డాండ్రఫ్(చుండ్రు)ని తొలగించే అద్భుతమైన హెయిర్ సొల్యూషన్

By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

డాండ్రఫ్ సమస్యను అరికట్టడానికి అనేకరకాలైన యాంటీ డాండ్రఫ్ ప్రాడక్ట్స్ ని వాడినా ప్రయోజనం లేదా? తరచూ మిమ్మల్ని వేధించే డాండ్రఫ్ సమస్యకు సరైన పరిష్కారం లభించడం లేదా? అయితే, మీ సమస్యకు చక్కటి పరిష్కారం మేము చూపిస్తాము.

ఈ భయానక హెయిర్ కండిషన్ ను స్కాల్ప్ పై దురదలు అలాగే భుజాలపై డాండ్రఫ్ పెచ్చుల ద్వారా గుర్తించవచ్చు. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే శిరోజాలకు సంబంధించిన మరిన్ని సమస్యలను కొనితెచ్చుకున్నట్టవుతుంది.

డాండ్రఫ్ సమస్య బారినపడినట్లైతే మీ శిరోజాల ఆకృతి బలహీనపడుతుంది. శిరోజాలు తమ దృఢత్వాన్ని కోల్పోయి దెబ్బతింటాయి. అందువలన, ఈ సమస్యకు తక్షణ పరిష్కార మార్గం కనుగొనాలి.

సాధారణంగా, మన భుజాలపై వైట్ ఫ్లేక్స్ ను గమనించగానే యాంటీ డాండ్రఫ్ షాంపూ కోసం దగ్గరిలోనున్న బ్యూటీ స్టోర్ కి వెళ్తాము.

solution to cure dandruff

అయితే, యాంటీ డాండ్రఫ్ షాంపూలలో ఎక్కువ శాతం కెమికల్స్ తో తయారైనవే. వీటిని ఉపయోగించడం వలన సమస్య పరిష్కారం కాకపోగా సరికొత్త సమస్యకు దారితీస్తాయి. డాండ్రఫ్ సమస్య మరింత ఉధృతమవుతుంది.

అటువంటి కెమికల్ ప్రాడక్ట్స్ శిరోజాల సంరక్షణకు ఉపయోగపడకపోగా శిరోజాలను మరింతగా దెబ్బతీస్తాయి. కాబట్టి, మార్కెట్ లో లభించే వివిధ రకాల యాంటీ డాండ్రఫ్ ప్రాడక్ట్స్ ని వాడే బదులు సహజసిద్ధమైన హెర్బల్ ప్రాడక్ట్స్ ని వాడటం ఎంతో మంచిది.

అయితే, సహజసిద్ధమైన శిరోజాల సంరక్షణ ప్రాడక్ట్స్ కోసం మీరు మార్కెట్ల వద్ద ప్రయత్నించనవసరం లేదు. నిజానికి, డాండ్రఫ్ ని నేచురల్ ప్రాడక్ట్స్ తో సహజసిద్ధంగా ఎలా తొలగించుకోవాలో ఈ రోజు మీకు తెలియచేస్తాము. వంటింటిలో లభించే పదార్థాలతోనే డాండ్రఫ్ సమస్యను పూర్తిగా నిర్మూలించుకోవచ్చు.

ఉసిరి పొడి, రీటా పౌడర్, శీకాకాయి పొడి వంటి హెర్బల్ పదార్థాలలో డాండ్రఫ్ ని పోరాడే గుణాలు కలవు. డాండ్రఫ్ ని కలిగించే ఫంగస్ ని నశింపచేసే సామర్థ్యం వీటిలో కలదు. తద్వారా, తలపైన చర్మం పెచ్చులుగా రేగిపోవడం తగ్గుతుంది. ఆ విధంగా డాండ్రఫ్ సమస్యకు చెక్ పెట్టవచ్చు.

వీటన్నిటినీ కలిపి యాంటీ డాండ్రఫ్ సొల్యూషన్ ను సులువుగా తయారుచేసుకోవచ్చు. కెమికల్స్ లేకపోవడం ఈ నేచురల్ హెయిర్ కేర్ సొల్యూషన్ యొక్క గొప్పతనం. చౌకగా తయారుచేసుకోగలిగే ఈ సొల్యూషన్ ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది. డాండ్రఫ్ ని పూర్తిగా నిర్మూలిస్తుంది.

ఇక్కడ, సహజమైన నేచురల్ సొల్యూషన్ ను సులభంగా చేసుకునే విధానాన్ని సరళంగా వివరించాము....

