For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టు పొడవుగా..ఒత్తుగా పెరగడానికి హెల్తీ అండ్ న్యూట్రీషియన్ జ్యూస్ లు..!

By Super Admin
|

జుట్టు ఆరోగ్యానికి తాజా కూరలు, పండ్లు గొప్పగా సహాయపడుతాయా?ఖచ్చితంగా అవుననే అంటున్నారు పోషకాహర నిపుణులు. కొన్న ప్రత్యేకమైన పండ్లు, వెజిటేబుల్స్ డైలీ డైట్ లో చేర్చుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యంగా , అందంగా పెరుగుతుంది.

ఫ్రెష్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల శరీరానికి కావల్సిన న్యూట్రీషియన్స్ అందుతాయి . అదే విదంగా జుట్టుకు కూడా పోషణను అందిస్తుంది. ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్ జ్యూస్ లు రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల హెయిర్ బ్రేకేజ్ ను నివారిస్తుంది, దాంతో హెయిర్ గ్రోత్ పెరుగుతుంది. జ్యూస్ లో ఉండే న్యూట్రీషియన్స్ బాడీ వేగంగా గ్రహిస్తుంది, దాంతో ఫలితం ఫాస్ట్ గా ఉంటుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే కొన్ని ఎఫెక్టివ్ జ్యూస్ ఈ క్రింది విదంగా..

ఈ క్రింది సూచించిన రెగ్యులర్ జ్యూస్ లను రెగ్యులర్ గా తీసుకుంటే, జుట్టు రాలడం నివారిస్తుంది, జుట్టు పల్చగా మారకుండా నివారిస్తుంది. ఇతర సమస్యలను కూడా నివారిస్తుంది.అయితే ఆ జ్యూసుల గురించి కాస్త వివరంగా తెలుసుకుందాం..

1. అలోవెర జ్యూస్ :

1. అలోవెర జ్యూస్ :

అలోవెర జ్యూస్ లో జుట్టు రాలడం నివారిస్తుంది. అలోవెర జ్యూస్ లో ఉండే విటమిన్స్ జుట్టును స్ట్రాంగ్ గా మరియు హెల్తీగా పెరగడానికి సహాయపడుతుంది. హెయిర్ బ్రేకేజ్ ను నివారిస్తుంది. ఈ జ్యూస్ లో ఉండే ఎంజైమ్స్ జుట్టుకు పోషణను అందిస్తుంది., మాయిశ్చరైజింగ్ గా మార్చుతుంది. అలోవెర జుట్టుకు అప్లై చేయడం వల్ల చుండ్రు నివారిస్తుంది, దురద తగ్గుతుంది. జుట్టుకు అలోవెర జ్యూస్ అప్లై చేయడం వల్ల జుట్టు సాఫ్ట్ గా కాంతివంతంగా మారుతుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

2. కివి ఫ్రూట్ జ్యూస్:

2. కివి ఫ్రూట్ జ్యూస్:

కివి ఫ్రూట్ జ్యూస్ లో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది, ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. విటమిన్ ఇ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. కివి ఫ్రూట్ వ్యాధినిరోధక శక్తిని పెంచడంతో జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. ఇది క్లెన్సింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. ఈ జ్యూస్ ను బాగా షేక్ చేసి, తలకు అప్లై చేయాలి.

3. ఉల్లిపాయ జ్యూస్:

3. ఉల్లిపాయ జ్యూస్:

హెల్తీ వెజిటేబుల్లో ఉల్లిపాయ ఒకటి. ఉల్లిపాయ జ్యూస్ ను తలకు నేరుగా అప్లై చేయడం వల్ల తెల్ల జుట్టు నివారించబడుతుంది. జుట్టు పెరుగదలను ప్రోత్సహిస్తుంది. ఉల్లిపాయల్లో సల్ఫర్ అధికంగా ఉంటుంది. ఇది జుట్టుకు అసవరమయ్యే పోషణను అందిస్తుంది. హెయిర్ ఫోలిసెల్స్ ను ఆరోగ్యంగా ఉంచుతుంది.జుట్టు పెరుగుదలను అడ్డుకునే హానికరమైన ప్యారాసైట్స్ ను తొలగిస్తుంది.

