మన జుట్టుకి సరైన పోషణనిచ్చే మార్గాలేంటి? నూనె.

Written By: DEEPTHI T A S
Subscribe to Boldsky

మన జుట్టును లోపల నుంచి ధృఢపర్చి, అస్సలు ఏ సమస్య లేకుండా చేసే మంచి నూనెలు ఏమిటి? ఆముదం ఇంకా ఉసిరి నూనెల మిశ్రమాన్ని మించినదైతే ఈ విషయంలో ఇంకేదీ లేదు.

విడివిడిగా ఆముదం నూనె ( ఆముదం విత్తనాల నుండి తీసినది) జుట్టు పెరగటానికి ఉపయోగపడుతుంది, దానిలో ఉండే బ్యాక్టీరియా, ఫంగల్ వ్యతిరేక లక్షణాలు అన్ని రకాల వెంట్రుకల కుదుళ్ళలో కణజాలాల వాపు, చుండ్రు ఇంకా కుదుళ్ల ఇన్ఫెక్షన్లను తొలగిస్తాయి, కుదుళ్ల దగ్గర రక్తప్రసరణ సరిగ్గా ఉండేలా సాయపడి జుట్టు మృదువుగా, పొడవుగా ఇంకా అందంగా ఉండేలా చేస్తుంది.

ఉసిరి లేదా ఆమ్లా నూనె లాభాలు కూడా దాదాపు ఆముదం నూనె లాభాలలాగానే ఉంటాయి. అది కూడా జుట్టు మళ్ళీ మొలవడానికి, జుట్టు మందం పెరగటానికి ఉపయోగపడుతుంది. ఉసిరి యాంటీఆక్సిడెంట్ కూడా అవటంతో కుదుళ్లను గట్టిగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. క్రమం తప్పకుండా ఉసిరినూనెను వాడటం వలన వెంట్రుకలు విరిగిపోవటం, చివర్లన ముక్కలవటం తగ్గిపోతుంది.

పైన చెప్పినట్లు, ఆముదం ఇంకా ఉసిరి నూనెలు జుట్టుకి అద్భుతంగా పనిచేస్తాయి. కానీ వాటిని కలిపినప్పుడు ఆ ఫలితాలు అంతే అద్భుతంగా ఉంటాయా లేదా విడివిడిగానే ఎక్కువ ప్రభావం చూపిస్తాయా?

How beneficial is a fusion of Amla and Castor Oil

మనం ఇప్పుడు ఉసిరి నూనె, ఆముదం నూనెలకి చెందిన కొన్ని నిజాలను తెలుసుకుందాం, అసలు ఒకే రకం ఫలితాలనిచ్చే ఈ రెండిటినీ ఎందుకు కలపాలి,కదా?

ఆముదం నూనెలో విటమిన్ ఇ, ప్రొటీన్లు,ఖనిజలవణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇందులో మంచి కొవ్వులు –ఒమేగా 6,9 కూడా ఉంటాయి. ఇవేకాక, పైన చెప్పినట్లు, ఫంగల్, బ్యాక్టీరియా వ్యతిరేక లక్షణాలు ఉంటాయి.ఆముదం నూనెలో 'రికినోలెయిక్ యాసిడ్’ ఎక్కువగా ఉంటుంది, ఇది జుట్టు కుదురు దగ్గర పిహెచ్ బ్యాలెన్స్ ను నిలిపి వుంచుతుంది, ఇంకా కొన్ని సహజ నూనెలతో తిరిగి వెంట్రుకలకి జీవం వచ్చేలా చేసి, కాలుష్యం నుంచి, రసాయనాల నుంచి పాడైన జుట్టు,మాడును బాగుచేస్తుంది.

ఉసిరి లేదా ఆమ్లాలో చాలా ఎక్కువ స్థాయిలో టాన్నిన్స్ ఇంకా విటమిన్ సి పుష్కలంగా ఉండి, దీన్ని మేటి యాంటీఆక్సిడెంట్లలో ఒకటిగా పరిగణిస్తారు (బరువు తగ్గడంలో కూడా ఇది సాయపడుతుంది). ఇందులో ఫ్లేవనాయిడ్లు, కెయింప్ఫెరోల్, గాలిక్ యాసిడ్ కూడా ఉండి జుట్టు ఆకారాన్ని మెరుగుపర్చేలా ప్రభావం చూపిస్తాయి. ఆముదం నూనెలాగానే, ఉసిరి నూనె కూడా జుట్టు కుదుళ్ల దగ్గర పిహెచ్ బ్యాలెన్స్ నిలిపి, రక్తప్రసరణ మెరుగుపడేలా చేస్తుంది.

How beneficial is a fusion of Amla and Castor Oil

అయితే మరి ఈ మిశ్రమం ఇంకా లాభాన్నిస్తుందా?

