బ్లూ బెర్రీలు : రంధ్రాలు బిగించి, జుత్తు వత్తుగా పెరిగేందుకు !!

Posted By: LAKSHMI BAI PRAHARAJU
Subscribe to Boldsky

జుత్తుకు, చర్మానికి అత్యంత మేలు చేసే విటమిన్లు, పోషకాల గనులు బ్లూబెర్రీలు.

శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ లు పుష్కలంగా వుండే బ్లూ బెర్రీలను వాణిజ్య పరంగా ఉత్పత్తి చేసే సౌందర్య సాధనాల్లో తరచూ ఉపయోగిస్తారు. అయితే, ఈ రుచికరమైన బ్లూ బెర్రీలు తమ కేశాలకు, చర్మానికి ఎలాంటి ప్రయోజనాలు అందిస్తాయో తెలియని వారు చాలా మందే వున్నారు.

From Tightening Pores To Boosting Hair Growth: 10 Reasons To Use Blueberries For Skin And Hair

మీరు కూడా ఇంతవరకు ఈ పండును సౌందర్యం కోసం వాడనట్లయితే, ఈ వ్యాసం మీ కోసమే. బోల్డ్ స్కై లో ఈ రోజు మేము కేశాలకు, చర్మానికి బ్లూ బెర్రీల వల్ల కలిగే ప్రయోజనాలను సేకరించి అందిస్తున్నాం.

రంధ్రాలను బిగించడ౦ నుంచి కేశ వృద్ధికి తోడ్పడే బ్లూ బెర్రీల వల్ల మీ చర్మానికి, కేశాలకు చాలా ప్రయోజనాలే ఉన్నాయి. పైగా, ముదురు నీలి రంగులో వుండే ఈ బెర్రీలను వారంలో లేదా నెలసరి సౌందర్య సాధనాలతో చేర్చే వివిధ మార్గాలు ఉన్నాయి.

కాబట్టి, బైట దొరికే సౌందర్య ఉత్పత్తులపై ఎక్కువ డబ్బు ఖర్చుపెట్టడానికి బదులుగా, మీ రోజువారీ సౌందర్య సాధనాలలో భాగంగా ఈ బ్లూ బెర్రీలను వాడి ఫలితంగా బహుమతిని పొందండి.

సౌందర్య ప్రయోజనాల కోసం బ్లూ బెర్రీలను వాడడానికి గల కారణాలపై ఒక దృష్టి పెట్టండి:

1. వృద్ధాప్య సంకేతాలపై పోరాడుతుంది

1. వృద్ధాప్య సంకేతాలపై పోరాడుతుంది

విటమిన్ A సమృద్ధిగా ఉన్న బ్లూ బెర్రీలు వయసును తగ్గించే పండ్లు, ఇవి ముడతలు, సన్న గీతాలు వంటి వృద్ధాప్య సంకేతలపై ప్రభావవంతంగా పోరాడతాయి. ఈ పండ్లను చర్మ సంరక్షణకు వాడితే మీ చర్మ౦ యవ్వనంతో మెరుస్తూ ఉంటుంది.

2. చర్మం పి హెచ్ బ్యాలెన్స్ ని కాపాడడానికి

2. చర్మం పి హెచ్ బ్యాలెన్స్ ని కాపాడడానికి

చర్మ సంరక్షణ కోసం బ్లూ బెర్రీలను ఉపయోగించడంలో కలిగే మరో అద్భుతమైన ప్రయోజనం ఇది చర్మం పి హెచ్ బ్యాలెన్స్ ని కాపాడడంలో సహాయపడుతుంది. అందువల్లే దీన్ని తరచుగా స్కిన్ టోనర్ లా ఉపయోగిస్తారు. ఇది హైడ్రేషన్ కారకం మాత్రమే కాదు మీ చర్మం అందంగా, తేమగా ఉండేట్టు కూడా చేస్తుంది.

3. రంధ్రాలను బిగుతుగా చేస్తుంది

3. రంధ్రాలను బిగుతుగా చేస్తుంది

యాంటీ-ఆక్సిడెంట్లు, విటమిన్లకు నిధులైన బ్లూ బెర్రీలు మీ రంధ్రాలు పూడిపోకుండా చేసి, బిగుతుగా కూడా ఉండేలా చేయడానికి సహాయపడతాయి. మీ చర్మం ఆరోగ్యంగా, అందంగా ఉండడానికి బిగుతైన, శుభ్రమైన రంధ్రాలు చాలా అవసరం. కాబట్టి, మీ చర్మం కాంతివంతంగా, అందంగా ఉంచడానికి మీ సౌందర్య సాధనాలలో ఈ అద్భుతమైన పండు ను కూడా చేర్చండి.

