For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శిరోజాలు దెబ్బతినకుండా హెయిర్ ను బ్లీచ్ చేసుకోవడమెలా?

|

మార్కెట్ లో ఈ మధ్యకాలంలో అనేక కలర్స్ అందుబాటులోకి వస్తున్నాయి. మీరు ఏ కలర్ గురించి అడిగినా ఆ కలర్ మీకు అందుబాటులోకి వస్తుంది. రైన్ బో కలర్స్, యాష్ గ్రే, డార్క్ గ్రే, యంబర్, తేనే, బ్లాండ్, పర్పుల్, పింక్, డార్క్ బ్రౌన్ వంటి కలర్స్ అనేకం లభ్యమవుతున్నాయి. మీ హెయిర్ కు కలరింగ్ టచ్ ఇవ్వాలని మీరనుకుంటున్నారా? అయితే, ప్రస్తుతం మీ హెయిర్ డీప్ డార్క్ షేడ్ లో ఉందా? అయితే, కేవలం కలరింగ్ మాత్రం ఉపయోగకరంగా ఉండదు. మీరు హెయిర్ ను బ్లీచ్ చేయవలసి వస్తుంది.

ఇదివరకు, హెయిర్ ని బ్లీచ్ చేసేటప్పుడు ఆరెంజ్ స్ట్రీక్, స్కాల్ప్ పై మంట అలాగే హెయిర్ ఫాల్ ఎక్కువవడం వంటి సమస్యలు సాధారణంగా ఎదురయ్యేవి. అయితే, ఇప్పటికి కూడా బ్లీచింగ్ ను మీరు పాటించకపోతే ఈ సమస్య మరింత జఠిలమవుతుంది.

ఇప్పుడు, ఈ బ్లీచింగ్ అంటే ఏంటి మరియు కలర్ చేసే ముందు హెయిర్ ను ఎందుకు బ్లీచ్ చేసుకోవాలి అన్న విషయాన్ని అర్థం చేసుకోండి. హెయిర్ పై కలర్ అనేది కనపడాలంటే మీ సహజ హెయిర్ కలర్ ను కాస్తంత లైటెన్ చేసుకోవడం ముఖ్యం. ఇందుకోసం మీరు హైడ్రోజెన్ పెరాక్సయిడ్ ని గాని లేదా బ్లీచ్ ని గాని వాడవలసి వస్తుంది.

హైడ్రోజెన్ పెరాక్సయిడ్ అనేది వెంట్రుకలను పూర్వరూపంలోకి మార్చటానికి వీలులేని కెమికల్ రియాక్షన్ ను కలిగిస్తుంది. అంటే, మీ హెయిర్ కలర్ ఎంత డీప్ గా ఉంటే అంత ఎక్కువ పిగ్మెంట్ ను తొలగించడం ద్వారా ఆశించిన కలర్ అందుతుంది. ఈ ప్రాసెస్ హెయిర్ ను డ్రై గా అలాగే రఫ్ గా మారుస్తుంది.

అయితే, ఈ రోజు హెయిర్ కు డేమేజ్ తలెత్తకుండా బ్లీచింగ్ ని ఏ విధంగా పాటించాలో కొన్ని టిప్స్ ను అందిస్తున్నాము. వీటిని పరిశీలించండి మరి.

1. బ్లీచ్ కు ముందు కండిషనర్ ను అప్లై చేయండి:

1. బ్లీచ్ కు ముందు కండిషనర్ ను అప్లై చేయండి:

బ్లీచింగ్ ప్రాసెస్ వలన హెయిర్ లోంచి మాయిశ్చర్ తొలగిపోతుంది. అందువలన, హెయిర్ పొడిగా అలాగే రఫ్ గా మారుతుంది. ఈ సమస్యను అవాయిడ్ చేయడం కోసం కండిషనర్ ను అప్లై చేసుకుని రెండు గంటల పాటు హెయిర్ పై కండిషనర్ ను అలాగే ఉండనివ్వాలి. కండిషనర్ అనేది శిరోజాల మొదళ్ళలో మాయిశ్చర్ ను నిలిపి ఉంచేందుకు తోడ్పడుతుంది. తద్వారా,హెయిర్ అనేది పొడిబారటం తగ్గుతుంది. ఈ ప్రాసెస్ ని వారానికి రెండు సార్లు పాటించండి. లేదంటే, హెయిర్ బ్రేకేజ్ సమస్య తలెత్తవచ్చు.

మంచి బ్రాండ్ కి చెందిన హెయిర్ ప్రోడక్ట్స్ ని ఎంచుకోండి. చీప్ ప్రోడక్ట్స్ ను అవాయిడ్ చేయండి. మంచి నాణ్యత కలిగిన ప్రోడక్ట్ అనేది హెయిర్ ను డేమేజ్ నుంచి రక్షిస్తుంది. ప్రోటీన్ లేదా కేరాటిన్ బేస్డ్ కండిషనర్ ను ఎంచుకోండి.

