For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సాఫ్ట్ అండ్ షైనీ హెయిర్ కోసం ఫ్రూట్ కండీషనర్

|

ప్రస్తుత కాలంలో జుట్టు రాలడం అనేది సాధారణ సమస్యగా మారింది. ఇది ఒక్క మహిళలల్లోనే కాదు, పురుషుల్లో కూడా అధికంగా కనబడుతోంది. ముఖ్యంగా అందుకు కారణం వంశపారంపర్యం, ఒత్తిడి, ఆహార అసమతుల్యతలు మరియు ఎక్కువ స్థాయిలో డిహైడ్రోటెస్టోస్టిరాన్ స్థాయి ఎక్కువగా ఉండటం. ఈ కారణాల చేత జుట్టు రాలిపోతుంటే తల స్నానం చేసిన ప్రతి సారీ కండీషన్ అప్లై చేయాడం చాలా ఆరోగ్యం కరం. హెయిర్ కండీషన్ తో చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

హెయిర్ కండీషన్ కురులు రాలిపోకుండా మ్యానేజ్ చేయడమే కాకుండా జుట్టును మెత్తగా, సిల్కీగా, సాఫ్ట్ గా మార్చుతాయి. చాలా మంది మంచి ఫలితాల కోసం తలకు ఏ షాంపూను ఉపయోగిస్తారో అదే కండీషనర్ ను ఉపయోగిస్తారు. రసాయనాలతో కూడిన హెయిర్ కండిషనర్స్ ను ఉపయోగించడం కంటే ఇంట్లో ఉండు పండ్లతో సహజ కండీషనర్ ను కురులకు పట్టించండం చాలా ఆరోగ్యం కరం. ఇది కనుక మీకు నచ్చినట్లేతే కొన్ని ఫ్రూట్ హెయిర్ కండీషనర్ ను మీరూ ప్రయత్నించండి.

హోం మేడ్ ఫ్రూట్ హెయిర్ కండీషనర్స్ ను పెరుగు, బీర్, వెనిగర్ లేదా గుడ్లతో తయారు చేస్తారు. మరి వీటితో పండ్లను ఏవిధంగా ఉపయోగించాలి, కురులు సున్నితంగా, మెరిసేలా ఎలా కురులకు కండీషన్ చేయాలి? తెలుసుకోవాలంటే క్రింది ఇచ్చిన కండిషనర్స్ ను చదివి మీరు కూడా ప్రయత్నించి మీ పొడి, చుక్కబడిన జుట్టు నుండి విముక్తి పొందండి...

పట్టులాంటి కేశ సౌందర్యానికి ఫ్రూట్ కండీషనర్

అరటి: అరటి ఆరోగ్యానికి, చర్మ సౌందర్యానికి మాత్రమే కాదు, కురులకు కూడా చాలా ప్రయోజనకారి. ఈ హోం రెమెడీ చిక్కుబడిని, పొడిబారిన,నిర్జీవమైన కురుకు బాగా పనిచేస్తుంది. అందుకు అరటి పండును మెత్తగా చేసి అందులో పెరుగు, నిమ్మరసం, పాలు వేసి బాగా మిక్స్ చేసి తలకు బాగా పట్టించాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే మెత్తటి, నునుపైన కురులు మీ సొంత అవుతాయి.

పట్టులాంటి కేశ సౌందర్యానికి ఫ్రూట్ కండీషనర్

బొప్పాయి: బొప్పాయిని బాగా గుజ్జులా చేసి అందులో పెరుగు, రెండు చుక్కల గ్లిజరిన్ కలిపి బాగా మిక్స్ చేసి తలమాడు నుండి కేశాలకు పూర్తిగా పట్టించి అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే, ఒత్తైన సున్నితమైన, షైనీ హెయిర్ మీసొంతం అవ్వడమే కాకుండా జుట్టు చిట్లడానికి ఆపు చేస్తుంది.

