For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తెల్ల జుట్టును నల్లగా మార్చే సులభమైన చిట్కాలు..!

|

చిన్న వయస్సులో తెల్ల జుట్టు చాలా ఇబ్బంది కరంగా ఉంటుంది. చిన్న వయస్సులో తెల్లజుట్టు కారణంగా వయస్సైన వారిలా కనబడుతారు. తెల్ల జుట్టు అనేది ప్రతి ఒక్కరి జీవితంలోనూ స్వాగతించదగ్గ విషయం. 50 ఏళ్ళ వయస్సు పైబడ్డ వారిలో తెల్లజుట్టు సహజం . కానీ చిన్న వయస్సులోనే జుట్టు తెల్లబడితే బాధకరమైన విషయం. అందువల్ల చిన్న వయస్సులో జుట్టు తెల్లబడుటకు గల కారణాలు తెలుసుకుని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. హోం రెమెడీస్ ను ఉపయోగించాలి. ఇక ముందు తెల్ల జుట్టు ఏర్పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.

తలలో జుట్టు నల్లగా నేచురల్ గా కలర్ కలిగి ఉండటానికి అసవరమయ్యే మెలనిన్ సరిపడా ఉత్పత్తి కాకపోవడం వల్ల తెల్ల జుట్టు ఏర్పడుతుంది. అలాగే జుట్టును స్ట్రాంగ్ గా ఉంచే కెరోటినిన్ అనే ప్రోటీన్ లోపించడం వల్ల మెలనిన్ సరిగా ఉత్పత్తి కాదు. దాంతో యంగ్ ఏజ్ లోనే జుట్టు తెల్లగా మారుతుంది. పిగ్మెంటేషన్ కారణంగా కూడా తెల్ల జుట్టు వస్తుంది. కొంత మందిలో వ్యాధుల కారణంగా, ఉపయోగించే మెడిసిన్స్ మరియు అండర్ లైయింగ్ స్కిన్ సమస్యల వల్ల జుట్టు తెల్లగా మారుతుంది. ఇంకా చెప్పాలంటే జెనటిక్స్ (వంశపారంపర్యంగా ) లేదా స్ట్రెస్, స్మోకింగ్ కూడా జుట్టుకు ముఖ్య కారణం.

చిన్న వయస్సులోనే జుట్టు తెల్లగా మారుతున్నట్లైతే వెంటనే స్మోకింగ్ నిలిపేయాలి. ఇతర కారణాల వల్ల అయితే, కొన్ని హోం రెమెడీస్ ను ఉపయోగించడం వల్ల తెల్ల జుట్టును ఎఫెక్టివ్ గా నివారించుకోవచ్చు. ఈ హోం రెమెడీస్ తెల్ల జుట్టును శాశ్వతంగా నివారిస్తాయి !

ఆమ్లా ఆయిల్ :

ఆమ్లా ఆయిల్ :

ఆమ్లా ఆయిల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఆమ్లా నూనెను ఉపయోగించడం వల్ల చిన్న వయస్సులో వచ్చే తెల్ల జుట్టును గ్రేట్ గా నివారించుకోవచ్చు. డ్రై అయిన ఆమ్లా ముక్కలను కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్లో వేసి మరిగించి గోరువెచ్చని నూనెను తలకు మసాజ్ చేయాలి.

 ఉల్లిపాయ పేస్ట్ :

ఉల్లిపాయ పేస్ట్ :

ఉల్లిపాయల్లో కాటలేస్ అనే ఎంజైమ్స్ అధికంగా ఉన్నాయి. ఇవి మెలనిన్ ప్రొడక్షన్ ను పెంచుతాయి. ఉల్లిపాయను మెత్తగా పేస్ట్ చేసి, తలకు అప్లై చేయాలి. ఈ ఆనియన్ ప్యాక్ ను వారంలో ఒకసారి వేసుకుంటే చాలు మంచి ఫలితం ఉంటుంది. తెల్ల జుట్టు నివారించుకోవడానికి ఫర్ఫెక్ట్ మార్గం !

కరివేపాకు:

కరివేపాకు:

కరివేపాకు లో విటమిన్ బి కాంప్లెక్స్, సెలీనియం, జింక్ వంటివి తలలో మెలనిన్ కంప్లెక్షన్ ఉత్పత్తి చేయడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. కరివేపాకును కొబ్బరి నూనెలో వేసి బాగా మరిగించాలి. తర్వాత నూనె వడగట్టి, తలకు అప్లై చేసి మసాజ్ చేయాలి.

మేతి:

మేతి:

మెంతులను నేచురల్ హోం రెమెడీగా ఉపయోగించుకోవచ్చు. తెల్ల జుట్టును నివారించడంలో మెంతులు గ్రేట్ గా సహాయపడుతాయి. మెంతులను నీటిలో వేసి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు మెత్తగా పేస్ట్ చేసి, తలకు ప్యాక్ వేసుకోవాలి. అరగంట తర్వాత తలస్నానం చేయాలి..

బ్లాక్ టీ :

బ్లాక్ టీ :

తలకు బ్లాక్ టీని మసాజ్ చేయడం వల్ల తెల్ల జుట్టును నివారించుకోవచ్చు. బ్లాక్ టీలో ఉండే కెఫిన్ మరియు యాంటీఆక్సిడెంట్స్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. ఇది నేచురల్ హెయిర్ డైగా పనిచేస్తుంది. జుట్టును నేచురల్ గా డార్క్ గా మార్చుతుంది.

హెన్నా:

హెన్నా:

తెల్ల జుట్టును నల్లగా మార్చే మరో నేచురల్ రెమెడీ హెన్నా. హెన్నాను ఆమ్లా, శీకాకాయ్ తో మిక్స్ చేసి, తలకు అప్లై చేయడం వల్ల తెల్ల జుట్టును నేచురల్ గా మాయం చేసుకోవచ్చు. అంతే కాదు, ఈ హెయిర్ ప్యాక్ వల్ల జుట్టు సాఫ్ట్ గా మరియు షైనీగా మారుతుంది.

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె:

తెల్ల జుట్టును నివారించడంలో కొబ్బరి నూనె అమేజింగ్ హోం రెమెడీ .. వారంలో రెండు మూడు సార్లు కొబ్బరి నూనెను తలకు మసాజ్ చేయడం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. . ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

English summary

7 Home Remedies To Get Rid Of Grey Hair Permanently

Early grey hair is surely distressing. Even though grey hair is something that everyone deals with at some point of time or the other, it can be quite a pain to see that first strand come up, especially if it comes before you expect it to. Thankfully, you can try out some of the home remedies to delay and get rid of the signs of premature greying of hair.
Story first published: Tuesday, September 13, 2016, 13:21 [IST]
Desktop Bottom Promotion