Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
హెయిర్ ఫాల్ సమస్య నుంచి ఉపశమనానికి అద్భుతమైన తోడ్పడే స్వీట్ పొటాటో హెయిర్ మాస్క్
హెయిర్ ఫాల్ సమస్య నుంచి ఉపశమనానికి అద్భుతమైన తోడ్పడే స్వీట్ పొటాటో హెయిర్ మాస్క్
హెయిర్ ఫాల్ సమస్య మిమ్మల్ని వేధిస్తోందా? జుట్టును దువ్వుకునేటప్పుడు హెయిర్ ఫాల్ చింత మిమ్మల్ని టెన్షన్ కి గురిచేస్తోందా? కుచ్చులుగా జుట్టు రాలుతోందా? దీంతో తలదువ్వడమనేది ఒక సమస్యగా మారిందా? ఇక మీరు ఎటువంటి చింతకు గురికావాల్సిన అవసరం లేదు. ఈ సమస్య సాధారణంగా అందరికీ ఎదురయ్యే సమస్యే? వంటింట్లో అందుబాటులో ఉండే కొన్ని పదార్థాలతో ఇంట్లోనే చక్కని హెయిర్ మాస్క్ ను తయారుచేసుకోవడం ద్వారా హెయిర్ ఫాల్ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.
అంతేకాక, ఈ హోమ్ రెమెడీస్ కి మీరు ఎక్కువగా ఖర్చు చేయనవసరం లేదు. మీ జేబుకు చిల్లు పడదు. ఇంకా, ఈ హోమ్ రెమెడీస్ వలన మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ సమస్య కూడా తలెత్తదు. వీటిలో ఎటువంటి కెమికల్స్ ఉండకపోవడం వలన ఈ రెమెడీస్ ను పాటించడం సురక్షితం.

హెయిర్ ఫాల్ ని అరికట్టే నేచురల్ రెమెడీస్ గురించి మాట్లాడుకునేటప్పుడు స్వీట్ పొటాటో గురించి ఖచ్చితంగా ప్రస్తావించుకుని తీరాలి. స్వీట్ పొటాటో అనేది ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీని ద్వారా లభించే పోషకాలు అనేక ఆరోగ్యప్రయోజనాలను కలిగి ఉంటాయి. దీని అద్భుతమైన రుచి వలన భోజనప్రియులకు స్వీట్ పొటాటోపై ప్రత్యేక ఆకర్షణ ఉండటం సహజం. ఐతే, ఈ స్వీట్ పొటాటోని హెయిర్ మరియు స్కిన్ కేర్ కు కూడా వినియోగించవచ్చన్న విషయం చాలా మందికి తెలియదు.
మరి ఈ స్వీట్ పొటాటోస్ ని ఏ విధంగా హెయిర్ కేర్ కి వాడుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
హెయిర్ కేర్ కి స్వీట్ పొటాటో తోడ్పడుతుందా?
విటమిన్ ఏ పుష్కలంగా లభించడం వలన స్కాల్ప్ హెల్త్ ను మెరుగుపరచడంతో పాటు రూట్స్ ని బలపరిచి హెయిర్ కి చక్కటి ఫౌండేషన్ ను తయారుచేయడానికి స్వీట్ పొటాటోస్ తోడ్పడతాయి. హెయిర్ ను దృఢంగా, ఆరోగ్యంగా మరియు నిగనిగలాడేలా మార్చేందుకు కూడా తోడ్పడతాయి. స్వీట్ పొటాటోస్ అనేవి నేచురల్ మాయిశ్చరైజర్ గా వ్యవహరిస్తూ హెయిర్ గ్రోత్ ను పెంపొందిస్తాయి. తద్వారా, హెయిర్ ఫాల్ మరియు బ్రేకేజ్ ను అరికడతాయి.
అంతేనా? స్వీట్ పొటాటోస్ లో ఒమేగా-3 ఫ్యాట్ ఏసిడ్స్ కలవు. ఇవి శిరోజాలకు మెరుపును జోడిస్తాయి. శిరోజాలను ఆకర్షవంతంగా మారుస్తాయి. స్వీట్ పొటాటోస్ లోని సుగుణాలను హెయిర్ కేర్ కు వినియోగించుకునేందుకు మీరు ఇంటివద్దనే చక్కటి హోమ్ మేడ్ హెయిర్ మాస్క్ ను తయారుచేసుకోవచ్చు. నెలకు రెండు సార్లు ఈ స్వీట్ పొటాటో హెయిర్ మాస్క్ ను ఉపయోగించడం ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు.
ఇంటివద్దే స్వీట్ పొటాటో హెయిర్ మాస్క్ ను తయారుచేయడమెలా?
కావలసిన పదార్థాలు
1. స్వీట్ పొటాటో
2 టేబుల్ స్పూన్ల యోగర్ట్ (పెరుగు)
1 టేబుల్ స్పూన్ తేనె
1 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్
తయారుచేసే విధానం:
స్వీట్ పొటాటో ను చిన్న చిన్న ముక్కలుగా తరుగుకోవాలి. వాటిని మ్యాష్ చేసి మెత్తటి పేస్ట్ ను తయారుచేసుకుని పక్కన ఉంచుకోవాలి.
ఒక చిన్న బౌల్ లో కొంత యోగర్ట్ మరియు తేనెను జోడించి ఈ పదార్థాలను బాగా కలుపుకోవాలి.
చివరగా, మ్యాష్ చేయబడ్డ స్వీట్ పొటాటోని అలాగే ఆలివ్ మరియు కోకోనట్ ఆయిల్ ను ఈ మిశ్రమానికి వేసి ఈ పదార్థాలన్నిటినీ బాగా కలుపుకోవాలి.
ఈ హెయిర్ ప్యాక్ ను ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు.
ఎలా అప్లై చేసుకోవాలి?
తడి చేసుకున్న హెయిర్ ను చిన్న చిన్న సెక్షన్స్ గా విడదీసుకోవాలి.
ఒక్కొక్క సెక్షన్ కు హెయిర్ బ్రష్ సహాయంతో ఈ ప్యాక్ ను అప్లై చేసుకోవాలి.
హెయిర్ మొత్తానికి అంటే రూట్స్ నుంచి టిప్స్ వరకు ఈ ప్యాక్ ను అప్లై చేసుకోవాలి.
షవర్ క్యాప్ ను ధరించండి. ఈ ప్యాక్ లోని సుగుణాలు హెయిర్ కు చేరేవరకు అంటే ఒక అరగంట వరకు ఈ ప్యాక్ ను అలాగే ఉండనివ్వండి.
ఈ ప్యాక్ ను నెలలో రెండు సార్లు వాడితే ఆశించిన ఫలితాలు లభిస్తాయి.
చూశారుగా...ఈ ప్యాక్ ను ఇంత సింపుల్ గా తయారుచేసుకోవచ్చు. ఈ హెయిర్ ప్యాక్ ను అప్లై చేసుకోవడం ద్వారా హెయిర్ అనేది దృఢంగా, ఆరోగ్యంగా అలాగే నిగనిగలాడుతూ ఉంటుంది. హెయిర్ ఫాల్ గురించి మీరింక చింతించనవసరం లేదు. స్వీట్ పొటాటోస్ హెయిర్ ఫాల్ సమస్యను తొలగించేస్తాయి. హెయిర్ బ్రేకేజ్ అలాగే డ్యామేజ్ సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.



Click it and Unblock the Notifications