For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిగనిగలాడే నల్లని జుట్టు మీ సొంతం కావాలంటే: చిట్కాలు

|

నల్లని ఒత్తైన జుట్టు ఆడవారికి మరింతగా అందాన్ని చేకూరుస్తాయి. అందుకే తమ అందానికి ప్రతిరూపమైన నల్లని నిగనిగలాడే జుట్టుకోసం ఆశపడని స్త్రీలు ఉండరంటే అతిశయోక్తి కాదు. కాని కొందరికి వెంట్రుకలు రాగి రంగులో నిర్జీవంగా ఉంటాయి. అలాంటి వారు నల్లని జుట్టు పొందడానికి చేయని ప్రయత్నమంటూ ఉండదు. అందమైన, నల్లని కురుల సంపద కోసం ఆడవారి తాపత్రయం చాలా ఉంటుంది. ఎవరికైనా ఒతైన జుట్టు కావాలని కోరుకుంటారు. అయితే జుట్టు పట్ల సరైన జాగ్రత్తలు, సంరక్షణ కలిగి వుంటే కురులను కాపాడుకోవచ్చు. అందుకే మీరూ నల్లని కురులను సొంతం చేసుకోవాలనుకుంటే ఈ సలహాలు పాటించి చూడండి. నల్లగా నిగనిగలాడే అందమైన కురులు మీ సొంతమౌతాయి.

మీరు మీ జుట్టుని అందంగా, నల్లగా ఉండాలి అని కోరుకుంటున్నారా,తెల్ల జుట్టు వస్తే "హేయిర్ డయర్" వాడాలేమో అని భయపడుతున్నారా. ఐతే ఇంకెందుకు ఆలస్యం, అతి తక్కువ ఖర్చుతో, మీ ఇంట్లోనే, సహజమైన పద్దతులతో మీ జుట్టుని కాపడుకోవడం ఎలాగో తెలుసుకుందాం రండి.

పొడవైన,అందమైన,తళ, తళ లాడే జుట్టు మీ సొంతం కావాలంటే ఇలా చేస్తే సరి:

 Home Tips To Get Black Hair Naturally

1. అరలీటరు నీరులో రెండు చెంచాల ఉసిరిపొడి కలపండి,నిమ్మకాయని సగంగా కోసి,ఒక ముక్కలోని రసాన్ని ఆ నీటిలో కలపండి,ఈ మిశ్రమాన్ని రోజూ మీ తలకు రాసుకుని తలస్నానం చేస్తే అతి తక్కువ సమయంలో, అందమైన నల్లని జుట్టు మీ సొంతం అవుతుంది.

2. 1 KG కాచిన వెన్న (నెయ్యి)తీసుకుని, 250 గ్రాములు " liquorice(muleatia)" (దీనిని ఎక్కువగా మందులు మరియు స్వీట్స్ తయారిలో ఉపయోగిస్తారు) తీసుకుని, 1 లీటరు ఉసిరి రసం కలిపి, వేడి చేసి ఒక సీసాలో ఉంచుకోవాలి, తలస్నానం చేసే ముందు, మీ తలకు రాసుకుని, చేస్తే సులభంగా నల్లని జుట్టు మీ సొంతం అవుతుంది.

3. కొన్ని మామిడి ఆకులు తీసుకుని వాటిని పేస్ట్ లాగా చేసుకుని, తలకు పట్టించాలి, 15-20 నిమిషాల తరువాత, చల్లని నీటితో శుబ్రంచేసుకుంటే, అది మీ జుట్టు పెరుగుదలకే కాక అందమైన నల్లని జుట్టుని మీ సొంతం చేస్తుంది.

4. కొన్ని మామిడి ఆకులు, పచ్చి మామిడి పైన పచ్చని తొక్కను తీసుకుని,వాటిని పేస్ట్ లాగా చేసి,నూనెతో కలిపి ఎండలో ఎండబెట్టాలి,ఈ మిశ్రమాన్ని మీ జుట్టుకు పట్టించి శుబ్రం చేసుకుంటే జుట్టు ఊడిపోయే సమస్య తగ్గి అందంగా సహజమైన నల్లని జుట్టు పొందవచ్చు.

5. మీ తెల్ల జుట్టుని నల్లగా మార్చికోవాలి అనుకున్న, లేదా చిన్న వయస్సులోనే తెల్లజుట్టు రాకుండా ఉండాలన్నా మామిడి యొక్క రసాన్ని తీసుకుని తలకి పట్టిస్తే మంచి ఫలితాన్నిస్తుంది, జుట్టు రాలిపోవడం,చుండ్రు సమస్యల నుంచి కూడా మంచి విముక్తి లభిస్తుంది.

English summary

Home Tips To Get Black Hair Naturally

In case you are fond of thick black hair but don’t wish to depend on any hair coloring products, then resorting to natural remedies is the best solution.
Desktop Bottom Promotion