For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మృదువైన జుట్టు కోసం ఈ అద్భుతమైన హెన్నా, కొబ్బరిపాల మాస్క్ ను ప్రయత్నించండి

మృదువైన జుట్టు కోసం ఈ అద్భుతమైన హెన్నా, కొబ్బరిపాల మాస్క్ ను ప్రయత్నించండి

|

ప్రజలు పురాతన కాలం నుండి హెన్నాను తమ జుట్టుకి రంగు కోసం వాడుతూ వచ్చారు. కానీ హెన్నా లాభాలు కేవలం జుట్టు రంగు కోసం మాత్రమే కాదు. హెన్నా అనే ఈ జుట్టును సంరక్షించే ఉత్పత్తి మీ జుట్టు ఆరోగ్యాన్ని మొత్తం మీద పదిలంగా ఉంచుతుంది.

హెన్నా జుట్టుకి కండీషనింగ్, పాడైన వెంట్రుకలను బాగుచేయడం, పిహెచ్ స్థాయిలను బ్యాలెన్స్ చేయటం వంటి లాభాలు చేకూరుస్తుంది.మీ జుట్టు సంరక్షణా రొటీన్ లో హెన్నాను కూడా చేర్చటం మంచిది.

Try This Amazing Henna And Coconut Milk Mask To Get Soft Hair

జుట్టు ఆరోగ్యానికి హెన్నా లాభాలు;

జుట్టు ఆరోగ్యానికి హెన్నా లాభాలు;

-కుదుళ్ల ఆరోగ్యం మెరుగుపరుస్తుంది

ఇందులో వుండే చల్లని,యాంటీ మైక్రోబియల్ లక్షణాల కారణంగా, హెన్నా కుదుళ్ల ఆరోగ్యం మంచిగా ఉంచుతుందని ప్రసిద్ధి. ఇది చిరాగ్గా, దురదగా ఉన్న తలకి ఉపశమనాన్ని ఇస్తుంది.అలాగే చుండ్రును కూడా సమర్థవంతంగా నయం చేస్తుంది.

-హెయిర్ కండీషనర్

-హెయిర్ కండీషనర్

ఇది జుట్టులో ఉన్న ఎక్కువ మురికి, అదనపు జిడ్డును తొలగిస్తుంది. గుడ్డుతో లేదా ఇతర హైడ్రేటింగ్ పదార్థాలతో కలిపినప్పుడు ఇది మీ జుట్టును చాలా బాగా కండీషన్ చేయగలదు. హెన్నా హెయిర్ ప్యాక్ లతో మీ జుట్టు పట్టులా, మృదువుగా మెరిసిపోతుంది. అలా ఎందుకంటే హెన్నా వెంట్రుక కుదురులోని తేమను బయటకు పోకుండా అక్కడే నిలిపివుంచుతుంది.

-జుట్టుకు బలాన్నిచ్చి,పాడైన వెంట్రుకలను బాగుచేస్తుంది;

-జుట్టుకు బలాన్నిచ్చి,పాడైన వెంట్రుకలను బాగుచేస్తుంది;

హెన్నా వెంట్రుక పాడైతే మొదలునుంచి బాగుచేయగలదు. ఇది చాలా పోషణనిస్తుంది. జుట్టు వెంట్రుకలు విరిగిపోవటాన్ని హెన్నా రాసి నివారించవచ్చు, ఎందుకంటే హెన్నా వెంట్రుకలలో సాగే గుణాన్ని పెంచుతుంది, బలాన్ని కూడా ఇస్తుంది. చివర్లు కూడా విరిగిపోవటాన్ని నివారించవచ్చు.

-పిహెచ్, నూనెల ఉత్పత్తిని బ్యాలెన్స్ చేస్తుంది

-పిహెచ్, నూనెల ఉత్పత్తిని బ్యాలెన్స్ చేస్తుంది

మీ జుట్టు మరీ జిడ్డుగా ఉంటే, మీరు హెన్నా వాడి ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఎక్కువగా పనిచేస్తున్న సెబేషియస్ గ్రంథులను శాంతపర్చి నూనెల ఉత్పత్తిని నియంత్రించవచ్చు. కుదురు దగ్గర పిహెచ్ స్థాయిని కూడా దాని సహజ ఆమ్ల-క్షార స్థాయికి తీసుకురావచ్చు. మెల్లగా కుదుళ్ళ దగ్గర కూడా జుట్టు స్ట్రెయిట్ అవుతుంది.

-జుట్టు పెరుగుతుంది, ఊడిపోవటం నివారించబడుతుంది.

-జుట్టు పెరుగుతుంది, ఊడిపోవటం నివారించబడుతుంది.

కుదుళ్ల ఆరోగ్యం మెరుగవటం వలన, జుట్టు ఊడిపోవటం నివారించబడుతుంది. ఇలా జుట్టు పెరిగే వేగం కూడా మెరుగవుతుంది.

