For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పురుషుల జుట్టు సమస్యలకు బెస్ట్ హెయిర్ కండీషనర్స్

|

హోం రెమడీస్ విషయంలో, పురుషుల కంటే స్త్రీలే ఎక్కువ ఆసక్తి చూపుతారు. హోం రెమడీస్ ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే, ఈ రోజుల్లో స్త్రీలతో సరిసమానంగా పురుషుల కూడా వారి జుట్టు సంరక్షణ కోసం హోం రెమడీస్ ను ఉపయోగించడం మీద ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తున్నారు. ప్రస్తుత మోడ్రన్ ప్రపంచంలో పురుషులు ఫ్యాన్సీ అవుట్ ఫిట్స్ ను ధరించడానికి మరియు డిజైనర్ వార్డ్ రోబ్స్ చూడటానికి బెస్ట్ లైఫ్ స్టైల్ ఎంపిక చేసుకుంటున్నారు. మొదట ఇక్కడ ఇచ్చిన ఇంట్రడక్షన్స్ అందానికి సంబందించినదే. స్త్రీలకు కానీ, పురుషులకు కానీ హోం రెమడీస్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

అలాగే హెయిర్ స్టైల్ విషయంలో కూడా, మార్కెట్లో దొరికే కొన్ని హెయిర్ ప్రొడక్ట్స్ ఉపయోగించడం అంటే స్త్రీలతో పాటు పురుషులు కూడా భయపడుతున్నారు. కారణం ఈ హెయిర్ ప్రొడక్ట్స్ వల్ల జుట్టు రాలే సమస్యలు అధికం అవుతాయి. చిన్న వయస్సులోనే తెల్లబడటం జరుగుతుంది. చర్మానికి ఉపయోగించే హోం రెమడీస్ లాగే, హెయిర్ కేర్ కూడా ఉన్నాయి . పురుషుల్లో ఎవరైతే నేచురల్ హెయిర్ ను పొందాలంటే ఈ నేచురల్ హెయిర్ కండీషనర్స్ ను ఉపయోగించడం వల్ల ఇవి, పురుషులకు మాత్రేమే సూట్ అవుతాయి . నిపుణుల ప్రకారం నేచురల్ హెయిర్ కండీషనర్స్ అన్ని రకాల జుట్టు సమస్యలకు ఉపయోగపడుతాయి. మరి అవేంటో ఒక సారి చూద్దాం...

అవొకాడో :

అవొకాడో :

కేశాలకు మరో అద్భుతమైన హెయిర్ కండీషనర్ అని చెప్పవచ్చు. అవోకాడోను ఉడికించి గుజ్జులా తయారు చేసి అందులో కొన్ని చుక్కల తేనె, షీ బట్టర్, ఆపిల్ సైడర్ వెనిగర్ మరియు పెరుగు కలిపి బాగా మిక్స్ చేసి తలకు బాగా పట్టించాలి అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

వెనిగర్:

వెనిగర్:

వినెగార్, ఇది ఎక్కువగా ఆపిల్ ఆపిల్ రసం నుంచి చేసిన పానీయం; ఇది మీ జుట్టును శుభ్రపర్చడానికి మరియు ఒకే సమయంలో pH స్థాయి సమతుల్యం చేయటంలో సహాయపడుతుంది. ఇందువలన దీనిని ఒక మంచి హెయిర్ కండిషనర్ గా పేర్కొంటారు. రెండు కప్పుల నీటిలో వినేగార్ ను కలిపి, ఆ మిశ్రమాన్ని తలకు పట్టించి అలానే 20-30 నిముషాల వరకు ఉంచండి. ఈ మిశ్రమం జుట్టులో ఇనికిపోయేవరకు మీ వేళ్ళతో 4-5 సార్లు జుట్టును మర్దన చేయండి. తరువాత చల్లటి నీటితో కడగండి. ఈ కండిషనర్ మీరు తలస్నానం చేసినప్పుడు వదలని ఏ రసాయన, షాంపూ లేదా కండీషనర్ గాని తొలగించడంలో సహాయపడుతుంది.

