For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డ్రై హెయిర్ కోసం, మీ ఇంట్లోనే తయారు చేసుకోగలిగే బెస్ట్ ఫ్రూట్ హెయిర్ ప్యాక్లు !

డ్రై హెయిర్ కోసం, మీ ఇంట్లోనే తయారు చేసుకోగలిగే బెస్ట్ ఫ్రూట్ హెయిర్ ప్యాక్లు !

|

మనందరి వయస్సు & లింగంతో సంబంధం లేకుండా జుట్టు పొడిగా, చిక్కులుగా ఉండటం & జుట్టు చిట్లి పోవడం వంటి జుట్టు సంబంధమైన సమస్యలను మనము కలిగి ఉంటాము. ఇలాంటి జుట్టు సమస్యలతో పోరాటానికి మనం అనేక రకాలైన పరిష్కారాల కోసం అన్వేషిస్తాము. ఈ వ్యాసంలో పొడి జుట్టు నివారణ కోసం పాటించవలసిన పద్ధతులు గురించి ఇప్పుడు ఈరోజు మనము చర్చించుకుందాం ! అంతకన్నా ముందు మీకు పొడి జుట్టు ఏర్పడటానికి గల కారణాల గూర్చి ఇప్పుడు మనం చూద్దాం.

మీ జుట్టు పొడిగా మారడానికి గల కారణాలు ఏమిటి ?

వేడి సాధనాలను ఉపయోగించడం :-

చాలామంది వివిధ రకాల హెయిర్ స్టైల్స్ లో కనబడటానికి రకరకాల ప్రయోగాలు చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాము. అందుకోసం మనము స్ట్రైట్నర్స్, కర్లర్స్, బ్లో-డ్రైయర్స్ వంటి వేడి సాధనాలను తరచుగా ఉపయోగిస్తుంటాము.

Best 3 Fruit Hair Masks For Dry Hair You Can Try At Home

తరచుగా తలస్నానం చేయడం :-

మీరు తరచుగా తలస్నానం చేయడం వల్ల మీ జుట్టు ఆరోగ్యకరంగా ఉంటుందన్న భావన మీ జుట్టుకు మరింతగా నష్టాన్ని కలుగజేయవచ్చనేది వాస్తవానికి మనకు అర్థం కాదు. మీరు తరచుగా తలస్నానం చేయడం వల్ల మాడుపై సహజంగా ఉత్పత్తి అయ్యే ఆయిల్ పూర్తిగా తరలించబడి మీ జుట్టును పొడిగా, చిక్కులుగా మార్చగలదు.

జుట్టుకు సరైన విటమిన్లు & పోషకాలు అందకపోవటం :-

మీరు ఆరోగ్యవంతమైన జుట్టును పొందడానికి విటమిన్లు & పోషకాలు అనేది చాలా అవసరం. విటమిన్ - A,C,E లతో పాటు యాంటీ-ఆక్సిడెంట్లు కూడా మీ జుట్టును బలంగా చేస్తూ, మాడును హైడ్రేట్గా ఉంచడంలో సహాయపడతాయి.

పండ్లతో చేసే హెయిర్ ప్యాక్లు ఎలా పని చేస్తాయి ?

పండ్లలో దాగున్న విటమిన్ - A,C & యాంటీ-ఆక్సిడెంట్లు మీ జుట్టును బలపరచడమే కాకుండా మీ జుట్టుకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా కాపాడడంతో పాటు, మీ జుట్టును మరింత మృదువుగా ఉంచుతుంది. పండ్లలో ఉన్న యాంటీ-ఆక్సిడెంట్లు మీ జుట్టును & మాడును హైడ్రేటింగా ఉంచడంతో పాటు జుట్టు చివర్ల పగిలిపోకుండా కాపాడుతుంది. విటమిన్ ఎ, మీ జుట్టును మరింత హెల్తీగా ఉంచేందుకు సహకరించే సహజమైన ఆయిల్స్ను మీ మాడుపైన ఉత్పత్తి చెయ్యడంలో బాగా సహాయపడుతుంది.