ఈ పైన చెప్పిన లాభాలు హెన్నాని జుట్టు సంరక్షణకి సరైన పదార్థంగా నిరూపిస్తాయి. మీరు హెన్నాని,ఇతర సహజ పదార్థాలతో కలిపి హెయిర్ మాస్క్ తయారుచేయవచ్చు, ఇది వాడితే మీ జుట్టు మృదువుగా,ఆరోగ్యంగా, బలంగా మారుతుంది.

అలాంటి ఒక మాస్క్ యే హెన్నా, కొబ్బరిపాలతో చేసేది. ఈ రెండు పదార్థాలు చేసే అద్భుతాలతో మీ జుట్టుకి ఎంతో కాంతి, మృదుత్వం వస్తాయి.

హెన్నా,కొబ్బరిపాలతో తయారుచేసే హెయిర్ మాస్క్

హెన్నా,కొబ్బరిపాలతో తయారుచేసే హెయిర్ మాస్క్

కావాల్సిన వస్తువులు

10 చెంచాల హెన్నా పౌడర్

1 కప్పు కొబ్బరిపాలు

4 చెంచాల ఆలివ్ నూనె

ఈ హెయిర్ మాస్క్ తయారుచేయటానికి, వాడటానికి ఒక గంట సమయం పడుతుంది.

తయారుచేసే పద్ధతి ;

తయారుచేసే పద్ధతి ;

-కొబ్బరిపాలను వేడిచేయండి. దీనికి 10 చెంచాల హెన్నా పౌడర్, 4 చెంచాల ఆలివ్ నూనెను వేయండి.

-బాగా కలిపి,ఉండలు కట్టకుండా చూడండి. మీకు మృదువైన పేస్టు వస్తుంది.

ఈ మిశ్రమాన్ని మీ జుట్టుకి,మాడుకి పట్టించండి. ఒక గంటపాటు అలా వదిలేయండి. తర్వాత మైల్డ్ షాంపూ వాడి తలస్నానం చేయండి. సల్ఫేట్ లేని షాంపూ అయితే మంచిది. షాంపూ తర్వాత జుట్టుని కండీషన్ చేయండి.

మీరు ఈ హెయిర్ మాస్క్ ను వారానికోసారైనా వాడవచ్చు.

మీరు ఈ హెయిర్ మాస్క్ ను వారానికోసారైనా వాడవచ్చు.

ఈ ప్యాక్ పొడి జుట్టు ఉన్నవారికి చాలా సూట్ అవుతుంది. ఇది వాడటం వలన మీ జుట్టుకి బరువు, మందం పెరిగి, కాంతివంతంగా ఉంటుంది. ఇది మీ జుట్టును మృదువుగా మార్చి, చిక్కును నియంత్రిస్తుంది.

ఆరోగ్యవంతమైన జుట్టుకి హెన్నా, కొబ్బరిపాలు మేటి కాంబినేషన్. పైన చెప్పిన లాభాలతో పాటు, కొబ్బరిపాల వలన కూడా జుట్టు ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుంది.

కొబ్బరిపాలల్లో ఎక్కువ కొవ్వు పదార్థం ఉండి, జుట్టును మెత్తగా మారుస్తుంది,అలా మీరు దువ్వుకున్నప్పుడు హాయిగా ఉంటుంది ( రింగుల జుట్టు లేదా అలల్లాంటి జుట్టున్న ప్రతి అమ్మాయి కోరుకునేది ఇదే). ప్రొటీన్ ఎక్కువగా ఉండటం వలన కొబ్బరిపాలు జుట్టు కుదురు నుండి బలపరుస్తుంది.

ప్రతి కప్పు కొబ్బరిపాలకి 5 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది.దీనివలన జుట్టు కుదురును సరిగ్గా మళ్ళీ నిలబెట్టవచ్చు. కొబ్బరి పీచు కూడా సహజంగా జుట్టు ఎదగటానికి సాయపడుతుంది.

కుదుళ్ల నుంచి పోషణ మాత్రమే కాక, కొబ్బరిపాలు పాడైన జుట్టు కుదుళ్లను బాగుచేయటం వలన జుట్టు పెరుగుతుంది. రక్తప్రసరణ కూడా జరిగేలా చూడటం వలన, పోషకాలు కుదుళ్ళ వరకూ వెళ్తాయి.

జుట్టు ఊడిపోవటాన్ని నియంత్రించటానికి కొబ్బరిపాలు,హెన్నా హెయిర్ మాస్క్ ను వాడండి. ఈ మాస్క్ ను తలపై ఒక గంటపాటు అలానే వదిలేయటం మర్చిపోవద్దు. దీనిద్వారా రెండు పదార్థాల లాభాలు జుట్టుకి చేరతాయి.

English summary

Try This Amazing Henna And Coconut Milk Mask To Get Soft Hair

Henna is a hair care ingredient that can be used to maintain your overall hair health. Henna offers benefits such as conditioning, repairing damage and balancing the pH levels. Henna application should definitely be included as a part of your hair care routine. Also, due to its cooling and antimicrobial properties, henna is known to maintain good scalp health.
Desktop Bottom Promotion