For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తలస్నానం చేసిన తర్వాత ఖచ్చితంగా చేయదగిన మరియు చేయకూడని అంశాల గురించిన వివరాలు మీకోసం.

|

దైనందిక జీవన శైలిలో భాగంగా ముఖంతో పాటు జుట్టుకు అధిక ప్రాధాన్యతని ఇస్తుంటారు. కొందరు జుట్టే తమ స్టేటస్ సింబల్, స్టైలిష్ ఐకాన్ అన్న ఆలోచనలో కూడా ఉంటుంటారు. క్రమంగా కొంచం రాలినట్లు కనిపించినా, ఏమాత్రం అనారోగ్యకర లక్షణాలు ఎదురైనా మానసిక క్షోభకి గురవుతుంటారు. ఒక్కోసారి జుట్టు అనారోగ్య లక్షణాలు, శరీరంలో ఇతర వ్యాధుల ఉనికిని కూడా సూచిస్తూంటాయి. మురికి, కాలుష్యం, మరియు ఇతర మలినాలతో కూడిన హెయిర్ బ్యాండ్ల వాడకం, మరియు రసాయనాల వాడకం జుట్టు మీద తీవ్రప్రభావాన్ని చూపుతుంది అని అందరికీ తెలుసిన విషయమే. కానీ ఎప్పటికప్పుడు తలస్నానం చేయడం, కొన్ని ఉత్తమమైన చర్యలను పాటించడం మూలంగా, జుట్టును ఎప్పటికీ ఆరోగ్యకరంగా ఉంచుకునే వీలుంటుంది.

ముఖ్యంగా మనం తీసుకునే ఆహారప్రణాళిక, జీవన శైలి పూర్తిగా జుట్టు మీద ప్రభావాలను కలిగి ఉంటాయని వేరే చెప్పనవసరం లేదు. కావున, ఆహారంలో, కూరగాయలు, ఆకుపచ్చని ఆకుకూరలు, తృణ ధాన్యాలు వంటి పోషకాలతో కూడిన ఆహారాలను జతచేసుకోవడం మంచిదిగా సూచించబడినది.

కొన్నిరకాల జుట్టు ఉపకరణాలు, మీ జుట్టును ఎంతో అందంగా మలిస్తే, కొన్ని స్టైల్ తో పాటు మీ జుట్టు ఆరోగ్యం మీద, ముఖ్యంగా జుట్టు మూలాల మీద సానుకూల, ప్రతికూల ప్రభావాలను కలిగి ఉంటాయని తెలుసుకోవలసి ఉంటుంది.

ఇంకా చెప్పాలంటే, మీ జుట్టును వారంలో కనీసం 2 నుండి 3 మార్లు కనీసం శుభ్రపరచవలసి ఉంటుంది. దీనితో పాటు, మీ జుట్టు ఆరోగ్యం కోసం సరైన పోషకాలతో కూడిన ఆహార ప్రణాళికను అవలంభించవలసి ఉంటుంది. కొన్నిసార్లు ఇంట్లో తయారు చేసిన హెయిర్ మాస్క్ లేదా క్రమం తప్పనిసరిగా నూనెలను ఉపయోగించడం ద్వారా మీ జుట్టు ఆరోగ్యాన్ని నిలబెట్టుకోవచ్చు. క్రమంగా మీ జుట్టును ఇదివరకులా కాకుండా ఇంకాస్త అందంగా, ఆరోగ్యకరంగా కూడా మలచవచ్చు.

ఏదైనాసరే ఒకటి మాత్రం మనసులో ఉంచుకోండి, కొన్ని స్వయంకృతాలే జుట్టు అనారోగ్యానికి కారకాలుగా ఉన్నాయి. కానీ తలస్నానం చేసిన తర్వాత కూడా, చేయదగిన మరియు చేయకూడని పనులంటూ కొన్ని ఉన్నాయని మీకు తెలుసా? వీటి గురించిన అవగాహన కలిగి ఉండడం ద్వారా, భవిష్యత్తులో జుట్టు సమస్యల నుండి కొంతమేర తప్పించుకునే అవకాశాలు ఉన్నాయి.

