For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టు రాలడానికి ముఖ్య కారణం మీ డైలీ హ్యాబిట్సే..!!

జుట్టు సమస్యల్లో హెయిర్ ఫాల్ ఒకటి. జుట్టు పల్చబడటం కాదు, సాధారణంగా కంటే ఎక్కువ హెయిర్ ఫాల్ ఉన్నట్లైతే ఆలస్యం చేయకుండా వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. జుట్టు రాలుతున్నప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకు

|

జుట్టు సమస్యల్లో హెయిర్ ఫాల్ ఒకటి. జుట్టు పల్చబడటం కాదు, సాధారణంగా కంటే ఎక్కువ హెయిర్ ఫాల్ ఉన్నట్లైతే ఆలస్యం చేయకుండా వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

జుట్టు రాలుతున్నప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల బట్టతల ఏర్పడే ప్రమాదం ఉంది. హెల్తీ అండ్ బౌన్సీ హెయిర్ కలిగి ఉండాలంటే కొన్ని అలవాట్లను దూరం చేసుకోవాలి. జుట్టు రాలడానికి ప్రధాన కారణం ఈ క్రింది అలవాట్లే ...

ప్రోటీన్ ఫుడ్స్ సరిగా తీసుకోకపోవడం:

ప్రోటీన్ ఫుడ్స్ సరిగా తీసుకోకపోవడం:

జుట్టు పెరుగుదల 90శాతం ప్రోటీన్స్ మీదే ఆధారపడి ఉంటుంది. ప్రోటీన్స్ లోపం వల్ల హెయిర్ ఫాల్ అధికంగా ఉంటుంది. ప్రోటీన్స్ లోపిస్తే జుట్టు పెరగడం ఆగిపోతుంది, జుట్టు చిట్లడం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా జుట్టు పెరుగుదలకు ఐరన్ మరియు జింక్ న్యూట్రీషియన్స్ ఎక్కువగా అవసరం అవుతాయి, కాబట్టి, రెగ్యులర్ డైట్ లో తప్పనిసరిగా ప్రోటీన్స్ అధికంగా ఉన్న ఆహారాలను ఎంపిక చేసుకోవాలి.

హాట్ స్టైలింగ్ టూల్స్ ఉపయోగించడం :

హాట్ స్టైలింగ్ టూల్స్ ఉపయోగించడం :

హెయిర్ స్ట్రెటనింగ్స్, కర్లింగ్ టూల్స్, డ్రయ్యర్స్ వంటివి 410 డిగ్రీల ఫారన్ హీట్ కలిగి ఉంటాయి. వీటిని జుట్టుకు ఉపయోగించడం వల్ల జుట్టుకు అవసరమయ్యే ప్రోటీన్ ను డ్యామేజ్ చేస్తుంది. చుట్టూ క్యూటికల్స్ ను నాశనం చేస్తుంది. క్యూటికల్స్ డ్యామేజ్ అయితే జుట్టులో మాయిశ్చరైజింగ్ తగ్గుతుంది. జుట్టు మరింత వీక్ గా మారుతుంది. కాబట్టి, ఇటువంటి హీట్ ప్రొడ్యూసింగ్ ప్రొడక్ట్స్ కు దూరంగా ఉండాలి.

జుట్టును మరీ టైట్ గా వేసుకోవడం, బ్యాడ్స్ , క్లిప్స్ తో జుట్టును టైట్ చేయడం:

జుట్టును మరీ టైట్ గా వేసుకోవడం, బ్యాడ్స్ , క్లిప్స్ తో జుట్టును టైట్ చేయడం:

వివిధ రకాల హెయిర్ స్టైల్ వల్ల ప్రభావం హెయిర్ ఫాలీ సెల్స్ మీద ప్రభావం చూపుతుంది. దాంతో జుట్టు వీక్ గా మారుతుంది, దాంతో జుట్టు పొట్టిగా, లేదా మద్యలోకి తెగిపోవడం జరుగుతుంది.

హాట్ షవర్ :

హాట్ షవర్ :

రెగ్యులర్ గా వేడినీళ్ళ స్నానం చేయడం వల్ల జుట్టులో నేచురల్ మాయిశ్చరైజింగ్ కోల్పోతుంది. దాంతో జుట్టుకు డీహైడ్రేషన్, జుట్టు వీక్ గా మారడం జరుగుతుందిం. అడిషినల్ గా హెయిర్ ఫాలీ సెల్స్ అదనంగా ఎక్కువ ఆయిల్స్ ను ఉత్పత్తి చేయడం వల్ల హెయిర్ రూట్స్ డ్యామేజ్ అవుతాయి. ఇది జుట్టు రాలడానికి కారణమవుతుంది.

