చుండ్రు కారణంగా ఊడిపోయే జుట్టును సంరక్షించే 7 అత్యుత్తమమైన ఇంటి చిట్కాలు !

Posted By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

సాధారణ చుండ్రుగా పిలిచే "సెబోరోహెయిక్ డెర్మాటిస్" అనేది తలపైచర్మం యొక్క రుగ్మత. జిడ్డుగా ఉన్న చర్మము, తలపై చర్మము మీద ఉండే ఫంగస్, పొడిచర్మము మరియు చర్మ శోథల వంటివి చుండ్రును అభివృద్ధి చేసే అనేక కారణాలుగా ఉన్నాయి. అవును, మీరు ఊహిస్తున్నట్లుగానే, ఇది పూర్తిగా దురదను కలిగి చాలా అధ్వాన్నంగా ఉంటూ, మీ జుట్టు పతనానికి కారణమవుతుంది. చుండ్రు మరియు జుట్టు రాలిపోవడం అనేవి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి.

జుట్టు రాలిపోవడం మరియు చుండ్రులను నివారించే 7 రకాల ఇంటి చిట్కాలు :

1. నీమ్ (వేపతో) థెరపీ :

1. నీమ్ (వేపతో) థెరపీ :

కావలసిన పదార్థాలు :-

వేప రసం - ¼ కప్

బీట్రూటు రసం - ¼ కప్

కొబ్బరి పాలు - ¼ కప్

కొబ్బరి నూనె - 1 స్పూన్

తయారీ విధానం :-

1) పైన తెలిపిన పదార్థాలను బాగా కలిసేలా పూర్తిగా కలపాలి, ఆపై మీ తలపై ఉన్న జుట్టు మీద ఈ మిశ్రమంతో మసాజ్ చేయాలి.

2) 20 నిమిషాల పాటు అలానే మీ జుట్టును బాగా ఆరనివ్వాలి. ఆ తర్వాత ఒక తేలికపాటి షాంపూతో శుభ్రంగా తలస్నానం చేయాలి.

2. మెంతులతో చుండ్రును తొలగించడం :

2. మెంతులతో చుండ్రును తొలగించడం :

కావలసిన పదార్థాలు :-

మెంతి విత్తనాలు - 2 టేబుల్ స్పూన్లు

ఆపిల్ సైడర్ వినెగార్ - 1 కప్పు

నీరు - 1 కప్పు

తయారీ విధానం :

1) మెంతులను రాత్రిపూట నీటిలో బాగా నానిబెట్టాలి.

2) మరుసటి ఉదయం ఆ విత్తనాలను ఒక పేస్ట్లా మెత్తగా చేయాలి.

3) ఈ పేస్ట్కు ఆపిల్ సైడర్ వినెగార్ను కలపాలి.

4) మీ తలచర్మంపై ఈ పేస్ట్ను ఉపయోగించండి.

5) 30 నిమిషాల పాటు అలానే మీ జుట్టును బాగా ఆరనివ్వాలి. ఆ తర్వాత ఒక తేలికపాటి షాంపూతో శుభ్రంగా తలస్నానం చేయాలి. ప్రతీవారంలో ఒకసారి ఇలా చేయండి.

3. ఆస్పిరిన్ మాత్రలతో చుండ్రును తొలగించడం :

3. ఆస్పిరిన్ మాత్రలతో చుండ్రును తొలగించడం :

కావలసిన పదార్థాలు :-

ఆస్పిరిన్ - 2 మాత్రలు

షాంపూ - 1

తయారీ విధానం :

1) బాగా గుండగా చేసిన ఆస్పిరిన్ మాత్రలను, షాంపూలో వేసి బాగా కలపాలి.

2) ఇప్పుడు మీ తలపై ఉన్న జుట్టు మీద ఈ టాబ్లెట్-షాంపూను ఉపయోగించండి.

3) దానితో 5 నిముషాల పాటు మీ జుట్టును అలానే మసాజ్ చేసి బాగా ఆరబెట్టండి.

4) ఇప్పుడు మీ జుట్టును పూర్తి శుభ్రంగా కడగండి.

