For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రాత్రిపూట జుట్టు విషయంలో ఎప్పటికీ చేయకూడని పొరపాట్లు..!!

By Swathi
|

ప్ర‌తిరోజూ డ్యామేజ్ హెయిర్‌తో ఇబ్బందిప‌డుతున్నారా.. జుట్టు కావాల్సిన పోష‌ణ అందిస్తున్నా.. నిర్జీవంగా క‌నిపిస్తోంద‌ని భావిస్తున్నారా. అయితే మీ జుట్టు నిర్జీవంగా ఉంటే.. మీ లుక్ మొత్తంపై దుష్ర్ప‌భావం చూపుతుంది. కాబ‌ట్టి జుట్టు ఎట్రాక్టివ్‌గా ఉండ‌టానికి జాగ్ర‌త్త తీసుకోవాలి.

మీకు అన్ హెల్తీ హెయిర్ ఉందంటే.. ట్రెండీ హెయిర్ స్టైల్ ఫాలో అవ‌డం కూడా క‌ష్ట‌మ‌వుతుంది. అయితే హెయిర్ డ్యామేజ్‌కి చాలా కార‌ణాలుంటాయి. పోష‌కాహార‌లోపం, హెయిర్ కేర్‌పై శ్ర‌ద్ధ తీసుకోక‌పోవ‌డం, కొన్ని ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు, కొన్ని మందుల సైడ్ ఎఫెక్ట్స్, పొల్యూష‌న్ కార‌ణంగా.. జుట్టు డ్యామేజ్ అవుతుంది.

ఒక‌వేళ ఇవేవీ కార‌ణాలు కాదు.. అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.. అయినా జుట్టు మాత్రం నిర్జీవంగా త‌యారైంది అంటే.. మీరు పాటించే కొన్ని అల‌వాట్లే.. కార‌ణ‌మ‌వుతాయి. అది డ్యామేజ్‌కి కార‌ణ‌మ‌వుతాయి. మ‌రి మీ జుట్టు డ్యామేజ్ అవ‌డానికి మీరు పాటించే హ్యాబిట్స్ ఏంటో తెలుసుకుని.. వాటికి దూరంగా ఉండండి.

త‌డిజుట్టుతో ప‌డుకోవ‌డం

త‌డిజుట్టుతో ప‌డుకోవ‌డం

రాత్రిప‌డుకోవ‌డానికి ముందు త‌డిజుట్టుతోనే ప‌డుకుంటే.. జుట్టు రాల‌డానికి కార‌ణ‌మ‌వుతుంది. దిండుపై జుట్టు అలా ఇలా తిర‌గ‌డం వ‌ల్ల‌.. స్కాల్ప్ మాయిశ్చ‌రైజ‌ర్ ని కోల్పోతుంది.

టైట్‌గా బ్యాండ్ వేసుకోవ‌డం

టైట్‌గా బ్యాండ్ వేసుకోవ‌డం

రాత్రిపూట టైట్‌గా పోనీటైల్ వేసుకోవ‌డం వ‌ల్ల జుట్టు బ్రేక్ అవుతుంది. కుదుళ్లు బ‌ల‌హీన‌మై.. జుట్టు రాల‌డానికి కార‌ణ‌మ‌వుతుంది. క్లిప్స్ కూడా టైట్ గా ఉండేవి రాత్రిపూట పెట్టుకోక‌పోవ‌డం మంచిది.

ఎక్కువగా దువ్వుకోవడం

ఎక్కువగా దువ్వుకోవడం

రాత్రిప‌డుకోవ‌డానికి ముందు జుట్టుని దువ్వుకోకపోవడమే మంచిది. దువ్వడం కంటే మసాజ్ చేయడం వల్ల జుట్టు ఒత్తుగా మారుతుంది. న్యాచురల్ ఆయిల్ తో రాత్రి మసాజ్ చేయడం వల్ల రాత్రంతా పోషణ అందుతుంది. కావాలంటే ఉదయం దువ్వుకుంటే.. ఆయిల్ జుట్టంతటికీ అందుతుంది.

దువ్వెన ఎంపిక సరిగా లేకపోవడం

దువ్వెన ఎంపిక సరిగా లేకపోవడం

ఒకవేళ మీరు మీ జుట్టుని ఖచ్చితంగా దువ్వుకోవాలి అనుకుంటే.. సరైన దువ్వెన ఎంచుకోవాలి. వెడల్పాటి పళ్లు ఉన్న దువ్వెన ఉపయోగిస్తే.. ఆయిల్ జుట్టంతటికీ అందుతుంది.

 కుదుళ్ల నుంచి దువ్వడం

కుదుళ్ల నుంచి దువ్వడం

రాత్రిపడుకోవడానికి ముందు ఎట్టిపరిస్థితుల్లో జుట్టుని కుదుళ్ల నుంచి దువ్వకూడదు. జుట్టుని చిన్న చిన్న భాగాలుగా విడదీసి.. కుదుళ్ల నుంచి కాకుండా.. మధ్యలో నుంచి.. కిందకు దువ్వుకోవాలి.

