జుట్టు రాలడం అరికట్టడానికి ఇంట్లో స్వయంగా తయారుచేసుకునే హెయిర్ మాస్క్

Posted By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

జుట్టు రాలిపోవడమనే సమస్య ఈ రోజుల్లో సర్వసాధారణ సమస్యగా మారిపోయింది. ఈ సమస్యతో ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ప్రజలు సతమతమవుతున్నారు. జుట్టు రాలిపోవడానికి అనేక కారణాలు దోహదపడతాయి.

జన్యులోపాలు, ఆరోగ్య సమస్యలు, పోషకాహార లోపం, జీవనశైలి అలవాట్లు, జుట్టును స్టైల్ చేసుకోవడానికి అతిగా వాడే హీట్ స్టైలింగ్ టూల్స్ తదితర అంశాలు సాధారణంగా జుట్టుపై దుష్ప్రభావం చూపుతాయి.

ప్రతిరోజూ కొన్ని వెంట్రుకలు రాలిపోవడం సహజం. అయితే, విపరీతంగా జుట్టు రాలిపోతున్నట్లైతే ఖచ్చితంగా హెయిర్ ఫాల్ సమస్య మిమ్మల్ని వేధిస్తున్నాదని అర్థం. ఈ సమస్యను నిర్లక్ష్యం చేసినట్టయితే ఈ సమస్య మరింత జఠిలంగా మారుతుంది. తద్వారా మీ శిరోజాలపై మరింత దుష్ప్రభావం పడుతుంది.

hair fall mask using amla powder

DIY హోమ్ మేడ్ హెయిర్ ఫాల్ మాస్క్ రెసిపీ

హెయిర్ ఫాల్ సమస్యను అరికట్టడానికి వివిధ రకాలైన కాస్మొటిక్ మరియు సర్జికల్ ట్రీట్మెంట్స్ అందుబాటులో కలవు. అయితే, ఈ ట్రీట్మెంట్స్ కొన్ని దుష్ప్రభావాలను కూడా కలగచేస్తాయి. అదనంగా, మీ జేబును గుల్లకూడా చేస్తాయి.

కాబట్టి, ఒకవేళ మీరు చౌకైన అలాగే సురక్షితమైన ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నట్లైతే ఈ ఆర్టికల్ ప్రత్యేకంగా మీ కోసమే. ఇవాళ, బోల్డ్ స్కై మీకోసం హెయిర్ ఫాల్ ని అరికట్టే అటువంటి అద్భుతమైన హోమ్ మేడ్ మాస్క్ గురించి వివరిస్తుంది.

ఈ హోంమేడ్ హెయిర్ మాస్క్ లో వాడిన పదార్థాలలోనున్న యాంటీఆక్సిడెంట్స్ మీ శిరోజాలకు పోషణనిచ్చి హెయిర్ ఫాల్ ని అరికడుతూ దెబ్బతిన్న శిరోజాలను కూడా సరిచేస్తాయి. ఎంతో ప్రభావవంతమైన ఈ మాస్క్ ను తయారు చేసుకోవడం చాలా సులభం.

ఇక్కడ, హోంమేడ్ హెయిర్ ఫాల్ మాస్క్ ని తయారుచేయడమెలాగో పూర్తి సమాచారాన్ని అందించాము. ఈ మాస్క్ ని మీ బ్యూటీ రొటీన్ లో భాగంగా చేసుకుని అద్భుతమైన ఫలితాలను పొందండి. మీ శిరోజాలను సంరక్షించుకోండి.

గమనిక: ఈ మాస్క్ ను మీ తలకి అప్లై చేసేముందు ప్యాచ్ టెస్ట్ ను నిర్వహించండి. ప్యాచ్ టెస్ట్ కోసం కాస్తంత ప్యాక్ ను తీసుకుని మీ తలపై కొంచెం అప్లై చేసి దాని ప్రభావం గమనించండి.

1. ఉసిరి పొడి ద్వారా శిరోజాలకు కలిగే ప్రయోజనాలు:

1. ఉసిరి పొడి ద్వారా శిరోజాలకు కలిగే ప్రయోజనాలు:

హెయిర్ ఫాల్ ను నియంత్రించడానికి ఉసిరి పొడిని ఉపయోగించమనేది తరతరాలుగా ప్రాచుర్యంలో ఉంది. శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్స్ ని కలిగి ఉండటంతో శిరోజాలను వ్రేళ్ళనుంచి దృఢంగా మార్చే శక్తి ఉసిరి పొడికి కలదు.

