For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పొడి బారిన జట్టు కోసం హెయిర్‌ప్యాక్‌లు

ఈ కాలంలో దాదాపు అందరూ ఎదుర్కొంటున్న సమస్య జుట్టు పొడిబారడం. సరైన రీతిలో జుట్టును పట్టించుకోకపోవడం, జాగ్రత్తలు తీసుకోకపోవడం, పోషకాహార పదార్థాలు తీసుకోకపోవడం, పడని రసాయనాలు వాడటం, వాతావరణ కారకాలతో జుట్

|

ఈ కాలంలో దాదాపు అందరూ ఎదుర్కొంటున్న సమస్య జుట్టు పొడిబారడం. సరైన రీతిలో జుట్టును పట్టించుకోకపోవడం, జాగ్రత్తలు తీసుకోకపోవడం, పోషకాహార పదార్థాలు తీసుకోకపోవడం, పడని రసాయనాలు వాడటం, వాతావరణ కారకాలతో జుట్టు తరుచూ పొడిబారుతుంది. చిట్లిపోతుంది.

ఆరోగ్యకరమైన జుట్టు మీ సొంతం అవ్వాలంటే దానిని బాగా కండిషనింగ్‌ చేయడం తప్పనిసరి. అది కూడా క్రమం తప్పకుండా సరైన సమయంలో చేస్తుంటేనే శిరోజాలు మిలమిల మెరుస్తాయి. నునుపుగా మారతాయి. అయితే మీ జుట్టు కండిషనింగ్‌ చేసుకునేందుక సహజ పద్ధతులను ఉపయోగించడమే మంచింది.

Hydrating Hair Packs For Dry Hair

పొడివారిని జుట్టును చాలామంది పట్టించుకోరు గానీ దానివల్లే బలహీనంగా మారి వెంట్రుకలు తెగిపోతాయి. పొడిదనం పోగొట్టుకోవాలంటే సరైన పోషణ అవసరం. మరీ అతిగా షాంపూ వాడితే శిరోజాల్లోని నూనెలు తగ్గిపోయి జుట్టు పొడిబారుతుంది. బలహీనంగా మారుతుంది. ప్రకృతి సిద్ధంగా లభంచిన మూలికలను పట్టిస్తేనే పొడిదనం పోతుంది.

సహజ పదార్థాలతో తయారుచేసిన మాస్క్‌లు వాడటం వల్ల బలమైన జుట్టు పొందవచ్చు. వాటి ద్వారానే శిరోజాలను మెరిసేలా నునుపు దేలేలా మార్చుకోవచ్చు. సహజ వస్తువలుతో జుట్టును బలవర్ధకంగా ఎలా మార్చుకోవచ్చో బోల్డ్‌స్కై.కామ్‌ అందిస్తున్న ఈ కథనంలో మీరు తెలుసుకోవచ్చు!

Hydrating Hair Packs For Dry Hair

బాదం పాలు, కొబ్బరిపాలు మిశ్రమం:

బాదం పాలు, కొబ్బరి పాల మిశ్రమంతో బాగా పనిచేసే మాస్క్‌ తయారుచేసుకోవచ్చు. శిరోజాల సమస్యల నుంచి బయటపడవచ్చు. ఈ మాస్క్‌ జుట్టులో పొడిదనాన్ని తగ్గించి చిట్లకుండా రక్షిస్తుంది. ఇందుకోసం మీరు బాదం పాలను, కొబ్బరి పాలను సమంగా తీసుకొని అందులో కాస్త నిమ్మరసం కలిపితే చాలు. ఈ మాస్క్‌ను వెంట్రుకలకు పట్టించండి. ఓ గంట తర్వాత నీటితో కడిగిస్తే చాలు.

అరటి, తేనే:

అరటి, తేనేల మిశ్రమం సైతం శిరోజాలను తేమగా ఉంచుతాయి. సిల్కీగా మారుస్తాయి. ఇది అద్భుతమైన కండిషనర్‌గా పనిచేసి మీ జుట్టును మరింత మెరిసేలా మెత్తగా ఉంచుతుంది. బాగా తరిగిన అరటిలో ఒక టేబుల్‌ స్పూన్‌ తేనేను కలపాలి. దాన్ని శిరోజాలకు పట్టించాలి. ఓ గంట ఆగి పూర్తిగా కడిగేసుకుంటే సరి.

Hydrating Hair Packs For Dry Hair

మందార పువ్వు:

జుట్టును కాపడ్డంలో మందార పువ్వును మించిది లేదనేది వాడినవారి మాట! శిరోజాలను కాపాడే చాలా పదార్థాలు ఈ పువ్వులో ఇమిడి ఉంటాయి. జుట్టు బాగా పెరిగేందుకు, మెరిసేందుకు సాయపడుతుంది. మందార పువ్వులను ముద్దగా చేసి దాన్ని కొబ్బరి నూనెలో కలిసి నెత్తికి పట్టించాలి. అప్పుడే అత్యుత్తమ ఫలితాలు కనిపిస్తాయి.

కొబ్బరి పాలు:

కొబ్బరి పాలు కూడా జుట్టు రాలిపోవడాన్ని అరికడుతుంది. ఈ పాలను కండిషనర్‌గా ఉపయోగిస్తారు. పొడి బారడాన్ని, చిట్లడాన్ని తగ్గిస్తుంది. కొబ్బరి పాలను శిరోజాలకు పట్టించి రాత్రంతా అలాగే ఉండి ఉదయాన్నే చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే చాలు ఆరోగ్యకరమైన జుట్టు మీ సొంతం అవుతుంది.

English summary

hair packs fro dry hair

in this article, we at Boldsky will be listing out some of the natural hair packs that work wonders in treating an dry hair. Read on to know more about it
Story first published:Thursday, January 25, 2018, 18:37 [IST]
Desktop Bottom Promotion