Latest Updates
-
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.!
బీరుతో మీ జుత్తును త్వరగా పెరగనివ్వండి/ బీరు వలన జుట్టుకు కలిగే ప్రయోజనాలు
మీకు తెలుసా బీర్ తో మీ జుట్టుకు ఎన్నో అద్భుతాలు చేయొచ్చని? ఆశ్చర్యపోతున్నారా? అవును, మీరు విన్నది నిజమే! మనలో చాలామంది ఆరోగ్యకరమైన జుట్టు కొరకు చిట్కాలను వెతుకుతుంటారు. రకరకాల మందులు, షాంపూలు, రసాయన చికిత్సలు, క్రీములు మరియు ఇతర ఉత్పత్తులను జుట్టు ఎదుగుదలకు వాడుతుంటారు.
జుట్టు ఎంత తొందరగా పెరుగుతుంది అనేది మన అందరికీ సాధారణంగా ఉండే సందేహం? దీనికి సరైన సమాధానం ఇక్కడ ఉంది. అదే బీర్!
మత్తుపానీయంగా మాత్రమే కాకుండా బీరును జుట్టు పోషణకై రకరకాలుగా వాడవచ్చు. బీరులో దెబ్బతిన్న జుట్టును బాగుచేసి దాని నిర్మాణాన్ని పునరుద్ధరించడానికి అవసరమైన ప్రొటీన్లు ఉంటాయి. బీరులో ఉండే విటమిన్ B జుట్టు పొడవు ఎదగడానికి తోడ్పడితే,అందులో ఉండే మాల్టోస్ జుట్టును బలంగా చేస్తుంది.
బీరులో అతి ముఖ్యమైన విటమిన్ బయోటిన్ ఉంటుంది. ఇది జుట్టును ఆరోగ్యవంతంగా ఎదగనిస్తుంది.అంతే కాకుండా బయోటిన్ చుండ్రును నివారించి జుట్టు రాలటాన్ని అరికడుతుంది.
ఇప్పుడు మనం ఇంట్లోనే కురుల సమస్యలను బీరుతో ఎలా పరిష్కరించుకోవచ్చో తెలుసుకుందాం.

1. బీరు మరియు గుడ్డు:
కావలసిన పదార్థాలు:
అర కప్పు బీరు
ఒక గుడ్డు
ఒక టీ స్పూన్ అవకాడో ఆయిల్
తయారీ విధానం: ఒక గిన్నెలో బీరును, గుడ్డును బాగా కలపండి. తరువాత దీనిలో అవకాడో ఆయిల్ వేసి మళ్ళా బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు బాగా పట్టించి కుదుళ్లనుండి చివర్ల వరకు బాగా మర్దన చేయండి. తరువాత జుట్టును షవర్ క్యాప్ తో కప్పి అరగంట వదిలేయండి. అరగంట తర్వాత షాంపూ మరియు కండీషనర్ తో కడిగేయండి. ఇలా వారానికి ఒకసారి చేయండి.

2. బీరు మరియు తేనె:
కావలసిన పదార్థాలు:
అర కప్పు బీరు
ఒక టీ స్పూన్ తేనె
ఒక గుడ్డు పచ్చ సొన
ఒక అరటిపండు
తయారీ విధానం: పై పదార్థాలను అన్నిటిని కలిపింది చిక్కని పేస్ట్ గా చేయండి. ఇప్పుడు జుట్టును పాయలుగా విడదీసి కుదుళ్లనుండి చివర్ల వరకు బాగా పట్టించండి. తరువాత ఒక షవర్ క్యాప్ తో జుట్టును మూసేసి రెండు గంటలు వదిలేయండి. తర్వాత షాంపూ మరియు కండీషనర్ తో కడిగేయండి. ఇలా వారానికి ఒకసారి చేయండి.

3. యాపిల్ సిడర్ వెనిగర్:
కావలసిన పదార్థాలు:
పావుకప్పు యాపిల్ సిడర్ వెనిగర్
ఒక కప్పు బీరు
తయారీ విధానం: బీరును మూట తేదీ రాత్రంతా అలా వదిలేయండి. దానిలో నురగంతా పోయాక పావుకప్పు యాపిల్ సిడర్ వెనిగర్ వేసి కలపండి. ముందుగా జుట్టును షాంపూ మరియు కండీషనర్ తో కడిగేయండి.
తరువాత తయారు చేసిన మిశ్రమాన్ని జట్టుపై పోసి బాగా రుద్ది పదిహేను నిమిషాల పాటు వదిలేయండి. తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి.

4. బీరు షాంపూ:
కావలసిన పదార్థాలు:
ఒకటిన్నర కప్పు బీరు
ఒక కప్పు షాంపూ
తయారీ విధానం: బీరును ఒక కుండలో పావుగంట మరగనిచ్చి గాడి ఉష్ణోగ్రతకు చల్లారనివ్వండి. దీనికి ఒక కప్పు షాంపు కలపండి. దీనిని మీరు ఎప్పుడు వాడే షాంపూకి బదులుగా వాడండి. తర్వాత జుట్టును చల్లని నీటితో కడగండి. దీనిని మీ జుట్టు శుభ్రపరచడం కొరకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడవచ్చు.



Click it and Unblock the Notifications
