For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ఈ సహజ పద్ధతులని ఉపయోగించి జుట్టు చివర్లు చిట్లకుండా నివారించుకోవచ్చు!

  By Ashwini Pappireddy
  |

  మీ జుట్టు మొత్తం స్ప్లిట్స్ రావడం వలన ప్రతిసారి మీ తలలో కత్తెర పెట్డానికి భయపడుతున్నారా? జుట్టుని కత్తరించకుండా మీ వెంట్రుకల చివరన వున్న స్ప్లిట్ చివరలను మాత్రం ఎలా వదిలించుకోవాలని మార్గాలకోసం వెతుకుతున్నారా? అలా అయితే, దీనిని చదవండి.

  మీ వెంట్రుకలకి స్ప్లిట్ వస్తున్నాయి అంటే, మీ జుట్టు బాగా డామేజ్ అయినదని మీరు గ్రహించాలి. మీ జుట్టుకు నష్టాన్ని కలిగించడానికి వివిధ కారణాలు ఉన్నాయి. మీరు అత్యంత సాధారణంగా చేసే బ్లో డ్రైయర్ మరియు ఇతర వేడి స్టైలింగ్ టూల్స్, సూర్యకిరణాలకి మీ జుట్టు ఎక్కువగా బహిర్గతం అవడం మొదలైన వాటివలన జుట్టుకి నష్టం ఏర్పడవచ్చు.

  కారణం ఏదైనా,అందరిని భయపెడుతున్న ఈ స్ప్లిట్స్ చివరికి మీ జుట్టుని పొడిబారిపోయేలా చేసి, పెళుసుగా మారిపోయి మరియు దెబ్బతిన్నట్లు కనిపించేలా చేస్తాయి. కానీ ప్రతిసారి మీరు కత్తెర మీద ఆధారపడి మీరు ఈ సమస్యని వదిలించుకోవాలనుకుంటే మాత్రం మీరు పొరబడుతున్నట్లే. ఎందుకంటే ఇది శాశ్వత పరిష్కారం కాదు.

   natural remedies to get rid of split ends | how to get rid of split ends | tips to get rid of split ends

  మీరు మీ జుట్టు చివరన ఉన్నటువంటి స్ప్లిట్ తొలగించడమనేది మంచి ఆలోచనే. కానీ దానివలన మీ మీ జుట్టుకు ఎలాంటి హాని జరగకుండా దెబ్బతిన్న జుట్టును కూడా నివారించగల కొన్ని జుట్టు-రీజునేటింగ్ పద్ధతులని ఉపయోగించాలి.

  జుట్టు సంరక్షణకు బనానా హెయిర్ ప్యాక్

  ఈ నివారణ పద్ధతులు కొన్ని తరాలనుండి మన చుట్టూ వాడుకలో ఉన్నాయి మరియు స్ప్లిట్ ని వదిలించుకునే చికిత్స విషయానికి వస్తే, ఈ నివారణలు సురక్షితమైనవిగా మరియు చాలా ప్రభావవంతమైనవిగా ,మరియు మీరు జుట్టు సంరక్షణకై అధిక మొత్తంలో సొమ్ముని వెచ్చించే ఉత్పత్తులకన్నా ఇవి ఎంతో సురక్షితమైనవిగా పరిగణించబడ్డాయి.

  స్ప్లిట్స్ ని తొలగించి మీ జుట్టు కుదుళ్ళనుండి బలంగా ఉండటానికి ఇక్కడ కొన్ని సహజ ఇంటి చిట్కాలనుతెలియజేయడం జరిగింది. వీటిని అనుసరించి ఈ సమస్య నుండి బయటపడండి. మరి ఇప్పుడు అవేంటో చూసేద్దామా మరి..

  1. గుడ్డు పచ్చసొన

  1. గుడ్డు పచ్చసొన

  ప్రోటీన్లు మరియు విటమిన్ ఎ తో నిండివున్న గుడ్డు పచ్చసొన స్ప్లిట్ చివరలను తొలగిస్తుంది మరియు ఇది మళ్ళి పునరావృతం కాకుండా ఇది సహాయపడుతుంది.

  ఎలా ఉపయోగించాలి:

  2 టేబుల్ స్పూన్లు నిమ్మరసం మరియు 4-5 చుక్కల లావెండర్ నూనె లో గుడ్డు పచ్చసొన ని

  కలపండి. దీనిని మీ తల, కుదుళ్ళు మొత్తం వెంట్రుకల చివర్ల దాకా బాగా రాయండి. 40 నిముషాలు పాటు ఉండనిచ్చి తేలికపాటి షాంపూ మరియు సాధారణ నీటితో కడిగేయండి.

  2. బాదం నూనె

  2. బాదం నూనె

  బాదం నూనె అనేది ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, మెగ్నీషియం మరియు విటమిన్ ఏ ల వంటి జుట్టు-లాభదాయక సమ్మేళనాల సహజ వనరు గా చెప్పవచ్చు. ఈ మిశ్రమం స్ప్లిట్ ని పోగొడుతుందిమరియు మరల మరల రాకుండా ఆపుతుంది.

