ఇంట్లోనే హెయిర్ స్పా చేసుకోవడానికి : సులభ చిట్కాలు

By Sindhu
Subscribe to Boldsky

కొంత మంది జుట్టు చూస్తే చాలా అందంగా మంచి షైనింగ్ తో మెరుస్తుంటుంది. అయితే కొంత మందికి అది నేచురల్ గా మెయింటైన్ చేస్తే మరికొంత మంది దాన్ని బ్యూటీ పార్లర్స్ లో హెయిర్ స్పాలు చేయించుకుంటున్నారు అనుకుంటారు. అయితే జుట్టు సాఫ్ట్ గా మరియు మంచి షైనింగ్ తో మెరుస్తుండాలంటే, పార్లర్ కే వెళ్ళాల్సిన అవసరం లేదు. నేచురల్ పద్దతుల ద్వారా మనం ఇంట్లో హెయిర్ స్పా చేసుకోవచ్చు.

అయితే మనలో కూడా చాలా మంది జుట్టు ఆరోగ్యంగా మెరిపించుకోవడం కోసం, ఒత్తిడిని తగ్గించుకొనేందుకు వందలకు వందలు పోసి బ్యూటీ పార్లర్లలో ట్రీట్మెంట్లు తీసుకుంటుంటారు. అయితే అలాంటివీ అవసరం లేకుండానే, డబ్బు ఖర్చు చేయకుండానే ఇంట్లో లభించే సహజసిద్దమైన పదార్థాలతో హెయిర్ స్పా చేసుకోవచ్చు. అదెలాగో తెలుసుకోవాలంటే ఈ క్రింది స్లైడ్ క్లిక్ చేయాల్సిందే...

బనానా స్పా:

బనానా స్పా:

అరటిపండు ఆరోగ్యానికి మరియు చర్మ సౌంద్యానికి మాత్రమే కాదు, శిరోజాల నిగారింపులో కూడా ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. అందుకోసం బాగా పండిన అరటిపండును మెత్తగా చేసి అందులో ఒక కప్పు ఆలివ్ ఆయిల్, ఎగ్ వైట్ కలిపి బాగా మిక్స్ చేయాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని కుదుళ్ళ నుండి జుట్టుకు పూర్తిగా పట్టించి, వేడినీటిలో ముంచిన టవల్ తో తలకు చుట్టేయాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో తలస్నానం చేయాలి. తర్వాత జుట్టుకు కండీషనర్ ను అప్లై చేయాలి. ఇలా చేస్తే మిళమిళ మెరిసే కేవ సౌందర్యం మీ సొంతమవుతుంది.

 కోకనట్ క్రీమ్ :

కోకనట్ క్రీమ్ :

జుట్టును కాంతివంతంగా ఉంచుకునేందుకు కోకోనట్ క్రీమ్ బాగా ఉపయోగపడతుంది. దీన్ని ఇంట్లోనూ తయారుచేసుకోవచ్చు. లేదా మార్కెట్లో కూడా మనకు అందుబాటులో ఉంటుంది. దీన్ని చేత్తో బాగా కలిపి తలకు పట్టించి 10 నిముషాల బాగా మసాజ్ చేయాలి. క్రీమ్ జుట్టు కుదుళ్లకు మాడుకు పూర్తిగా పట్టేలా తలస్నానం చేయాలి. ఆ తర్వాత జుట్టును హెయిర్ డ్రయ్యర్ తో కాకుండా సహజంగా ఆరనివ్వాలి. ఇలా చేస్తే జుట్టుకు కావాల్సిన పోషణ అందుతుంది, ఆరోగ్యంగా తయారవ్వడమే కాకుండా చూసేందుకు ఆకర్షణీయంగా కూడా ఉంటుంది.

