For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొబ్బరినూనె, నిమ్మరసం మిశ్రమంతో జుట్టుకి కలిగే అమేజింగ్ బెన్ఫిట్స్..!

By Swathi
|

జుట్టు రాలడం, జుట్టు పలచబడి పోవడం, చుండ్రు, స్కాల్ప్ లో దురద వంటి సమస్యలు.. మహిళలందరిలో చాలా కామన్ ప్రాబ్లమ్స్. అన్ హెల్తీ లైఫ్ స్టైల్, పొల్యూషన్, ఇతర కారణాల వల్ల.. మన జుట్టు ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతోంది.

చాలా ఖరీదైన హెయిర్ ప్రొడక్ట్స్ ఉపయోగించినా.. జుట్టు నిర్జీవంగా, అనేక సమస్యలను ఫేస్ చేస్తున్నారంటే.. మీరు ఖచ్చితంగా న్యాచురల్ రెమిడీస్ ఉపయోగించాలి. కేవలం రెండే రెండు పదార్థాల మిశ్రమం మీ జుట్టుకి అద్భుత ప్రయోజనాలు అందిస్తుంది.

అవేవో కాదు.. కొబ్బరినూనె, నిమ్మరసం. ఈ కాంబినేసన్ ని జుట్టుకి ఉపయోగించడం వల్ల జుట్టు హెల్తీగా, షైనీగా మారుతుంది. 2 నుంచి 3 స్పూన్ల కొబ్బరినూనె, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం కలపాలి. ఈ రెండింటి మిశ్రమాన్ని జుట్టుకి పట్టించి.. గంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. లేదా రాత్రంతా నానిన తర్వాత ఉదయం శుభ్రం చేసుకోవచ్చు.

జుట్టు పెరుగుదలకు

జుట్టు పెరుగుదలకు

ఈ రెండింటిలో ప్రొటీన్స్, మినరల్స్ ఉండటం వల్ల.. జుట్టు కుదుళ్లను బలంగా మార్చి.. జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. చాలా మంది మహిళలు.. ఈ మిశ్రమాన్ని ఉపయోగించి.. అద్భుత ఫలితాలు పొందారు.

చుండ్రు

చుండ్రు

ఈ పవర్ ఫుల్ కాంబినేషన్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. సిట్రిక్ ప్రాపర్టీస్.. త్వరగా చుండ్రు తొలగిపోవడానికి సహాయపడతాయి.

తెల్ల జుట్టు

తెల్ల జుట్టు

కొబ్బరినూనె జుట్టుకి పోషణ అందిస్తుంది. విటమిన్ సి ఉండే నిమ్మరసంను, కొబ్బరినూనెలో మిక్స్ చేసి తలకు పట్టించడం ద్వారా.. జుట్టు తెల్లబడకుండా అరికట్టవచ్చు. ఈ కాంబినేషన్ ని రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల.. బట్టతల లక్షణాలను కూడా తొలగించుకోవచ్చు.

స్కాల్ప్ లో దురద

స్కాల్ప్ లో దురద

కొబ్బరినూనె, నిమ్మరసం కలిపి.. స్కాల్ప్ కి పట్టించడం వల్ల.. దురద నివారించవచ్చు. అలాగే స్కాల్ప్ ని స్మూత్ గా మార్చవచ్చు. ఈ మిశ్రమం స్కాల్ప్ కి మాయిశ్చరైజర్ ని అందిస్తుంది.

పలచటి జుట్టు

పలచటి జుట్టు

పలుచగా ఉన్న జుట్టుని నివారించడానికి ఈ మిశ్రమం ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఈ మిశ్రమాన్ని రెగ్యులర్ గా అప్లై చేస్తూ ఉంటే.. జుట్టు స్ట్రాంగ్ గా మారుతుంది.

సాఫ్ట్ హెయిర్

సాఫ్ట్ హెయిర్

ఈ రెండింటి మిశ్రమాన్ని జుట్టుకి పట్టించడం వల్ల.. జుట్టు టెక్చర్ ని మెరుగుపరచవచ్చు. రెగ్యులర్ గా అప్లై చేస్తే.. జుట్టు సాఫ్ట్ గా, బలంగా మారడమే కాకుండా.. షైనీగా కనిపిస్తుంది.

ఎండ నుంచి రక్షణ

ఎండ నుంచి రక్షణ

ఈ రెండు పదార్థాల్లో ఉండే పోషకాలు.. జుట్టుకి ఎండ నుంచి హాని కలుగకుండా ప్రొటెక్ట్ చేస్తాయి. ఎక్కువగా సూర్యకిరణాలు చుట్టుపై పడితే.. జుట్టు డ్యామేజ్ అవుతుంది.

English summary

7 Miraculous Benefits Of Using Coconut Oil With Lemon Juice For Hair

7 Miraculous Benefits Of Using Coconut Oil With Lemon Juice For Hair. Combination of 2 natural ingredients that can benefit your hair in ways you've never known before.
Desktop Bottom Promotion