For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆయిల్ హెయిర్ నివారించే 7 ఎఫెక్టివ్ హోం రెమెడీస్

|

సాధారణ జుట్టు సమస్యల్లో ఆయిలీ హెయిర్ ఒకటి. మీరు రెగ్యులర్ గా తలస్నానం చేస్తున్నా, జుట్టు ఎప్పుడూ జిడ్డుగా కనబడుతుంటుందా ? తలలో సెబమ్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల ఈ జిడ్డు సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా ఎఫెక్టివ్ గా కేశాల మీద ప్రభావం చూపుతుంది. నూనె వల్ల జుట్టు మరింత మురికిగా, జిడ్డుగా కనబడేలా చేస్తుంది.

అలాగే మరికొంత మందిలో జీన్స్, హార్మోనుల ప్రభావంతో పాటు, అసాధారణ ఆహారపు అలవాట్లు , ఒత్తిడి వంటి కారణాల వల్ల కూడా జుట్టు జిడ్డుగా మారే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఆయిలీ హెయిర్ జుట్టుకు సంబంధించిన చుండ్రు, జుట్టు చిట్లడం వంటి సమస్యలకు కారణమవుతుంది.

ఇలాంటి జుట్టును మ్యానేజ్ చేయడం చాలా కష్టం. ఇలాంటి జుట్టు నిర్వాహణ కోసం ఒక సులభమైన, పవర్ఫుల్ హోం మేడ్ హెయిర్ మాస్క్ ను పరిచయం చేస్తున్నాం. ఇది ఆయిల్ జుట్టుకు ఉపయోగించి, ఆయిలీ హెయిర్ నునివారించుకోండి.

తలస్నానం తర్వాత కూడా జుట్టు జిడ్డుగా ఉంటే ఇలా చేయండి..?

ఆయిల్ హెయిర్ నివారించుకోవడానికి వంటగదిలోని కొన్ని పదార్థాలు చాలా ఉపయోగకరమైనవి. వంటగదిలో ఉండే ఎగ్ వైట్, ఉప్పు, నిమ్మరసం వీటన్నింటిలో, ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకమైన గుణాలు ఉన్నాయి. ఇవి జుట్టు లోపల నుంచి పోషణను అందిస్తాయి. అలాగే తలలో ఉండే అదనపు నూనెను గ్రహిస్తాయి.

ఈ పదార్థాలు యాంటీబ్యాక్టీరియల్ స్వభావం కలిగి ఉంటాయి. అందువల్ల ఇవి వివిధ రకాల జుట్టు సమస్యలను నివారించడంలో గొప్పగా సహాయపడతాయి. ఆయిలీ హెయిర్ ను నివారించుకోవడానికి ఇంట్లో మీరు ఉపయోగించాల్సిన కొన్ని ఎఫెక్టివ్ హోం మేడ్ హెయిర్ ప్యాక్స్ ..ఈ క్రింది విధంగా..

 ఆపిల్ సైడర్ వెనిగర్:

ఆపిల్ సైడర్ వెనిగర్:

ఆపిల్ సైడర్ వెనిగర్ ఆయిల్ హెయిర్ నివారించడంలో ఎపెక్టివ్ గా సహాయపడుతుంది. . ఆపిల్ సైడర్ వెనిగర్ లో ఉండే అసిటిక్ యాసిడ్ తలలో పిహెచ్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది. ఎక్సెస్ ఆయిల్ ను నివారిస్తుంది . మరియు ఇది ఎఫెక్టివ్ గా హెయిర్ టానిక్ గా పనిచేస్తుంది. జుట్టును సాఫ్ట్ గా మరియు షైనిగా మార్చుతుంది. 3 టేబుల్ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ ను ఒక కప్పు నీటిలో మిక్స్ చేసి, షాంపుతో తలస్నానం చేయాలి. ఇలా వారంలో 3సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

నిమ్మరసం:

నిమ్మరసం:

వివిధ రకాల జుట్టు సమస్యలకు నిమ్మరసం గ్రేట్ గా సహాయపడుతుంది. నిమ్మరసంలో వివిధ రకాల విటమిన్స్, మినిరల్స్ ఉంటాయి. ఇవి హెల్తీ హెయిర్ ను ప్రోత్సహితస్తాయి. నిమ్మలో అసిడిక్ లక్షణాలు, జుట్టులో పిహెచ్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది. నిమ్మరసంను రెండు కప్పుల డిస్టిల్ వాటర్ లో మిక్స్ చేసి, అందులో తేనె మిక్స్ చేసి తలకు పూర్తిగా పట్టించి మసాజ్ చేయాలి, కొన్ని నిముషా తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. దీన్ని వారంలో మూడు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

