For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ జుట్టు అందంగా మిళమిళ మెరుస్తుండాలంటే ఈ హెయిర్ ప్యాక్స్ సెలక్ట్ చేసుకోండి..!

ఎంత పొడవైన ఒత్తైనా జుట్టు ఉన్నా...అది అందంగా, కాంతివంతంగా మెరుస్తూ కనబడకపోతే ప్రయోజనం ఉండదు. మరి అలాంటి మెరుస్తుండే జుట్టును మీరు ఇంట్లోనే పొందాలని కోరుకుంటున్నారా? అందుకు కొన్ని సులభమైన హెయిర్ ప్యాక్

By Lekhaka
|

ఎంత పొడవైన ఒత్తైనా జుట్టు ఉన్నా...అది అందంగా, కాంతివంతంగా మెరుస్తూ కనబడకపోతే ప్రయోజనం ఉండదు. మరి అలాంటి మెరుస్తుండే జుట్టును మీరు ఇంట్లోనే పొందాలని కోరుకుంటున్నారా? అందుకు కొన్ని సులభమైన హెయిర్ ప్యాక్స్ ఇంట్లోనే అందుబాటులో ఉన్నాయి .

సహజంగా బ్యూటీని మెరుగుపరుచుకునే విషయంలో చాలా వరకూ మీ బ్యూటీ సమస్యలను నివారించుకోవడానికి మన వంటగదిలో ఉండే నేచురల్ పదార్థాలే అద్భుతంగా సమాయపడుతాయి. ఈ హెయిర్ ప్యాక్స్ ఉపయోగించడం చాలా సులభం. అంతే కాదు వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మరియు సురక్షితమైనవి. వీటిలో ఎలాంటి రసాయనాలు ఉండకపోవడం వల్ల చర్మానికి సురక్షితమైనవి. డబ్బు ఖర్చుచేయాల్సిన అవసరం ఉండదు.

Easy Packs To Get Shiny Hair At Home

జుట్టు నిర్జీవంగా డల్ గా కనబడటానికి అనేక కారణాలున్నాయి. అందుకు వాతావరణంలో మార్పులు, స్ట్రెస్ , కాలుషం, సరైజన జాగ్రత్తలు తీసుకోకపోవడం. ఈ డల్ హెయిర్ ను నివారించుకోవడం కోసం పార్లర్ కు వెలితే సరిపోతుందుని అనుకుంటారు. అయితే ఇది కొద్దిగా అసౌకర్యం కలిగించే ఖరీదైన ట్రీట్మెంట్స్ .

అందువల్ల మీరు ఇంట్లోనే అందమైన ప్రకావంతంగా మెరిసే జుట్టును పొందడానికి కొన్ని హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా ఉన్నాయి. వీటికోసం డబ్బు ఖర్చుపెట్టాల్సిన అవసరం లేదు.

1. ఎగ్ హెయిర్ ప్యాక్ :

1. ఎగ్ హెయిర్ ప్యాక్ :

జుట్టుకు ప్రకాశవంతంగా మార్చడానికి ఎగ్ వైట్ గ్రేట్ గా సహాయపడుతుంది. వీటిలో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. ఒక గుడ్డు తీసుకుని అందులో ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేయాలి. ఒక గంట సేపు అలాగే వదిలేసి, తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టుకు మంచి కండీషనర్ లా పనిచేస్తుంది. ఎగ్ వైట్ మీ జుట్టు పొడవును బట్టి తీసుకోవాలి.

2. అలోవెర జెల్ :

2. అలోవెర జెల్ :

జుట్టు ప్రకాశవంతంగా మెరవాలంటే కొద్దిగా అలోవెర జెల్ తీసుకుని జుట్టుకు అప్లై చేసి మసాజ్ చేయాలి. అప్లై చేసిన ఒక గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ జెల్ జుట్టుకు మంచి కండీషనర్ గా పనిచేస్తుంది. జుట్టును సాప్ట్ గా మరియు షైనీగా మార్చుతుంది.

3. యాపిల్ సైడర్ వెనిగర్

3. యాపిల్ సైడర్ వెనిగర్

షైనీ హెయిర్ పొందడానికి ఒక సింపుల్ హోం రెమెడీ. యాపిల్ సైడర్ వెనిగర్ ను ఉపయోగించడం. యాపిల్ సైడర్ వెనిగర్ ను హెయిర్ మాస్క్ గా ఉపయోగించడం లేదా తలస్నానం చేసిన తర్వాత చివర్లో రెండు టేబుల్ స్పూన్ల వెనిగర్ ను ఒక మగ్ నీటిలో వేసి మిక్స్ చేసి తలస్నానం చివరన తలారా పోసుకోవాలి. నీటిలో బాగా కలిసే విధంగా చూసుకోవాలి

4. కొబ్బరి నూనె :

4. కొబ్బరి నూనె :

కొబ్బరి నూనెతో ఎలాంటి హెయిర్ సమస్యలైనా నివారించుకోవచ్చు. కొబ్బరి నూనెను వేడి చేసి తలకు జుట్టు కుదలకు బాగా అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి. కొబ్బరి నూనెను తలకు అప్లై చేసి, రాత్రంతా అలాగే ఉంచితే మరిన్ని ఎక్కువ ప్రయోజనాలు పొందుతారు.

5. బాదం నూనె :

5. బాదం నూనె :

బాదం ఆయిల్లో కొద్దిగా నిమ్మరం మిక్స్ చేసి తలకు అప్లై చేసుకోవాలి. బాదం ఆయిల్ జుట్టుకు మంచి పోషణను అందిస్తుంది. నిమ్మరసం జుట్టుకు మంచి షైనింగ్ అందిస్తుంది. అలాగే తలలో ఎక్సెస్ ఆయిల్ మరియు చుండ్రును నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

6. ఆర్గాన్ ఆయిల్ :

6. ఆర్గాన్ ఆయిల్ :

డ్రై అండ్ డ్యామేజ్ హెయిర్ ఉన్నవారికి నిజంగా ఇది ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఆర్గాన్ ఆయిల్ ను జుట్టుకు అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. రెండు గంటల పాటు అప్లై చేసి తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఈ ఆయిల్ వల్ల జుట్టుకు మంచి షైనింగ్ వస్తుంది.

English summary

Easy Packs To Get Shiny Hair At Home

Wouldn't it be great if you could easily get shiny hair at home? We will tell you about some easy hair packs to get shiny hair at home.Most of the answers to your beauty problems lie in your kitchen cabinets. These packs are easy to use and are very safe, as they are all free of chemicals. The best part about them is that you don't have to shell out all of your money on them.
Desktop Bottom Promotion