For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటానికి అసలు కారణాలు.. !!

By Swathi
|

25 ఏళ్లు దాటుతున్నాయంటే.. అందరికీ ఆందోళనే. అదే సమయంలో.. తెల్లజుట్టు కూడా.. ప్రధాన సమస్య. అయితే మీరింకా 20లలో ఉన్నప్పుడే.. తెల్లజుట్టు సమస్యను ఫేస్ చేస్తున్నారంటే.. సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం. కొన్ని కొన్ని తెల్ల వెంట్రుకలు.. మిమ్మల్ని.. ఏమాత్రం ఆకర్షణీయంగా కనిపించనీయవు.

సహజంగా వారసత్వంగా.. ఈ తెల్లజుట్టు సమస్య వస్తుంది. కాబట్టి ఒకవేళ మీరు టీనేజర్ లేదా 20లలో ఉన్నవాళ్లు అయి ఉండి..మీరు మీ తలలో ఎక్కువగా తెల్లజుట్టుని చూస్తున్నారంటే.. దానికి కారణాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి.

చిన్న వయసులోనే తెల్లజుట్టు సమస్యకు అసలు కారణాలను కొన్ని అధ్యయనాలు రివీల్ చేశాయి. వీటన్నింటినీ తెలుసుకోవడం వల్ల.. మీ జుట్టు తెల్లబడటానికి కారణమేంటో తెలుసుకోవచ్చు. అలాగే.. తెల్లజుట్టు నివారించుకోవడానికి కూడా సింపుల్ టిప్స్ మీ కోసం..

పేరెంట్స్

పేరెంట్స్

చిన్నవయసులోనే పేరెంట్స్ కి తెల్లజుట్టు ఉంటే.. మీకు కూడా చిన్నవయసులోనే తెల్లజుట్టు రావడానికి ఎక్కువ అవకాశాలున్నాయి.

మెలనిన్

మెలనిన్

మీ వయసు పెరిగే కొద్దీ.. మెలనిన్ ఉత్పత్తి.. తగ్గుతూ ఉంటుంది. దీనివల్ల.. జుట్టు తెల్లబడుతుంది.

పోషకాలు అందకపోవడం

పోషకాలు అందకపోవడం

ఐరన్, ప్రొటీన్, విటమిన్ బి12, జింక్ వంటివి శరీరంలో తగ్గిపోవడం వల్ల.. మెలనిన్ ఉత్పత్తి నెమ్మదిగా మారుతుంది. అలా.. జుట్టు తెల్లబడటానికి కారణమవుతుంది.

కెమికల్స్

కెమికల్స్

షాంపూ, కండిషనర్స్, హెయిర్ కలర్స్ లో ఉండే కెమికల్స్ కూడా.. ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ హెయిర్ కి కారణమవుతాయి.

ఒత్తిడి, డిప్రెషన్

ఒత్తిడి, డిప్రెషన్

అనీమియా, డిప్రెషన్, థైరాయిడ్, ఒత్తిడి వంటి సమస్యలు యంగ్ ఏజ్ లోనే ఇబ్బందిపెడుతుంటే.. మీకు ఖచ్చితంగా జుట్టు చిన్నవయసులోనే తెల్లబడుతుంది.

ధైరాయిడ్

ధైరాయిడ్

థైరాయిడ్ సమస్య ఉన్నవాళ్లకు జుట్టు తెల్లబడటానికి ఎక్కువ అవకాశాలున్నాయి. కాబట్టి ఒక్కసారి థైరాయిడ్ చెక్ చేయించుకోవడం మంచిది.

ఆయిల్

ఆయిల్

జుట్టుకి ఆయిల్ తక్కువ అవడం, మాయిశ్చరైజర్ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల డీహైడ్రేట్ అయి జుట్టు తెల్లబడుతుంది. కాబట్టి రెగ్యులర్ గా ఆయిల్ పెట్టుకోవాలి. స్పాలకు వెళ్లడం కంటే ఇంట్లోనే మసాజ్ చేసుకుంటే మంచిది.