2. సరైన బ్లీచ్ ను ఎంచుకోండి:

2. సరైన బ్లీచ్ ను ఎంచుకోండి:

అనేక లక్షల హెయిర్ ప్రోడక్ట్స్ మంచి ఫలితాలను అందిస్తాయని ప్రకటనలలో వెల్లడిస్తాయి. అయితే, అసలు విషయానికి వస్తే సరైన ఫలితం అందేది కేవలం కొన్ని ప్రోడక్ట్స్ ద్వారానే. కాబట్టి, మంచి ప్రోడక్ట్ ను ఎంచుకోవడం ముఖ్యం. హై క్వాలిటీ, తక్కువ డేమేజింగ్ బ్లీచెస్ కొంత ఎక్స్పెన్సివ్ గా ఉండటం సహజం. కానీ, ఇవి హెయిర్ ను దృఢంగా అలాగే ఆరోగ్యంగా మార్చడానికి తోడ్పడతాయి.

హెయిర్ బ్రేకేజ్, డ్రైనెస్, ఫ్రిజ్జీ హెయిర్, ఫ్లై అవేస్ వంటి సమస్యల నిర్మూలనకు కూడా ఉపయోగపడే ఆ ప్రోడక్ట్స్ ఖరీదు కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. సరైన బ్లీచ్ ను ఎంచుకోవడానికి దాని వాల్యూమ్ ని మీరు పరిగణలోకి తీసుకోవాలి. ఆ సంఖ్య 10 నుండి 40 ల మధ్యన లభ్యమవుతుంది. సంఖ్య ఎక్కువగా ఉంటే బ్లీచ్ అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. మీ హెయిర్ పలచగా ఉంటే తక్కువ నంబర్ కలిగిన బ్లీచ్ ను ఎంచుకోండి.

3. మంచి కలరిస్టు ను హైర్ చేసుకోండి:

3. మంచి కలరిస్టు ను హైర్ చేసుకోండి:

బ్లీచింగ్ ఇది మొదటిసారి అయితే, మీరు కలరిస్ట్ సేవలను పొందండి. బంధుమిత్రులకు తెలిసిన వారిని లేదా సెలూన్ కు కాల్ చేసి కలరిస్ట్ గురించి ఆరా తీయండి. హెయిర్ కలరిస్టు కొంచెం ఎక్కువగానే ఛార్జ్ చేస్తారు. కానీ, వారి సేవలు మెరుగైన ఫలితాల్ని ఇస్తాయి. సరైన అవగాహన లేకుండా బ్లీచ్ చేసుకుంటే హెయిర్ డేమేజ్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి, హెయిర్ కలరిస్టు సేవలను పొందండి.

4. డీప్ కండిషనింగ్ మాస్క్:

4. డీప్ కండిషనింగ్ మాస్క్:

మీ హెయిర్ డార్క్, కర్లీ మరియు కోర్సీగా ఉంటే మీకు అంతకంటే ఎక్కువ కండిషనింగ్ అవసరం. హెయిర్ ను బ్లీచ్ తర్వాత కండిషనింగ్ పై అమితమైన శ్రద్ధను కనబరచాలి. డ్రై హెయిర్ పై డీప్ కండిషనింగ్ మాస్క్ ను ప్రతి రోజూ రాత్రి అప్లై చేసుకోండి. ఈ పద్దతిని వారం పాటు పాటించండి. అలాగే, వీక్లీ బాండ్ రిపెయిర్ ట్రీట్మెంట్ ను వాడండి.

అరచేతుల్లోని క్రీమ్ ను తీసుకుని తడి జుట్టుపై అప్లై చేయండి. షవర్ క్యాప్ తో కవర్ చేయండి. మరుసటి రోజు షాంపూ చేయండి. ఒక్క వాష్ కే, మీ హెయిర్ మరింత మృదువుగా అలాగే మరింత కాంతివంతంగా తయారవుతుంది. హెయిర్ బ్రేకేజ్ తక్కువగా ఉంటుంది.

5. అపాయింట్మెంట్ తీస్కోండి:

5. అపాయింట్మెంట్ తీస్కోండి:

హెయిర్ డేమేజ్ ను అరికట్టడానికి మీరు ఈ సింపుల్ ట్రిక్ ను పాటించండి. బ్లీచ్ మరియు టోన్ అయిపోయాక సెలూన్ ను వదిలి వెళ్లబోయే ముందు టచ్ అప్ కోసం అపాయింట్మెంట్ ను తీసుకోండి. ఈ పద్దతిని పాటించడం వలన బ్రేకేజ్ తగ్గుతుంది. హెయిర్ గురించి ఎంత ఎక్కువగా శ్రద్ధ కనబరిస్తే హెయిర్ అంత ఎక్కువగా అందంగా తయారవుతుంది. మీ అపియరెన్స్ ను ప్లెజంట్ గా మారుస్తుంది.

బ్లీచింగ్ సమయంలో పాటించవలసిన ఈ చిట్కాలను తెలుసుకున్నారు కదా? వీటిని పాటిస్తే హెయిర్ డేమేజ్ ను అరికట్టవచ్చు.

English summary

How To Bleach Your Hair Without Harming It

Bleach tends to extract moisture out from your hair making it look dry and coarse. So, to avoid that, make sure you apply a conditioner and leave it for 2 hours. The trick to choosing the right bleach would be to check its 'volume,' which ranges from 10 to 40 and it's usually marked on the box. So, if your hair is already light, stick to the lower number.
Story first published: Monday, July 23, 2018, 12:30 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more