తలలో జిడ్డు తొలగించే వండర్ ఫుల్ రెమెడీస్: ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు

Posted By: Lekhaka
Subscribe to Boldsky

సాధరణంగా మహిళలకు అందమైన జుట్టు ఉన్నప్పుడే అందం మరింత పెరుగుతుంది. జుట్టు అందంగా లేకపోతే ఎంత మేకప్ చేసుకున్నా ప్రయోజనం ఉండదు. ముఖ్యంగా జిడ్డు చర్మం లాగే జుట్టు జిడ్డుగా ఉంటే చూడటానికే కాదు, మెయింటైన్ చేయడానికి కూడా కష్టం. ఇటువంటి జుట్టుతో బాధపడే వారిలో మీరు ఒకరైతే , ఈ ఆర్టికల్ మీకోసమే. మీకోసం బోల్డ్ స్కూ కొన్ని సింపుల్ అండ్ ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ను ఇంట్లోనే తయారుచేసుకోగల సింపుల్ రెమెడీస్ పరిచయం చేస్తున్నది.

ఈ మద్యకాలంలో ఇంట్లోనే స్వయంగా తయారుచేసుకోగలిగి హెయిర్ మాస్కులు బాగా ఫేమస్ అయ్యాయి. అది ముఖ్యంగా వీటిని స్వయంగా ఇంట్లో తయారుచేసుకోవడం సులభం. చౌకైనవి కూడా. ఇంకా చెప్పాలంటే ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. అంతే కాదు, కమర్షియల్ హెయిర్ మాస్క్ లు ఖరీదైనవి, హర్ష్ కెమికల్స్ కలిగినవి, ఆశించిన ఫలితాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి.

 Wonderful 2-Ingredient DIY Masks For Oily Hair

అందువల్ల, మీరు ఎల్లప్పుడు ఇంట్లో తయారుచేసుకునే హెయిర్ మాస్క్ లను ఎంపిక చేసుకోవడం మంచిది. ముఖ్యంగా జిడ్డు జుట్టు వదిలించుకోవడానికి హానికరమైన, కఠినమైన షాంపుల కంటే, ఇంట్లో తయారుచేసుకునే షాంపులు ఎంతో బెటర్ గా పనిచేస్తాయి.

ఇంట్లో స్వయంగా తయారుచేసుకోవడానికి కేవలం రెండు కాంబినేషన్ పదార్థాలుంటే చాలు, మీ ఆయిల్ హెయిర్ కు చెక్ పెట్టినట్లే, ఈ క్రింది లిస్ట్ లోని రిసిపిలను ఫాలో అయితే జుట్టు జిడ్డు మాత్రమే కాదు, ఇతర జుట్టు సమస్యలు కూడా తగ్గుతాయి..

మరి ఆ హోం మేడ్ రిసిపిలేంటో ఒకసారి తెలుసుకుందాం రండి..:

జుట్టుకు, చర్మానికి బాదం ఆయిల్..!! అద్భుతమైన ప్రయోజనాలు..!

1. విట్చ్ హాజల్ + గ్రీన్ టీ

1. విట్చ్ హాజల్ + గ్రీన్ టీ

- ఒక టీస్పూన్ హాజల్ , రెండు టీస్పూన్ల చల్లార్చిన గ్రీన్ టీ మిక్స్ చేయాలి.

- తర్వాత ఈ రెండూ బాగా మిక్స్ చేసి, తలకు అప్లై చేసి, మసాజ్ చేయాలి. తర్వాత నార్మల్ షాంపు, నార్మల్ వాటర్ తో తలస్నానం చేయాలి.

- ఈ హెయిర్ మాస్క్ తలలో జిడ్డు, ఆయిల్ నెస్ ను తగ్గించి మంచి ఫలితాలను ఇస్తుంది.

2. టీ ట్రీ ఆయిల్ + ఆలివ్ ఆయిల్

2. టీ ట్రీ ఆయిల్ + ఆలివ్ ఆయిల్

- నాలుగు , ఐదు చుక్కల టీట్రీ ఆయిల్ ను 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ తో మిక్స్ చేసి పెట్టుకుంటే ఆయిల్ మాస్క్ రెడీ.

- ఈ నూనెను తలకు అప్లై చేసి, వేడి నీటిలో ముంచిన కాటన్ టవల్ తలకు చుట్టి, 15 నిముషాలు అలాగే ఉంచాలి. తర్వాత చన్నీటింతో తలస్నానం చేయాలి. .

