For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టురాలడం తగ్గించి, వేగంగా జుట్టు పెంచు ఉత్తమ హోం రెమెడీలు

|

సాధారణంగా ఆరోగ్యకరమైన జుట్టును ఎవరైతే కలిగి ఉంటారో వారిలో ఒక రోజుకు 40-80(కొన్ని సార్లు తక్కువగా కూడా)రాలిపోతుంటాయి . ఇది ఒక నేచురల్ ప్రొసెస్. ఎందుకంటే ఫోలిసెల్స్ జీవిత కాలం ముగిసిన తర్వాత, అలా వీక్ గా మారిన వెంట్రుకలు రాలిపోవడం సహజం. అయితే అలా పాత ఫోలిసెల్స్ చనిపోయా, వెంట్రుకలు రాలిపోయిన తర్వాత, అదే ప్లేస్ లో కొత్త ఫోలీసెల్స్ తో కొత్తగా వెంట్రులకలు మొలవడం ప్రారంభం అవుతుంది.

అయితే క్రమంగా మీ జుట్టు 100కంటే ఎక్కువ వెంట్రుకలో రోజువారి, కొన్నినెలల తరబడి రాలిపోతుంటే మాత్రం పరిస్థితిని సీరియస్ గా తీసుకోవాలి. జుట్టురాలే సమస్యను అరికట్టుటకు తగిన జాగ్రత్తలను వెంటనే తీసుకోవాలి.

దాని కంటే ముందు జుట్టు రాలడానికి గల కారణాలు ఏంటో తెలుసుకోవాలి. అధికంగా జుట్టు, క్రమం తప్పకుండా రాలుతుంటే , అది మెటబాలిక్ డిజార్డర్ వల్ల అయ్యుంటుంది. ఫోలిసెల్స్ పెరుగుదలకు పాపిల్లా సహాయపడుతుంది. కొన్ని గ్రూప్ ల సెల్స్ యొక్క అమినో యాసిడ్స్ కెరాటిన్ గా మార్పుచెందుతుంది. ఎంత ఎక్కువగా కెరెటీన్ ఉప్పత్తి ఉంటే అంత ఎక్కువ హెయిర్ గ్రోత్ ఉంటుంది. కాబట్టి, ఈ సమస్యను గుర్తించి, నివారించగలిగినప్పుడు జుట్టురాలడాన్ని అరకట్టవచ్చు. ఈ సమస్యకు నేచురల్ ట్రీట్మెంట్ చాలా బాగా సహాయపడుతుంది.

జుట్టు రాలడాన్ని అరికట్టడానికి వివిధ రకాల హోం రెమెడీలు ఉన్నాయి. అందులో ప్రతి ఒక్క హోం రెమెడీ జుట్టు సమస్యలకు ఒక్కో సమస్యకు ఒక్కో హోం రెమెడీ ఉపయోగపడుతుంది. దాంతో జుట్టు రాలడం తగ్గించుకోవచ్చు . జుట్టు రాలడానికి సరైన కారణం తెలుసుకొన్నట్లైతే వెంటనే హెయిర్ లాస్ ను చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. ఈ హోం రెమెడీస్ స్త్రీ/పురుషుల ఇద్దరిక గ్రేట్ గా సహాయపడుతాయి. మరి జుట్టు రాలడం తగ్గించే హోం రెమెడీస్ ఏంటో ఒకసారి చూద్దాం...

కలబంద

కలబంద

జుట్టు రాలడం తగ్గించడంలో కలబంద గ్రేట్ గా సహాయపడుతుంది . కలబంద జెల్ ను తలకు పట్టించి మసాజ్ చేసి రాత్రంతా అలాగే ఉంచి తర్వాత రోజు ఉదయం తలస్నానం చేయాలి.

ఉసిరి నూనె:

ఉసిరి నూనె:

ఆమ్లా ఆయిల్ చాలా ఎఫెక్టివ్ హోం రెమెడీ. . ఎండిన ఉసిరి కాయ పీస్ లను కొబ్బరి నూనెలో వేసి మరగించి గోరువెచ్చగా తలకు పట్టించాలి. ఇది ఒక మంచి హెయిర్ టానిక్ మరియు జుట్టు పెరుగుదలకు గ్రేట్ గా సహాయపడుతుంది.

మసాజ్:

మసాజ్:

జుట్టు రాలడం తగ్గించడంలో హెయిర్ మసాజ్ ఒక ఎఫెక్టివ్ హోం రెమెడీ. అంతే కాదు, జుట్టు పెరుగుదలను కూడా ప్రోత్సహిస్తుంది . చేతివేళ్ళతో మీ తలకు ప్రతి రోజూ మసాజ్ చేస్తుండాలి.

బ్రష్ :

బ్రష్ :

ప్రతి రోజు తలకు బ్రష్ చేయడం వల్ల తలలోని చర్మ రంద్రాలు తెరచుకొనే చేస్తాయి. ఇది జుట్టు పెరుగుదలకు సహాయపడుతాయి . ప్రతి రోజూ రాత్రి పడుకొనే ముందు తలకు బ్రష్ చేయాలి. అయితే జుట్టును బలవంతంగా లాగకూడదు.