నువ్వుల నూనె

నువ్వుల నూనె

ఆలివ్ ఆయిల్, నువ్వుల నూనెను.. ఒక గిన్నె సొరకాయ జ్యూస్ లో కలపాలి. ఈ మిశ్రమాన్ని స్కాల్ప్, జుట్టుకి మసాజ్ చేసి.. 30 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

ఉల్లిపాయ

ఉల్లిపాయ

కొన్ని చుక్కల నిమ్మరసంను, ఉల్లిపాయ జ్యూస్ లో కలిపి జుట్టుకి, స్కాల్ప్ కి పట్టించాలి. 10 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

పాలు

పాలు

పాలను.. జుట్టు కుదుళ్లకు పట్టించాలి. వారానికి ఒకసారి ఇలా చేస్తే.. తెల్లజుట్టు నివారించవచ్చు. పాలను కుదుళ్లకు పట్టించిన తర్వాత.. 15 నుంచి 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

గ్రీన్ టీ

గ్రీన్ టీ

గ్రీన్ టీతో వారానికి ఒకసారి.. జుట్టుని శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల.. జుట్టు బలంగా మారడమే కాకుండా.. నల్లగా మారుతుంది.

అల్లం

అల్లం

అల్లం పేస్ట్ లో పాలు కలిపి.. జుట్టుకి పట్టించాలి. అరగంట తర్వాత.. జుట్టుని శుభ్రం చేసుకోవాలి. తరచుగా ఇలా చేస్తుంటే.. తెల్లజుట్టు నివారించవచ్చు.

ఉసిరి

ఉసిరి

ఉసిరి జ్యూస్ ని బాదాం నూనెలో కలిపి.. జుట్టుకి మసాజ్ చేయాలి. అరగంట తర్వాత.. శుభ్రం చేసుకుంటే..తెల్లజుట్టు నల్లగా నిగనిగలాడుతుంది.

కరివేపాకు

కరివేపాకు

కరివేపాకు తీసుకోవడం వల్ల కూడా తెల్లజుట్టు తగ్గుతుంది. పూర్వం నుంచి జుట్టు సంరక్షణలో కరివేపాకు బాగా సహాయపడుతుంది. కొబ్బరినూనెలో కరివేపాకు ఆకులు వేసి బాగా ఉడికించాలి. చల్లారిన తర్వాత ఆ నూనెను తలకు పట్టించుకోవడం వల్ల తెల్లజుట్టు సమస్య దరిచేరదు.

కొబ్బరినూనె, నిమ్మకాయ

కొబ్బరినూనె, నిమ్మకాయ

మీ జుట్టుకు సరిపడా ఆయిల్ తీసుకుని దానిలో.. 3 టేబుల్ స్పూన్ల నిమ్మరసం కలపాలి. తర్వాత కుదుళ్ల నుంచి జుట్టుకి పట్టించాలి. గంట తర్వాత మైల్డ్ షాంపూతో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

పొటాటో వాటర్ మాస్క్

పొటాటో వాటర్ మాస్క్

ఒక బంగాళదుంపను ఉడకబెట్టాలి. ఆ నీటిని తలకు పట్టించుకుంటే.. జుట్టు నల్లగా మారుతుంది. లేదా పొటాటో వాటర్ కి పెరుగు కలిపి పట్టించుకున్నా జుట్టు నల్లగా మారుతుంది.

మిరియాల మాస్క్

మిరియాల మాస్క్

నల్లమిరియాలను గ్రైండ్ చేయాలి. తర్వాత పెరుగు, నిమ్మరసం కలిపి పేస్ట్ చేయాలి. స్కాల్ఫ్ కి పట్టించాలి. యాక్నే, డాండ్రఫ్ సమస్యలతో పాటు జుట్టు తెల్లబడటాన్ని న్యాచురల్ గా నివారిస్తుంది.

English summary

This is Why You Have Gray Hair at an Early Age

This is Why You Have Gray Hair at an Early Age. There’s something wrong with you if you are 25 and turning into a silver fox. Gray hair is a problem, and if you are still in your 20s then it definitely is a major problem.
Story first published:Tuesday, August 16, 2016, 11:57 [IST]
Desktop Bottom Promotion