2. శిరోజాల సంరక్షణకై రీటా పౌడర్ ద్వారా కలిగే ప్రయోజనాలు

2. శిరోజాల సంరక్షణకై రీటా పౌడర్ ద్వారా కలిగే ప్రయోజనాలు

యాంటీఆక్సిడెంట్ ఎంజైమ్స్ రీటా పౌడర్ లో పుష్కలంగా ఉంటాయి. ఇవి గాలిలోనున్న టాక్సిన్స్ ని అలాగే పొల్యూట్రన్ట్స్ నుంచి శిరోజాలను సంరక్షించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.

అలాగే, టాక్సిన్స్ నుంచి వెంట్రుకలను సంరక్షిస్తూ శిరోజాలను దెబ్బతీయకుండా రక్షిస్తూ జుట్టు చిట్లిపోవడమనే సమస్యను రీటా పౌడర్ అరికడుతుంది.

3. రోజ్ వాటర్ వలన శిరోజాల సంరక్షణకు కలిగే ప్రయోజనాలు

3. రోజ్ వాటర్ వలన శిరోజాల సంరక్షణకు కలిగే ప్రయోజనాలు

హెయిర్ లాస్ ను అరికట్టడానికి రోజ్ వాటర్ అనేది ప్రభావంతంగా పనిచేస్తుంది. ఇది వెంట్రుకలను దృఢపరచి pH ను సంతులనం చేస్తుంది.

అంతే కాదు, రోజ్ వాటర్ ని మీ స్కాల్ప్ సులభంగా గ్రహించడం వలన జుట్టు మొదళ్ళకి తగిన పోషణ లభిస్తుంది.

4. హోంమేడ్ మాస్క్ వలన కలిగే ప్రయోజనాలు:

4. హోంమేడ్ మాస్క్ వలన కలిగే ప్రయోజనాలు:

ఇంతకు ముందు వివరించిన పదార్థాల కలయికతో మీ శిరోజాలకు అద్భుతమైన పోషణ లభిస్తుంది. తద్వారా మీ శిరోజాలు ఒత్తుగా ఉంటాయి. మొదళ్ళ నుంచి హెయిర్ ఫాల్ సమస్యను అరికట్టడంలో ఈ ప్యాక్ ముఖ్యపాత్ర వహిస్తుంది .

నిజానికి, ఈ హెయిర్ మాస్క్ ను తరచూ వాడటం వలన మీ శిరోజాలు ఒత్తుగా దృఢంగా మరి ఆరోగ్యంగా మారతాయి.

5. ఈ హెయిర్ మాస్క్ తయారీకి కావలసిన పదార్థాలు

5. ఈ హెయిర్ మాస్క్ తయారీకి కావలసిన పదార్థాలు

ఒక టీస్పూన్ ఆమ్లా పౌడర్

ఒక టీస్పూన్ రీటా పౌడర్

పావు టీస్పూన్ కర్పూరం పొడి

మూడు టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్

6. తయారుచేసే విధానం:

6. తయారుచేసే విధానం:

ఒక ఖాళీ గ్లాసు తీసుకుని అందులో ఇప్పుడు చెప్పుకున్న పదార్థాలను బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ఒక పేస్ట్ లా వచ్చేవరకు కలుపుతూ ఉండండి.

7. ఎలా వాడాలి:

7. ఎలా వాడాలి:

మీ తలపై ఈ మాస్క్ ని అప్లై చేసి మీ శిరోజాల కుదుళ్ళ నుంచి చివర్ల వరకు బాగా మసాజ్ చేయండి.

ఆ తరువాత పది నిమిషాల వరకు ఈ మాస్క్ ను అలాగే ఉంచండి.

గోరువెచ్చటి నీటితో కడగండి.

వారంలో రెండు లేదా మూడు సార్లు ఈ మాస్క్ ని వాడడం ద్వారా అద్భుతమైన ఫలితాలు పొందండి.

English summary

How To Make Homemade Hair Fall Mask

It's normal to shed a few hair strands on a daily basis. However, excessive shedding can be a sign of a hair fall problem. And, under no circumstance should a person turn a blind eye to this issue, as ignoring it would only further exacerbate the problem and may cause an irreversible damage to your hair.