For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టు సాఫ్ట్ గా ఉండాలంటే 10 ఉత్తమ మార్గాలు

By Super
|

ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జుట్టును కోరుకుంటారు. అయితే అందరూ ఆరోగ్యకరమైన బ్యూటిఫుల్ గా మంచి షైనింగ్ తో మరియు అందంగా ఉండే జుట్టును పొందలేరు. మరీ ముఖ్యంగా ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ఇటువంటి ఒత్తైన జుట్టును పొందడం కొంచెం కష్టమే . ప్రస్తుత రోజుల్లో ఒత్తిడితో కూడుకొన్న జీవన శైలి, సరైన పౌష్టిహారం తీసుకోకపోబడం, వల్ల జుట్టు సమస్యలు అధికమవుతున్నాయి. ఇంకా వాతావరణ కాలుష్యం వల్ల జుట్టుకు దుమ్ము, ధూళి చేరి మరింత జిడ్డుగా తయారవడం జరుగుతుంటుంది.

అంటువంటి పరిస్థితుల్లో జుట్టు పోషణకు మరియు మంచి కండీషనర్ అప్లై చేయక, సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే జుట్టు మరింత కోల్పోయే ప్రమాదం ఉంది. టీవీలల్లో మరియు మ్యాగజైన్ లో వచ్చే కమర్షియల్ యాడ్స్ చూసి, అనసవరం అయిన వాటిని మొద్దమొత్తం ఖర్చు చేసినా ఎటువంటి ఫలితం ఉండుదు. ఈ కమర్షియల్ యాడ్స్ లో చూపించే మెయిర్ ప్రొడక్ట్స్ తక్షణ ప్రభావం చూపిన కొద్ది రోజులకు పరిస్థితి మరింత ఎక్కువవుతుంది. కాబట్టి, ఈ సమస్యను నుండి బయటపడాలంటే, హెయిర్ ఆయిల్స్, షాంపూలు, హెయిర్ వాష్, కండీషనర్స్, సెరమ్స్, సాఫ్ట్నర్స్ మరియు ఇతర ప్రొడక్ట్స్ ను మన్నికైన వాటిని ఎంపిక చేసుకోవాలి.

ఇటువంటి ప్రొడక్ట్స్ బయట మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ కూడా మన అందమైన జుట్టుకు చాలా అవసరం అవుతాయి? అయితే, మన ఓల్డర్ జనరేషన్ లో ఇటువంటి ఖరీదైన హెయిర్ ప్రొడక్ట్స్ ఉపయోగించకుండానే, నేచురల్ ప్రొడక్ట్స్ తోనే ఒత్తైన కేశ సౌందర్యాన్ని పొందేవారు. అందులో ఒక ప్రాధమిక అంశం జుట్టును మరియు తలను ఎల్లవేళలా శుభ్రంగా ఉంచుకోవడమే. తలకు వారానికి ఒకటి రెండు సార్లు ఆయిల్ మసాజ్ చేయడం వల్ల అవాంచనీయ హెయిర్ ట్రీట్మెంట్స్ నుండి మన జుట్టును కాపాడుకోవచ్చు. అంతే కాదు, ఎప్పుడూ తలను శుభ్రంగా ఉంచుకొంటూ, తలకు తరచూ నూనె పెట్టి షాంపు చేస్తే చాలు మీరు కోరుకున్న జుట్టు మీ సొంతం అవుతుంది. మరి మీ వంటగదిలో ఉండే మరికొన్ని నేచురల్ హెయిర్ కేర్ టిప్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి. వీటిని ఉపయోగించడం వల్ల తప్పకుండా మీరు కోరుకొన్న ఒత్తైన కేశ సౌందర్యంను పొందవచ్చు. మరి ఆ హెయిర్ ప్రొడక్ట్స్ ఏంటో ఒకసారి చూద్దాం...

గుడ్డు:

గుడ్డు:

గుడ్డు తలకు పట్టించడం వల్ల తలకు మరియు జట్టుకు కావల్సినంత పోషణను అందిస్తుంది. మరియు బెస్ట్ కండీషనర్ గా పనిచేస్తుంది . అయితే గుడ్డును మాత్రమే కాకుండా గుడ్డుకు పాలు లేదా నిమ్మరసం లేదా తేనె మిక్స్ చేయడం వల్ల ఫలితం మరింత ఉత్తమంగా ఉంటుంది. మీ జుట్టు ఆయిలీగా ఉంటే ఎటువంటి సమస్యా లేదు, లేదంటే వీటిలో కొద్దిగా నూనె కూడా మిక్స్ చేసి జుట్టుకు పట్టించాలి ఒక గంట తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి.