ఈ క్రింద వున్న ఫ్రూట్ హెయిర్ ప్యాక్లు మీ జుట్టును ఆరోగ్యంగా మృదువుగా ఉంచేందుకు అవసరమైన అన్ని రకాల పోషకాలను మరియు విటమిన్లను కలిగి ఉంటాయి. అవి

Best 3 Fruit Hair Masks For Dry Hair You Can Try At Home

1. బొప్పాయి :

యాంటీ-ఆక్సిడెంట్లకు బొప్పాయి చాలా ముఖ్యమైన వనరుగా ఉంది. దీనిని మీ జుట్టుకు అప్లై చేసేటప్పుడు జుట్టుకు & మాడుకు కావలసిన పోషకాలను అందించే ఒక సహజ సిద్ధమైన కండిషనర్గా పనిచేస్తుంది.

కావలసిన పదార్ధాలు :

1/2 బొప్పాయి

1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె

1 టేబుల్ స్పూన్ల ఆలీవ్ నూనె

తయారీ విధానం :

* మొదటగా బొప్పాయిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

* దాన్ని గ్రైండర్లో వేసుకుని మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోవాలి.

* అలా తయారైన పేస్ట్ కు కొబ్బరినూనెను & ఆలివ్ ఆయిల్ ను జోడించాలి.

* ఈ పదార్థాలన్నింటినీ బాగా కలిపి తలకు & మాడుకు అప్లై చేయాలి.

* ఆ పేస్టు బాగా ఆరేలా 30 నిమిషాల వరకు వేచి ఉండాలి.

* ఆ తర్వాత గోరువెచ్చని నీటితో మీ తలను బాగా శుభ్రపరుచుకోవాలి.

Best 3 Fruit Hair Masks For Dry Hair You Can Try At Home

2. అరటి :

అరటిలో కార్బోహైడ్రేట్లు, పొటాషియం, విటమిన్ B6 & C వంటి గొప్ప మూలాలను కలిగి ఉంది. విటమిన్-సి లోతైన కండీషనర్గా సహాయపడుతూ మీ జుట్టును మరింత మృదువుగా ఉంచుతుంది.

కావాల్సిన పదార్ధాలు :

1 అరటి (బాగా మగ్గినది)

1 టేబుల్ స్పూన్ తేనె

1 టేబుల్ స్పూను కొబ్బరినూనె

తయారీ విధానం :

* మొదటిగా అరటిపండును చిక్కని పేస్టులా తయారుచేసుకోవాలి.

* ఆ పేస్టులోకి కొబ్బరినూనె & తేనెను వేసి బాగా మిక్స్ అయ్యేలా కలపాలి.

* మీ జుట్టును కొన్ని పాయలుగా వేరుచేసి, మీ జుట్టు మూలాల నుంచి ఈ పేస్ట్ను సరైన రీతిలో అప్లై చేయాలి.

* షవర్ క్యాప్తో మీ జుట్టును ఒక గంట పాటు బాగా ఆరేలా వదిలివేయాలి.

* చివరగా, మీరు రెగ్యులర్గా ఉపయోగించే షాంపూతో తలస్నానం చేయాలి.

3. జామ :

జామలో విటమిన్-సి ఉన్న కారణంగా మీ జుట్టును మరింత బలంగా, మృదువుగా ఉంచడంలో సహాయపడుతుంది. జామలో ఉన్న యాంటీ-ఆక్సిడెంట్లు మీ మాడును తేమగా ఉంచుతూ, మీ జుట్టు నష్టాన్ని కలుగజేసే రాడికల్స్తో పోరాడుతుంది.

కావలసిన పదార్ధాలు :

2-3 జామ పండ్లు (బాగా పండినవి)

కొన్ని చుక్కల తేనె

తయారు విధానం :

* జామపండ్లను మిక్సీలో వేసి మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలి.

* అలా తయారైన మిశ్రమానికి తేనెను కలిపి మరింత బాగా మిక్స్ చేసుకోవాలి.

* దీనిని మీ జుట్టుకు అప్లై చేసిన తర్వాత 10 నిమిషాలు పాటు బాగా ఆరేలా వదిలివేయాలి.

* చివరిగా, మీ జుట్టును సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి.

English summary

Best 3 Fruit Hair Masks For Dry Hair You Can Try At Home

Dry, frizzy and damaged hair are the most common hair-related issues that we all face, irrespective of gender and age group. We look for several remedies to fight these issues. Here in this article, we'll discuss some remedies to combat dry hair. But before that let us see what really makes your hair dry. Read more at: https://www.boldsky.cDry, frizzy and damaged hair are the most common hair-related issues that we all face, irrespective of gender and age group. We look for several remedies to fight these issues. Here in this article, we'll discuss some remedies to combat dry hair. But before that let us see what really makes your hair dry.
Desktop Bottom Promotion