చేయదగినవి:

చేయదగినవి:

1. టీ-షర్టు ఉపయోగించి మీ తడిజుట్టును పొడిగా చేయండి :

నిజం, మీరు ఆశ్చర్యానికి లోనవ్వొచ్చు కూడా. ఒక సాధారణ టవల్(తువాలు) కన్నా, టీ-షర్ట్ తడిజుట్టును పొడిగా చేయడంలో చక్కగా పనిచేస్తుంది. టవల్ మీ జుట్టు షాఫ్ట్ను కఠినతరంగా చేస్తుంది మరియు మీ కుదుళ్ళకు గణనీయమైన నష్టాన్ని కలిగిస్తుంది. క్రమంగా మీ జుట్టు బలహీనంగా మారడం, మరియు విరిగిపోయేలా తయారవుతుంది. తద్వారా జుట్టునష్టం సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. కానీ టీ-షర్టును ఉపయోగించడం మూలంగా ఈ సమస్యలు కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు.

చేయదగినవి:

చేయదగినవి:

2. హెయిర్-సీరం (కండిషనర్) ఉపయోగించండి :

మీ జుట్టు రకం ఆధారితంగా కండిషనర్ను ఎన్నుకోండి. ముందుగా మీరు కండిషనర్ గురించిన అవగాహన కలిగిఉండాలి. ఈ కండిషనర్ జుట్టును పొడిబారకుండా చేసి, మీ జుట్టును నునుపుగా మృదువుగా చేయడంలో, మరియు మెరిసేలా ఉంచడంలో సహాయం చేస్తుంది. తలస్నానం తరువాత తడి జుట్టు మీద కండిషనర్ ఉపయోగించడం మంచిది.

Most Read:బాయ్ ఫ్రెండ్ మోజులో పడి నాన్నను చాలా మోసం చేశా, పెళ్లికాకుండానే అన్ని రకాల తప్పులు చేశా #mystory244

చేయదగినవి:

చేయదగినవి:

3. మీ వేళ్లను ఉపయోగించి జుట్టు చిక్కును తీయండి :

అనేకమంది సాధారణంగా చేసే తప్పులలో ఇది కూడా ఒకటి. ప్రజలు తరచుగా చిక్కుబడ్డ జుట్టును తొలగించడానికి దువ్వెన లేదా బ్రష్ను ఉపయోగిస్తారు. మీరు వారిలో ఒకరిగా ఉన్నట్లయితే, వెంటనే ఈ అలవాటును ఆపండి. మీ జుట్టు తడి- పొడి సంబంధం లేకుండా, ఎల్లప్పుడూ మీ వేళ్ళను శాంతముగా చిక్కును తొలగించడానికి వినియోగించండి. క్రమంగా జుట్టు విచ్చిన్నం కాకుండా జాగ్రత్తపడవచ్చు.

ఇవి చేయకండి :

ఇవి చేయకండి :

1. తడి జుట్టు మీద వెంటనే బ్లో-డ్రైయర్ ఉపయోగించకండి :

అనేకమంది, తడి జుట్టును పొడి చేసే క్రమంలో బ్లో- డ్రైయర్ వినియోగించడం చూస్తూనే ఉంటాం. సత్వరంగా జుట్టును పొడిగా చేయడానికి ఉత్తమంగా పని చేస్తుందని భావిస్తుంటారు. కానీ ఇలా చేయడం ఎంతవరకు సబబు? తరచుగా బ్లో-డ్రైయర్ను వినియోగించడం మూలంగా జుట్టు అనారోగ్యానికి గురవడం, జుట్టు రాలడం, జుట్టు నష్టం మొదలైన అనేక సమస్యలు తలెత్తుతాయని వైద్యులు ధృవీకరిస్తున్నారు. బ్లో డ్రైయర్ నుండి ఉత్పన్నమయ్యే వేడి మీ జుట్టును తేమ నుండి దూరం చేసి, పొడిగా చేస్తుంది. కానీ తరచుగా వినియోగించడం మూలంగా, జుట్టు పెళుసుగా మారుతుంది. క్రమంగా అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. బదులుగా పైన చెప్పినట్లు టీ షర్ట్ వాడకం మంచిది అని సూచించబడుతుంది.

