For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టుురాలడం నుండి అనేక హెయిర్ ప్రాబ్లెమ్స్ నివారించే ఆయుర్వేదిక్ రెమెడీ వేప

|

వేప సహజ ఔషధ గుణాల నిధి. దీనినే సర్వరోగ నివారిణిగా పిలుస్తారు. వేల ఏళ్ల నుంచి భారతీయుల జీవనంలో వేప చెట్టు ఒక భాగంగా ఉంది. వేపచెట్టు, వేపాకు, వేపపూత ఇలా వేపచెట్టునుండి వచ్చే ప్రతి భాగము కూడా మనిషి అరోగ్యంలో పాలుపంచుకుంటున్నాయి. మనిషికి కావలసిన స్వచ్ఛమైన గాలిని ఈ వేప చెట్టు అందిస్తుంది, అలాగే ఆరోగ్యం కూడా. దీనివలన ప్రాచీనకాలం నాటినుండే మనిషి వేపతో అనుసంధానమయ్యాడు.

వేపఆకులో ఆరోగ్యానికి సహాయపడే ఔషధగుణాలు మాత్రమే కాదు, చర్మ, కేశ సంరక్షణకు సహాయపడే గుణాలు కూడా మెండుగా ఉన్నాయి . వేపఆకు పేస్ట్, వేపాకు పౌడర్ మరియు వేపనూనె ను జుట్టుకు పట్టించడం వల్ల చుండ్రు, డ్రై హెయిర్ మరియు హెయిర్ ఫాల్ వంటి అనేక జుట్టు సమస్యలను నివారారించడానికి సహాయపడుతుంది.

READ MORE: వేప గింజల్లో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఇన్ని విధాలుగా సహాయపడే వేపాకు పేస్ట్ మరియు వేపనూనెను కేశాలకు మొదళ్ల నుండి వారానికొకసారి పట్టిస్తే , తల మాడుకు వేపనూనెతో డీప్ గా మసాజ్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. స్నానానికి ఒక గంట లేదా అరగంట ముందుగా అప్లై చేసి తలస్నానం చేసుకుంటే చాలా చాలా ఎఫెక్టివ్ అండ్ క్విక్ ఫలితాలను అందిస్తుంది . అంతేకాదు, వేపనూనె వాసన పడనివారు వేపనూనెలో కొబ్బరి నూనె మిక్స్ చేసి తలకు పట్టించడం వల్ల వాసన అంతగా అనిపించకపోవగా జుట్టు సమస్యలను ఎదుర్కోవచ్చు . ఇంకా జుట్టును సాఫ్ట్ గా మార్చుకోవచ్చు.

READ MORE: జుట్టు పెరుగుదలకు కరివేపాకును ఎలా ఉపయోగించాలి?

జుట్టుకు కలరింగ్ లేదా బ్లీచ్ చేసుకోవడానికి కూడా నీమ్ ప్రొడక్ట్స్ గ్రేట్ గా సహాయపడుతాయి. కలర్ అప్లై చేసిన 6నెలలకు ఈ నీమ్ ప్రొడక్ట్స్ ను ఉపయోగించుకోవచ్చు . హెయిర్ కలర్స్ లో ఉండే కెమికల్స్ నీమ్ పేస్ట్ కు సరిపడక తలలో ఇన్ఫెక్షన్స్ కు దారి తీయవచ్చు. .

మరి వేపఆకుతో జుట్టుకు కలిగి ప్రయోజనాలను ఈ క్రింది స్లైడ్ ద్వారా తెలుసుకుందాం...

1. చుండ్రును నివారిస్తుంది:

1. చుండ్రును నివారిస్తుంది:

వేపాకు బ్యాక్టీరియా, ఫంగస్ నివారిణి. వారంలో రెండు సార్లు వేపనూనెను తలకు పట్టించడం వల్ల చుండ్రు ను నివారించుకోవచ్చు . వేప నూనెలో ఉండే ఔషధ గుణాలు తలలో తెల్లగా పొట్టులాగ ఏర్పడే లక్షణాలను నిలుపుదల చేస్తుంది.