4. డెడ్ స్కిన్ సెల్స్ ని తొలగిస్తుంది

4. డెడ్ స్కిన్ సెల్స్ ని తొలగిస్తుంది

మీ చర్మం నిరంతరం మృతకణాల వల్ల పాడవుతుంటుంది. ఈ మృతకణాలు పెరిగితే పగుళ్ళు ఏర్పడతాయి. అయితే, బ్లూ బెర్రీల సహాయంతో, దీన్ని నివారించడం సాధ్యమే. ఈ పండులో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు మృత కణాలను సమర్ధంగా తొలగించి, తద్వారా పగుళ్ళు లేకుండా చేస్తాయి.

5. చర్మానికి మంచి పోషణ

5. చర్మానికి మంచి పోషణ

చర్మానికి పోషణను ఇచ్చే విటమిన్లతో నిండిన బ్లూ బెర్రీలు మీ చర్మ ఆరోగ్యం మొత్తాన్నీ పెంచి, మీ రూపాన్ని కూడా గణనీయంగా మెరుగుపరుస్తుంది. ఇది చర్మాన్ని దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ పై పోరాడి, మీ చర్మాన్ని పునరుద్ధరించుకోవడానికి కూడా సహాయపడుతుంది.

6. నల్లటి వలయాలను తొలగిస్తుంది

6. నల్లటి వలయాలను తొలగిస్తుంది

ఇది చర్మ సంరక్షణ కోసం బ్లూ బెర్రీలను ఉపయోగించడం వల్ల కలిగే మరో అద్భుతమైన ప్రయోజనం. ఈ పండులో అధికంగా ఉండే విటమిన్ E మీ కళ్ళ చుట్టూ వున్న నల్లటి వలయాలను తొలగించి మీ కళ్ళు తాజాగా, యవ్వనంతో కనిపించేట్టు చేస్తుంది.

7. జుట్టు నెరవడాన్ని అరికడుతుంది :

7. జుట్టు నెరవడాన్ని అరికడుతుంది :

వార్ధక్యాన్ని నిరోధించే గుణాలున్న బ్లూ బెర్రీలు మీ జుట్టు నెరవకుండా కూడా చేయగలవు. అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది మహిళలు తమ కురులు వయసుతో పాటు నెరవడాన్ని నిరోధించేందుకు బ్లూ బెర్రీలతో చేసిన హెయిర్ ప్యాక్ ను ఉపయోగిస్తారు.

8. కేశ వృద్ధికి దోహదం చేస్తుంది :

8. కేశ వృద్ధికి దోహదం చేస్తుంది :

కేశాలకు ప్రయోజనం కలిగించే యాంటి ఆక్సిడెంట్లతో నిండి ఉన్న బ్లూబెర్రీలు కేశ వృద్ధికి మరే ఇతర పండూ దోహదం చేయనంతగా చేస్తుంది. మీ కేశాలకు, తలకు బ్లూ బెర్రీ హెయిర్ మాస్క్ పట్టిస్తే పొడవైన కురులు కలిగి ఉండాలన్న మీ కల నెరవేరుతుంది.

9. మాడు మీద దాని అవశేషాలు నిలవ ఉండకుండా నివారిస్తుంది.

9. మాడు మీద దాని అవశేషాలు నిలవ ఉండకుండా నివారిస్తుంది.

షాంపూలు, కండిషనర్ లు, సీరం, మూస్ లాంటివి ఉపయోగిస్తే వాటి అవశేషాలు మాడు మీద నిల్వ వుండిపోతాయి. ఇది మరింత చికాకు పరిచే ఇతర కేశ సంబంధ సమస్యలను కలిగిస్తుంది. అయితే, బ్లూ బెర్రీల సహాయంతో మాడును పరిశుభ్రంగా ఉంచుకోవడం బాగా సాధ్యం అవుతుంది. ఈ పండులో వుండే విటమిన్లు మీ మాడు నుంచి మలినాలను రూపుమాపి అసౌకర్యమైన కేశ స్థితిని దూరం చేస్తాయి.

10. దట్టమైన కేశాలను కలిగిస్తుంది.

10. దట్టమైన కేశాలను కలిగిస్తుంది.

కేశ సంరక్షణ కోసం బ్లూ బెర్రీలను వినియోగించడం వల్ల కలిగే ప్రయోజనాల్లో ఇది చివరిది. జుట్టు కుదుళ్ళను బలపరిచి వెంట్రుకలు పల్చబడడం లాంటి సమస్యలను కూడా ఇందులోని ప్రత్యేకత నిరోధిస్తుంది. దట్టమైన, ఎగిసే కురుల కోసం ఈ పండుతో మీ కేశాలను సంరక్షించుకోండి.

English summary

From Tightening Pores To Boosting Hair Growth: 10 Reasons To Use Blueberries For Skin And Hair

From tightening pores to boosting hair growth, blueberries have lots to offer for your skin and hair. Moreover, there are various ways in which these indigo-coloured berries can be included in the weekly or monthly beauty routine.
Story first published: Friday, February 2, 2018, 17:30 [IST]