గమనిక: ఈ నేచురల్ సొల్యూషన్ ని ఉపయోగించే ముందు మీ స్కాల్ప్ పై ప్యాచ్ టెస్ట్ ను ప్రయత్నించండి.

అయితే, ఈ సొల్యూషన్ ను ఎలా తయారు చేయాలో తెలుసుకునే ముందు డాండ్రఫ్ కి కారణమయ్యే అంశాల గురించి తెలుసుకుందాం.

ఈ క్రింది కారణాల వలన డాండ్రఫ్ సమస్య వేధిస్తుంది..

ఈ క్రింది కారణాల వలన డాండ్రఫ్ సమస్య వేధిస్తుంది..

 • శిరోజాల పరిశుభ్రతను పాటించకపోవడం
 • ఫంగల్ ఇన్ఫెక్షన్స్
 • ఆయిలీ స్కాల్ప్
 • నాసిరకం హెయిర్ ప్రోడక్ట్స్ ను వాడడం
 • వంశపారంపర్య అంశాలు
 • ఒత్తిడి
ఈ సొల్యూషన్ ను వాడడం వలన కలిగే లాభాలు:

ఈ సొల్యూషన్ ను వాడడం వలన కలిగే లాభాలు:

ఈ అద్భుతమైన హోంమేడ్ హెర్బల్ సొల్యూషన్ అనేది యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీలకి అలాగే యాంటీ ఇంఫ్లమ్మెటరీ ప్రాపర్టీలకు ముఖ్యకేంద్రంగా వ్యవహరిస్తోంది. ఈ సొల్యూషన్ లో వాడే పదార్థాలన్నిటిలో శిరోజాలకు సంరక్షణనిచ్చే గుణాలు అమితంగా కలవు.

ఈ గుణాలన్నీ డాండ్రఫ్ కు దారితీసే బాక్టీరియాను సంపూర్ణంగా నాశనం చేస్తాయి. అలా డాండ్రఫ్ సమస్యను మూలాల నుంచి నశింపచేస్తాయి.

ఈ సొల్యూషన్ ను తరచూ వాడటం వలన మీ శిరోజాలకు అలాగే స్కాల్ప్ కు చక్కని పోషణ లభిస్తుంది. డాండ్రఫ్ సమస్య నుంచి సంరక్షణ లభిస్తుంది. అంతే కాకుండా, డాండ్రఫ్ సమస్య మళ్ళీ మళ్ళీ వేధించకుండా తోడ్పడుతుంది.

కావలసిన పదార్థాలు:

కావలసిన పదార్థాలు:

 • ఉసిరిపొడి - ఒక టీస్పూన్
 • వేపాకులు - 5 నుంచి 6
 • శీకాకాయి పొడి - ఒక టీస్పూన్
 • మెంతి పొడి - ఒక టీస్పూన్
 • రీటా పొడి - ఒక టీస్పూన్
 • నీళ్లు - ఒక కప్పు

తయారుచేసే విధానం:

తయారుచేసే విధానం:

ఒక ప్యాన్ ను తీసుకుని వేడి చేసి ఇప్పుడు అందులో ఒక కప్పుడు నీళ్లు పోయండి.

ఇప్పుడు, ఇంతకు ముందు చెప్పుకోబడిన పదార్థాలను ఆయా మోతాదులలో ప్యాన్ లోకి తీసుకోండి. ప్యాన్ పై మూతను పెట్టి పది నిమిషాల వరకు ఆ పదార్థాలను మరగనివ్వండి.

ఇప్పుడు మూతను తీసి స్టవ్ మీద నుంచి ప్యాన్ ను తీసివేయండి .

ప్యాన్ లో నున్న సొల్యూషన్ చల్లారేవరకూ స్పూన్ తో కలపండి.

ఒక పాత్రలోకి సొల్యూషన్ ని వడగట్టండి.

ఉపయోగించే విధానం:

ఉపయోగించే విధానం:

ఈ సొల్యూషన్ ని మీ స్కాల్ప్ పై అప్లై చేయండి.

మీ మునివేళ్లతో స్కాల్ప్ పై మృదువుగా మసాజ్ చేయండి.

ఇప్పుడు గోరువెచ్చటి నీటితో మీ తలను శుభ్రపరుచుకోండి.

English summary

solution to cure dandruff | how to cure dandruff | what causes dandruff

Presence of dandruff in your hair can weaken its texture and cause breakage. That is why, it is crucial to address this hair concern on an immediate basis. Certain age-old herbal ingredients like amla powder, reetha powder, shikakai powder, etc., are known to inhibit the growth of dandruff-causing fungus and prevent flaking of the skin on your scalp.
Subscribe Newsletter