For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

థైరాయిడ్ పేషంట్స్ లో హెయిర్ ఫాల్ తగ్గించే హోం మేడ్ హెయిర్ మాస్క్ లు

|

ఈ మధ్యకాలం లో బాగా ఎక్కువగా వింటున్న ఆరోగ్య సమస్యల్లో థైరాయిడ్ సమస్య ఒకటి. ఇది ఎక్కువగా మహిళల్లోనే కనిపిస్తుంది. ఇది ఒక జబ్బు కాదు. హార్మోనుల అసమతుల్యత వల్ల శరీరంలో తలెత్తే ఒక అనారోగ్య స్థితి. థైరాయిడ్ ను రక్త పరీక్ష ద్వారా నిర్ధారిస్తారు. మానవ శరీరంలో గొంతు మధ్య భాగాన లోపల సీతాకోక చిలుక ఆకారంలో ఉండే ఒక గ్రంధి థైరాయిడ్. ఈ గ్రంధి యొక్క స్రావములు, ఎక్కువ అయినా, లేక తక్కువ అయినా థైరాయిడ్ వ్యాధి వస్తుంది.

థైరాయిడ్ గ్రంథి అనేది శరీరంలో అతి పెద్దది గ్రంథి. ఇది ముఖ్యంగా మెడ భాగంలో, థైరాయిడ్ కార్టిలేజ్ క్రింది బాగంలో ఉంటుంది. జీవప్రక్రియలు అన్నింటికీ ఇది అతి ముఖ్యమైన గ్రంథి. శరీరంలో ఉండే అతి ముఖ్యమైన అవయవాలను కూడా థైరాయిడ్ గ్రంథి కంట్రోల్‌లో ఉంచుతుంది.

ఈ వ్యాధి వలన మన రోజువారీ పనులకు ఏలాంటి ఆటంకాలు రావు. కానీ మనం మాములుగా మన పని మనం చేసుకుంటూ ఉంటాము. సాధారణంగా మహిళలకు ఉన్న పెద్ద దురలవాటు ఏమిటంటే, శరీరములో బాధ కలిగి, మన పనులకు ఆటంకము కలిగే వరకు మనలో ఉన్న అనారోగ్యాన్ని పట్టించుకోము. జ్వరము , దగ్గు, జలుబు ఇలాంటి జబ్బుల లక్షణాలు పైకి కనబడతాయి కాబట్టి ఏదో ఒక మందు వేసేసుకుని రోజు గడిపేస్తాము. కాని థైరాయిడ్ సమస్య అలా కాదు. కాలం గడిచే కొద్దీ, జుట్టు ఉడడం సమస్య చాల ఎక్కువ అవుతుంది. అయితే ఈ సమస్యను ప్రారంభంలోనే గుర్తించినట్లైతే తగిన చికిత్సను తీసుకోవచ్చు. సమస్య చిగురిస్తున్నప్పుడు కొన్ని నేచురల్ అండ్ హెల్తీ పదార్థాలు జుట్టు రాలడాన్ని అరికడుతాయి.

నిత్య జీవితంలో హాట్ ఆయిల్ మసాజ్ మరియు మినిరల్ వాటర్ తో జుట్టును శుభ్రం చేసుకోవడం హోం మేడ్ షాంపులను ఉపయోగించడం, మన్నికైన కండీషర్స్ మరియు సెరమ్ వంటి ప్రొడక్ట్స్ ను ఉపయోగించడం వల్ల జుట్టు మొదళ్లను స్ట్రాంగ్ గా మార్చి, జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. అయినా థైరాయిడ్ హార్మోనుల అసమతుల్యత వల్ల కంటిన్యూగా హెయిర్ ఫాలస్ ఉన్నట్లై ఇక ముందుముండు హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా కొన్ని సులభమైన హెయిర్ మాస్కులను ఫాలో అవ్వాలి. ఈ హెయిర్ మాస్క్ లవల్ల స్త్రీ పురుషులిరివురిలోనే పెద్ద డిఫరెన్స్ ను చూడవచ్చు. ఈ క్రింది తెలిపిన హెయిర్ మాస్కుల్లో ఏదో ఒకటి అనుసరిస్తూ జుట్టు రాలడం తగ్గించుకోవచ్చు . ఇంకా థైరాయిడ్ సమస్యలను నివారించుకోవాలనుకొనే వారు టెన్షన్స్ మరియు స్ట్రెస్ ను తగ్గించుకోవడం వల్ల జుట్టు రాలడం అరికట్టవచ్చు.

థైరాయిడ్ పేషంట్స్ జుట్టు రాలే సమస్యను అరికట్టుకోవడానికి ఒకే ఒక మార్గం హెయిర్ మాస్క్ లు. కనీసం వారంలో ఒకసారి హెయిర్ మాస్క్ వేసుకోవడం వల్ల ముందు ముందు హెయిర్ ఫాల్, జుట్టు పల్చబడటం, చిట్లడం, డ్రైహెయిర్ జరగకుండా సహాయపడుతుంది . మరియు థైరాయిడ్ పేషంట్స్ స్పెషల్ గా వేసుకోగలిగి హెయిర్ మాస్కులు ఏంటో చూద్దాం...