2. జుట్టుకు మంచి షైనింగ్ ను అందిస్తుంది:

2. జుట్టుకు మంచి షైనింగ్ ను అందిస్తుంది:

మీ జుట్టు చూడటానికి డల్ గా అనిపిస్తున్నదా? డల్ హెయిర్ ను ట్రీట్ చేయడానికి నీమ్ పేస్ట్ ను హెయిర్ మాస్క్ గా అప్లై చేయాలి . వేపాకు పేస్ట్ ను నెలలో రెండు సార్లు జుట్టుకు పట్టించాలి. ఈ హోం రెమెడీ మీ జుట్టును మరింత కాంతివంతంగా మెరిపిస్తుంది .

3. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది:

3. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది:

వేపాకు జుట్టు రాలడం తగ్గిస్తుంది మరియు జుట్టు పెరగడాన్ని ప్రోత్సహిస్తుంది . వేపనూనెను ప్రతి వారం జుట్టుకు అప్లై చేయడం ద్వారా జుట్టు పెరుగుదల ఉంటుంది.

4. స్కాల్ఫ్(తలమాడు)ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది:

4. స్కాల్ఫ్(తలమాడు)ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది:

స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ ను నివారించడంలో ఎఫెక్టివ్ హోం రెమెడీ . వేపాకు పేస్ట్ ను నేరుగా తలకు పట్టించి 15 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి . అన్ని రకాల హెయిర్ ప్రాబ్లెమ్స్ ను నివారిస్తుంది.

5. తలలో దురద నివారణకు:

5. తలలో దురద నివారణకు:

వేపనీటితో తలలో దురదను తగ్గించుకోవచ్చు . తరచూ తల దురద పెడుతుంటే హెల్తీ మెడిసినల్ వాటర్ తో తలస్నానం చేసుకోవాలి. దాంతో తలదురద నుండి విముక్తిపొందివచ్చు.

6. వేప మరియు కొబ్బరి నూనె:

6. వేప మరియు కొబ్బరి నూనె:

రెండు చెంచాల వేడి కొబ్బరి నూనెలో మూడు చెంచాల వేపనూనె వేసి గోరువెచ్చగా అయిన తర్వాత ఈ మిశ్రమాన్ని తలకు నేరుగా అప్లై చేయాలి. కేశాలకు తలకు బాగా పట్టిన అరగంట తర్వాత షాంపుతో తలస్నానం చేసుకోవాలి.

7. వేప పేస్ట్:

7. వేప పేస్ట్:

వేపఆకులను నీటిలో వేసి ఉడికించాలి. ఆ నీటిని వడగట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఉడికిన ఆకులను మెత్తగా పేస్ట్ చేసుకోవాలి . ఈ పేస్ట్ ను తలకు పట్టిస్తే వివిధ రకాల హెయిర్ సమస్యలు నివారించబడుతాయి .

8. నీమ్ హెయిర్ ప్యాక్:

8. నీమ్ హెయిర్ ప్యాక్:

జుట్టుకు సంబంధించిన ఎలాంటి సమస్యలైనా నివారించడంలో నీమ్ హెయిర్ ప్యాక్ చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. మీ జుట్టుకు ఎక్కువ న్యూట్రీషియన్స్ అందివ్వాలంటే....వేపాకు పేస్ట్ లో కొద్దిగా ఎగ్ వైట్ ను చేర్చి తర్వాత జుట్టుకు పట్టించాలి.

9. వేపనీళ్ళు:

9. వేపనీళ్ళు:

గుప్పెడు వేపాకులను నీటిలో వేసి బాగా మరిగించి, ఆ నీటిని వడగట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తలస్నానం చేసి ప్రతి సారీ ఈ నీటిని తలరా పోసుకోవాలి. ఇది జుట్టు ఆకారన్ని మెయింటైన్ చేస్తుంది. మరియు అన్ని రకాల హెయిర్ సమస్యలను నివారిస్తుంది.

10. వేప పొడి:

10. వేప పొడి:

వేప ఆకులను బాగా ఎండబెట్టి, పౌడర్ చేసుకొని నిల్వ చేసుకోవాలి. మీకు అవసరం అయినప్పుడు, మరియు హెయిర్ ప్యాక్ లలో వేప ఆకు పౌడర్ మిక్స్ చేసి హెయిర్ ప్యాక్ వేసుకోవచ్చు.

Desktop Bottom Promotion