For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జిమ్ మరియు వ్యాయామానికి సూచించే హెయిర్ స్టైల్స్

మీరు జిమ్ కి వెళ్తున్నప్పుడు, సరియైన దుస్తులు,హెయిర్ స్టైల్ సౌకర్యంగా ఉండటం ముఖ్యం. ఇది ఎందుకంటే దుస్తులు, హెయిర్ స్టైల్ వ్యాయామంలో మీ విజయాన్ని నిర్ణయిస్తాయి. మీరు అసౌకర్యంగా ఉన్న దుస్తులు, డిస్ట్రబ్

|

మీరు జిమ్ కి వెళ్తున్నప్పుడు, సరియైన దుస్తులు,హెయిర్ స్టైల్ సౌకర్యంగా ఉండటం ముఖ్యం. ఇది ఎందుకంటే దుస్తులు, హెయిర్ స్టైల్ వ్యాయామంలో మీ విజయాన్ని నిర్ణయిస్తాయి. మీరు అసౌకర్యంగా ఉన్న దుస్తులు, డిస్ట్రబ్ చేసే హెయిర్ స్టైల్ తో జిమ్ కి వెళ్తే, అది మీ వ్యాయామాన్ని తప్పక ప్రభావితం చేస్తుంది.

జిమ్ కి సరిగ్గా రెడీ అవ్వకపోతే మీరు జిమ్ లో విచిత్రంగా కూడా కన్పిస్తారు. నిజానికి జిమ్ లో మొదటిరోజు లేదా ప్రొఫెషనల్ వ్యాయామం మొదలు పెట్టేముందు తప్పక మీ దుస్తులు, హెయిర్ స్టైల్ పై ధ్యానం పెట్టండి.

hairstyles for gym

వీటి ఆధారంగా, ఈరోజు మేము మీరు జిమ్ కి ప్రయత్నించదగ్గే ఐదు మేటి హెయిర్ స్టైల్స్ ఇక్కడ పొందుపర్చాం. ఇక్కడ లిస్టులో ఇచ్చిన హెయిర్ స్టైల్స్ వ్యాయామానికి సౌకర్యంగా ఉండే మరియు అవసరానికి తగ్గట్టుగా ఉంటాయి.

అందుకని, మీకు నచ్చిన జిమ్ హెయిర్ స్టైల్ ఎంచుకుని వ్యాయామం అనుభూతిని పూర్తిగా పొందండి.

పైకి కట్టిన పోనీటెయిల్

పైకి కట్టిన పోనీటెయిల్

జిమ్ లో సాధారణమైన హెయిర్ స్టైల్, పైకి దువ్విన పోనీటెయిల్ ఒక వేగంగా అయిపోయే ఒక స్టైల్. ఇలా చేస్తూ, రబ్బర్ బ్యాండ్ సరిగ్గా గట్టిగా వేయండి. ఇంకా, వ్యాయామం చేసేటప్పుడు, మీకు బాగా చెమటలు పట్టినప్పుడు, పోనీటెయిల్ వేసినప్పుడు చెమట మీ జుట్టు కుదుళ్ళకి కూడా పట్టి, అక్కడే పేరుకుపోతుంది.

పిక్సీ

పిక్సీ

తక్కువ జుట్టు ఉన్నవారు ఎప్పుడూ జిమ్ లేదా వ్యాయామానికి సంబంధించి పిక్సీ హెయిర్ కట్ నే ఎంచుకోవచ్చు. క్లిప్పులు మరియు క్లచెస్ సాయంతో జుట్టును పిక్సీ స్టైల్ లో తక్కువ పొడవుగా అలంకరించవచ్చు. మీకు పిక్సీ హెయిర్ కట్ ఉంటే అది ఇంకా మంచిది. మీ తలపై పిక్సీ ఉండటం వలన తల, చేతులు మరియు భుజాల కదలికలు సులభంగా, అనుకూలంగా మారతాయి.

విరబోసిన జుట్టు

విరబోసిన జుట్టు

ఇది అంత సౌకర్యంగా అన్పించకపోవచ్చు కానీ, కొందరు స్త్రీలకి జిమ్ లో జుట్టును అలా వదిలేయటమే ఇష్టపడతారు. జిమ్ సమయంలో మీరు జుట్టును విరబోసినట్లు వదిలేయాలనుకుంటే, దాన్ని సరిగ్గా దువ్వి ఒకచోట ఉండనివ్వండి. మీరు వ్యాయామం చేసేటప్పుడు ముఖంపై పడి మీ ఏకాగ్రత చెదరకూడదు.

హెయిర్ బ్యాండ్

హెయిర్ బ్యాండ్

వ్యాయామం చేసేటప్పుడు లేదా జిమ్ లో జుట్టు వదిలేయటం ఇష్టపడేవారికి - హెయిర్ బ్యాండ్ వాడితే ఎలా ఉంటుంది? హెయిర్ బ్యాండ్ జుట్టును ఒకచోట నిలిపి ఉంచి మీ వ్యాయామాన్ని సులభతరం చేస్తుంది. మీ హెయిర్ బ్యాండ్ రంగును మీకు నచ్చినట్టు ఎంచుకోవచ్చు కానీ జిమ్ కి మాత్రం కాటన్ దే ఎంచుకోండి.

ఫ్రింజ్డ్ హెయిర్ స్టైడ్

ఫ్రింజ్డ్ హెయిర్ స్టైడ్

జుట్టుకి ఫ్రింజెస్ ఉన్నవారు జిమ్ లేదా వ్యాయామం చేసినప్పుడు వాటిని ప్రదర్శించుకోవచ్చు. మీ ఫ్రింజ్ ముందువైపుకు ఉంటే,మీరు వెనకవైపు పోనీటైల్, బన్ను లేదా జడ వేసుకోవచ్చు. మీ వ్యాయామానికి మీ జుట్టు ఫ్రింజ్ అడ్డమొస్తోంటే ఒక క్లిప్ పెట్టేయండి.

English summary

Hairstyles For Gym | Gym Hairstyles | Hairstyles For Workout | Workout Hairstyles

Maintaining a proper hair and dress is important, especially when hitting the gym or planning a workout. Wrong clothing or hairstyle can make you feel uncomfortable and spoil the entire sport plan. Here are hairstyles that you can count on for the gym or your next workout session.
Story first published:Monday, January 15, 2018, 12:53 [IST]
Desktop Bottom Promotion