For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చిన్న వయస్సులోనే తెల్లజుట్టు సమస్య నివారించే హెర్బల్ రెమెడీస్..

|

తెల్లజుట్టు వయస్సైన వారికి లక్షణంగా చూపెడుతుంది. అయితే, బాధకరమైన విషయం ఏంటంటే ఈ రోజుల్లో చిన్న వయస్సులోనే ఈ సమస్యను ఎదుర్కొంటున్న వారి సంఖ్య ఎక్కవగానే ఉన్నారు . చిన్న వయస్సులోనే జుట్టు తెల్లబడటానికి కారణాలు అనేకం.

ముఖ్యంగా ప్రస్తుత మోడ్రన్ ప్రపంచంలో స్ట్రెస్, పొల్యూషన్, హెరిడిటి, జెనిటిక్స్, పోషకాల లోపం మరియు స్మోకింగ్. ఇంకా ఈ రోజుల్లో యుక్తవయస్సులోని వారు హానికరమైన పొల్యూషన్ కు గురి అవుతున్నారు. ఫలితంగా చిన్నవయస్సులోనే తెల్లజుట్టు సమస్యలను ఎదుర్కొంటున్నారు.

జుట్టు రంగుకు ప్రధానకారణం మెలనిన్. ప్రతి హెయిర్ ఫోలిసెల్స్ లో సెల్స్ లో ఈ పిగ్మెంట్ ఉంటుంది . ఈ తెల్లజుట్టును నివారించడానికి ఒకే ఒక మార్గం నేచురల్ హోం రెమెడీస్. హెర్బల్ రెమెడీస్ లో నువ్వుల నూనె, మెంతులు మరియు ఆవనూనె వంటివి తెల్లజుట్టును నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి. వీటిని రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.

ఇదేవిధంగా మరికొన్ని హో రెమెడీస్ కూడా ఈ క్రింది విధంగా లిస్ట్ అవుట్ చేయబడినది . వీటిని రెగ్యులర్ బ్యూటీకేర్ లో ఉపయోగించుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. తెల్ల జుట్టు నుండి త్వరగా మంచి ఫలితం ఉంటుంది. మరి ఆ ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఏంటో ఒకసారి చూద్దాం...

కోకనట్ ఆయిల్ కరివేపాకు

కోకనట్ ఆయిల్ కరివేపాకు

తెల్లజుట్టు నివారించడంలో చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. ఈ హోం రెమెడీస్ తెల్ల జుట్టును నేచురల్ గానే డార్క్ గా మార్చుతుంది. కొబ్బరినూనెలో కొన్ని కరివేపాకు ఆకులను వేసి, వేడి చేసి తలకు రెగ్యులర్ గా పట్టిస్తుంటే హెల్తీగా, ఒత్తుగా మరియు డార్క్ హెయిర్ పెరుగుతుంది.

ఆనియన్ మరియు నిమ్మరసం

ఆనియన్ మరియు నిమ్మరసం

ఉల్లిపాయలో సల్ఫర్ ఉంటుంది. ఇది డ్యామేజ్ అయిన జుట్టు తిరిగి పెరగడానికి సహాయపడుతుంది . తెల్లజుట్టును నివారిస్తుంది . జుట్టుకు పూర్వస్థితికి తీసుకొ్తుంది . ఉల్లిపాయ రసంలో నిమ్మరసం మిక్స్ చేసి తలకు పట్టించి 2గంట తర్వాత తలస్నానం చేసుకోవాలి.

ఆమ్లా

ఆమ్లా

ఉసిరికాయ లోని హెయిర్ బెనిఫిట్స్ మనకు తెలిసినవే. ఉసిరికాలో జుట్టును స్ట్రాంగ్ గా మరియు ఒత్తుగా మరియు డార్క్ గా మార్చే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. మరియు చిన్న వయస్సులో వచ్చే తెల్ల జుట్టును నివారిస్తుంది. వీటిని నేరుగా తినడం లేదా ఆయిల్లో మరిగించి తలకు అప్లై చేయవచ్చు.

 ఆవనూనె మరియు బ్రహ్మి

ఆవనూనె మరియు బ్రహ్మి

ఆవనూనె మరియు బ్రహ్మీఆయిల్ మిక్స్ చేసి తలకు అప్లై చేయడం వల్ల జుట్టు కలర్ డార్క్ గా ఉంటుంది . దీన్ని రెగ్యులర్ గా అప్లైచేయండ వల్ల జుట్టు సహజంగానే డార్క్ గా మారుతుంది. హెయిర్ రూట్స్ స్ట్రాంగ్ గా మారుతాయి.

నువ్వుల నూనె, కొబ్బరినూనె మరియు ఆలివ్ ఆయిల్

నువ్వుల నూనె, కొబ్బరినూనె మరియు ఆలివ్ ఆయిల్

ఈ మూడింటి నూనెల యొక్క కాంబినేషన్ బెస్ట్ గా ఉంటుంది. ఇవి ప్రీమెచ్యుర్ గ్రేహెయిర్ ను నివారిస్తుంది . జుట్టును స్ట్రాంగ్ గా మరియు సిల్కీగా మార్చుతుంది.

 కొబ్బరి నూనె మరియు మెంతులు

కొబ్బరి నూనె మరియు మెంతులు

కొబ్బరి నూనెలో మెంతులు వేసి వేడి చేసి, చల్లారిన తర్వాత జుట్టుకు అప్లై చేయాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది . జుట్టు యొక్క ఓరిజినల్ కలర్ నేచురల్ గా అందుతుంది. తక్కువ సమయంలోనే మంచి ఫలితాలను పొందవచ్చు.

English summary

Herbal Remedies For Premature Greying Of Hair

Grey hair is an indication of old age. However, sadly, nowadays even younger generations are falling prey to this hair condition. The reasons for this condition can be many.
Story first published: Saturday, March 12, 2016, 15:44 [IST]
Desktop Bottom Promotion