ఎగ్ :

ఎగ్ :

జుట్టుకు మంచి షైనింగ్ మరియు మంచి పోషణ అందివ్వడంలో గుడ్డులోని తెల్లసొన బాగా ఉపకరిస్తుందని మనకు తెలుసు. కానీ దీనితో హెయిర్ స్పా చేసుకోవచ్చన్న విషయం చాల మందికి తెలియకపోవచ్చు. దీని కోసం చేయాల్సిందల్లా ... ఒక గుడ్డును తీసుకొని అందులో నుంచి తెల్లసొనను జాగ్రత్తగా వేరుచేయాలి. అందులో కొద్దిగా కొబ్బరి నూనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు మాస్క్ లా పట్టించి, ఆ తర్వాత ఒక టవల్ ను వేడినీళ్ళలో ముంచి తలకు గట్టిగా కట్టుకోవాలి. 20 నిముషాల తర్వాత చల్లటి నీళ్ళు, షాంపుతో తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

హాట్ ఆయిల్ మసాజ్:

హాట్ ఆయిల్ మసాజ్:

సాధారణంగా ఇంట్లో అందుబాటులో ఉండే కొబ్బరి నూనెను వేడి చేసి దానిని కూడా హెయిర్ స్పా కోసం ఉపయోగించవచ్చు. చక్కటి రిలాక్సేషన్ పొందవచ్చు. దీనికోసం కొబ్బరి నూనెను వేడి చేసి దాంతో పది నిముషాల పాటు తలపై మర్దన చేసుకోవాలి. ఓ పావుగంట తర్వాత వేడి నీళ్లలో ముంచిన టవల్ ను నీళ్లు కారకుండా పిండేసి, తలకు చుట్టుకోవాలి. లేకపోతే ఆయిల్ పెట్టిన తలకు ఆవిరి కూడా పట్టవచ్చు. ఇలా చేసిన అరగంట తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి. స్నానానికి గోరువెచ్చని నీటిని ఉపయోగించాలి. అలాగే తలస్నానం తర్వాత కండీషనర్ ను అప్లై చేయాలి. కండీషనర్ అప్లై చేసిన తర్వాత తిరిగి తలమీద నీళ్ళు పోసి కడిగేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. తలలో జిడ్డు, మురికి పూర్తిగా తొలగిపోయి జుట్టు ఆరోగ్యంగా మెరుస్తూ ఉంటుంది.

 జెల్ స్పా:

జెల్ స్పా:

ఈ చికిత్స కూడా తలకు నూనె రాసుకోకుండా చేసుకోవాలి. నాలుగు చెంచాల కలబంద గుజ్జు, చెంచా చొప్పున బాదం నూనె ,గులాబి నూనె. మైట్లి నూనె (బజార్లో లభిస్తుంది)లను తీసుకోవాలి. ఈ నూనెల్ని కలబంద గుజ్జుకు కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట మర్దన చేయాలి. తర్వాత వేడినీటిలో ముంచిన తువాలును తలకు చుట్టుకోవాలి. పదినిమిషాలు అలాగే వదిలేసి ఆ తరవాత జెల్ ఆధారిత షాంపూతో కడిగేసుకోవాలి. జుట్టు తడి ఆరకుండానే జెల్ స్పా క్రీంను రాసుకుని పదినిమిషాలయ్యాక కడిగేసుకోవాలి.

కలర్ స్పా:

కలర్ స్పా:

జుట్టుకు రంగు వేసుకోవాలనుకునేవారు దీన్ని ప్రయత్నించవచ్చు. ముందుగా తలస్నానం చేసుకోవాలి. తడి పూర్తిగా ఆరిపోయాక.. నప్పే కలర్ స్పా క్రీం ను సరిపడేంత తీసుకుని మాడుకు కాకుండా జుట్టుకు మాత్రమే పట్టించాలి. నలభై ఐదునిమిషాల తరవాత స్పా కలర్ కంట్రోల్ షాంపూతో కడిగేసుకోవాలి. తడి ఆరకుండానే స్పా కండిషనింగ్ క్రీంను రాసుకుంటే సరిపోతుంది. మరో పదినిమిషలయ్యాక నీళ్ళతో దాన్నీ తొలగించుకోవాలి. తరచు కలర్ కంట్రోల్ షాంపూను వాడడం వల్ల వేసుకున్న రంగు ఎక్కువ రోజులు జుట్టుకు పట్టి ఉంటుంది. ఈ చికిత్సల్లో ఉత్పత్తులన్నీ బజార్లో లభిస్తాయి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Hair Spa Treatment At Home : Beauty Tips in Telugu

    A home spa treatment is a great way to relax at home after a busy, stressful day. Most people will only focus on their skin or nails, but hair needs love and care too! If your hair is dry, brittle, frizzy, or damaged, it probably needs extra moisture. A hair spa treatment is a great and relaxing way to give your hair the moisture that it needs. At the end of it, you may be surprised with hair that feels much softer than before!
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more