ఆముదం మరియు రోజ్మెరీ:

ఆముదం మరియు రోజ్మెరీ:

జుట్టు పెరుగుదలకు ఈ రెంటింటి కాంబినేషన్ చాలా గ్రేట్ గా సహాయపడుతుంది అర చెంచా ఆముదంలో రోజ్మెరీ ఆయిల్ ను మిక్స్ చేసి, తలకు పట్టించి మసాజ్ చేయాలి. వారంలో రెండు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

కొబ్బరి నూనె మరియు నిమ్మరసం:

కొబ్బరి నూనె మరియు నిమ్మరసం:

కొబ్బరినూనెలో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి, ప్రతి రోజూ తలకు పట్టించడం వల్ల జుట్టు రాలడం అరికడుతుంది.

ఆవనూనె మరియు గోరింటాకు:

ఆవనూనె మరియు గోరింటాకు:

ఆవనూనెలో కొన్ని గోరింటాకులను వేసి మరిగించాలి, జుట్టురాలడానికి ఈ రెమెడీ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది . 350గ్రాములు ఆవనూనెలో 60గ్రాలము గోరింటాకలు వేసి నూనెను బాగా మరిగించాలి. దీన్ని వడగట్టి, నిల్వచేసుకొని, రెగ్యులర్ గా తలకు పట్టించాలి. ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గి, జుట్టు పెరుగుతుంది.

మార్గోసా:

మార్గోసా:

జుట్టు రాలడంతో పాటు, జుట్టు పెరగడం కూడా ఆగిపోయినప్పుడు, మార్గోసా యొక్క డికాషన్ తో జుట్టును వాష్ చేసుకోవాలి . ఇది తలలో పేలను మరియు ఇతర ఇన్ఫెక్షటెడ్ అంశాలను నివారిస్తుంది . జుట్టు రాలడం తగ్గించి, పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

ఉల్లిపాయ:

ఉల్లిపాయ:

జుట్టు రాలడం తగ్గించడంలో ఉల్లిపాయ ఒక గ్రేట్ హోం రెమెడీ. ఇది ప్యాచ్ గా ఉండే బట్టతలను నివారిస్తుంది . ఉల్లిపాయ నుండి రసం తీసి, తలకు పట్టించి ఒక గంట తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి . ఇది జుట్టు పెరుగుదలకు సహాపడుతుంది. బట్టతలను కూడా నివారిస్తుంది. జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.

కొత్తిమీర:

కొత్తిమీర:

తాజా కొత్తిమీర రసాన్ని తలకు పట్టించడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది.

బ్లాక్ గ్రామ్ మరియు మెంతులు:

బ్లాక్ గ్రామ్ మరియు మెంతులు:

ఉడికించిన బ్లాక్ గ్రామ్ మరియు మెంతులను మెత్తగా పేస్ట్ చేసి తలకు పట్టించి, కొద్ది సేపటి తర్వాత తలస్నానం చేయాలి. జుట్టు పొడవుగా పెరిగేలా చేస్తుంది. జుట్టు రాలడం అరికడుతుంది.

లెట్యూస్ మరియు స్పినాచ్:

లెట్యూస్ మరియు స్పినాచ్:

. లెట్యూస్ మరియు స్పినాచ్: లెట్యుస్ మరియు ఆకు కూరల రసాన్ని మిక్స్ చేసి ప్రతి రోజూ త్రాగడం వల్ల ఉత్తమ ఫలతాలను పొందవచ్చు.

కొబ్బరి పాలు :

కొబ్బరి పాలు :

జుట్టు రాలడం అరకట్టడంలో కొబ్బరిపాలు చాలా గ్రేట్ గా సహాయపడుతాయి. ఫ్రెష్ గా ఉండే కొబ్బరితురుమును మిక్సీలో వేసి పాలుతీసి తలకు అప్లై చేయాలి. తర్వాత మసాజ్ చేసి, ఒక గంట తర్వాత తలస్నానం చేయాలి.

లికోరైస్ :

లికోరైస్ :

లిక్వోరైస్ కు కొద్దిగా పాలు మిక్స్ చేసి మెత్తగా పేస్ట్ చేసి తలకు పట్టించాలి. రాత్రంతా అలాగే ఉంచి తర్వాత ఉదయం తలస్నానం చేయాలి. ఇలా చేడయం వల్ల బట్టతలను నివారించుకోవచ్చు.

అమరాంత్:

అమరాంత్:

అమరాంత్ ఆకులను తాజావి తీసుకొని పేస్ట్ చేసి అందులోనుండి వచ్చే రసాన్ని తలకు పట్టిస్తే మంచి ఫలితాలను పొందవచ్చు. జుట్టు రాలడం అరికట్టుటకు ఇది చాలా విలువైన హోం రెమెడీ.

