For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే టాప్ 10 జ్యూసులు

|

తాజా పండ్లు, మరియు తాజా వెజిటేబుల్స్ నుండి తయారుచేసే జ్యూసులు జుట్టు ఆరోగ్యానికి ప్రధానమైనవి, ప్రభావంతంగా పనిచేస్తాయని మీకు తెలుసా?అవును అంటే, మరి ఈ జ్యూస్ లను మీ డైలీ డైట్ లో చేర్చుకోవడం, మీ జుట్టు సంరక్షణకు చాలా అవసరం.

తాజా పండ్ల రసాలు, మరియు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, మీ శరీరానికి కావల్సిన న్యూట్రీషియన్స్ ను పొందవచ్చు. తాజా పండ్లు మరియు వెజిటేబుల్స్ జుట్టుకు బలాన్ని చేకూర్చడమే కాదు, ఇవి హెయిర్ బ్రేకేజ్ ను తగ్గిస్తాయి. దాంతో జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. పండ్ల రసాలు కానీ, వెజిటేబుల్ జ్యూసులు కానీ వాటిలోని పోషకాలు పూర్తిగా శోషించబడి, ఫలితం చాలా త్వరగా వస్తుంది. మరి అటువంటి జుట్టు సంరక్షణకు మరియు పెరుగుదలకు సహాయపడే కొన్నిరకాల జ్యూసులను ఈ క్రింది విధంగా ఇస్తున్నాం...

జుట్టు రాలడాన్ని తగ్గించే టాప్ 15 సూపర్ ఫుడ్స్ : క్లిక్ చేయండి

జుట్టు పెరుగుదలకు : టాప్ టెన్ జ్యూసులు

ఆనియన్ జ్యూస్:

ఆనియన్ జ్యూస్:

ఉల్లిపాయ మన కళ్ళలో నీళ్ళు కారేవింధంగా చేస్తుంది. అలాగే కురుల సమస్యలను కూడా నివారిస్తుంది అనడంలో ఆశ్చర్యం కలగక మానదు!. నిజానికి ఉల్లిపాయ వల్ల జుట్టు రాలడాన్ని అరికట్టడంలో అద్భుతమైన ప్రయోజనాలను అంధిస్తుంది. ఉల్లిపాయలో ఉండే ఘాటైన సల్ఫర్ జుట్టు పెరగడానికి బాగా సహాయపడుతుంది. మరియు జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. మరియు ఇందులో యాంటీబ్యాక్టిరియల్ లక్షణాలుండటం వల్ల చుండ్రును నిర్మూలిస్తుంది. కాబట్టి మీ జుట్టు రాలడాన్ని అరకట్టానుకున్నా .. ఉన్న జుట్టు అందంగా, స్ట్రాంగ్ గా ఉండాలనుకున్నా ఆనియన్ హెయిర్ ప్యాక్ వేసుకోవాలి.

అలోవెరా జ్యూస్:

అలోవెరా జ్యూస్:

అలోవెరా జ్యూస్ జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. అలోవెరా జ్యూస్ లో ఉన్న విటమిన్స్ జుట్టును బలోపేతం చేస్తుంది. బ్రేకేజ్ తగ్గిస్తుంది. ఈ జ్యూస్ లోని ఎంజైములు న్యూరిష్ చేస్తుంది మరియు మాయిశ్చరైజ్ చేస్తుంది. అలోవెరా జ్యూస్ చుండ్రును నివారిస్తుంది మరియు దురదను తగ్గిస్తుంది . జుట్టుకు అలోవెరా జ్యూస్ ను అప్లై చేయడం వల్ల జుట్టు మెరుస్తూ, సున్నితంగా మారుతాయి.

క్యారెట్ జ్యూస్: క్యారెట్ :

క్యారెట్ జ్యూస్: క్యారెట్ :

జుట్టు పెరుగుదలకు అవసరం అయ్యే విటమిన్స్ మరియు మినిరల్స్ పుష్కలంగా కలిగి ఉన్నాయి. ఈ విటమిన్స్ , మినిరల్స్ జుట్టు పెరుగుదలకు మాత్రమే కాదు, జుట్టు మందగా పెరగడానికి సహాయపడుతుంది. ప్రతి రోజూ ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల మీకు అవసరం అయ్యే బీటాకెరోటిన్ అందుతుంది. ఇది జుట్టు సిబం ఉత్పత్తికి సహాయపడుతుంది.

