జుట్టు స్ట్రాంగ్ గా..ఒత్తుగా పెరగడానికి ఇంటి చిట్కాలు

Subscribe to Boldsky

ఆరోగ్యకరమైన శిరోజాలు మీ అందానికి వన్నె తెస్తాయి. అయితే, ఈ మధ్యకాలంలో అనేకరకాలైన సమస్యల వలన శిరోజాల అందం దెబ్బతింటోంది. ముఖ్యంగా జుట్లు చిట్టిపోవడమనేది ప్రధాన సమస్యగా మారింది. శిరోజాల సంరక్షణపై మీరు చూపించే శ్రద్ధతో పాటు మీరు తీసుకునే ఆహారం అలాగే ఇతర అలవాట్లు శిరోజాలపై తమ ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ ఆర్టికల్ లో మీ శిరోజాలను దృఢంగా ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం...

ఈ ఆర్టికల్ లోని చెప్పిన పాటించడం ద్వారా మీరు దెబ్బతిన్న శిరోజాలను తిరిగి దృఢంగా మార్చుకోవచ్చు. ఒత్తైన, దృఢమైన శిరోజాలతో మీ అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు.

దృఢమైన శిరోజాలు కలిగి ఉండటమంటే జుట్టు రాలిపోవడమనే సమస్యతో పాటు జుట్టు చిట్లే సమస్య దాదాపు లేదనే అర్థం. జుట్టు రాలే సమస్య ప్రతి మహిళను బాధిస్తుంది. అపురూపంగా కాపాడుకుంటున్న శిరోజాల సౌందర్యం ఇలా నేలపాలవడం మహిళలను ఇబ్బంది పెట్టే అంశం.

కాబట్టి, శిరోజాలను దృఢంగా మార్చుకోవడం ద్వారా జుట్టుకు సంబంధించిన అనేకరకాల సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.

ఇక్కడ, మీ శిరోజాలను దృఢంగా మార్చుకునేందుకు అవసరమైన సులభమైన చిట్కాలను పొందుపరచాము. ఈ చిట్కాలను పాటించడం ద్వారా బలహీనమైన శిరోజాలను దృఢంగా మార్చుకోవచ్చు.

1. ఆలివ్ ఆయిల్:

1. ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్ లో విటమిన్ ఈ సమృద్ధిగా లభిస్తుంది. అందువలన మీ శిరోజాలకు తగిన పోషణ లభిస్తుంది. మీ శిరోజాలు వేగంగా, ఆరోగ్యవంతంగా పెరిగేందుకు ఈ విటమిన్ తోడ్పడుతుంది. కాస్తంత వేడి చేసిన ఆలివ్ ఆయిల్ తో మీ స్కాల్ప్ పై మసాజ్ చేసుకోండి. మరుసటి ఉదయాన్నే మీ శిరోజాలను వాష్ చేసుకోండి.

2. గుడ్లు:

2. గుడ్లు:

గుడ్లనుంచి శిరోజాలకు అవసరమైన ప్రోటీన్లు లభిస్తాయి. గుడ్లను ఆహారంలో తీసుకోవడం ద్వారానే కాకుండా శిరోజాల సంరక్షణకు హెయిర్ ప్యాక్ గా కూడా వాడి తగిన ప్రయోజనాలు పొందవచ్చు. గుడ్లలోని తెల్లని సొనను ఒక పాత్రలోకి తీసుకుని అందులో కాస్తంత తేనెని కలపండి. ఈ మిశ్రమాన్ని మీ స్కాల్ప్ పై అప్లై చేసి ఒక గంట తరువాత శిరోజాలను నీటితో శుభ్రపరుచుకోండి. ఈ చిట్కాని పాటిస్తే మీ శిరోజాలు దృఢంగా, కోమలంగా మారతాయి.

3. ఉసిరి:

3. ఉసిరి:

స్కాల్ప్ ని ఎక్స్ఫోలియెట్ చేయడానికి ఉసిరి ఎంతగానో ఉపయోగపడుతుంది. కొన్ని ఎండు ఉసిరికాయలని కొబ్బరి నూనెలో మరిగించి, వడగట్టండి. ఇప్పుడు, వడగట్టిన ఈ నూనెతో మీ స్కాల్ప్ పై మృదువుగా మసాజ్ చేయండి. ఒక గంట తరువాత మీ శిరోజాలను నీటితో శుభ్రపరుచుకోండి. ఈ పద్దతిలో వారానికి ఒకసారి మీ శిరోజాలను సంరక్షిస్తే దృఢమైన శిరోజాలు మీ సొంతమవుతాయి.

4. అలో వెరా:

4. అలో వెరా:

అలో వెరాలో స్కాల్ప్ యొక్క pH స్థాయిలను బాలన్స్ చేసే సామర్థ్యం కలదు. కొంత అలో వెరా జెల్ ను కాస్త కొబ్బరి పాలతో కలిపి ఈ మిశ్రమాన్ని హెయిర్ ప్యాక్ లా అప్లై చేయండి. ఈ చిట్కాను పాటిస్తూ ఉంటే, కాలక్రమేణా, మీ శిరోజాలు మృదువుగా, కోమలంగా తయారవుతాయి.

5. క్యాస్టర్ ఆయిల్:

5. క్యాస్టర్ ఆయిల్:

క్యాస్టర్ ఆయిల్ లో శిరోజాలను దృఢపరిచే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా కలవు. వారానికి ఒకసారి ఈ ఆయిల్ తో స్కాల్ప్ పై మసాజ్ చేయాలి. ఈ పద్దతి ద్వారా మీ శిరోజాలు దృఢంగా తయారవడమే కాకుండా వేగంగా కూడా పెరుగుతాయి.

6. హెన్నా:

6. హెన్నా:

సహజసిద్ధమైన హెన్నాని వాడడం ద్వారా మీ శిరోజాలకు డీప్ హెయిర్ కండిషనింగ్ ట్రీట్మెంట్ ను అందివ్వవచ్చు. నెలకొకసారి హెన్నా ట్రీట్మెంట్ ను మీ శిరోజాలకు అందివ్వండి. ఈ విధంగా క్రమంతప్పకుండా పాటిస్తే మీ శిరోజాలు దృఢంగా, కోమలంగా తయారవుతాయి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Tips To Get Stronger Hair At Home

    Hair breakage is a common problem. It has a lot to do with how you take care of your hair, your diet and other things you do to your hair. In this article, we will tell you some tips on how to get stronger hair.
    Story first published: Friday, December 15, 2017, 15:30 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more