For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టు తెల్లబడకుండా ఉండాలంటే ఇలా చేయండి చాలు..!

శారీరక సమస్యల్లో ప్రధానమైనవి జుట్టు నెరవడం, బట్టతల. వీటి వల్ల చాలా మంది తీవ్ర డిప్రెషన్ బారినపడుతున్నారు. ఈ సమస్యలకు కారణాలను యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌కు చెందిన సౌత్‌వెస్ట్రన్‌ మెడికల్‌ సెంటర్‌..

|

ఈ మద్యకాలంలో జుట్టు సమస్యలు ఎదుర్కొంటున్న వారి సంఖ్య పెరిగిపోతున్నది. ప్రస్తుత కాలంలో యువత ఎదుర్కొంటున్న శారీరక సమస్యల్లో ప్రధానమైనవి జుట్టు నెరవడం, బట్టతల. వీటి వల్ల చాలా మంది తీవ్ర డిప్రెషన్ బారినపడుతున్నారు. ఈ సమస్యలకు కారణాలను యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌కు చెందిన సౌత్‌వెస్ట్రన్‌ మెడికల్‌ సెంటర్‌ పరిశోధకులు గుర్తించారు.

జుట్టు రాలడం, చండ్రు, జుట్టు పల్చగా మారడం, డ్రై హెయిర్, ఆయిల్ హెయిర్ వంటి సమస్యలతో పాటు తెల్ల జుట్టు సమస్యలు కూడా వేగంగా పెరుగుతున్నాయి. అందుకు ముఖ్య కారణం జీవన శైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు, జంక్ ఫుడ్స్, పోషకాహార లోపం, రాత్రుల్లో లేట్ గా నిద్రపోవడం. కొందరి జీవనశైలిలో మార్పులతో పాటు అనారోగ్య సమస్యలు కూడా జుట్టు సమస్యలకు కారణం కావచ్చు.

చిన్నవయస్సులోనే జుట్టు నెరవడానికి కారణమేమి?చిన్నవయస్సులోనే జుట్టు నెరవడానికి కారణమేమి?

శరీరంలో కొన్ని రకాల ఎంజైమ్స్ తగ్గిపోవడం వల్ల కూడా జుట్టు నిర్జీవంగా మారడం, షైనింగ్ తగ్గిపోవడం, జుట్టు రాలడం వంటి సమస్యలు ఎదుర్కొంటుంటారు. జుట్టు రాలకుండా నివారించడానికి తిరిగి పూర్వ స్థితికి రావాలంటే జుట్టుకు తగిన పోషకాలను అందివ్వాలి. మంచి డైట్ ను ఫాలో అవ్వడంతో పాటు కొన్ని అలవాట్లను మార్చుకోవడం వల్ల నిర్జీవంగా మారిన జుట్టు తిరిగి పెరుగుతుంది. జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు పెరుగుదలకు కారణమయ్యే ఎంజైమ్స్ రీస్టోర్ అవుతాయి. ..మరి జుట్టు తెల్లబడకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం...

హెల్తీ డైట్ :

హెల్తీ డైట్ :

మన రెగ్యులర్ గా తీసుకునే ఆహారం ఆరోగ్యానికి మాత్రమే కాదు, అందానికి కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. జుట్టు అందంగా, మంచి రంగుతో పెరగాలంటే అందుకోసం హెల్తీ డైట్ తీసుకోవాలి. డైట్ లో విటమిన్ ఎ, బి, లతో పాటు మినిరల్స్ , జింక్ అధికంగా ఉండేట్లు చూసుకోవాలి. కాపర్, జింక్, మినిరల్స్ అధికంగా ఉన్న ఆహారాలను తీసుకోవడం ద్వారా తెల్ల జుట్టును నివారించుకోవచ్చు. వీటితో పాటు ఫ్రెష్ గా ఉండే పచ్చి కూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. వాటర్ ఎక్కువగా తాగాలి.

అల్లం మరియు తేనె:

అల్లం మరియు తేనె:

అల్లం మరియు తేనె గ్రేట్ కాంబినేషన్. తెల్ల జుట్టు నివారించడంలో ఈ రెండు గొప్పగా సహాయపడుతాయి. వీటిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు సహాయపడుతాయి. ఒక టీస్పూన్ అల్లంను మెత్తగా పేస్ట్ చేసి, ఒక టీస్పూన్ తేనెలో మిక్స్ చేసి రోజూ ఉదయం తినాలి. ఇలా రోజు తినడం వల్ల తెల్లజుట్టు నేచురల్ గా ఎఫెక్టివ్ గా తగ్గుతుంది.

