెయిర్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది, పొడి జుట్టు నివారిస్తుంది. చుండ్రును వదలగొడుతుంది. జుట్టుకు కండీషన్ లా పనిచేసి సాప్ట్ గా మార్చుతుంది.

వేపాకు:

వేపాకు:

వేపాకులో యాంటీబ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది మరియు తలలో ఇతర ఇన్ఫెక్షన్స్ ను తగ్గిస్తుంది.

ఆరెంజ్:

ఆరెంజ్:

సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుండి. ఇది హెయిర్ ఫాల్ ను నేచురల్ అడ్డుకుంటుంది. ఇంకా ఆరెంజ్ జుట్టును శుభ్రపరుస్తుంది మరియు తలలో జిడ్డును తొలగిస్తుంది.

నిమ్మరసం:

నిమ్మరసం:

నిమ్మరసం ఒక అద్భుతమ హెయిర్ కేర్ వస్తువు. ఇది చుండ్రును వదిలించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా హెయిర్ లాస్ తో పోరాడుతుంది చిట్లిన జుట్టును నివారిస్తుంది.

అరటిపండు:

అరటిపండు:

బాగా పండిన అరటి పండును చిది తలకు, కేశాలకు పట్టించి అరగంట తర్వాత శుభ్రం చేసుకుంటే జుట్టు రాలడాన్ని తగ్గించి ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తుంది.

ఉల్లిపాయ:

ఉల్లిపాయ:

ఉల్లిపాయల్లో సల్ఫర్ అధికంగా ఉంటుంది, ఇది జుట్టు రాలడాన్ని అరికడుతుంది మరియు జుట్టు బలంగా ఉంచుతుంది. ఇంకా జుట్టుకు అవసరం అయ్యే పోషణను అంధిస్తుంది.

ఆమ్లా:

ఆమ్లా:

ఉసిరికాయ ఒక బెస్ట్ హెయిర్ కేర్ ప్రొడక్ట్, ఇది హెయిర్ ఫాల్ అరికడుతుంది, చుండ్రు మరియు తలలోని ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది.

కొబ్బరి నూనె/కొబ్బరి పాలు:

కొబ్బరి నూనె/కొబ్బరి పాలు:

ఇవి జుట్టుకు పోషణ అంధించడంతో పాటు, కొబ్బరిపాలు లేదా కొబ్బరి నూనె జుట్టు పొడిబారడాన్ని తగ్గిస్తుంది. ఇంకా కేశాలు సాఫ్ట్ గా మరియు షైనీగా తయారుచేస్తుంది.

ఆముదం:

ఆముదం:

జుట్టు పెరుగుదలకు ఉపయోగపడే హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ లో మరో అద్భుతమైన వస్తువు ఆముదం. ఇది హెయిర్ గ్రోత్ ను పెంచుతుంది.నేచురల్ గానే హెయిర్ ఫాల్ ను తగ్గిస్తుంది.

రీతా:

రీతా:

శీకాకాయ/కుంకుడుకాయ జుట్టు యొక్క కలర్ కు రక్షణ కల్పించే హెయిర్ కేర్ బ్యూటీ ప్రొడక్ట్ ఇది . ప్రజలు వీటిని గ్రేహెయిర్ నివారించడానికి ఉపయోగిస్తుంటారు. అయితే, రీతాను పెరుగుతో మిక్స్ చేసి, తలకు అప్లై చేస్తే హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది.

పెరుగు:

పెరుగు:

జుట్టు రాలడాన్ని తగ్గించే ఒక ఎఫెక్టివ్ హెయిర్ బ్యూటీ ప్రొడక్ట్ ఇది. పెరుగును ఇతర వంటగది వస్తువులు(తేనె లేదా నిమ్మరసం)తో మిక్స్ చేసి తలకు అప్లై చేసుకోవచ్చు.

పాలు:

పాలు:

పాలను తలమీద పోసుకోవడం వల్ల కేశాలు సాఫ్ట్ గా మారుతాయి. మరియు కేశాలకు నేచురల్ గా కండీషన్ అంధించబడుతుంది. ఇంకా, కేశకణాలకు బలాన్ని చేకూర్చుతుంది దాంతో జుట్టు పెరగడాన్ని ప్రోత్సహిస్తుంది.

వెల్లుల్లి:

వెల్లుల్లి:

గార్లిక్ లో సల్ఫర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మంలోపల కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది హెయిర్ గ్రోత్ కు బాగా సహాయపడుతుంది. జుట్టు రాలడంతో పోరాడుతుంది.

జామకాయ:

జామకాయ:

జామకాయలో విటమిన్ ఎ మరియు విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. ఇవి రెండూ కూడా, కొత్తగా జుట్టు పెరగడాన్ని ప్రోత్సహిస్తాయి. జామకాయను మెత్తగా పేస్ట్ చేసి, నిమ్మరసం లేదా పెరుగు మిక్స్ చేసి తలకు పట్టిండం వల్ల హెయిర్ ఫాల్ తగ్గుతుంది.

చెర్రీస్:

చెర్రీస్:

చెర్రీస్ లో బయోఫ్లెవనాయిడ్ ఎక్కువగా ఉన్నాయి. ఇవి జుట్టు రాలడాన్ని అరికడుతాయి. వీటిని బాగా మెత్తగా చేసి తలకు పట్టించాలి.

English summary

15 Kitchen Ingredients To Reduce Hair Fall

Hair loss is one of the major hair problems these days. There are many causes of hair fall. From seasonal changes to diet to improper hair care, the causes of hair fall are numerous. There are several beauty ingredients that can be used for hair care.
Desktop Bottom Promotion