For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ హోమ్ రెమెడీస్ తో హెయిర్ లాస్ కి గుడ్ బై చెప్పవచ్చు

|

ఆరోగ్యకరమైన, ఒత్తైన, అలాగే నిగనిగలాడే జుట్టును కలిగి ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఎందుకంటే, ఈ విధమైన జుట్టు అందాన్ని రెట్టింపు చేయడానికి తోడ్పడుతుంది. అందమైన జుట్టుతోనే మంచి ఫస్ట్ ఇంప్రెషన్ ని కొట్టేయవచ్చు. లేదంటే, పూర్ ఇంప్రెషన్ కి గురవ్వాల్సిన ఇబ్బంది ఎదురవుతుంది. దురదృష్టవశాత్తూ, హెయిర్ లాస్ సమస్యతో ఎంతో మంది సతమతమవుతూ వస్తున్నారు.

హెయిర్ లాస్ కి దారితీసేందుకు అనేక ఫ్యాక్టర్స్ కారణమవుతాయి. పర్యావరణ ప్రభావం, ఏజింగ్, అధిక ఒత్తిడి, విపరీతమైన స్మోకింగ్, పోషకాహార లోపం, హార్మోన్లలో అసమతుల్యతలు, జన్యు కారకాలు, స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్, కెమికల్ ప్రోడక్ట్స్ ని ఎక్కువగా వాడటం, థైరాడ్ సమస్యకు వాడిన మెడికేషన్స్, ఆటో ఇమ్యూన్ వ్యాధులు, పోలీ సిస్టిక్ ఓవర్ సిండ్రోమ్ ((PCOS), ఐరన్ లోపం అనీమియాతో పాటు కొన్ని దీర్ఘకాల అనారోగ్యాల వలన హెయిర్ లాస్ సమస్య ఎదురవుతుంది.


స్కాల్ప్ పై దాదాపు లక్ష వెంట్రుకలు ఉంటాయి. రోజుకు ఏభై నుంచి వంద వెంట్రుకలను కోల్పోవటం సాధారణమే. అయితే, అంతకంటే, ఎక్కవ హెయిర్ లాస్ ను మీరు గమనిస్తే మీరు తక్షణమే హెయిర్ కేర్ ను మరింత పెంచాలి. అందువలన, బాల్డ్ నెస్ తో పాటు బాల్డ్ స్పాట్స్ సమస్యలు మరిన్నితగ్గే అవకాశం ఉంటుంది.

ఇంటివద్దే, హెయిర్ లాస్ ను అరికట్టేందుకు తగిన చర్యలను తీసుకోవచ్చు. రెడీగా అందుబాటులో ఉండే ఇంగ్రిడియెంట్స్ ను వాడటం ద్వారా హెయిర్ లాస్ ను అరికట్టవచ్చు. ఈ హోమ్ రెమెడీస్ హెయిర్ లాస్ ను అరికట్టేందుకు అద్భుతంగా తోడ్పడతాయి. వీటిని పరిశీలించండి మరి.

1. హెయిర్ ఆయిల్ మసాజ్:

1. హెయిర్ ఆయిల్ మసాజ్:

హెయిర్ లాస్ ను అరికట్టేందుకు మొదటి అడుగిది. స్కాల్ప్ పై తగినంత హెయిర్ ఆయిల్ తో మసాజ్ చేయాలి. సరైన హెయిర్ అండ్ స్కాల్ప్ మసాజ్ హెయిర్ ఫోలికల్స్ కు బ్లడ్ ఫ్లో ను పెంపొందిస్తుంది. స్కాల్ప్ ని కండిషన్ చేస్తుంది అలాగే హెయిర్ రూట్స్ ను బలపరుస్తుంది. రిలాక్సేషన్ ను పెంపొందించి ఒత్తిడిపూర్వక ఆలోచనలను తగ్గిస్తుంది.

కొబ్బరి లేదా ఆల్మండ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్, ఆమ్లా ఆయిల్ వంటి కొన్ని ఆయిల్స్ ను హెయిర్ మసాజ్ కు వినియోగించవచ్చు. కొన్ని చుక్కల రోజ్ మేరీ ఎసెన్షియల్ ఆయిల్ ను బేస్ ఆయిల్ కు జోడిస్తే మెరుగైన అలాగే వేగవంతమైన ఫలితాలను పొందవచ్చు. ఎమూ ఆయిల్, ఆర్గాన్ ఆయిల్ లేదా వీట్ జెర్మ్ ఆయిల్ వంటివి ఇందుకు తోడ్పడే కొన్ని ఇతర ఆయిల్స్.

పైన మెన్షన్ చేయబడిన ఏవైనా ఆయిల్స్ తో హెయిర్ పై అలాగే స్కాల్ప్ పై తేలికపాటి ఒత్తిడిని ఇస్తూ మీ మునివేళ్లతో మసాజ్ చేయాలి. ఈ పద్దతిని వారానికి ఒకసారి పాటించాలి.

2. ఉసిరికాయ:

2. ఉసిరికాయ:

సహజమైన అలాగే వేగవంతమైన హెయిర్ గ్రోత్ కోసం ఉసిరిలోని గుణాలను వినియోగించవచ్చు. ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. సీ విటమిన్ లోపం వలన హెయిర్ లాస్ సమస్య తలెత్తవచ్చు.

యాంటీ ఇంఫ్లేమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ మరియు ఎక్స్ఫోలియేటింగ్ ప్రాపర్టీస్ ఉసిరిలో లభ్యమవుతాయి. ఇవి స్కాల్ప్ ను ఆరోగ్యంగా ఉంచేందుకు హెయిర్ గ్రోత్ ను పెంపొందించేందుకు తోడ్పడతాయి.