Most Read:ఊహకు కూడా అందని ఈ 10 అంశాలు, మీ మలబద్దకానికి ప్రధాన కారణాలు కావొచ్చు

ఇవి చేయకండి :

ఇవి చేయకండి :

2. తడి జుట్టును కలిపి కట్టడం చేస్తున్నారా ? వెంటనే ఆపండి :

తడి జుట్టును కలిపి కట్టడం చేస్తున్నారా? ఇది ఖచ్చితంగా ఆపవలసిన చర్య. జుట్టు మీద ఏ ఇతర ఉపకరణాలను వినియోగించడమైనా కొన్ని ప్రతికూల ఫలితాలను ఇస్తుంది అనడంలో ఎటువంటి ఆశ్చర్యమూ లేదు. ఎందుకంటే, ఉదాహరణకు దువ్వెన, జుట్టు బ్యాండ్లు, సాగే బ్యాండ్లు, U పిన్స్ మొదలైన ఉపకరణాల వాడకం జుట్టు విచ్ఛిన్నానికి దారితీస్తుంది. కావున తడి జుట్టును చిక్కుతీసే క్రమంలో భాగంగా, ఎటువంటి ఉపకరణాల జోలికి వెళ్ళకుండా చేతి వెళ్ళనే ఉపయోగించవలసినదిగా సూచించడమైనది. దువ్వెనలు, బ్రష్షులు కేవలం జుట్టు పొడిగా మారిన తర్వాతనే, అవసరం ఆధారితంగా వినియోగించండి.

ఇవి చేయకండి :

ఇవి చేయకండి :

3. తడిజుట్టుకు హెయిర్ బ్యాండ్స్ & క్లిప్స్ వంటి వాడకం సరికాదు

మీతల్లి, లేదా పెద్దవారు అనేకమార్లు ఈవిషయాన్ని మీకు చెప్పే ఉంటారు. తలస్నానం తర్వాత మీ జుట్టును వెంటనే ముడికట్టకూడదు అని. వారు చెప్పినట్లు మీరు వింటున్నారా? వినని పక్షంలో అదొక సీరియస్ అంశమని నిర్ధారించుకోండి. తడిజుట్టును ముడి వేయడం వలన జుట్టు విచ్ఛిన్నం జరుగుతుంది. మరియు అధికంగా సాగే గుణాలు కలిగిన బ్యాండ్ల వాడకం జుట్టును పెళుసుగా చేయడమే కాకుండా, కుదుళ్ళ మీద కూడా ప్రభావాలను కలిగి ఉంటుంది. క్రమంగా చుండ్రు వంటి పరిస్థితులతో పాటు, జుట్టునష్టం సమస్యలను కూడా ఎదుర్కొనవలసి ఉంటుంది.

Most Read: నా భార్య నాతో సెక్స్ చేయించుకోనని తెగేసి చెబుతోంది, ఏం చెయ్యమంటారు?

కావున, ఎల్లప్పుడూ తడిగా ఉన్నా , పొడిగా ఉన్నా మీ జుట్టు చిక్కును తీసే క్రమంలో చేతి వేళ్ళను మాత్రమే వినియోగించండి. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఇతర ఉపకరణాలను వినియోగిస్తున్నారని నిర్ధారించుకోండి. తలస్నానం చేశాక జుట్టుకు తగిన కండిషనర్ల వాడకం, ఆహారప్రణాళికలలో, జీవనశైలిలో ఆరోగ్యకర మార్పులు, ఆరోగ్యకర కందెనల వాడకం మొదలైనవి మీ జుట్టు ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తాయి.

English summary

Dos and Don'ts To Remember After A Refreshing Hair Wash

You hair needs some nourishment too, along with hair wash. At times, using a home-made hair mask or a hair oil can really prove to be beneficial for your hair - making or stronger than before. And, as you all know, whether you apply a hair mask or massage with hot oil, one thing that is inevitable is a refreshing hair wash in the end.
Story first published: Tuesday, September 25, 2018, 13:30 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more