పట్టులాంటి కేశ సౌందర్యానికి ఫ్రూట్ కండీషనర్

అవొకాడో: కేశాలకు మరో అద్భుతమైన హెయిర్ కండీషనర్ అని చెప్పవచ్చు. అవోకాడోను ఉడికించి గుజ్జులా తయారు చేసి అందులో కొన్ని చుక్కల తేనె, షీ బట్టర్, ఆపిల్ సైడర్ వెనిగర్ మరియు పెరుగు కలిపి బాగా మిక్స్ చేసి తలకు బాగా పట్టించాలి అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

పట్టులాంటి కేశ సౌందర్యానికి ఫ్రూట్ కండీషనర్

పీర్(బేరికాయ): బేరికాయ హెయిర్ కండీషనర్ చాలా పాపులర్. బేరికాయను మెత్తగా చేసి అందులో షీబాటర్, కొబ్బరి నూనె మరియు తేనె మిక్స్ చేసి తలకు బాగా ప్టించి. తలకు కవర్ చుట్టేయాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. దాంతో కురులు సాప్ట్ గా మారుతాయి.

పట్టులాంటి కేశ సౌందర్యానికి ఫ్రూట్ కండీషనర్

స్ట్రాబెర్రీ: సిల్కీ, గ్లాసీ హెయిర్ పొందాలంటే ఈ హోం మేడ్ హెయిర్ కండీషనర్ బాగా పనిచేస్తుంది. స్ట్రాబెర్రీని మెత్తగా చేసుకొని అందులో పెరుగు చేర్చి బాగా మిక్స్ చేసి కురులకు పట్టించి అరగంట తర్వాత చల్లటి నీటితో తలస్నానం చేసుకోవాలి. స్ట్రీబెర్రీ తో పాటు పాలను కూడా మిక్స్ చేసుకోవచ్చు.

పట్టులాంటి కేశ సౌందర్యానికి ఫ్రూట్ కండీషనర్

ఆరెంజ్: సిట్రస్ జాతికి చెందిన ఆరెంజ్ లో విటమిన్ సి అధికంగా ఉండి, శరీరానికి కావాలసినంత ఫైబర్ కంటెంట్ ను అంధించడంతో కురులకు కూడా బాగా ఉపయోగపడుతుంది. కేశలాను దృఢంగా పెరిగేలా చేసే రూట్ కెనాల్ కు కావలసినంత బీటా కెరోటిన్ అంధిస్తుంది.

పట్టులాంటి కేశ సౌందర్యానికి ఫ్రూట్ కండీషనర్

జామ మరియు తేనె హెయిర్ కండీషనర్: ఇది మరొక అద్భుతమైన హెయిర్ కండీషనర్. తేనె కురులకు మంచి మెరుపు నివ్వడమే కాకుండా కురులను స్ట్రాంగ్ గా ఉంచుతుంది. ఇక జామకాయలోని విటమిన్ ఎ మరియు విటమిన్ సిలు కూడా అద్భుతమైన మార్పును తీసుకొస్తాయి. విటమిన్ ఎ కొత్తగా జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. బాగా పండిని జామపండును తీసుకొని మెత్తగా చేసి అందులో కొద్దిగా తేనె మరియు నిమ్మరసం(చుండ్రు ఉంటేనే) కలిపి బాగా మిక్స్ చేసి తలకు బాగా పట్టించి పదిహేను నిముషాల తర్వాత షాంపూతో శుభ్రం చేసుకోవాలి.

English summary

Homemade Fruit Hair Conditioners | పట్టులాంటి కేశ సౌందర్యానికి ఫ్రూట్ కండీషనర్

It is often advised to apply a hair conditioner after shampooing. There are many benefits of hair conditioning. A hair conditioner keeps the hair manageable, smooth, silky and soft. A majority of people buy conditioner of the same shampoo brand.
Story first published: Saturday, January 12, 2013, 17:22 [IST]
Desktop Bottom Promotion