For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  హెయిర్ ఫాల్ తగ్గించే నేచురల్ రెమెడీ : కరివేపాకు ఔషధం

  By Sindhu
  |

  కొంత మందిలో జుట్టురాలే సమస్య అధికంగా ఉంటుంది. ఎన్ని షాంపులు మార్చినా ఫలితం కనిపించడం లేదని వాపోతుంటారు . ఇలా ఎవరైనా..ఎప్పుడైనా వెంట్రుకలు ఎక్కువగా రాలిపోతున్నాయని అమ్మతోనో, అమ్మమ్మతోనూ చెబితే వారు, చిట్కాల గురించి ఖచ్చితంగా చెబుతారు. హెయిర్ ఫాల్ తగ్గించే చిట్కాల్లో ,..రెమెడీస్ లో కర్రీ లీవ్స్(కరివేపాకు)ఒకటి.

  జుట్టురాలడం తగ్గించి, వేగంగా జుట్టు పెంచు ఉత్తమ హోం రెమెడీలు

  కరివేపాకు ఆకులను అనేక భారతీయ వంటలలో ఉపయోగిస్తారు. అయితే, వాటిని ఎక్కువగా కూరలలో ఉపయోగించుట వలన కరివేపాకు అని పేరు వచ్చింది. దీనిని "తీపి వేప ఆకులు" అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలో ఎక్కువగా ఉపయోగించే మూలికలలో ఒకటి. కరివేపాకు మీ వంటకాల్లో వాసన మరియు రుచిని కలిగిస్తుంది. శాకాహారమైన, మాంసాహారమైనా రుచి రావాలంటే అందులో కొద్దిగా కరివేపాకు అలాగే అదే సమయంలో,వాటి వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అలాంటి ప్రయోజనాల్లో ఒకటి కురులు స్ట్రాంగ్ మరియు ఒత్తుగా పెరగడం.

  జుట్టు రాలడాన్ని తగ్గించే మన వంటగది వస్తువులు

  కరివేపాకు ఆకులు చెడు కొలెస్ట్రాల్ నియంత్రణ, జీర్ణ వ్యవస్థ కోసం,అతిసారం నిరోధించడానికి సహాయపడతాయి. వీటితోపాటు, కరివేపాకు జుట్టుకు కూడా మంచి చేస్తుంది. మీ జుట్టు ఆరోగ్యంగా మరియు ప్రకాశవంతముగా ఉంచటానికి సహాయపడుతుంది. ఈ భారతీయ హెర్బ్ మీ జుట్టును నునుపుగా మరియు మెరిసేలా చేస్తుంది. అలాగే జుట్టు పెరుగుదలకు సహాయం చేస్తుంది. కరివేపాకు మరియు జుట్టు పెరుగుదల మధ్య ఉన్న కనెక్షన్ గురించి తెలుసుకోవటానికి దీనిని చదవండి.

  1. హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది:

  1. హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది:

  ఒక గిన్నెలో అరకప్పు కొబ్బరి నూనె వేసి, అందులోనే కరివేపాకు వేసి సన్నని మంట మీద ఉడికించాలి. కరివేపాకు బాగా నల్లగా మారే వరకూ ఉడికించి క్రిందికి దింపి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని బాటిల్లో పోసి నిల్వ చేసుకోవాలి. దీన్ని ప్రతి రోజూ కురులకు పట్టిస్తుంటే హెయిర్ ఫాల్ తగ్గడంతో పాటు, జుట్టు కుదుల్ళు స్ట్రాంగ్ గా తయారవుతాయి. దాంతో జుట్టు ఒత్తుగా పెరుగుతుంది . అలాగే జుట్టు తెల్లబడకుండా ఉంటుంది.

  2. చుండ్రునివారణకు

  2. చుండ్రునివారణకు

  నేటి మహిళల్లో జుట్టు రాలడంతో పాటు చుండ్రు కూడా సాధారణ సమస్యగా మారిపోయింది. దీని నుంచి విముక్తి పొందడానినికి యాంటీడాండ్రఫ్ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తుంటారు. వీటి వల్ల కేవలం తాత్కలిక ఫలితం మాత్రమే కనిపిస్తుంది అయితే కరివేపాకుతో తయారుచేసిన ఈ ప్యాక్ ని అప్లై చేసుకుంటూ ఉంటే చుండ్రు నివారించుకోవచ్చు. అందుకోసం, కరివేపాకును శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. తర్వాత ఈ ఆకులను కాచి చల్లార్చిన పాలలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ను కేశాలకు పట్టించి 20 నిముషాల తర్వాత ఆరనివ్వాలి. అనంతరం చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఈ ప్యాక్ ని తరచూ అప్లై చేసుకుంటూ ఉంటే చుండ్రు సమస్య తగ్గుముకం పట్టడంతో పాటు కురులు స్ట్రాంగ్ గా తయారవుతాయి.