- ఈ విధంగా ఒక నెల రోజులు క్రమం తప్పకుండా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. జుట్టులో ఆయిల్ నెస్ తగ్గుతుంది.

3. గుడ్డులోని పచ్చసొన, నిమ్మరసం

3. గుడ్డులోని పచ్చసొన, నిమ్మరసం

- మూడు గుడ్లలోని పచ్చసొన తీసుకుని, అందులో 3 టేబుల్ స్పూన్ల నిమ్మరసం కలపాలి.

- ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేసి, ఒక నాలుగు గంటల సేపు అలాగే ఉంచాలి.

- నాలుగు గంటల తర్వాత తలకు షాంపు పెట్టి, గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి.

- ఈ ప్రొసెస్ ను రిపీట్ చేస్తే తప్పకుండా తలలో జిడ్డు తగ్గుతుంది.

ఆముదం తలకే కాదు.. చర్మానికీ ఎంతో మేలుచేస్తుంది..!

4. పుదీనా జ్యూస్ ,తేనె

4. పుదీనా జ్యూస్ ,తేనె

- ఒక టేబుల్ స్పూన్ పుదీనా రసంలో , రెండు టేబుల్ స్పూన్ల తేనె కలపాలి. .

- దీన్ని తలకు పూర్తిగా అప్లై చేసి, 20 నిముషాలు అలాగా ఉంచాలి.

- 20 నిముషాల తర్వాత షాంపు పెట్టి గోరువెచ్చని నీటితో తలస్నానం చేసుకోవాలి.

- నెలలో రెండు సార్లు ఇలా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

5. బీర్ , యాపిల్

5. బీర్ , యాపిల్

- కొన్ని ఆపిల్ ముక్కలు తీసుకుని, మెత్తగా పేస్ట్ చేయాలి. తర్వాత ఈ పేస్ట్ ను అరకప్పు బీర్ లో వేసి రెండూ బాగా కలపాలి. .

- ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేసి మసాజ్ చేయాలి. .

- 20 నిముషాల తర్వాత రెగ్యులర్ షాంపు , నార్మల్ వాటర్ తో తలస్నానం చేయాలి. .

- నెలకొకసారి ఇలా చేస్తుంటే తప్పకుండా తలలో జిడ్డు తగ్గుతుంది.

6. యాపిల్ సైడర్ వెనిగర్, కోకనట్ ఆయిల్

6. యాపిల్ సైడర్ వెనిగర్, కోకనట్ ఆయిల్

- ఒక బౌల్లో అరటీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుని, రెండు టేబుల్ స్సూన్ల కొబ్బరి నూనె మిక్స్ చేయాలి.

- ఈ మిశ్రమాన్ని తలకు పూర్తిగా అప్లై చేసి, 20 నిముషాల తర్వాత తలస్నానం చేయాలి.

7. ఓట్ మీల్, ఆమ్లా వాటర్

7. ఓట్ మీల్, ఆమ్లా వాటర్

- ఉండికించిన ఓట్ మీల్ ను రెండు టీస్పూన్లు తీసుకుని, అందులో మూడు టేబుల్ స్పూన్ల ఆమ్లా వాటర్ కలపాలి.

- ఈ మాస్క్ ను తలకు, జుట్టు పొడవున అప్లై చేయాలి.

- అరగంట తర్వాత నార్మల్ వాటర్ , రెగ్యులర్ షాంపుతో తలస్నానం చేసుకోవాలి.

- తిరిగి ఒక వారం తర్వాత ఇదే మాస్క్ ను మరోసారి ఉపయోగించడం వల్ల తలలో జిడ్డు తగ్గుతుంది.

8. రోజ్మెర్రీ ఆయిల్ , బాదం నూనె

8. రోజ్మెర్రీ ఆయిల్ , బాదం నూనె

- నాలుగు చుక్కల రోజ్మెర్రీ నూనెను, 2 టేబుల్ స్పూన్ల బాదం నూనెతో కలపాలి.

- దీన్ని తలకు అప్లై చేసి, 20-25 నిముషాలు డ్రైగా మార్చాలి.

- తర్వాత నార్మల్ షాంపుతో తలస్నానం చేసుకోవాలి.

- నెలకొకసారి, ఈ రిసిపిని ఉపయోగించడం వల్ల తలలో జిడ్డు తగ్గుతుంది.

English summary

Wonderful 2-Ingredient DIY Masks For Oily Hair

Check out the best hair masks for oily hair. The combination of these two ingredients works wonders for oily hair
Subscribe Newsletter