1. విటమిన్ సి మాస్క్:

1. విటమిన్ సి మాస్క్:

మిక్సీ జార్లో ఒక ఆరెంజ్, ఒక మోసంబి, ఒక స్ట్రాబెర్రీని వేసి, ఈ మూడింటిం కాంబినేషన్ ను జ్యూస్ చేయాలి . ఈ రసాన్ని మూడు చెంచాల పెరుగు మిక్స్ చేసి, ఈ విటమిన్ సి హెయిర్ మాస్క్ ను జుట్టు మొదళ్ల నుండి పట్టించాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే హెయిర్ ఫాల్ తగ్గుతుంది. 20 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేసుకోవాలి.

2. ఆయిల్ మాస్క్:

2. ఆయిల్ మాస్క్:

రెగ్యులర్ గా తలకు అప్లై చేసే హెయిర్ ఆియల్ ను గోరువెచ్చగా చేసి తలకు పట్టించి సున్నితంగా మసాజ్ చేయడం వల్ల థైరాయిడ్ పేషంట్స్ హెయిర్ ఫాల్ తగ్గించుకోవచ్చు . తలస్నానానికి 1 గంట ముందు తలకు హాట్ ఆయిల్ మసాజ్ వల్ల అనేక ప్రయోజనాలున్నాయి.

3. ఫైబర్ మాస్క్:

3. ఫైబర్ మాస్క్:

ఫైబర్ రిచ్ ఫుడ్స్ ను హెయిర్ మాస్క్ గా అప్లై చేయాలి . ఫైబర్ మాస్క్ వల్ల హెయిర్ ఫాల్ సమస్యలు కొన్ని వారాల్లో తగ్గిపోతాయి. చిక్కటి పాలలో మూడు చెంచాల ఓట్స్ పౌడర్ మిక్స్ చేసి పేస్ట్ లా చేసి తలకు అప్లై చేసి డ్రై అయిన తర్వాత తలస్నానం చేయాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

4. టీతో స్నానం:

4. టీతో స్నానం:

గ్రీన్ టీ జుట్టును మరియు హెయిర్ స్కాల్ప్ కు గ్రేట్ గా సహాయపడుతుంది. కొన్ని వారాల పాటు క్రమం తప్పకుండా వారంలో రెండుమూడు సార్లు గోరువెచ్చని గ్రీన్ టీతో తలస్నానం చేయడం వల్ల మంచి ప్రయోజనాలను పొందవచ్చు . దాంతో థైరాయిడ్ పేషంట్స్ జుట్టు రాలడం తగ్గించుకోవచ్చు.

5. ఎగ్ మాస్క్:

5. ఎగ్ మాస్క్:

గుడ్డు ప్రోటీన్ రిచి పదార్థం . ఎలాంటి హెయిర్ సమస్యలైనా నివారించే పోషక గుణాలు ఎగ్ లో అధికంగా ఉన్నాయి . ఎగ్ హెయిర్ మాస్ ను ఉపయోగించి హెయిర్ ఫాల్ ను తగ్గించుకోవచ్చు. థైరాయిడ్ పేషంట్ వారంలో రెండు సార్లు ఎగ్ హెయిర్ మాస్క్ వేసుకోవడం వల్ల జుట్టుకు మంచి షైనింగ్ అందివ్వడంతో పాటు హెయిర్ ఫాల్ అరికడుతుంది.

6. బెర్రీ మాస్క్:

6. బెర్రీ మాస్క్:

గుప్పెడు స్ట్రాబెర్రీలను తీసుకొని మెత్తగా పేస్ట్ చేసి అందులో మూడు చెంచాల పాలు మిక్స్ చేసి తలకు, కేశాల పొడవునా అప్లై చేసి డ్రై అయిన తర్వాత తలస్నానం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే హెయిర్ ఫాల్ తగ్గుతుంది.

7. యోగ్రట్ మాస్క్:

7. యోగ్రట్ మాస్క్:

థైరాయిడ్ పేషంట్స్ కోసం ది బెస్ట్ హెయిర్ ట్రీట్మెంట్ చల్లగా ఉండే పెరుగును కేశాలకు అప్లై చేయడం మంచిది . పెరుగులో క్యాల్షియం, ప్రోటీన్ మరియు న్యూట్రీషియన్స్ ను కేశాలకు అదిస్తుంది . హెయిర్ రూట్స్ బలపడటంతో పాటు హెయిర్ ఫాల్ ను అరికడుతుంది.

8. విటమిన్ ఇ :

8. విటమిన్ ఇ :

బాదం నూనెలో ఉండే విటమిన్ ఇ కేశాలకు గ్రేట్ గా ఉపయోగపడుతుంది . రెండు చెంచాల బాదం నూనెను ఒక చెంచా కొబ్బరి నూనె మిక్స్ చేసి గోరువెచ్చగా చేసి, విటమిన్ ఇ క్యాప్యూల్ ను పొడిచేసి నూనెలో మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని కేశాలకు అప్లై చేయాలి. హెయిర్ మాస్క్ లా వేసుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. వారంలో మూడు సార్లు ఈ హెయిర్ మాస్క్ వేసుకోవడం వల్ల జట్టురాలడం త్వరగా తగ్గుతుంది.

English summary

Hair Masks For Hair Fall In Thyroid Patients

People suffering from thyroid have enough problems to deal with and one of them is hair fall. Thyroid patients face terrible hair loss and the only solution to end this problem is to apply natural and healthy ingredients on the hair.
Story first published: Friday, December 4, 2015, 12:26 [IST]
Desktop Bottom Promotion