ఒక టేబుల్ స్పూన్ ఉసిరికాయ గుజ్జును అలాగే ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని కలిపి ఒక మిశ్రమాన్ని తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమంతో స్కాల్ప్ పై మసాజ్ చేసుకోవాలి. షవర్ క్యాప్ తో హెయిర్ ను కవర్ చేసుకోవాలి. రాత్రంతా అలాగే ఉంది మరుసటి రోజు ఉదయాన్నే హెయిర్ ను షాంపూ చేసుకోవాలి.

3. మెంతులు:

3. మెంతులు:

మెంతులు హెయిర్ లాస్ ను అరికట్టేందుకు అత్యద్భుతంగా తోడ్పడతాయి. మెంతులలో యాంటీసెడెంట్స్ అనే హార్మోన్ కలదు. ఇది హెయిర్ గ్రోత్ ను పెంపొందిస్తుంది. హెయిర్ ఫోలికల్స్ పునర్నిర్మాణానికి తోడ్పడుతుంది. మెంతులులో నికోటినిక్ యాసిడ్ తో పాటు ప్రోటీన్స్ కలవు. ఇవి హెయిర్ గ్రోత్ కు అమితంగా తోడ్పడతాయి.

ఒక కప్పుడు మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టండి. ఉదయాన్నే, వీటిని మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసి హెయిర్ కు అప్లై చేసుకోండి. షవర్ క్యాప్ తో కవర్ చేయండి. 40 నిమిషాల తరువాత హెయిర్ ను రిన్స్ చేయండి. ఈ రెమెడీను నెలకి ఒకసారి పాటించండి.

4. ఉల్లిరసం:

4. ఉల్లిరసం:

ఉల్లిరసంలో సల్ఫర్ కంటెంట్ అధికంగా లభ్యమవుతుంది. ఇది హెయిర్ ఫోలికల్స్ కు బ్లడ్ సర్క్యూలేషన్ ను పెంపొందిస్తుంది. హెయిర్ ఫాలికల్స్ పునర్నిర్మాణానికి తోడ్పడి ఇంఫ్లేమేషన్ ను తగ్గిస్తుంది.

ఉల్లిరసంలో లభ్యమయ్యే యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీస్ అనేవి జెర్మ్స్ ను అలాగే పారసైట్స్ ను నశింపచేస్తాయి. హెయిర్ లాస్ కి దారితీసే స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ ను ట్రీట్ చేస్తాయి.

ఒక ఉల్లిపాయను తురిమి అందులోంచి రసాన్ని వెలికితీయండి. స్కాల్ప్ పై నేరుగా ఉల్లి రసాన్ని అప్లై చేయండి. ముప్పై నిమిషాలపాటు అలాగే ఉంచి ఆ తరువాత వాష్ చేయండి. చివరగా, షాంపూ చేయండి.

మూడు టేబుల్ స్పూన్ల ఉల్లి రసంలో రెండు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్ ను కలపండి. ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ ను జోడించండి. ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ పై అప్లై చేయండి. ముప్పై నిమిషాల పాటు అలాగే వదిలేయండి. ఆ తరువాత రిన్స్ చేసి షాంపూ చేసుకోండి.

ఈ రెమెడీస్ లో ఎదో ఒక రెమెడీస్ ను వారానికి రెండు లేదా మూడు సార్లు కొన్ని వారాలపాటు పాటించండి. మెరుగైన ఫలితాలని పొందండి.

5. అలోవెరా:

5. అలోవెరా:

అలోవెరాలో లభించే ఎంజైమ్స్ అనేవి ఆరోగ్యకరమైన హెయిర్ గ్రోత్ కు తోడ్పడతాయి. అలాగే, ఇది ఆల్కలైజింగ్ ప్రాపర్టీస్ కలిగినది. ఇది స్కాల్ప్ పై అలాగే హెయిర్ పై పీహెచ్ ను ఆశించిన స్థాయికి తీసుకువస్తుంది. అందువలన, హెయిర్ గ్రోత్ అనేది పెంపొందించబడుతుంది.

దీన్ని రెగ్యులర్ గా వాడటం వలన స్కాల్ప్ పై దురద తగ్గి స్కాల్ప్ రెడ్ నెస్ తో పాటు ఇంఫ్లేమేషన్ తగ్గుముఖం పడుతుంది. శిరోజాలు దృఢంగా తయారవుతాయి. డాండ్రఫ్ సమస్య తగ్గుముఖం పడుతుంది. అలోవెరా జెల్ మరియు జ్యూస్ లో అద్భుతాలు సృష్టిస్తాయి.

అలోవెరా జెల్ మరియు జ్యూస్ ను స్కాల్ప్ పై అప్లై చేయండి. కొన్ని గంటల పాటు అలాగే వదిలేయండి. ఆ తరువాత గోరువెచ్చటి నీటితో వాష్ చేయండి. ఈ ప్రాసెస్ ను వారంలో మూడు నుంచి నాలుగు సార్లు పాటించండి. ఒక టేబుల్ స్పూన్ అలోవెరా జ్యూస్ ను రోజూ పరగడుపునే తీసుకోవడం కూడా హెయిర్ గ్రోత్ ను మీరు గుర్తించే అవకాశం ఉంది.

English summary

Best Home Remedies For Hair Loss

The first step that you can take to reduce hair loss is to massage your scalp with appropriate hair oil. Proper hair and scalp massage will increase blood flow to the hair follicles, condition the scalp, and enhance the strength of your hair's roots. You can use hair oils like coconut or almond oil, olive oil, castor oil, amla oil, or others.
Story first published: Friday, July 6, 2018, 7:00 [IST]