.నిమ్మరసం మరియు పెప్పర్:

.నిమ్మరసం మరియు పెప్పర్:

నిమ్మగింజలను మరియు బ్లాక్ పెప్పెర్ పేస్ట్ చేసి తలకు పట్టించాలి. అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఇది బ్లడ్ సర్కులేషన్ పెంచుతుంది మరియు జుట్టుపెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

ఆల్ఫాల్ఫా:

ఆల్ఫాల్ఫా:

ఆల్పాల్పా జ్యూస్ లో క్యారెట్ జ్యూస్ మరియు ఆకుకూరల రసం మిక్స్ చేసి త్రాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్:

ఆపిల్ సైడర్ వెనిగర్:

ఒక చెంచా ఆపిల్ సైడర్ వెపిగర్ ను నీటిలో మిక్స్ చేసి త్రాగాలి. ఇలా మూడు వారాల పాటు త్రాడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

గోరింటాకు:

గోరింటాకు:

రాత్రంతా నీటిలో గోరింటాకును నానబెట్టి, ఆనీటితో తలకు మసాజ్ చేయాలి. కొద్దిసమయం అలాగే ఉంచి, తర్వాత ఉత్తమఫలితాలనుపొందవచ్చు.

 మందారం ఆకులు:

మందారం ఆకులు:

మందారం ఆకులు తీసుకొని అందులో నిమ్మరసం మిక్స్ చేసి వేడినీళ్ళు పోసి నానబెట్టాలి, తర్వాత ఆ నీటిని వడగట్టుకొని తలకు మసాజ్ చేయాలి. ఒక గంట తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి.

ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్:

అరకప్పు ఆలివ్ ఆయిల్ లో ఒక చెంచా జీలకర్ర మిక్స్ చేసి తలకు పట్టించి, అరగంట తర్వాత తలస్నానం చేయాలి.

తేనె మరియు గుడ్డు:

తేనె మరియు గుడ్డు:

తేనె మరియు గుడ్డు మిశ్రమాన్ని తలకు మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం పొందవచ్చు.

ఆరెంజ్ మరియు నిమ్మతొక్క:

ఆరెంజ్ మరియు నిమ్మతొక్క:

ఆరెంజ్ మరియు నిమ్మ తొక్కను వేడినీళ్ళలో వేసి, నీటిని తలకు పోసుకోవాలి. ఇలా చేయడం వల్ల చుండ్రు నివారించబడుతుంది. హెయిర్ సాప్ట్ గా ఉంటాయి.

ఆముదం:

ఆముదం:

ఆముదం చాలా ఉపయోగకరమైన హోం రెమెడీ . ఆముదంను రోజుకు రెండు సార్లు అప్లై చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గించుకోవచ్చు.

బీట్ రూట్ ఆకులు:

బీట్ రూట్ ఆకులు:

జుట్టు రాలడం తగ్గించడంలో బీట్ రూట్ గ్రేట్ గా సహాయపడుతుంది. బీట్ రూట్ యొక్క ఆకులను పేస్ట్ చేసి తలకు పట్టించి ఒక గంట తర్వాత తలస్నానం చేయాలి.

కందులు(Pigeon peas):

కందులు(Pigeon peas):

కందులు ఎఫెక్టివ్ హోం రెమెడీ. కందులు మరియు రెడ్ గ్రామ్ తీసుకొని పేస్ట్ చేసి తలకు పట్టించడం వల్ల జుట్టు రాలడం అరకట్టవచ్చు.

నిమ్మరసం మరియు గుడ్డు:

నిమ్మరసం మరియు గుడ్డు:

జుట్టురాలడం తగ్గించే ఎఫెక్టివ్ హోం రెమెడీ నిమ్మరసం. కొన్ని చుక్కల నిమ్మరసం మరియు గుడ్డు మిక్స్ చేసి తలకు ప్యాక్ వేసుకొని అరగంట తర్వాత తలస్నానం చేయాలి.

జరానియమ్(Geranium)

జరానియమ్(Geranium)

జెరానియం ఆకులను నీటిలో వేసి , మరిగించి వడగట్టి, ఆనీటిలో తలకు పట్టిస్తే మంచి ఫలితాలను పొందవచ్చు.

 ఆస్పిరిన్ టాబ్లెట్:

ఆస్పిరిన్ టాబ్లెట్:

హెయిర్ ఫాల్ నివారించడంలో ఆస్పిరిన్ మాత్రకూడా ఉపయోగపడుతుంది. ఇది యాంటీ డాండ్రఫ్ షాంపుగా ఉపయోగపడుతుంది

బాదం నూనె:

బాదం నూనె:

జుట్టు రాలడం తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. బాదం నూనెను తలకు పట్టించి మసాజ్ చేయాలి. తర్వాత వేడినీళ్ళలో డిప్ చేసిన టవల్ ను తలకు చుట్టి, అరగంట తర్వాత తలస్నానం చేయాలి.

Desktop Bottom Promotion