For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒత్తైన..ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు ఇంట్లోని హెయిర్ కండీషనర్స్..

|

ప్రస్తుత కాలంలో జుట్టు రాలడం అనేది సాధారణ సమస్యగా మారింది. ఇది ఒక్క మహిళలల్లోనే కాదు, పురుషుల్లో కూడా అధికంగా కనబడుతోంది. ముఖ్యంగా అందుకు కారణం వంశపారంపర్యం, ఒత్తిడి, ఆహార అసమతుల్యతలు మరియు ఎక్కువ స్థాయిలో డిహైడ్రోటెస్టోస్టిరాన్ స్థాయి ఎక్కువగా ఉండటం. ఈ కారణాల చేత జుట్టు రాలిపోతుంటే తల స్నానం చేసిన ప్రతి సారీ కండీషన్ అప్లై చేయాడం చాలా ఆరోగ్యం కరం. హెయిర్ కండీషన్ తో చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

హెయిర్ కండీషన్ కురులు రాలిపోకుండా మ్యానేజ్ చేయడమే కాకుండా జుట్టును మెత్తగా, సిల్కీగా, సాఫ్ట్ గా మార్చుతాయి. చాలా మంది మంచి ఫలితాల కోసం తలకు ఏ షాంపూను ఉపయోగిస్తారో అదే కండీషనర్ ను ఉపయోగిస్తారు. రసాయనాలతో కూడిన హెయిర్ కండిషనర్స్ ను ఉపయోగించడం కంటే ఇంట్లో ఉండే నేచురల్ పదార్థాలను కండీషనర్ గా కురులకు పట్టించండం చాలా ఆరోగ్యం కరం.

డ్రైహెయిర్ డ్యామేజ్ హెయిర్ కు హెయిర్ కండీషనర్ అప్లై చేస్తే జుట్టు సాప్ట్ గా మారుతుంది. హెయిర్ కలర్ కూడా ఎక్కువ రోజులు నిలిచి ఉంటుంది. మార్కెట్లో ఉండే హెయిర్ కండీషనర్ ఖరీదైనవి మరియు కెమికల్స్ కలిసినవి కాబట్టి, వీటికి బదులుగా ఇంట్లో ఉండే నేచురల్ పదార్థాలతో హెయిర్ కు కండీషనర్ గా ఉపయోగండం వల్ల అనేక ప్రయోజనాలను పొందుతారు..

పెరుగు:

పెరుగు:

ఇది ఒక సహజమైనటువంటి పదార్థం. సాధారణంగా ఇంట్లో దొరికే ఈ పెరుగును అప్పడప్పుడు తలకు పట్టించినట్లైతే జుట్టు మెరుస్తూ, సున్నితంగా ఉంటుంది. బాగా పులిసిన పెరుగును తలకు పట్టించి అరగంట సేపు అలాగే ఉండనిచ్చి తర్వాత మంచి షాంపూతో తలస్నానం చేసుకోవాలి. ఒక వేళ తలలో చుండ్రు ఉన్నట్లైతే అరకప్పు పెరుగులో రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం కలిపి తలంతటికి పట్టించి తర్వాత గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి. నిమ్మరసం చుండ్రును వదలగొడుతుంది.

 ఆపిల్ సైడ్ వెనిగర్:

ఆపిల్ సైడ్ వెనిగర్:

వినెగార్, ఇది ఎక్కువగా ఆపిల్ ఆపిల్ రసం నుంచి చేసిన పానీయం; ఇది మీ జుట్టును శుభ్రపర్చడానికి మరియు ఒకే సమయంలో pH స్థాయి సమతుల్యం చేయటంలో సహాయపడుతుంది. ఇందువలన దీనిని ఒక మంచి హెయిర్ కండిషనర్ గా పేర్కొంటారు. రెండు కప్పుల నీటిలో వినేగార్ ను కలిపి, ఆ మిశ్రమాన్ని తలకు పట్టించి అలానే 20-30 నిముషాల వరకు ఉంచండి. ఈ మిశ్రమం జుట్టులో ఇనికిపోయేవరకు మీ వేళ్ళతో 4-5 సార్లు జుట్టును మర్దన చేయండి. తరువాత చల్లటి నీటితో కడగండి. ఈ కండిషనర్ మీరు తలస్నానం చేసినప్పుడు వదలని ఏ రసాయన, షాంపూ లేదా కండీషనర్ గాని తొలగించడంలో సహాయపడుతుంది.ఇలా చేస్తే జుట్టు సిల్కీగా వుండి చక్కని మెరుపును సంతరించుకుంటుంది.