బ్లాక్ టీ:

బ్లాక్ టీ:

బ్లాక్ టీ గ్రేట్ ఆస్ట్రిజెంట్ గా పనిచేస్తుంది. ఇందులో ఉండే టానిక్ యాసిడ్ తలలో ఎక్సెస్ ఆయిల్ ను నివారిస్తుంది. చర్మ రంద్రాలను టైట్ చేస్తుంది. రెండు కప్పుల నీటిలో టీ ఆకులను వేసి బ10 నిముషాలు బాగా మరిగించి , రూమ్ టెంపరేచర్ లో చల్లార్చాలి . ఈ గోరువెచ్చని బ్లాటీని తలకు పోసుకుని మసాజ్ చేయాలి. 10 నిముషాల తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి. వారంలో 3 సార్లు ఇలా చేస్తుంటే ఆయిల్ హెయిర్ నివారించబడుతుంది.

అలోవెర:

అలోవెర:

కలబందలో విటమిన్స్, మినిరల్స్ , ఎంజైమ్స్ పుష్కలంగా ఉన్నాయి . ఆయిల్ హెయిర్ నివారించడంలో చాలా గ్రేట్ రెమెడీ. అలోవెర తలలో మలినాలను నివారిస్తుంది . తలలో ఆయిల్ ఉత్పత్తిని నివారిస్తుంది, ఇది జుట్టుకు పోషణను అందిస్తుంది, మరియు జుట్టును స్మూత్ గా మార్చుతుంది. ఒక టీస్పూన్ అవోవెర జెల్లో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని షాంపుతో మిక్స్ చేసి తలస్నానం చేసుకోవాలి. తలకు పట్టించి, 10నిముషాలు తర్వాత తలస్నానం చేయాలి. ఈ షాంపు వల్ల జుట్టు తలలో ఆయిల్ కంట్రోల్ అవుతుంది.

బేకింగ్ సోడ:

బేకింగ్ సోడ:

బేకింగ్ సోడాలో ఆయిల్ ను గ్రహించే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది ఆయిల్ హెయిర్ కు గ్రేట్ హోం రెమెడీ. . ఇందులో ఉండే ఆల్కలైన్ నేచర్ తలలోని పిహెచ్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది. ఆయిల్ తగ్గిస్తుంది. ఫ్యూయల్ స్మెల్ తగ్గిస్తుంది.

ఎగ్ మాస్క్:

ఎగ్ మాస్క్:

ఆయిల్ హెయిర్ కు ఇది గ్రేట్ హెయిర్ కండీషనర్. ఎగ్ వైట్ తలలోని జిడ్డును తొలగిస్తుంది. గుడ్డు పచ్చసొనలో ప్రోటీన్స్ ఉన్నాయి. ఇవి జుట్టును బలోపేతం చేస్తుంది. ఒక ఎగ్ వైట్ ను తలకు పట్టించి 20 నిముషాల తర్వాత తలస్నానం చేయాలి. షాంపుతో తలస్నానం చేస్తే మంచి ఫలితం ుంటుంది. ఇలా వారానికొకసారి చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

టమోటోలు:

టమోటోలు:

టమోటోల్లో ఉండే అసిడిక్ నేచర్ తలలో పిహెచ్ లెవల్స్ బ్యాలెన్స్ చేస్తుంది. ఇది తలలోని ఎక్సెస్ ఆయిల్ సెక్రికేషన్ ను కంట్రోల్ చేస్తుంది. ఫ్యూయల్ స్మెల్ తగ్గిస్తుంది. బాగా పండిన టమోటోలో కొద్దిగా ఫుల్లర్స్ ఎర్త్ మిక్స్ చేసి తలకు పట్టించాలి. తర్వాత షవర్ క్యాప్ ధరించి అరగంట తర్వాత చల్లటి నీటితో తలను శుభ్రం చేసుకోవాలి. ఇలా వారంలో రెండు మూడు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

English summary

7 Home Remedies for Oily Hair

When your hair gets greasy just a day or two after washing it, you likely have oily hair. Oil is a natural secretion of the scalp that helps keep hair healthy. Oily hair is the result of excessive oil production. This can happen for many reasons like heredity, hormonal changes, excessive stress, eating too much oily food and poor hair care. Oily hair are heavy looking and unmanageable hair that clump together, and are more prone to dandruff and itchiness.
Story first published: Monday, July 18, 2016, 17:42 [IST]
Desktop Bottom Promotion