For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిజమా....? 100 % జుట్టు రాలడం తగ్గించే జామ, జామ ఆకులు..!

By Super Admin
|

ప్రతి ఒక్కరిలో జుట్టు రాలడం సహజం. జుట్టు రాలడం వందశాతం అరికట్టగలమో లేదో తెలియదు కానీ, జుట్టు రాలడం అరకట్టడంలో జామ ఆకులు ఎఫెక్టివ్ గా సహాయపడుతాయి. జుట్టు రాలడం అరికట్టడం మన చేతుల్లోనే ఉంటుంది. ఎన్నో హోం రెమెడీస్ ను ప్రయత్నించి ఉంటాము. జుట్టు రాలడం తగ్గించడంలో జామ ఆకులు కూడా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.

జామ ఆకుల్లో ఉండే విటమిన్ బి3, బి5 మరియు బి6 హెయిర్ డ్యామేజ్ కాకుండా నివారిస్తుంది. జుట్టు రాలడం అరికడుతుంది. ఇంకా విటమిన్ ఎ మరియు సి లు కొత్తగా హెయిర్ ఫాలీసెల్స్ ను ప్రోత్సహిస్తుంది.

ఇంకా చెప్పాలంటే జామ ఆకుల్లో 9% పొటాషియం, 2%జింక్ , మరియు 2% ప్రోటీన్లు ఉంటాయి. ఇది తలలో చీకాకు, దురద, చుండ్రు నివారించి, హెయిర్ ఎలాసిటిని పెంచుతుంది. జుట్టును స్మూత్ గా మార్చుతుంది.

ఇంకా జామ ఆకుల్లో ఉండే లైకోపిన్ ఫ్రీరాడికల్ కు వ్యతిరేకంగా రక్షణ కల్పిస్తూ మరో స్కిన్ లేయర్ ఏర్పడుటకు సహాయపడుతుంది. క్యూటికల్స్ మూసుకునేలా చేసి, మొత్తం హెయిర్ హెల్త్ ను ప్రోత్సహిస్తుంది.

జామ ఆకుల్లో అనేక ప్రయోజనాలు దాగున్నాయి, అంతే కాదు ఇది చాలాప్రభావితంగా పనిచేస్తుంది .అందువల్ల రోటీన్ గా ఉపయోగించకపోవడమే మంచిది. కొన్ని పరిశోధనలు జరిపిన తర్వాత జుట్టు పెరుగుదలకు జామ ఆకులను ఎలా ఉపయోగించాలి అని సింపుల్ టిప్స్ ను సూచించడం జరిగింది.

జామ ఆకులు: గుప్పెడు జామ ఆకులను ఒక కప్పు నీటిలో వేసి మరిగించాలి. 15 నుండి 20 నిముషాల వరకూ ఉడికించిన తర్వాత , స్టౌ ఆఫ్ చేసి, గది ఉష్ణోగ్రతలో ద్రవాన్ని చల్లార్చి వడగట్టాలి. ఈ నీటిని తలకు మొత్తం అప్లై చేయాలి. ఒక గంట తర్వాత తలను శుభ్రం చేసుకోవాలి.

జామ, తేనె, నిమ్మరసం:

జామ, తేనె, నిమ్మరసం:

బాగా పండిన జామకాయను తీసుకుని, మెత్తగా చేయాలి. తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ తేనె మరియు 10 చుక్కల నిమ్మరసం మిక్స్ చేయాలి. ఈ పదార్థాలన్నీ కలగలిసే వరకూ మిక్స్ చేయాలి. తర్వాత జుట్టును తడిచేసి, పాయలుగా విడదీసి, ఈ మాస్క్ ను అప్లై చేయాలి. ఈ జామకాయ మాస్క్ ను జుట్టు పొడవునా అప్లై చేసిన, 40 నిముషాల తర్వాత షాంపు, కండీషన్ తో శుభ్రం చేసుకోవాలి.

విటమిన్ ఇ, కొబ్బరి నూనె, జామ

విటమిన్ ఇ, కొబ్బరి నూనె, జామ

అరకప్పు కొబ్బరి నూనెను తక్కువ మంట మీద వేడిచేయాలి. విటమిన్ ఇ క్యాప్స్యూల్స్ ను బ్రేక్ చేసి, రెండుగా విడగొట్టి అందులోని నూనెను కొబ్బరి నూనెలో వేయాలి. దీనితోపాటు జామకాయ జ్యూస్ కూడా వేసి మిక్స్ చేయాలి. 15 నిముషాలు సిమ్ లో పెట్టి. తర్వాత జుట్టుపొడవునా, తలకు అప్లై చేయాలి. షవర్ క్యాప్ పెట్టుకుని, 1గంట తర్వాత షాంపు, కండీషనర్ తో తలస్నానం చేయాలి.