వేగవంతమైన జుట్టు పెరుగుదలకు ఆరోగ్యకరమైన ఆహారాలు:క్లిక్ చేయండి

కీరదోస జ్యూస్:

కీరదోస జ్యూస్:

కీరదోసకాయ సరైన హెయిర్ గ్రోత్ కు సహాయపడుతుంది మరియు జుట్టు యొక్క నాణ్యతను పెంచతుంది. ఇందులోని ఎంజైమ్స్ జుట్టు నష్టాన్ని నివారిస్తుంది . హీమోగ్లోబిన్ మరియు ఫోలీసెల్స్ ను పెంచుతుంది. ప్రతి రోజూ ఒక గ్లాసు కీరదోస జ్యూస్ ను త్రాగడం వల్ల జుట్టు సమస్యలన్నీ తగ్గించుకోవచ్చు.

గార్లిక్ జ్యూస్:

గార్లిక్ జ్యూస్:

చరిత్రల కాలం నుండి గార్లిక్ ను అనేక చికిత్సలకు ఉపయోగిస్తున్నారు. ఇది జుట్టుయొక్క నాణ్యతను పెంచడంలో సహాయపడుతుంది మరియు జుట్టుకు పోషణ అంధించి ఫోలిసెల్స్ ను పెరుగుదలకు సహాయపడుతుంది. ఇది తలలో రక్తప్రవాహాన్ని పెంచుతుంది.

గోవా జ్యూస్:

గోవా జ్యూస్:

జామకా జ్యూస్ లో పుష్కలమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అంతే కాదు ఇంకా క్యాల్షియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్ మొదలగునవి ఉండి, జుట్టు పెరుగుదలో అద్భుతంగా సహాయపడుతాయి. దీన్ని పచ్చిగా తీసుకోవచ్చు లేదా జ్యూస్ లా తీసుకోవచ్చు. ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. జామకాయ పేస్ట్ ను తలకు పట్టించిన తర్వాత 15నిముషాల తర్వాత తలస్నానం చేసుకోవాలి.

స్ట్రాబెర్రీ జ్యూస్:

స్ట్రాబెర్రీ జ్యూస్:

స్ట్రాబెర్రీ జ్యూస్ లో విటమిన్ సి పుష్కంగా ఉండి ఇది శరీరంలో ప్రోటీనుల పెంచుతుంది, ఇది జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. స్ట్రాబెర్రీలను చాలా మెత్తగా చేసి, తర్వాత తలకు పెట్టించి శుభ్రం చేసుకోవడం వల్ల అద్బుతమైన మార్పు కనిపిస్తుంది.

కివి జ్యూస్:

కివి జ్యూస్:

కివి పండ్లలో విటమిన్లు, పొటాషియం అధికం. ఈ పండు సిట్రస్ జాతికి చెందినది కాబట్టి ఇది చాలా ఎఫెక్టివ్ గా జుట్టు పెరుగుదలకు బాగా సహాయపడుతుంది కివి పండ్లలో విటమిన్ సి ని కూడా కనుగొనబడినది. మీ జుట్టు బలానికి కివి పండ్ల రసాన్ని ఇంటర్నల్ గా తీసుకోవచ్చు.

ఆకుకూరల రసం:

ఆకుకూరల రసం:

ఆకుకూరల జ్యూస్సులో అత్యంత శక్తివంతమైన మినిరల్స్, విటమిన్స్, ఐరన్ మొదలగునవి పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మం మరియు జుట్టుకు చాలా ఉపయోగకరం. తలలో దురద వంటి సమస్యలను నివారిస్తుంది. ఆకుకూరల్లో ఉండే విటమిన్ బి జుట్టుకు తగినంత షైనింగ్ ను అంధిస్తుంది.

కొత్తిమీర జ్యూస్:

కొత్తిమీర జ్యూస్:

కొత్తిమీర జ్యూస్ జుట్టు రాలడంతో పోరాడుతుంది మరియు ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది . ఇది చాలా సమతుల్యమైన జ్యూస్. ఇది ఇతర పానీయాలతో జోడించి తీసుకోవచ్చు. అలాగే కొత్తిమీర ఆకులను మెత్త్గా పేస్ట్ చేసి, తలకు పట్టించి, ఒక గంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

English summary

Top 10 Juices That Help Further Hair Growth

Do you know that juices from fresh vegetables and fruits can have a major impact on your hair health? Yes, including these juices in your daily diet can actually meet all your hair care needs.
Desktop Bottom Promotion