For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

థైరాయిడ్ వల్ల జుట్టు రాలే సమస్యలను నివారించడానికి ఎఫెక్టివ్ మార్గాలు..

|

ఈ మధ్యకాలం లో బాగా ఎక్కువగా వింటున్న ఆరోగ్య సమస్యల్లో థైరాయిడ్ సమస్య ఒకటి. ఇది ఎక్కువగా మహిళల్లోనే కనిపిస్తుంది. ఇది ఒక జబ్బు కాదు. హార్మోనుల అసమతుల్యత వల్ల శరీరంలో తలెత్తే ఒక అనారోగ్య స్థితి. థైరాయిడ్ ను రక్త పరీక్ష ద్వారా నిర్ధారిస్తారు. మానవ శరీరంలో గొంతు మధ్య భాగాన లోపల సీతాకోక చిలుక ఆకారంలో ఉండే ఒక గ్రంధి థైరాయిడ్. ఈ గ్రంధి యొక్క స్రావములు, ఎక్కువ అయినా, లేక తక్కువ అయినా థైరాయిడ్ వ్యాధి వస్తుంది.

థైరాయిడ్ గ్రంథి అనేది శరీరంలో అతి పెద్దది గ్రంథి. ఇది ముఖ్యంగా మెడ భాగంలో, థైరాయిడ్ కార్టిలేజ్ క్రింది బాగంలో ఉంటుంది. జీవప్రక్రియలు అన్నింటికీ ఇది అతి ముఖ్యమైన గ్రంథి. శరీరంలో ఉండే అతి ముఖ్యమైన అవయవాలను కూడా థైరాయిడ్ గ్రంథి కంట్రోల్‌లో ఉంచుతుంది.

25ఏళ్ళలోపు జుట్టు రాలడానికి గల ముఖ్యమైన ఆరోగ్య కారణాలు

ఈ వ్యాధి వలన మన రోజువారీ పనులకు ఏలాంటి ఆటంకాలు రావు. కానీ మనం మాములుగా మన పని మనం చేసుకుంటూ ఉంటాము. సాధారణంగా మహిళలకు ఉన్న పెద్ద దురలవాటు ఏమిటంటే, శరీరములో బాధ కలిగి, మన పనులకు ఆటంకము కలిగే వరకు మనలో ఉన్న అనారోగ్యాన్ని పట్టించుకోము. జ్వరము , దగ్గు, జలుబు ఇలాంటి జబ్బుల లక్షణాలు పైకి కనబడతాయి కాబట్టి ఏదో ఒక మందు వేసేసుకుని రోజు గడిపేస్తాము.

థైరాయిడ్ పేషంట్స్ లో హెయిర్ ఫాల్ తగ్గించే హోం మేడ్ హెయిర్ మాస్క్ లు

కాని థైరాయిడ్ సమస్య అలా కాదు. కాలం గడిచే కొద్దీ, జుట్టు ఉడడం సమస్య చాల ఎక్కువ అవుతుంది. అయితే ఈ సమస్యను ప్రారంభంలోనే గుర్తించినట్లైతే తగిన చికిత్సను తీసుకోవచ్చు. సమస్య చిగురిస్తున్నప్పుడు కొన్ని నేచురల్ అండ్ హెల్తీ పదార్థాలు జుట్టు రాలడాన్ని అరికడుతాయి. థైరాయిడ్ సమస్యల వల్ల రాలే జుట్టును అరికట్టడానికి కొన్ని నేచురల్ మార్గాలేంటో చూద్దాం...

విటమిన్ సి:

విటమిన్ సి:

విటమిన్ సి ఆహారాలను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శరీరంలో ఇమ్యూనిటి పవర్ పెరుగుతుంది . జుట్టు రాలడానికి కారణమయ్యే ఫ్రీరాడికల్స్ ను నివారించడాని విటమిన్ సిలో ఉండే యాంటీయాక్సిడెంట్స్ గ్రేట్ గా సహాయపడుతాయి . ఒక గ్లాసు నీటిలో నిమ్మరసం, ఉసిరికాయ జ్యూస్ రెండు టీస్పూన్స్ అందులో ఒక టీస్పూన్ తేనె మిక్స్ చేసి ప్రతి రోజూ ఉదయం పరగడుపుతో తీసుకోవాలి . రోజుకు ఒక జామకాయ తిన్నా సరే. ఇతర సిట్రస్ ఫ్రూట్స్ లో కంటే ఇందులో ఎక్కువ విటమిన్ సి ఉంటుంది.

విటమిన్ ఇ:

విటమిన్ ఇ:

విటమిన్ ఇ జుట్టు ఆరోగ్యానికి ప్రయోజనకరం. ఇది జుట్టు రాలడం తగ్గిస్తుంది మరియు జుట్టు పెరగడాన్ని ప్రోత్సహిస్తుంది . కాబట్టి థైరాయిడ్ వల్ల జుట్టు కోల్పోతుంటే విటమిన్ ఇ సప్లిమెంట్ తీసుకోవాలి . రోజుకొక విటమిన్ ఇ క్యాప్యూల్ తీసుకొని జుట్టు రాలడం తగ్గించుకోవాలి.

