For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వింటర్ సీజన్ లో హెయిర్ వాష్ చేయడానికి చిట్కాలు

|

వింటర్ సీజన్ లో, ఒక ప్రధాన, సాధారణ సమస్య ముఖ్యంగా మహిళలు ఎదుర్కొనే సమస్య జుట్టు సమస్యలు. సౌందర్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, వింటర్ సీజన్ లో జుట్టును తరచూ వాష్ చేడయం వల్ల, చుండ్రు మరియు ఆయిల్ స్లాప్ వంటి సమస్యలు అధికం అయ్యేలా చేస్తాయి.

శీతాకాలంలో మీరు తలస్నానం చేసినప్పుడు, తప్పకుండా మీరు అనుసరించాల్సిన కొన్ని హెయిర్ కేర్ టిప్స్ ఉన్నాయి. ఈ హెయిర్ కేర్ టిప్స్ అనుసరించడం వల్ల మీకు ఎటువంటి జుట్టు సమస్యలుండవు.

అటువంటి అందమైన ఒత్తైన జుట్టును మీరు చూడాలనుకుంటే, ఈ క్రింద ఇచ్చిన హెయిర్ కేర్ చిట్కాలను తప్పక అనుసరించాలి . శీతాకాలంలో మీ జుట్టును శుభ్రం చేసుకోవడానికి మీ జుట్టు చూడటానికి అందంగా మరియు ఆరోగ్యంగా కనబడుతాయి.

Washing Hair During Winter

1. వింటర్ సీజన్ లో మొదటి పాటించాల్సిన హెయిర్ కేర్ టిప్ మీరు మీ తలకు ఉపయోగించే షాంపు మన్నికైనదై ఉండాలి. మన్నికైన షాంపులను ఉపయోగించడం వల్ల తలలో, కేశాల్లో నిల్వ ఉండే అదనపు నూనెలను తొలగించి, తలకు మంచి పోషణను అంధిస్తుంది.

2. వింటర్ సీజన్ లో తలస్నానం వారానికి రెండు సార్లు చేయాలి . వారానికి రెండు సార్లు తలస్నానం చేయడానికి గోరువెచ్చని నీళ్లను మాత్రమే ఉపయోగించాలి . చలిగా ఉండే ఈ శీతాకాలంలో వేడినీళ్లతో తలస్నానం చేయడం వల్ల జుట్టు రాలడం అధికం అవుతుంది.

3. మీ జుట్టుకు నేచురల్ కండీషనర్స్ ను మాత్రమే అప్లై చేయాలి. కండీషన్ అప్లై చేసిన తర్వాత 5నిముషాలు అలాగే ఉంచి తర్వాత తలస్నానం చేసుకోవాలి. కండిషనర్ అప్లై చేసిన తర్వాత తలస్నానం చేసేప్పుడు, నీళ్లు గోరువెచ్చగా ఉండాలి. కండీషనర్ అప్లై చేసిన జుట్టుకు హాట్ వాటర్ ను ఎంట్టిపరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదు.

4. ఏ సీజన్ లో అయినా సరే వారి జుట్టును నూనె రాయడానికి ఇష్టపడే మహిళలు కూడా ఉన్నారు. అయితే, బ్యూటీ ఎక్స్ పర్ట్ అభిప్రాయం ప్రకారం, వింటర్ సీజన్ లో మీ తలకు వేడినూనెను అప్లై చేయాలని సూచిస్తున్నారు. మీరు తలస్నానం చేసేప్పుడు ఆయిల్ మొత్తం తొలగిపోయేలా షాంపు పెట్టి శుభ్రం చేసుకోవడం మర్చిపోకండి.

5. వింటర్ సీజన్ హెయిర్ కేర్ విషయంలో ముఖ్యంగా గుర్తించుకోవల్సిన మరో ముఖ్య విషయం, మీరు తరచూ హెయిర్ ప్యాక్ లను ఉపయోగించకూడదు. ఈ సీజన్ లో వాతావరణంలో మార్పుల చేత, వాతావరణంలో తేమ వల్ల, ఆల్రెడీ జుట్టు ఆయిలీగా ఉంటుంది. హెయిర్ ప్యాక్ లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల జుట్టు మూలాలను మరింత తడిగా మార్చుతుంది.

English summary

Washing Hair During Winter:Tips

During the winter season, one of the most common problems which women face is having to deal with hair problems. According to experts, it is said that washing ones hair frequently during the winter season can bring out a lot of hair problems like dandruff and even an oily scalp.
Desktop Bottom Promotion