ఎక్కువ ఒత్తిడికి గురి అవ్వడం :

ఎక్కువ ఒత్తిడికి గురి అవ్వడం :

జుట్టు పెరుగుదల ఆరోగ్యం, ఆహారపు అవాట్ల మీద ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యంగా, ఒత్తిడిల లేకుండా ఉన్నట్లైతే జుట్టు రాలడం తగ్గి, నేచురల్ గా జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. స్ట్రెస్ వల్ల శారీరకంగా మార్పులు వస్తాయి. స్ట్రెస్ వల్ల హార్మోనుల అసమతుల్యతులు కారణంగా జుట్టు సమస్యలు ఏర్పడుతాయి. కాబట్టి, స్ట్రెస్ లేకుండా జీవించాలి.

తడి జుట్టు మెయింటైన్ చేయడం :

తడి జుట్టు మెయింటైన్ చేయడం :

తడిగా ఉన్న జుట్టు చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. జుట్టు తడిగా ఉన్నప్పుడు బ్రష్ చేయడం, హార్ష్ గా డ్రై చేయడం, రఫ్ టవల్ ను ఉపయోగించడం మొదలగు మిస్ ట్రీట్మెంట్ వల్ల తడి జుట్టు జుట్టు రాలడానికి కారణం అవుతుంది.

 ఎక్కువగా ఎండలో తిరగడం:

ఎక్కువగా ఎండలో తిరగడం:

యూవీకిరణాలు చర్మంను మాత్రమే కాదు, జుట్టుకు కూడా డ్యామేజ్ చేస్తాయి. కాబట్టి ఎక్కువ ఎండలో తిరగకూడదు. యూవీ కిరణాల తాకిడి వల్ల హెయిర్ క్యూటికల్స్ చాలా వీక్ గా మారుతాయి, అది అలాగే కొనసాగడం వల్ల, జుట్టు చిట్లడం, వీక్ , డ్రై మరియు డిస్ కలర్ కు దారితీస్తుంది. దాంతో జుట్టు రాలడం పెరుగుతుంది.

తలస్నానం చేయకుండటం వల్ల :

తలస్నానం చేయకుండటం వల్ల :

తరచూ తలస్నానం చేయకపోవడం వల్ల తలలో చుండ్రు, దుమ్ము, ధూళి పేరుకోవడం వల్ల తలలో చర్మం రంద్రాలు బ్లాక్ అయ్యి, హెయిర్ ఫోలిసెల్స్ బ్లాక్ అవ్వడం వల్ల జుట్టు పెరుగుదలను అడ్డుకుంటుంది.

అస్తమానం దువ్వడం లేదా టీజ్ చేయడం :

అస్తమానం దువ్వడం లేదా టీజ్ చేయడం :

జుట్టు పెరుగుదలకు వ్యతిరేఖ దిశలో అస్తమానం తలదువ్వడం, జుట్టుకు రక్షణగా ఉండే క్యూటికల్ సెల్స్ పర్మనెంట్ గా హెయిర్ కూటికల్స్ డ్యామేజ్ అవ్వడం , హెయిర్ ఫైబర్ కోల్పోవడం వల్ల జుట్టు నాణ్యత తగ్గుతుంది.

కొన్ని రకాల మందులను ఉపయోగించడం :

కొన్ని రకాల మందులను ఉపయోగించడం :

కొన్ని రకాల మెడికేషన్స్ హెయిర్ ఫాలీసెల్స్ కు టాక్సిక్ గా మారుతాయి. ఇది తాత్కాలికంగా జట్టు రాలడానికి కారణమవుతుంది. బీటా బ్లాకర్స్, బ్లడ్ థిన్నర్స్, ఫీమేల్ హార్మోన్స్, ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్, మేల్ హార్మోన్స్, యాంటీ డిప్రజెంట్ మెడిసిన్స్, విటమిన్ ఎ టాబ్లెట్స్ వల్ల జుట్టు రాలుతుంది. కాబట్టి, పైన తెలిపిన ఆ అలవాట్లును మానుకొన్నట్లైతే జుట్టు రాలడం తగ్గించి, జుట్టు పెరుగుదలను పొందవచ్చు.

English summary

Top 10 Habits that Can Make Your Hair Fall

Okay, so it’s not just thin, they are actually shedding more than usual. Well, it’s not too late to save your strands and your head from going bald. Thick and bouncy hair is just a simple tweaks away. Just avoid these 10 habits that can make your hair fall. - See more at: http://htv.com.pk/lifestyle/10-habits-can-make-hair-fall#sthash.UySUMZeq.dpuf
Story first published: Friday, November 25, 2016, 17:50 [IST]
Desktop Bottom Promotion