For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అరటిపండు, కొబ్బరినూనె మిశ్రమం.. జుట్టుకి చేసే అద్భుతం..!!

By Swathi
|

జుట్టంతా హెల్తీగా కనిపించినా.. చాలామందికి చివర్లు.. నిర్జీవంగా మారి ఉంటాయి. బలహీనంగా కనిపిస్తూ ఉంటాయి. అది ఎవరికీ అవసరం లేదు. కానీ.. జుట్టు చివర్లు అందంగా, హెల్తీగా ఉన్నప్పుడు జుట్టు బలంగా పెరుగుతుంది. డ్రై, డ్యామేజ్ అయిన జుట్టు చివర్లను నివారించడానికి ఎఫెక్టివ్ హోం రెమిడీస్ ఉన్నాయి.

జుట్టు చివర్లు బలహీనంగా మారడానికి చాలా కారణాలున్నాయి. చాలా అరుదుగా.. న్యాచురల్ ఆయిల్స్ స్కాల్ప్ ద్వారా పొందనప్పుడు, మూడు రోజులపాటు జుట్టుని శుభ్రం చేయనప్పుడు.. జుట్టు చివర్లు బలహీనంగా మారతాయి. అలాగే.. స్లైలింగ్ ప్రొడక్ట్స్ కూడా.. జుట్టు డ్రైగా మారడానికి కారణమవుతుంది.

Coconut Oil And Banana Hair Mask

డ్రైగా, డ్యామేజ్ అయిన జుట్టు చివర్లను నివారించడానికి అద్భుతమైన రెమెడీ ఉంది. ఎలాంటి ఖర్చు లేకుండా.. సింపుల్ గా.. ఈ సమస్య నుంచి బయటపడే సొల్యూషన్ ఉంది.

కావాల్సిన పదార్థాలు
కొబ్బరి నూనె
బాగా పండిన అరటిపండు

Coconut Oil And Banana Hair Mask

తయారు చేసే విధానం
అరటిపండును మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఏమాత్రం ముక్కలు లేకుండా.. పూర్తీగా స్మూత్ గా చేయాలి. కొన్ని చుక్కల కొబ్బరినూనెను బనానా పేస్ట్ లో కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు మొత్తానికి పట్టించాలి. జుట్టు చివర్లను ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇప్పుడు., జుట్టుని చుట్టుకుని.. షవర్ క్యాప్ వేసుకోవాలి. 15 నుంచి 30 నిమిషాలు ఆరిన తర్వాత.. షాంపూ, కండిషనర్ ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి.

అరటిపండులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది.. డ్రై, డ్యామేజ్ అయిన జుట్టుని నివారిస్తుంది. కొబ్బరినూనెలో దాగున్న అద్భుత ప్రయోజనాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. జుట్టుకి మాయిశ్చరైజర్ ని అందిస్తుంది.

English summary

DIY Coconut Oil And Banana Hair Mask

DIY Coconut Oil And Banana Hair Mask. The length of the entire hair can look great and healthy, but somehow the ends of our hair turn into weak strands that very closely resemble straws, or even a broom.
Story first published:Tuesday, August 9, 2016, 15:34 [IST]
Desktop Bottom Promotion