4. ఆకు కూరల జ్యూస్ :

4. ఆకు కూరల జ్యూస్ :

ఆకుకూరల్లో మినిరల్స్, విటమిన్స్, ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది జుట్టుకు మరియు చర్మానికి ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుంది. జుట్టు పల్చబడటం, తలలో దురద వంటి జుట్టు సమస్యలను నివారిస్తుంది. ఆకుకూరల్లో విటమిన్ బి జుట్టుకు మంచి షైనింగ్ అందిస్తుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

5. జామ జ్యూస్:

5. జామ జ్యూస్:

జామకాయ జ్యూస్ లో యాంటీఆక్సిడెంట్స్, క్యాల్షియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్స్ వంటి వివిధ రకాల న్యూట్రీషియన్స్ గొప్పగా ఉన్నాయి. ఇవన్నీ జుట్టుకు అవసరమయ్యే మ్యాక్జిమమ్ బెనిఫిట్స్ ను అందిస్తుంది. రెగ్యులర్ గా జామకాయను తినడం లేదా జామజ్యూస్ తాగడం వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. అలాగే జామ ఆకులను టీ రూపంలో కాచీ , వడగట్టి తర్వాత తలకు అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

6. గార్లిక్ జ్యూస్:

6. గార్లిక్ జ్యూస్:

జుట్టు సమస్యలను నివారంచడానికి పురాతన కాలం నుండి దీన్ని ఉపయోగిస్తున్నారు. ఇది జుట్టు కోల్పోయిన క్వాలిటీ, పోషణను పోలిసెల్స్ ను రీస్టోర్ చేస్తుంది. గార్లిక్ జ్యూస్ ను తలకు అప్లైచేయడం వల్ల తలలో రక్తప్రసరణను పెంచుతుంది . ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.జుట్టును స్మూత్ గా మార్చుతుంది.

7. కీరదోస జ్యూస్:

7. కీరదోస జ్యూస్:

కీరదోస జ్యూస్ ను తలకు అప్లై చేయడం వల్ల జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది, హెయిర్ క్వాలిటీ పెంచుతుంది, కీరదోసకాయలో ఉండే ఎంజైమ్స్ జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది , తలలో హీమోగ్లోబిన్ ప్రసరణను పెంచుతుంది , హెయిర్ ఫోలిసెల్స్ కు అవసరమయ్యే రక్తప్రసరణ అందడం వల్ల జుట్టు ఆరోగ్యంగా,ఒత్తుగా పెరుగుతుంది. రోజుకు ఒక గ్లాసు కీరదోసకాయ జ్యూస్ తాగాలి.

8. కొత్తిమీర జ్యూస్:

8. కొత్తిమీర జ్యూస్:

కొత్తీమీరన సహజంగా సీలాంట్రో అనికూడా పిలుస్తారు, ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. హెయిర్ ఫాల్ కు వ్యతిరేఖంగా పనిచేస్తుంది. దీన్ని ఇతర జ్యూసులతో మిక్స్ చేసి తీసుకోవడం వల్ల టేస్టీగా ఉంటుంది. అలాగే జుట్టుకు అప్లై చేయాలనుకుంటే మెత్తగాపేస్ట్ చేసి, దీనికి ఇతర హెయిర్ ప్రొడక్టైన పెరుగు, నిమ్మరసం వంటి వాటితో మిక్స్ చేసి తలకు ప్యాక్ వేసుకోవాలి. ఒక గంట తర్వాత తలస్నానం చేసుకోవాలి.

9. క్యారెట్ జ్యూస్:

9. క్యారెట్ జ్యూస్:

క్యారెట్ గ్రేట్ న్యూట్రిషినల్ జ్యూస్, ఇందులో బీటాకెరోటిన్ అధికంగా ఉంటుంది. ఇది జుట్టును కాంతివంతంగా మార్చుతుంది. హెయిర్ కలర్ గ్రేట్ గా మారుతుంది. జుట్టులో హెయిర్ ఫాలిసెల్స్ ను స్ట్రాంగ్ గా మార్చుతుంది , ఇది జుట్టు క్వాలిటీని పెంచుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి తలకు కావల్సిన పోషణను గ్రేట్ గా అందిస్తుంది.

10. స్ట్రాబెర్రీ జ్యూస్:

10. స్ట్రాబెర్రీ జ్యూస్:

స్ట్రాబెర్రీ జ్యూస్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంది, ఇది శరీరంలో ప్రోటీన్స్ ను పెంచుతుంది, ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టుకు కాల్సిన ప్రోటీన్స్ పుష్కలంగా అందుతాయి. స్ట్రాబెర్రీను మెత్తగా పేస్ట్ చేసి, తలకు పట్టించడం వల్ల ఇది జుట్టుకు కవాల్సిన ప్రోటీన్స్, ను అందివ్వడంతో జుట్టుకు కావల్సిన పోషణు పూర్తిగా అందిస్తుంది.

English summary

Top 10 Juices That Help Further Hair Growth

Do you know that juices from fresh vegetables and fruits can have a major impact on your hair health? Yes, including these juices in your daily diet can actually meet all your hair care needs.The residue of fresh fruits and green leafy vegetables provide your body with ample nutrition and also assists the growth of mane. Fresh fruits and vegetable juices will lessen the chances of hair breakage and thus help promote hair growth
Desktop Bottom Promotion