 ప్రోటీన్ ఫుడ్ అధికంగా తీసుకోవాలి:

ప్రోటీన్ ఫుడ్ అధికంగా తీసుకోవాలి:

థైరాయిడ్ సమస్య నుండి అదే విధంగా జుట్టు రాలే సమస్య నుండి బయటపడాలంటే ప్రోటీన్ ఫుడ్ అధికంగా తీసుకోవాలి . ఇతి థైరాయిడ్ మాల్ ఫంక్షన్ ను చాలా ఎపెక్టివ్ గా నివారిస్తుంది . గుడ్లు, లెగ్యుమ్స్, నట్స్, కాటేజ్ చీజ్, మరియు క్వీనా వంటివి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

ఈవెనింగ్ పైమ్ రోజ్ ఆయిల్:

ఈవెనింగ్ పైమ్ రోజ్ ఆయిల్:

థైరాయిడ్ వల్ల జుట్టు రాలడాన్ని అరికట్టడానికి ప్రైమ్ రోజ్ ఆయిల్ ఉపయోగపడుతుందని కొన్ని పరిశోధన ద్వారా నిర్ధారించారు.

 ఓట్స్:

ఓట్స్:

ఓట్స్ లో సోలబుల్ ఫైబర్, విటమిన్ బి మరియు అమినో యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవన్నీ థైరాయిడ్ గ్రంథుల పనితీరుకు సహాయపడుతుంది. హెల్తీ లెవల్స్ విటమిన్స్ మరియు అమినో యాసిడ్స్ జుట్టు తక్కువగా రాలడాన్ని ఉపయోగపడుతాయిః

గ్లూటెన్ :

గ్లూటెన్ :

గ్లూటెన్ కు దూరంగా ఉండటం మంచిది . థైరాయిడ్ సమస్య వల్ల జుట్టు కోల్పోతుంటే. ఇలా గ్లూటెన్ కు ఒకసంవత్సరం పాటు దూరంగా ఉంటే ఫలితం ఉంటుంది.

ఎసెన్సియల్ ఫ్యాటీ యాసిడ్స్ మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి:

ఎసెన్సియల్ ఫ్యాటీ యాసిడ్స్ మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి:

ఓమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే ఆహారాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. ఉదాహరణకు ఫిష్, ఫ్లాక్స్ సీడ్స్, వాల్ నట్స్, మరియు సార్డిన్స్ వంటి వాటిలో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి . ఇవి థైరాయిడ్ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి . అదే సమయంలో జుట్టు రాలడం నివారిస్తాయి.

రోజూ వ్యాయామం చేయాలి:

రోజూ వ్యాయామం చేయాలి:

మీరు కనుక ఊబకాయగ్రస్తులైతే , ఖచ్చితంగా థైరాయిడ్ సమస్యకు గురి అవుతారు. కాబట్టి, ఈ రోజు నుండే వ్యాయామం చేయడం ప్రారంభించండి. వ్యాయామం బరువు తగ్గడానికి సహాయపడుతుంది, ఫిట్ గా ఉండటానికి సహాయపడుతుంది మరియు థైరాయిడ్ బ్యాలెన్స్ చేస్తుంది . హెయిర్ ఫాల్ మరియు ఇమ్యూనిటిని క్రమంగా ఉంచుతుంది.

యోగా చేయాలి:

యోగా చేయాలి:

యోగాను కేవలం వ్యాయామంగానే కాదు, రెగ్యులర్ గా యోగ చేయడంవల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. యోగాలో వివిధ రకాల ఆసనాలున్నాయి. ముఖ్యంగా అంతర్గతంగా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది మజ్రాసన లేదా భుజంగాసన చేయడం వల్ల జుట్టు రాలడం నివారించుకోవచ్చు.

చక్ర మెడిటేషన్ మరియు రైకిChakra Meditation And Reiki:

చక్ర మెడిటేషన్ మరియు రైకిChakra Meditation And Reiki:

ఈ రెండూ పవర్ ఫుల్ ఆల్టర్ నేటివ్ టెక్నిక్స్ . ఇవి కొన్ని అద్భుతాలను క్రియేట్ చేస్తాయి . ఈరెండూ ఒకే విధమైన ఫలితాలను అందిస్తాయి . సమస్య ఏదైనా కావచ్చు , ప్రారంభలో మూలధార చక్ర సహాయపడుతుంది.

English summary

Ten Simple And Natural Ways To Combat Thyroid-Induced Hair Loss

One of the major causes of hair loss in women is thyroid dysfunction. While there are symptomatic remedies available to offer relief from hair loss, the ultimate way to put an end to this disturbing phenomenon is to bring thyroid back to its natural form.
Story first published: Friday, March 4, 2016, 11:07 [IST]
Desktop Bottom Promotion