కొబ్బరి నూనె :

కొబ్బరి నూనె :

కొబ్బరి నూనెలో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. తెల్ల జుట్టును నివారిస్తుంది. యాంటీ ఆక్సియాక్సిడెంట్స్ కారణంగా తెల్ల జుట్టును నివారిస్తుంది. మరింత ఎఫెక్టివ్ గా పనిచేయాలంటే కొబ్బరి నూనెలో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి, తలకు పట్టించి మసాజ్ చేయాలి. ఒక గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

బ్లాక్ టీ :

బ్లాక్ టీ :

చాలా సింపుల్ హోం రెమెడీ. కొన్ని టీ ఆకులను నీటిలో వేసి బాగా మరిగించి, స్టౌ ఆఫ్ చేసి బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఈ టీని తలకు అప్లై చేసి మసాజ్ చేయాలి.ఒక గంట తర్వాత షాంపు ఉపయోగించకుండా తలస్నానం చేయాలి.

ఉల్లిపాయ జ్యూస్ :

ఉల్లిపాయ జ్యూస్ :

తెల్లజుట్టు నివారణకు, జుట్టు పల్చబడటం నివారించడానికి ఉల్లిపాయ జ్యూస్ గ్రేట్ గా సహాయపడుతుంది. హైడ్రేజన్ పెరాక్సైడ్ హెయిర్ ఫాలీసెల్స్ లో చేరడం వల్ల, దాంతో జుట్టు మొదళ్లలో నేచురల్ యాంటీఆక్సిడెట్స్ ఉత్పత్తి తగ్గుతుందని, దాంతో జుట్టు తెల్లగా మారుతుందని రీసెంట్ స్టడీ ద్వారా తెలిసింది. ఈ ప్రత్యేకమైన యాంటీ ఆక్సిడెంట్ ను నివారించడంలో ఉల్లిపాయ జ్యూస్ గ్రేట్ గా సహాయపడుతుందని, అందుకోసం ఉల్లిరసాన్ని జుట్టు మొదల్లకు అప్లై చేసి, మసాజ్ చేస్తే తెల్లజుట్టు నివారించుకోవచ్చని స్టడీస్ నిర్ధారిస్తున్నాయి.

బాదం నూనె-నిమ్మరసం:

బాదం నూనె-నిమ్మరసం:

తెల్ల జుట్టు నివారించడం కోసం మరో ఎఫెక్టివ్ హోం రెమెడీ బాదం ఆయిల్, నిమ్మరసం. ఈ రెండు పదార్థాలను మిక్స్ చేసి చేతి వేళ్ళతో తలలో అప్లై చేసి మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల తెల్ల జుట్టు సమస్య తప్పకుండా తగ్గుతుంది.

అలోవెర జెల్ :

అలోవెర జెల్ :

అలోవెర జెల్ లో మెడిసినల్ గుణాలు అధికంగా ఉండటం వల్ల ఇది జుట్టుకు గ్రేట్ గా సహాయపడుతుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టుకు కావల్సిన పోషణను అందిస్తుంది. తెల్ల జుట్టును నివారించి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

యాపిల్ సైడర్ వెనిగర్ :

యాపిల్ సైడర్ వెనిగర్ :

తెల్ల జుట్టును నివారించడంలో ఒక ట్రెడిషినల్ పద్దతి యాపిల్ సైడర్ వెనిగర్. హెయిర్ కలర్ కు సంబంధించిన మెటబాలిక్ రేటును పెంచి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

బ్యాడ్ హ్యాబిట్స్ ను వదిలేయాలి:

బ్యాడ్ హ్యాబిట్స్ ను వదిలేయాలి:

ప్రివెన్షన్ ఈజ్ బెటర్ ద్యాన్ క్యూర్ అంటుంటారు. కాబట్టి, ఏదైనా రాకముందే దాన్ని నివారించుకోవడం ఉత్తమం. చెడు అలవాట్లలో స్మోకింగ్ చాలా ప్రమాదకరమైనది . ఇది ఆరోగ్యాన్ని పాడు చేయడం మాత్రమే కాదు, అందాన్ని కూడా పాడుచేస్తుంది. ముఖ్యంగా జుట్టును తెల్లగా మార్చడంలో టుబాకో పనిచేస్తుంది. స్మోకింగ్ ను మానేయాలి.

English summary

9 Home Remedies to Prevent Premature Greying of Hair

Premature greying of hair is typically due to the effect of the reducing levels of enzyme catalase in the body. Here are some amazing home remedies to resolve this hair condition..
Story first published: Tuesday, May 23, 2017, 13:06 [IST]
Desktop Bottom Promotion