For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కోల్పోయిన జుట్టును తిరిగి నేచురల్ గా పొందడానికి ఎఫెక్టివ్ టిప్స్

|

ప్రస్తుత రోజుల్లో హెయిర్ ఫాల్ సమస్య ప్రతి ఒక్కరినీ పట్టిపీడుస్తున్నది. అసాధారణమైన జీవనశైలి మరియు అసాధారణమైన ఆహారపు అలవాట్లు కూడా కారణం అవుతున్నాయి. తెలిసో, తెలియక చేసే జీవనశైలిలోని మార్పులు, ఆహారపు అలవాట్లు వల్ల జుట్టు రాలే విషయంలో దీవ్ర దుష్ప్రభావాలు ఎదుర్కొంటూ, డెర్మటాలజింట్స్ లో, హెయిర్ స్పా సెంటర్లకు క్యూలు కడుతూ హెయిర్ ఫాల్ తగ్గించుకోవడానికి చేయని ప్రయత్నాలంటూ లేవంటున్నారు ప్రస్తుత యువత.

మన పూర్వీకులే కాదు, మన అమ్మమ్మలు కాలం నాటి నుండి జుట్టుకు తగిన నేచులర్ హెయిర్ ఆయిల్స్ తో మసాజ్ చేసుకొని జుట్టును కాపాడుకొనే వారు. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో టైట్ షెడ్యుల్ మద్య తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం, పౌష్టికాహార లోపంతో జుట్టు రాలడం, చిన్న వయస్సులో జుట్టు రాలడం, జుట్టు తెల్లబడుట జరగుతున్నది.

కొన్ని సందర్భాల్లో జుట్టు పోషణకు , శుభ్రత కు ఉపయోగించే కెమికల్ ప్రొడక్ట్స్ కూడా హెయిర్ లాస్ కు గురిచేస్తుంది. మరి ఇప్పుడు జుట్టురాలడం నివారించుకోవడానికి బెస్ట్ హోం రెమెడీ ఏంటి? . జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి కొన్ని ఎఫెక్టివ్ నేచురల్ రెమెడీస్ అందుబాటులో ఉన్నాయి. వాటిని ఈ క్రింది లిస్ట్ లో అందివ్వడం జరగింది. ఈ లిస్ట్ లోని చిట్కాలు చాలా సింపుల్ గా ఉన్నాయి. ఫలితం మాత్రం చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది . 15 రోజుల్లోనే జుట్టు రాడలడం తగ్గి, జుట్టు పెరగడాన్ని మీరు కనిపెడుతారు. మరి ఆ సింపుల్ రెమెడీస్ ఏంటో ఒకసారి చూద్దాం....

1. హెడ్ మసాజ్:

1. హెడ్ మసాజ్:

తలకు గోరువెచ్చని నూనె పట్టించి మసాజ్ చేయడం వల్ల టాక్సిన్స్ తొలగిపోయి, తలలో బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. తలో ఆయిల్ పెట్టినా , పెట్టుకోకపోయినా అప్పుడప్పుడు మసాజ్ చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది . అయితే హాట్ ఆయిల్ మసాజ్ వల్ల తలలో డ్రైనెస్ తగ్గుతంది మరియు హెయిర్ ఫాలీ సెల్స్ కు తగిన పోషనను అందిస్తుంది. అందుకు బాదం, కొబ్బరినూనె, ఆముదం మరియు ఆలివ్ ఆయిల్ ను ఉపయోగించుకోవచ్చు.

2. ఫింగర్ నెయిల్స్ తో రబ్ చేయడం:

2. ఫింగర్ నెయిల్స్ తో రబ్ చేయడం:

ప్రతి రోజూ ఫింగర్ నెయిల్ తో తలలో చిన్న పాటి మర్థన చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ప్రతి రోజూ 10నిముషాలు మర్ధన చేయడం వల్ల జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది . జుట్టు పెరుగదలకు మన పూర్వీకులు ఈ పద్ధతిని ఎక్కువగా ఉపయోగించే వారు . ఇది హెయిర్ ఫోలిసెల్స్ రిలాక్స్ అవ్వడానికి ఇది ఒక బెస్ట్ హోం రెమెడీ. ఈ టెక్నిక్ ను ఉపయోగించి జుట్టును వేగంగా పెంచుకోవచ్చు.