  ఎలా ఉపయోగించాలి:

  బాదం నూనెను స్పైర్ట్స్ ఎక్కవగా వున్న ప్రాంతంలో బాగా పట్టించి కాస్సేపు మర్దనా చేయండి. మీరు అద్భుతమైన ఫలితాలను పొందాలనుకుంటే ఈ నూనెని ఒక గంట లేదా అంతకంటే ఎక్కువ సేపు మీ తలలో ఉండటానికి అనుమతించండి.

  జుట్టు చివర్లు చిట్లకుండా నివారించడానికి ఆయుర్వేదిక్ రెమెడీస్

  3.అరటి

  3.అరటి

  విటమిన్లు మరియు కార్బోహైడ్రేట్లు సమృద్ధిగా ఉన్నటువంటి అరటి దెబ్బతిన్న జుట్టును సరిచేసి, మీ జుట్టుమరియు కుదుళ్ళని బలంగా మారుస్తుంది. తద్వారా స్ప్లిట్ ని సులభంగా నివారించవచ్చును.

  ఎలా ఉపయోగించాలి:

  పూర్తిగా మాష్ చేసిన ఒక పండిన అరటి పండుని ఒక గిన్నెలో తీసుకొని మరియు 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం తో కలపాలి. మీ జుట్టుకు మరియు వెంట్రుకలకి దీనిని రాసి ఒక గంట తర్వాత, షాంపూ మరియు గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

  4. ఆలివ్ ఆయిల్

  4. ఆలివ్ ఆయిల్

  ఆలివ్ నూనె మీ జుట్టును మంచిగా పోషించడంలో సహాయపడుతుంది. ఈ సహజ చమురులో ఉండే అనామ్లజనకాలు మీ చర్మం మరియు జుట్టుకు లోతైన పోషణను అందించేలా చేస్తాయి. ఈ నూనెని తరచూ ఉపయోగించడం వలన స్పిల్ట్స్ ని సులభంగా పోగొట్టవచ్చు.

  ఎలా ఉపయోగించాలి:

  కేవలం చిట్లిన మీ వెంట్రుకల చివరలకు ఆలివ్ నూనె ని బాగా పట్టించి కాస్సేపు మర్దనా చేయండి. రాత్రిపూట అలానే వదిలేయండి. ఉదయం, మంచి నీటితో మరియు ఒక లేత షాంపూతో శుభ్రం చేసుకోండి.

  5. మయోన్నైస్

  5. మయోన్నైస్

  మయోన్నైస్ అనేది జుట్టును మెరుగుపరిచే ప్రోటీన్ల యొక్క శక్తి ని కలిగివుంటుంది, ఇది స్ప్లిట్ ని దూరం చేస్తుంది.అంతే కాకుండా, ఇది మీ కుదుళ్ళకి హైడ్రేషన్ మరియు తేమను అందిస్తుంది, తద్వారా వాటిని పొడి మరియు పెళుసుగా చూడకుండా నివారించవచ్చు.

  ఎలా ఉపయోగించాలి:

  మీ తల మరియు మొత్తం వెంట్రుకలకి మయోన్నైస్ ని బాగా రాసి 40 నిముషాల పాటు మీ తలలో ఉండనిచ్చి తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి. దీనిని శుభ్రపరచడానికి ఏదయినా షాంపూ ని ఉపయోగించండి మరియు ప్రక్రియను ముగించడానికి ఒక కండీషనర్ను కూడా ఉపయోగించండి.

  6. చేప నూనె

  6. చేప నూనె

  చేప నూనె ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలతో నిండి ఉంటుంది, చేప నూనెలు దెబ్బతిన్న జుట్టును, స్ప్లిట్ ని మెరుగుపరుస్తుంది మరియు మీ కుదుళ్ళని ,వెంట్రుకల ను బలంగా తయారుచేస్తుంది.

  ఎలా ఉపయోగించాలి:

  చేపల నూనె గుళికల నుండి నూనెను తీసుకొని, మీ తల మీద మరియు ఇబ్బందికరమైన ప్రాంతమైనటువంటి స్ప్లిట్ వున్న ప్రాంతంలో రాయండి. అరగంట పాటు ఉండనిచ్చి తరువాత గోరు వెచ్చని నీటితో మరియు ఒక మూలికా షాంపూ తో కడిగేయండి.

  7. అవోకాడో

  7. అవోకాడో

  అవోకాడో లో ఉన్నటువంటి అమైనో ఆమ్లాలు మరియు విటమిన్ ఇ వంటి జుట్టు-పునరుజ్జీవన పదార్థాల ఉనికి మీ జుట్టు మీద అద్భుతాలను పని చేస్తుంది. ఇది స్ప్లిట్ ని తొలగిస్తుంది మరియు మీ జుట్టు మొత్తంఆరోగ్యంగా ఉండటంలో కూడా సహాయపడుతుంది.

  ఎలా ఉపయోగించాలి:

  కేవలం మాష్ చేసిన ఒక పండిన అవోకాడో మరియు 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె తో కలపాలి. మీ తల కుదుళ్ళు మరియు వెంట్రుకల చివరిదాకా రాయండి. అరగంట పాటు దీనిని మీ తలలో ఉంచి తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయండి.

  English summary

  natural remedies to get rid of split ends | how to get rid of split ends | tips to get rid of split ends

  Split ends are considered to be a sign of damaged hair. There are various factors that can cause damage to your hair. The most common ones are over-usage of blow dryer and other heat styling tools, excessive exposure to sun rays, etc.!
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more