గుడ్డు, జామ:

గుడ్డు, జామ:

జామకాయ హెర్బల్ హెయిర్ మాస్క్ వల్ల జుట్టు పెరుగుదలకు , హెయిర్ రూట్స్ బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. చిన్న బౌల్ తీసుకుని, అందులో బాగా పండిన జామ కాయను మెత్తగా చేసి వేయాలి. తర్వాత అందులో ఒక ఎగ్ వైట్ వేసి మొత్తం మిశ్రమం మిక్స్ చేయాలి. దీన్ని తలకు జుట్టు పొడవునా అప్లై చేయాలి. 40 నిముషాల తర్వాత తలకు మసాజ్ చేసి, షాంపుతో తలస్నానం చేయాలి.

జామ , కోకనట్:

జామ , కోకనట్:

జామ ఆకులను ఒక కప్పునీటిలో వేసి 10 నిముషాలు మీడియం మంట మీద ఉడికించాలి. తర్వాత క్రిందికి దింపి, ఆకులను మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఇందులో కొబ్బరి నూనెను మిక్స్ చేయాలి. ఈ పేస్ట్ ను తలకు జుట్టు పొడవున అప్లై చేయాలి. 15 నిముషాలు మసాజ్ చేసి, అలాగే ఉంచి, ఒక గంట తర్వాత షాంపుతో శుభ్రం చేసుకోవాలి.

శీకాయ, జామ, బాదం ఆయిల్ :

శీకాయ, జామ, బాదం ఆయిల్ :

జామ ఆకులను ఎండలో ఎండబెట్టి, తర్వాత మెత్తగా పౌడర్ చేసుకోవాలి. తర్వాత శీకాకాయ పొడి, జామఆకుల పొడిని సమంగా తీసుకుని, అందులో 10 చుక్కల బాదం నూనెను మిక్స్ చేయాలి. కొద్దిగా నీళ్ళు కలుపుకుని, మెత్తగాపేస్ట్ చేసుకోవాలి. దీన్ని తడి జుట్టుకు అప్లై చేయాలి. ఒక గంట తర్వాత తలస్నానం చేయాలి. ఈ హెర్బల్ మాస్క్ ను వారానికొకసారి వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

జామ టీ:

జామ టీ:

జామ ఆకుల టీబ్యాగ్స్ ఉపయోగించి గోవా టీని తాగొచ్చు. టీబ్యాగ్స్ ను వేడినీటిలో డిప్ చేసి తీసి, అందులో కొద్దిగా తేనె మిక్స్ చేసి తాగాలి. అలాగే గోరువెచ్చాగా ఉన్న నీటిని తలకు కూడా పోసుకోవచ్చు.

అవొకాడో, జామ, రోజ్మోర్రీ ఆయిల్ :

అవొకాడో, జామ, రోజ్మోర్రీ ఆయిల్ :

బాగా పండిన అవొకాడోను , జామకాయను స్మూత్ గా పేస్ట్ చేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ రోజ్మెర్రీ ఆయిల్ ను మిక్స్ చేసి, తర్వాత తడి జుట్టుకు అప్లై చేయాలి. షవర్ క్యాప్ పెట్టుకుని, ఒక గంట తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి.

కొబ్బరి పాలు, జామ ఆకులు:

కొబ్బరి పాలు, జామ ఆకులు:

జుట్టు రాలడం నివారించడంలో జామ ఆకులు గ్రేట్ గా సహాయపడుతాయి. ఒక కప్పు కొబ్బరి పాలు , అందులో ఎండిన జామ ఆకుల పొడి మిక్స్ చేయాలి. కాటన్ సహాయంతో తల మొత్తానికి అప్లై చేయాలి. మొత్తం అప్లై చేసిన తర్వాత మసాజ్ చేయాలి. ఒక గంట తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి.

జామకాయ:

జామకాయ:

జామకాయలో గ్రేట్ బెనిఫిట్స్ దాగున్నాయి, కాబట్టి, దీన్ని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం మంచిది. ఇందులోని విటమిన్స్, మినిరల్స్, నేరుగా రక్తంలో కలుస్తాయి . దాంతో ఓవరాల్ హెల్త్, బ్యూటికి అమేజింగ్ రిజల్ట్ ను చూపుతుంది.

English summary

Can Guava Stop 100% Hair Loss?

We don't know about 100% hair fall reversal, but what we do know is that guava is super-effective, more than any ingredient that you can possibly lay your hands on. So, how does guava benefit your hair? Guava has a high ratio of vitamins B3, B5 and B6, which repair damaged hair tissues, cleanse the scalp and stop hair fall.
Story first published:Tuesday, October 18, 2016, 12:58 [IST]
Desktop Bottom Promotion