పిల్లో క‌వ‌ర్స్ వాష్ చేయ‌క‌పోవ‌డం

పిల్లో క‌వ‌ర్స్ వాష్ చేయ‌క‌పోవ‌డం

ఒకే పిల్లో క‌వ‌ర్ ని ప‌దే ప‌దే వాడ‌టం, ఎక్కువ రోజులు వాష్ చేసుకోక‌పోవ‌డం వ‌ల్ల మైక్రోబ్స్ జుట్టుకి హాని చేస్తాయి. చుండ్రు, జుట్టు రాల‌డానికి కార‌ణ‌మ‌వుతాయి. కాబ‌ట్టి శుభ్ర‌మైన పిల్లో క‌వ‌ర్స్ వాడాలి.

జుట్టుని కట్టుకోకపోవడం

జుట్టుని కట్టుకోకపోవడం

రాత్రి నిద్రలో అటు ఇటూ పొర్లడం వల్ల జుట్టు విరిగిపోతుంది. అందుకే.. పిల్లో, బెడ్ షీట్ పై జుట్టు రాలి ఉంటుంది. కాబట్టి.. రాత్రి నిద్రపోవడానికి ముందు జుట్టుని కట్టుకోవాలి. దీనివల్ల జుట్టు హెల్తీగా ఉంటుంది.

జుట్టుతో ఆడుకోవడం

జుట్టుతో ఆడుకోవడం

రాత్రి, పగలు రోజంతా ఈ నియమం పాటించాలి. ఏదో ఆలోచిస్తూ. .మనం జుట్టుని చుట్టుడం, ముడేయడం, లాగడం వంటి పనులు చేస్తుంటాం. కానీ.. ఇలా చేయడం వల్ల జుట్టు కుదుళ్లు బలహీనంగా మారి.. జుట్టు రాలడానికి కారణమవుతుంది. ఈ అలవాటు ఉండే.. వెంటనే మానేయండి.

ఎక్కువ సమయం ఆయిల్ వదిలేయడం

ఎక్కువ సమయం ఆయిల్ వదిలేయడం

మంచి అలవాట్లు కూడా కొన్ని సార్లు హానిచేస్తాయి. హాట్ ఆయిల్ మసాజ్ వల్ల జుట్టుకి పోషణ అందుతుంది. కానీ.. ఎంతసేపు ఆయిల్ పెట్టుకోవాలి ? రాత్రంతా ఆయిల్ జుట్టుకి ఉంటే.. జిడ్డుగా, చుండ్రు రావడానికి కారణమవుతుంది. కాబట్టి.. ఆయిల్ జుట్టుకి రెండు గంటలు ఉంటే సరిపోతుంది.

స్కాల్ప్ ని నిర్లక్ష్యం చేయడం

స్కాల్ప్ ని నిర్లక్ష్యం చేయడం

రాత్రిపూట స్కాల్ప్ ని జాగ్రత్తగా చూసుకోవాలి. రాత్రిపూట స్కాల్ప్ రెస్ట్ తీసుకుంటుంది. బ్లడ్ ఫ్లో ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల జుట్టు స్ట్రాంగ్ గా మారుతుంది.

హెయిర్ ప్రొడ‌క్ట్స్ తో ప‌డుకోవ‌డం

హెయిర్ ప్రొడ‌క్ట్స్ తో ప‌డుకోవ‌డం

చాలాసంద‌ర్బాల్లో స‌మ‌యం లేక‌పోవ‌డం వ‌ల్ల జుట్టుకి క‌ల‌ర్ వేసుకుని.. వాష్ చేసుకోవ‌డం మ‌రిచిపోయి.. అలానే ప‌డుకుంటూ ఉంటారు. కానీ.. ఇలా ప‌డుకోవ‌డం వ‌ల్ల అవి జుట్టుకి హాని చేస్తాయి. 6గంట‌ల కంటే ఎక్కువ‌సేపు జుట్టుపై ఉండ‌టం మంచిది కాదు.

కాట‌న్ పిల్లో క‌వ‌ర్స్

కాట‌న్ పిల్లో క‌వ‌ర్స్

కాట‌న్ కాస్త ర‌ఫ్ గా ఉంటుంది. ఇవి జుట్టుని డ్రైగా మారుస్తుంది. కాబ‌ట్టి సిల్క్ లేదా సాటిన్ పిల్లో క‌వ‌ర్స్ వాడ‌టం మంచిది.

English summary

Things You Should Never Do To Your Hair Before Going To Bed

Things You Should Never Do To Your Hair Before Going To Bed. Head full of healthy hair, which is free of dry ends, is supple like silk and glossy like magazine cover.
Story first published: Thursday, September 22, 2016, 15:58 [IST]
Desktop Bottom Promotion