  3. సాఫ్ట్ హెయిర్ కోసం:

  3. సాఫ్ట్ హెయిర్ కోసం:

  కేశాలు పట్టులా మ్రుదువుగా మెరుస్తూ ఉండటానికి కండీషనర్ ను ఉపయోగించడం మనకు తెలిసిందే. అయితే కరివేపాకు హెయిర్ మాస్క్ వేసుకోవడం ద్వారా సహజమైన పద్దతిలోనే పట్టులాంటి కురులను పొందవచ్చు. దీనికోసం ఉసిరి పొడి, షీకాకాయ పొడి, కరివేపాకుతీసుకొని మూడు కలిపి నీటిలో వేసి 10 నిముసాలు మరిగించాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని చల్లార్చి మెత్తగా చేసుకోవాలి. దీన్ని కుదుళ్ల నుంచి చివరి వరకూ జుట్టుకు అప్లై చేసుకొని గంటపాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లటి నీటితో కడిగేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

  4. తెల్ల జుట్టు నివారణకు కరివేపాకు:

  4. తెల్ల జుట్టు నివారణకు కరివేపాకు:

  వెంట్రుకలు తెల్లగా మారగానే మార్కెట్ లో లభించే హెయిర్ డైలు వేసుకోవడం ఇటీవలి కాలంలో పరిపాటిగా మారిపోయింది. అయితే కరివేపాకు తెల్లబడిన జుట్టుని నల్లగా మార్చడంతో పాటు కొత్తగా తెల్ల వెంట్రుకలు రాకుండా నివారిస్తుంది. అందుకోసం అరకప్పు ఆవనూనె, బాదంనూనె, కరివేపాకు తీసుకొని, వీటిని బాగామిక్స్ చేసి వేడి చేయాలి. ఈ నూనె వడపోసుకొని బాటిల్లో నిల్వచేసుకొని బద్రపరచుకోవాలి. రాత్రి నిద్రించే ముందు ఈ నూనెను తలకు రాసుకొని మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయాలి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

  5. కండీషనర్ గా :

  5. కండీషనర్ గా :

  రెండు కప్పుల నీటిలో కరివేపాకుల్ని వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత ఈ నీటిని వడపోసి చల్లార్చుకోవాలి. ఈ మిశ్రమంతో తలస్నానం పూర్తయిన తర్వాత జుట్టును కడిగేస్తే సరిపోతుంది. ఇది కండీషనర్ గా పనిచేసి జుట్టును సాఫ్ట్ గా మార్చుతుంది.

  6. హెయిర్ డ్యామేజ్ ను నివారిస్తుంది:

  6. హెయిర్ డ్యామేజ్ ను నివారిస్తుంది:

  పెరుగుదలను ఆపివేసి జుట్టు మూలాలను నాశనం చేస్తాయి. జుట్టు కోసం మంచి పోషకాలు కలిగిన కరివేపాకు దెబ్బతిన్న మూలాలను రిపేరు చేస్తుంది. కరివేపాకు పేస్ట్ ను తల మీద చర్మంపై రాస్తే మూలాలను రిపేరు చేయవచ్చు. అలాగే జుట్టు యొక్క గ్రీవము బలంను పునరుద్ధరించడానికి కూడా సహాయపడుతుంది. మీకు చేదు రుచి ఇష్టం ఉంటే ఈ కరివేపాకు ఆకులను తినవచ్చు. కరివేపాకు మీ దెబ్బతిన్న జుట్టు ప్రథమ చికిత్స కోసం బాగా పనిచేస్తుంది. మీ జుట్టు యొక్క మూలాలు బలంగా మారటం వలన, జుట్టు పెరుగుదల వేగవంతం అవుతుంది.

  7. హెయిర్ మాస్క్ :

  7. హెయిర్ మాస్క్ :

  హెయిర్ మాస్క్ చేయండి కొన్ని కరివేపాకులను తీసుకోని పేస్ట్ చేయండి. ఈ కరివేపాకు పేస్ట్ ను పెరుగులో కలిపి మీ జుట్టుకు బాగా పట్టించండి. మీ జుట్టు మీద ఈ మిశ్రమంను 20 నుంచి 25 నిమిషాల పాటు ఉంచి, ఆ తరువాత ఒక తేలికపాటి షాంపూ తో శుభ్రం చేసుకోవాలి. జుట్టు పెరుగుదలలో తక్షణ పలితాలను చూడాలంటే ప్రతి వారం ఈ ప్యాక్ వేసుకోవాలి. ఈ జుట్టు ప్యాక్ జుట్టును పెంచటమే కాకుండా నునుపుగా మెరిసేలా చేస్తుంది.

  8. అన్ని రకాల జుట్టు సమస్యలకు కరివేపాకు టీ:

  8. అన్ని రకాల జుట్టు సమస్యలకు కరివేపాకు టీ:

  కరివేపాకు టీ ఇది కొంచెం అసహజంగా ఉండవచ్చు. కానీ మీరు మీ జుట్టు కోసం కరివేపాకు టీ ని తయారు చేయవచ్చు. నీటిలో కొన్ని కరివేపాకు ఆకులను వేసి మరిగించి, దానికి కొంచెం నిమ్మరసం,పంచదార జోడించండి. ప్రతి రోజు ఈ టీ త్రాగితే ఒక వారంలో మంచి పలితాలను చూడవచ్చు. ఇది మీ జుట్టు పెరుగుదలను పెంచడానికి, మీ జుట్టును మృదువుగా మెరిసేలా తయారుచేయటానికి మరియు బూడిద రంగు జుట్టును నిరోధించడానికి సహాయపడుతుంది. కరివేపాకును తీసుకోవడం వలన జీర్ణ వ్యవస్థ కోసం మంచిది మరియు అనేక జుట్టు సమస్యలను పరిష్కరిస్తుంది.

  English summary

  Curry Leaves Treatment for Hair Fall and White Hair

  While some deal with an irritated scalp, others deal with dandruff problems or thinning of hair. Hair loss and unhealthy hair conditions are two main problems that most people suffer from. Curry leaves is that magical ingredient which can treat such issues from the root. Curry leaves are rich in antioxidants, beta-carotene, amino acids, proteins, etc., that help get rid of the dead hair follicles and thereby promote thick hair growth.
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more