ఉసిరికి, ఆముదం నూనెకి ఉన్న ముఖ్య తేడాలలో ఒకటి ఉసిరిలో విటమిన్ సి ఉంటే, ఆముదం నూనెలో విటమిన్ ఇ ఉంటుంది.

ఈ రెండూ మరి కలిసి పనిచేస్తాయా? అవును!

ఈ రెండు విటమిన్ల పనితీరు లక్షణాలు వేరుగా ఉన్నా, రెండు విటమిన్లు కలిపినప్పుడు అద్భుతంగా పనిచేస్తాయి.ఉదాహరణకి, రెండూ యాంటీఆక్సిడెంట్లులాగా కలిసి చక్కగా పనిచేస్తాయి.

ప్రతిచర్య జరిపే రసాయనాలు అయిన ఫ్రీ రాడికల్స్ చేసిన నష్టాన్ని యాంటీఆక్సిడెంట్లు తగ్గించి కణాలను బాగుచేస్తాయి. ఈ ఫ్రీ రాడికల్స్ ఇలా వదిలేస్తే జన్యుపరంగా మ్యుటేషన్ వరకూ వెళ్ళి, కణాలు చనిపోయేలా చేస్తాయి. విటమిన్ ఇ యాంటీఆక్సిడెంట్ గా పనిచేసి, ఫ్రీ రాడికల్స్ ను నాశనం చేసేస్తుంది కానీ సరిగ్గా పనిచేయటానికి తిరిగి మళ్ళీ జుట్టుకి ఇది అవసరమవుతుంది. విటమిన్ సి, విటమిన్ ఇ కి ఏజెంటుగా పనిచేసి మరలా విటమిన్ ఇ లో యాంటీఆక్సిడెంట్ స్వభావాన్ని నింపుతుంది. అలా ఫ్రీ రాడికల్స్ ను నాశనం చేసేసాక విటమిన్ ఇ తిరిగి యాంటీ ఆక్సిడెంట్లతో సరికొత్తగా పని మొదలుపెడుతుంది.

How beneficial is a fusion of Amla and Castor Oil

ఈ రెండు విటమిన్లు కలిసి ఎంత బాగా పనిచేస్తాయో చెప్పటానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే, అందుకనే ఈ రెండింటి మిశ్రమం జుట్టుకి చాలా బాగా పనిచేసి, కుదుళ్ళు ఆరోగ్యంగా పెరగటానికి, జుట్టు మందంగా,నల్లగా మారటానికి సహజ కండీషనర్ లాగా పనిచేస్తుంది.

బ్యాక్టీరియా, ఫంగల్ వ్యతిరేక లక్షణాలుండి జుట్టు కుదుళ్ళ దగ్గర ఫంగల్ ఇన్ఫెక్షన్లు తొలగించి జుట్టును బలపరుస్తుంది. ఇంకా తేమను అందించి పోషణనిచ్చి దాదాపు అన్ని జుట్టు ఎండిపోయే సమస్యలను, జుట్టు ఊడిపోవటాన్ని తగ్గిస్తుంది. తల మాడుపై వేడి లేదా పొడిబారటం వలన వచ్చే ఏ కురుపులు, పొక్కులనైనా తగ్గించి ఉపశమనాన్ని ఇస్తుంది. ఈ మిశ్రమాన్ని వారానికి రెండుసార్లు వాడితే మంచిది.

దీనిలో నష్టం ఏమిటి? ఇది కొంచెం జిడ్డుగా ఉండొచ్చు, కానీ ఇన్ని లాభాలు కలుగుతున్నప్పుడు అది ఒక సమస్య కాదుకదా?

అందుకే దానికి కూడా ఒక సలహా ; మీరు వాడే అన్ని రకాల నూనెలు మంచివే, జుట్టుకి పోషణనిచ్చేవే. కానీ ఆముదం, ఉసిరి నూనెలు తక్కువగా మార్కెట్లో దొరుకుతాయి కానీ చాలా ప్రభావం చూపిస్తాయి.

అవి వేర్వేరుగానే అన్ని లాభాలని ఇస్తున్నప్పుడు, కలపటం వల్ల ఎంత మంచి ప్రభావం ఉంటుందో ఆలోచించండి. అయితే మీ శరీర అందంలాగానే మీ జుట్టును కూడా బలంగా, ఆరోగ్యంగా మార్చుకోవాలనుకుంటున్నారా? అలా అయితే, ఇది మాత్రం దానికి చక్కటి పరిష్కారం!

English summary

How beneficial is a fusion of Amla and Castor Oil

If you want healthy hair, it is very important to apply oil to your hair. It provides the required nutrition and keeps your body cool. Mixing of castor oil and amla oil is one such combination that can do wonders for your hair. Castor oil is rich in vitamin E, proteins and minerals. Amla oil is rich in vitamin C.
Story first published: Wednesday, March 28, 2018, 7:00 [IST]