షీ బటర్:

షీ బటర్:

చాలా సాఫ్ట్ గా ఉండే ఈ సీ బటర్ మీ కేశాలను చాలా స్ట్రాంగ్ గా ఉండేలా చేస్తుంది. ఈ నేచురల్ హెయిర్ కండీషనర్ పురుషులకు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. దీన్ని నెలకొకసారి తలకు అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

గుడ్డు:

గుడ్డు:

పురుషులు చాలా వరకూ గుడ్డును వారి జుట్టుకు అప్లై చేయడానికి ఇష్టపడరు అయితే, గుడ్డులోని తెల్ల సొన జుట్టుకు మంచిపోషణనిచ్చి, జుట్టు బలంగా ఉండేలా చేస్తుంది. కాబట్టి, తలస్నానం చేసే ఒక గంట ముందుగా ఎగ్ వైట్ తో తలను మసాజ్ చేయాలి.

సొరకాయ:

సొరకాయ:

సొరకాయ రసాన్ని జుట్టుకు పట్టించినట్లైతే మందమైన జుట్టు పొందవచ్చు. ఒక గంట ముందు సొరకాయ రసాన్ని తలకు పట్టించాలి.

తేనె:

తేనె:

తేనె ఒక చర్మమును మెత్త పరచు లేపనముగా వర్గీకరించబడింది అంటే ఇది సహజంగా ఒక మంచి కండిషనర్ మరియు మాయిశ్చరైజర్ ఎందుకంటే దీనిలో నీటి అణువులను ఆకర్షించే మరియు ఉంచుకోగలిగే సామర్థ్యము ఉన్నది. ఇది మీ జుట్టును కాంతివంతంగా మరియు నునుపుగా చేస్తుంది. దీనిలో విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఒక బొట్టులో మూడోవంతు తేనెను తీసుకుని, అంటే సమమైన మీరు వాడే కండిషనర్ తో కలపండి. ఈ రెండింటిని చేతులతో రుద్దండి. దీనిని మీ జుట్టు మొత్తం పట్టించండి. దీనిని మీ తలమీద జుట్టు కుదుళ్ళను చేరేవరకు మర్దన చేయండి. ఇలా 30 నిముషాల వరకు ఉంచండి, తరువాత తలస్నానం చేయండి.

బేకింగ్ సోడా :

బేకింగ్ సోడా :

బేకింగ్ సోడాలో కొద్దిగా నీళ్ళు పోసి ద్రవంలా తయారు చేసుకోవాలి. ఈ నీళ్ళతో తలను శుభ్రం చేసుకోవడం వల్ల జుట్టు పట్టుకుచ్చులా మందంగా పెరిగి గ్లాసీ లుక్ ను అందిస్తుంది.

పెరుగు:

పెరుగు:

పెరుగును నేచురల్ హెయిర్ కండీషనర్ అంటారు. పురుషుల అనేక హెయిర్ సమస్యలను నివారించడం కోసం పెరుగను ఎక్కువగా ఉపయోగించవచ్చు. ముఖ్యంగా చుండ్రును నివారించవచ్చు.

ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్:

ఇది ఒక ఉత్తమ నేచురల్ హెయిర్ కండీషనర్ . ఆలివ్ ఆయిల్ ను తేనెతో మిక్స్ చేసి అప్లై చేయడం వల్ల మరింత మేలు జరుగుతుంది . రఫ్ గా ఉన్న హెయిర్ సాష్ట్ గా మారుతాయి. అలాగే చిట్లిన జుట్టును నిారిస్తుంది.

అరటిపండు:

అరటిపండు:

అరటి ఆరోగ్యానికి, చర్మ సౌందర్యానికి మాత్రమే కాదు, కురులకు కూడా చాలా ప్రయోజనకారి. ఈ హోం రెమెడీ చిక్కుబడిని, పొడిబారిన,నిర్జీవమైన కురుకు బాగా పనిచేస్తుంది. అందుకు అరటి పండును మెత్తగా చేసి అందులో పెరుగు, నిమ్మరసం, పాలు వేసి బాగా మిక్స్ చేసి తలకు బాగా పట్టించాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే మెత్తటి, నునుపైన కురులు మీ సొంత అవుతాయి.

English summary

Natural Hair Conditioners For Men

When it comes to home remedies, women are the first ones to try out the best from the list. But, today, men too are proving to be quite the competitors when to comes to their grooming styles.
Desktop Bottom Promotion