4. బేకింగ్-సోడాతో చుండ్రును తొలగించడం :

4. బేకింగ్-సోడాతో చుండ్రును తొలగించడం :

కావలసిన పదార్థాలు :-

బేకింగ్ సోడా - 2 స్పూన్

నీరు (తగినంత)

తయారీ విధానం :-

1) మీ జుట్టును వేడి నీటితో శుభ్రపరచడం ద్వారా ప్రారంభించండి.

2) ఇప్పుడు బేకింగ్-సోడాకు తగినంత నీటిని జోడించండి.

3) మీ చర్మంలోకి బాగా చొచ్చుకు పోయేలా ఈ పేస్ట్తో మసాజ్ చేయండి.

4) ఆ తర్వాత మీ జుట్టుని పూర్తిగా శుభ్రంగా నీటితో కడగాలి.

5. కుంకుడు రసంతో చుండ్రును తొలగించడం :

5. కుంకుడు రసంతో చుండ్రును తొలగించడం :

కావలసిన పదార్థాలు :-

కుంకుడు కాయలు - 15 (సుమారుగా)

ఉసిరి రసం - 1 టేబుల్ స్పూన్

నీరు - 3 కప్పులు

తయారీ విధానం :

1) ఈ కుంకుడు కాయలను ఒక రాత్రి మొత్తం నీటిలో పూర్తిగా నానబెట్టండి.

2) మరుసటి రోజు ఉదయం, ఈ గింజలను పొడిగా దంచి - వేడి నీటిలో వేయాలి.

3) ఇలా పొడి చేసిన మిశ్రమానికి, ఉసిరి రసాన్ని కాస్తా జోడించి, బాగా పూర్తిగా కలపండి.

4) ఇలా తయారు కాబడిన పేస్టుతో మీ తలను 30 నిమిషాలపాటు మసాజ్ చేయండి.

5) ఆ తర్వాత మంచి నీటితో తలస్నానం చేయండి.

6. నిమ్మరసంతో చుండ్రును తొలగించడం :

6. నిమ్మరసంతో చుండ్రును తొలగించడం :

కావలసిన పదార్థాలు :-

నిమ్మరసం - 4 నిమ్మకాయలు

తయారీ విధానం :

1) మీ తలపై నిమ్మ రసంతో బాగా మసాజ్ చేయండి.

2) 15 నిమిషాల పాటు మీ తలని అలాగే ఆరనివ్వండి.

3) ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రంగా తలస్నానం చేయండి.

7. అలోవెరా జెల్తో చుండ్రును తొలగించడం :

7. అలోవెరా జెల్తో చుండ్రును తొలగించడం :

కావలసిన పదార్థాలు :-

అలోయి వేరా జెల్ - 5 టేబుల్ స్పూన్లు

తయారీ విధానం :

1) మీ తలపై అలోవెరా జెల్తో బాగా మసాజ్ చేయండి.

2) 30 నిమిషాల పాటు మీ తలని అలాగే ఆరనివ్వండి.

3) ఆ తర్వాత ఒక తేలికపాటి షాంపూతో శుభ్రంగా తలస్నానం చేయండి.

మీ జుట్టుకు చుండ్రును దూరంగా ఉంచటం వల్ల మీరు చాలా సంవత్సరాల పాటు ఆరోగ్యవంతమైన పూర్తి జుట్టుతో మరింత ఆకర్షణీయంగా ఉంటారు.

చుండ్రును నివారించడం కోసం మార్కెట్లో లభ్యమయ్యే ఇతర షాంపూలను వాడండి, అవి చుండ్రును నివారించడమే కాకుండా మీ జుట్టును మరింత కాంతివంతంగా కూడా తయారు చేస్తాయి.

English summary

7 Simple Home Remedies to Prevent Hair Fall Due To Dandruff

7 Simple Home Remedies to Prevent Hair Fall Due To Dandruff,Seborrheic dermatitis, commonly known as dandruff,is a disorder of the scalp. There are many reasons one may be a victim to dandruff like oily skin, fungus on the scalp, dry skin and skin inflammations.
Story first published: Thursday, March 15, 2018, 18:00 [IST]