3. ఆమ్లా తినాలి:

3. ఆమ్లా తినాలి:

ఇండియన్ గూస్బ్రెర్రీ గా పిలవబడే ఉసిరికాయలో విటమిన్ సి అధికం . విటమిన్ సిలో యాంటీఆక్సిడెంట్ ఎఫెక్ట్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది . ఆమ్లాలో అమినోయాసిడ్స్, మినిరల్స్ , ఫ్లెవనాయిడ్స్, మరియు టానిన్స్ ఇవన్నీ జుట్టు పెరుగుదలకు చాలా ముఖ్యమైనవి. హెయిర్ ఫాల్ నివారించుకోవడానికి ఫ్రెష్ గా లేదా డ్రైగా ఉండే ఉసిరికాయను ఉపయోగించుకోవచ్చు .

4. ఫ్లాక్సీడ్స్:

4. ఫ్లాక్సీడ్స్:

జుట్టు పెరుగుదలకు ఫ్లాక్సీడ్స్ చాలా ముఖ్యంగా అవసరం అవుతాయి మరియు బలహీనంగా ఉన్న జుట్టును స్ట్రాంగ్ గా మార్చుతాయి . ఫ్లాక్సీడ్స్ లో సెలీనియం, అమినో యాసిడ్స్, క్యాల్షియం, ఫాస్పరస్, విటమిన్ బి మరియు ఓమేగా ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండటం వల్ల సలాడ్స్, స్వీట్ డిష్ లో చేర్చుకోవాలి.

5. ప్రోటీన్ మరియు ఐరన్ అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోవాలి:

5. ప్రోటీన్ మరియు ఐరన్ అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోవాలి:

ప్రోటీనుల లోపం వల్ల కూడా హెయిర్ ఫాల్ అధికంగా ఉంటుంది. కాబట్టి, ప్రోటీన్స్ అధికంగా ఉండే ఆహారాలను పల్స్, లెగ్యూమ్స్, మటన్, చికెన్, సోయా మొదలగు వాటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి . హెయిర్ సెల్స్ కు ఐరన్ ట్రాన్స్పోర్ట్ చేయడం వల్ల జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

6.హెర్బల్ రిన్స్:

6.హెర్బల్ రిన్స్:

షాంపు చేసిన తర్వాత హేర్బల్ తో తలస్నానం చేయాలి. తలస్నానం ముగిసిన తర్వాత నిమ్మ, పుదీనా, రోజ్మెర్రీ, ల్యావెండర్, మెంతులు మరియు ఉసిరికాయ వంటి వాటి నీటిని తలస్నానం తర్వాత తలారా పోసుకోవాలి . వీటిలో ఏదో ఒక్కదాన్ని నీటిలో వేసి మరిగించి ఆ నీటితో తలారాపోసుకోవాలి.

7. ఒత్తిడి పెంచుకోకూడదు:

7. ఒత్తిడి పెంచుకోకూడదు:

జుట్టు రాలడానికి మరియు జుట్టు తెల్లబడుటకు ప్రధాన కారణం ఒత్తిడి. . ఒత్తిడి తగ్గించుకోవడానికి కొన్ని యాక్టివిటీస్ ను ట్రై చేయాలి. యోగా, వ్యాయామాలు ఒత్తిడి తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి.

8. రెగ్యులర్ వ్యాయామం:

8. రెగ్యులర్ వ్యాయామం:

రెగ్యులర్ ఎక్సర్ సైజ్ వల్ల హెయిర్ ఫాలీ సెల్స్ ఉత్తేజితమవుతాయి . డెడ్ స్కిన్ సెల్స్ తొలగి పోయి, కొత్త హెయిర్ ఫాలిసెల్స్ పెరుగుతాయి. దాంతో జుట్టు పెరుగదల ప్రారంభమౌతుంది.

English summary

8 Effective Tips To Grow Hair Back Naturally

Hair fall has become one of the most commonly faced issues due to our sedentary lifestyle and wrong eating habits. You can see most of them taking appointments with the doctor for hair loss problems.
Story first published: Tuesday, December 8, 2015, 17:53 [IST]
Desktop Bottom Promotion