తేనె:

తేనె:

గుడ్డు లేదా పాలలో కొద్దిగా తేనె మిక్స్ చేసి తలకు పట్టించాలి. ఎక్కువ సమయం ఆరబెట్టకుండా 20-30తర్వాత తలస్నానం చేయాలి. లేదంటే మీ జుట్టు యొక్క నాణ్యతను తేనె దెబ్బతీస్తుంది. జుట్టు షైపింగ్ కోల్పోతుంది.

పాలు:

పాలు:

జుట్టుకు ఒక ఉత్తమ ప్రోటీన్ ఇది. ఈ ప్రోటీన్స్ మీ ఆరోగ్యకరమైన జుట్టుకు చాలా అవసరం అవుతాయి. అందుకు పాల కంటే మించ ప్రోటీన్ ఆహారం మరొకటి ఉండదు . అంతే కాదు, ఇది హెయిర్ కు కండీషనర్ గా పనిచేస్తుంది.

నూనె:

నూనె:

జుట్టు సంరక్షణ చిట్కాల్లో హెయిర్ కు నూనె రాయకుండా ఉండలేము. నూనె పెట్టకుండా రెగ్యులర్ గా హెయిర్ వాష్ చేయడం వల్ల జుట్టు యొక్క ఆకారంలో మార్పులో వస్తాయి. జుట్టు పొడిగా మరియు నిర్జీవంగా మరియు చిక్కుబడినట్లు కనిపిస్తాయి.

అరటిపండ్లు:

అరటిపండ్లు:

అరపండ్లు జుట్టు పోషణలో ఒక బాగం. మెత్తగా చేసిన అరటిపండుగుజ్జును మెత్తగా చేసి తర్వాత జుట్టు మొత్తానికి పట్టించాలి. ఈఅరటిపండు గుజ్జుకు కొద్దిగా గుడ్డు మిక్స్ చేసి తలకు అప్లై చేసి 20నిముషాల తర్వాత హెయిర్ వాష్ చేయాలి.

పెరుగు:

పెరుగు:

పెరుగు మరో ఎఫెక్టివ్ కండీషనర్ మరియు బెస్ట్ మాయిశ్చరైజర్ . కొద్దిగా పెసరపిండి, మరియు మెంతిపొడిని మిక్స్ చేసి, ఒక గుడ్డు చేర్చి తలకు పట్టిస్తే జుట్టు సమస్యలన్నీ క్రమంగా తగ్గుతాయి.

బీర్:

బీర్:

మీరు బీర్ షాంపు గురించి విన్నారా? షాంపుకు చెక్ పెట్టి రియల్ బీర్ తీసుకొచ్చి, త్రాగకండి!తలకు పట్టిస్తే మంచి కండీషర్ గా పనిచేస్తుంది. తలస్నానం చేసిన తర్వాత బీర్ తో చివరగా తలారా పోసుకోవాలి.

ఆపిల్ సైడర్ వెనిగర్

ఆపిల్ సైడర్ వెనిగర్

ఆపిల్ సైడర్ వెనిగర్ తో చెప్పలేనన్ని ప్రయోజనాలున్నాయి. అయితే వాటిలో హెయిర్ లాస్ నివారించే ఉత్తమ ప్రయోజనం కూడా ఒటి . ఆపిల్ సైడర్ వెనిగర్ తో తలస్నానం చేసుకుంటే ఇది జుట్టు సమస్యలను నివారించి జుట్టు మెరిసేలా చేస్తుంది . మరియు ఇది స్మూత్ స్ట్రక్చర్ కలిగి ఉంటుంది.

నిమ్మరసం:

నిమ్మరసం:

నిగర్ కు చాలా దగ్గరి సంబంధం కలది. నిమ్మరసాన్ని అన్ని రకాల హెయిర్ ప్యాక్స్ లో జోడించి తలకు పట్టించాలి. నిమ్మరసాన్ని గుడ్డు, నూనె, పాలు లేదా తేనెలో వేసి మిక్స్ చేసి తలకు పట్టించడం వల్ల ఉత్తమ ఫలితం ఉంటుంది.

పెసరపిండి:

పెసరపిండి:

ప్రోటీన్స్ అధికంగా ఉండే పెసరపిండిని పెరుగులో వేసి మిక్స్ చేసి తలకు పట్టించాలి. తర్వాత అరగంట తర్వాత తలస్నానం చేయడం వల్ల జుట్టు సాఫ్ట్ గా మరియు స్మూత్ అండ్ సిల్కీగా తయారవుతుంది.

Desktop Bottom Promotion