గుడ్డు:

గుడ్డు:

గుడ్డులో సల్ఫర్ పుష్కలంగా ఉంటుంది. గుడ్డులోని సల్ఫర్ ఆధారిత అమైనో అమ్లాలు..కెరటిన్ ని అందించి జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది. అంతే కాదు గుడ్డు లోని తెల్ల సొన జుట్టుకు మంచి కండీషనర్ గా పనిచేస్తుంది. కండీషనర్ గానే కదా జుట్టుకు మంచి మెరుపును మాత్రమే కాదు వెంట్రుకలు చాలా మృదువుగా చేస్తుంది. జుట్టు, ఒత్తుగా, పొడవుగా పెరిగేందుకు మనం వాడే షాంపూలో ఒక గుడ్డును కలిపి, షాంపూతో జుట్టును రుద్ది కడుక్కోవాలి. ఇలా చేస్తే అందంతోపాటు, ఆకర్షణీ యంగా కనిపిస్తుంది.

మెయోనైజ్:

మెయోనైజ్:

మెయోనైజ్ జుట్టుకు గ్లాసి లుక్ ను అందిస్తుంది. ఒక స్పూన్ ఫుల్ మెయోనైజ్ ను జుట్టు మొత్తానికి అప్లై చేయాలి. 20 నిముషాలు అలాగే వదిలేసి తర్వాత జుట్టుకు షవర్ క్యాప్ చుట్టాలి. అరగంట తర్వాత నార్మల్ గా తలస్నానం చేయాలి.

కోకనట్ మిల్క్:

కోకనట్ మిల్క్:

తలకు కొబ్బరి నూనెను మసాజ్ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలను పొందుతామో..అదే విధంగా కోకనట్ మిల్క్ ను హెయిర్ కండీషనర్ గా అప్లై చేస్తే మరిన్ని ఎక్కువ ప్రయోజనాలను పొందుతారు . కోకనట్ మిల్క్ ను జుట్టు మొత్తానికి అప్లై చేసి అర గంట తర్వాత షాంపుతో తలస్నానం చేస్తే జుట్టు మంచిషైనింగ్ తో మెరుస్తుంటుంది.

తేనె:

తేనె:

తేనె ఒక చర్మమును మెత్త పరచు లేపనముగా వర్గీకరించబడింది అంటే ఇది సహజంగా ఒక మంచి కండిషనర్ మరియు మాయిశ్చరైజర్ ఎందుకంటే దీనిలో నీటి అణువులను ఆకర్షించే మరియు ఉంచుకోగలిగే సామర్థ్యము ఉన్నది. ఇది మీ జుట్టును కాంతివంతంగా మరియు నునుపుగా చేస్తుంది. దీనిలో విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఒక బొట్టులో మూడోవంతు తేనెను తీసుకుని, అంటే సమమైన మీరు వాడే కండిషనర్ తో కలపండి. ఈ రెండింటిని చేతులతో రుద్దండి. దీనిని మీ జుట్టు మొత్తం పట్టించండి. దీనిని మీ తలమీద జుట్టు కుదుళ్ళను చేరేవరకు మర్దన చేయండి. ఇలా 30 నిముషాల వరకు ఉంచండి, తరువాత తలస్నానం చేయండి.

అరటిపండు:

అరటిపండు:

అరటి ఆరోగ్యానికి, చర్మ సౌందర్యానికి మాత్రమే కాదు, కురులకు కూడా చాలా ప్రయోజనకారి. ఈ హోం రెమెడీ చిక్కుబడిని, పొడిబారిన,నిర్జీవమైన కురుకు బాగా పనిచేస్తుంది. అందుకు అరటి పండును మెత్తగా చేసి అందులో పెరుగు, నిమ్మరసం, పాలు వేసి బాగా మిక్స్ చేసి తలకు బాగా పట్టించాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే మెత్తటి, నునుపైన కురులు మీ సొంత అవుతాయి.

పాలు:

పాలు:

హెయిర్ కండీషనర్ గా మిల్క్ కూడా ఉపయోగించవచ్చు.ఇది జుట్టుకు మంచి షైనింగ్ ను ఇస్తుంది. జుట్టును స్ట్రాంగ్ గా సాఫ్ట్ గా మార్చుతుంది. చిక్కు పడనివ్వదు. స్ప్రేబాటిల్లో పాలు మిక్స్ చేసి స్ప్రే చేయాలి. స్ప్రే చేసిన తర్వాత తలను దువ్వి ముడి వేసి 15నిముషాల తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి.

English summary

Natural Ingredients To Condition Your Hair At Home

We always envy people and models when we see them with long and lustrous hair that is free of split ends and damage. The secret to this type of hair is regular conditioning. Yes, conditioning the hair is as important as oiling and shampooing.
Story first published: Thursday, July 28, 2016, 18:08 [IST]
Desktop Bottom Promotion