For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నువ్వుల నూనె మరియు కొబ్బరి నూనె ఒక మ్యాజిక్ మిశ్రమం

నువ్వుల నూనె మరియు కొబ్బరి నూనె ఒక మ్యాజిక్ మిశ్రమం

|

అందం విషయంలో ఎన్నో అవాంతరాలు ఉన్నాయి. వాటి ఎదుర్కోవాలంటే తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఇన్ స్టాంట్ గా మనం వాడుతున్ కెమికల్ ప్రొడక్ట్స్ దూరంగా ఉంటూ శరీరంలోని, చర్మంలో టాక్సిన్స్ తొలగించుకుంటే చాలు అందం తనంతట తానే ఇనుమడిస్తుంది. అందుకు న్యాచురల్ బ్యూటీ ప్రొడక్ట్స్ ఉపయోగపడుతాయి.

అలాంటి న్యాచురల్ బ్యూటీ ప్రొడక్ట్స్ లో నువ్వుల నూనె ఒకటి . ఈ నూనె చౌకైనది మాత్రమే కాదు, దీని వల్ల మంచి అందం విషయంలో ఫలితాలను సాధించవచ్చు. దీనికి కొబ్బరి నూనె కూడా జత చేస్తే బెనిఫిట్స్ డబుల్ గా ఉంటాయి. నువ్వుల నూనెలోని వేడి పుట్టించే గుణాలు, కొబ్బరి నూనెలో కూలింగ్ గుణాలు ఉండటం వల్ల ఈ రెండు లక్షణాలు అందాన్ని బ్యాలెన్స్ చేయడానికి , అందం పరంగా ఎదుర్కొంటున్న సమస్యలను నివారించడానికి సహాయపడుతాయి.

అయితే ఈ రెండు నూనెలను అన్ రిఫైండ్ స్వచ్చమైన వాటిని ఎంపిక చేసుకోవాలి. ఈ నూనెల్లో న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి. ఈ రెండు నూనెలను కలిపి ఉపయోగించడం వల్ల జుట్టు మరియు చర్మ అందం మెరుగుపడుతుంది. ఈ రెండింటిని జోడించడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో పరిశీలిద్దాం.

ఇది అనేక రకాల బ్యూటీ సమస్యలను తగ్గించడానికి

ఇది అనేక రకాల బ్యూటీ సమస్యలను తగ్గించడానికి

ఇది అనేక రకాల బ్యూటీ సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. నువ్వుల నూనెలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంది.అలాగే బ్యూటీ బెనిఫిట్స్ అధికంగా ఉన్నాయి. చర్మ సంరక్షణ మరియు జుట్టు సంరక్షణ కోసం నువ్వుల నూనెతో కొద్దిగా కొబ్బరి నూనెను కలిపినప్పుడు, ప్రయోజనాలు ఏమిటో చూద్దాం.

చర్మ సంరక్షణకు

చర్మ సంరక్షణకు

అందానికి సంబంధించిన సమస్యలను నయం చేయడానికి నువ్వుల నూనెను ఉపయోగించవచ్చు. పడుకునే ముందు కొద్దిగా నువ్వుల నూనె చేతిలో వేసి ముఖానికి రాసుకోవాలి. ఇది మీ చర్మానికి గొప్ప ప్రయోజనాలను అందిస్తుంది. నువ్వుల నూనె చర్మంలో నలుపు తగ్గించడానికి మరియు చర్మం ప్రకాశం మరియు రంగును పెంచడానికి సహాయపడుతుంది. చర్మ సంరక్షణ మరియు జుట్టు సంరక్షణ కోసం నువ్వుల నూనెను ఎలా ఉపయోగించాలో చూద్దాం.

జుట్టు రాలడాన్ని ఆపుతుంది

జుట్టు రాలడాన్ని ఆపుతుంది

జుట్టు సమస్యల్లో ప్రధానమైనది జుట్టు రాలడం. ఇది చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి, మనం నువ్వుల నూనెను ఉపయోగించవచ్చు. ఇది జుట్టు రాలడాన్ని త్వరగా తగ్గిస్తుంది. కొద్దిగా నువ్వుల నూనెను తీసుకుని, దానికి కొద్దిగా కొబ్బరి నూనె జోడించి మీ తలకు మర్ధన చేసుకోవాలి. కొద్దిసేపటి తరువాత, తేలికపాటి షాంపూతో శుభ్రం చేసుకోండి. ఇది వారానికి కనీసం రెండు లేదా మూడు సార్లు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తుంది

జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తుంది

జుట్టు సమస్యలల్లో జుట్టు రాలడం ఒకటి. నువ్వుల నూనె కొబ్బరి నూనె మిశ్రమం మీ జుట్టు రాటడం తగ్గించడానికి మరియు జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది. జుట్టు రాలే సమస్య నుండి బయటపడటానికి ఇది ఒక గొప్ప మార్గం. నువ్వుల నూనె జుట్టు అందాన్ని మెరుగుపరుచుకోవడానికి చాలా అవసరం.

చుండ్రును తొలగించడానికి

చుండ్రును తొలగించడానికి

నువ్వుల నూనె, కొబ్బరి నూనె మిశ్రమం చుండ్రు సమస్యను తొలగించడానికి కూడా సహాయపడుతుంది. ఈ నూనెల మిశ్రమాన్ని తలపై అప్లై చేయాలి మరియు గంట, రెండుగంటల తర్వాత శుభ్రం చేసుకోండి. కొద్దిగా వేడి చేసి మీ తలపై రాయండి. వారానికి రెండుసార్లు ఈ ఇలా చేయండి. చుండ్రు పూర్తిగా తొలగించబడుతుంది.

మంచి మాయిశ్చరైజర్

మంచి మాయిశ్చరైజర్

నువ్వుల నూనె మంచి మాయిశ్చరైజర్ అనడంలో సందేహం లేదు. అందువల్ల, నువ్వుల నూనె వివిధ రకాల సమస్యలను తొలగించడానికి సహాయపడుతుంది. గోరువెచ్చని నూనెతో చర్మాన్ని మసాజ్ చేయడం వల్ల పొడి చర్మం నివారించబడుతుంది. మరియు వ్యాధి నిరోధకతను పెంచుతుంది. శరీరంలో వ్యర్థాలను తొలగిస్తుంది. ఒత్తిడి తగ్గిస్తుంది. ఏజింగ్ లక్షణాలను కనబడనివ్వదు. అలాగే చర్మంలో జిడ్డు తత్వాన్ని తగ్గిస్తుంది.

అకాల వృద్ధాప్యానికి పరిష్కారం

అకాల వృద్ధాప్యానికి పరిష్కారం

నువ్వుల నూనె చాలా సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. నువ్వుల నూనెతో వృద్ధాప్యం వల్ల వచ్చే అనేక సమస్యలను నివారిస్తుంది. గోరువెచ్చని నూనెను చర్మానికి అప్లై చేసి మసాజ్ చేయడం వల్ల చర్మంలోని మలినాలు తొలగిపోయి చర్మం క్లియర్ గా కనబడేలా చేస్తుంది. కాబట్టి చర్మ సమస్యలను నివారించుకోవడం కోసం మనం ఎటువంటి సందేహం లేకుండా నువ్వుల నూనెను ఉపయోగించవచ్చు.

బ్లాక్ హెడ్స్ ను తొలగిస్తుంది

బ్లాక్ హెడ్స్ ను తొలగిస్తుంది

బ్లాక్ హెడ్స్ సమస్యను తొలగించడానికి నువ్వుల నూనె కూడా సహాయపడుతుంది. ఇది చర్మం లోతుల్లోకి వెళ్లి చర్మంపై ఉన్న ధూళిని తొలగిస్తుంది మరియు బ్లాక్ హెడ్స్ వంటి సమస్యని పూర్తిగా నయం చేయడానికి సహాయపడుతుంది. మీరు దీన్ని ముక్కు మరియు బుగ్గలపై అప్లై చేసి, సున్నితమైన మసాజ్ చేయడం వల్ల వెంటనే మంచి ఫలితాలను పొందుతారు.

పొడి చర్మం కోసం

పొడి చర్మం కోసం

మీ చర్మం మరీ డ్రైగా ఉంటే నువ్వుల నూనె ఉత్తమ నివారణలలో ఒకటి. నువ్వుల నూనె ఈ సమస్యలను ప్రభావవంతంగా తగ్గించడానికి సహాయపడుతుందనడంలో సందేహం లేదు. వివిధ రకాల చర్మ సమస్యల్లో డ్రై స్కిన్ ఒకటి. నువ్వుల నూనె, కొబ్బరి నూనె మిశ్రమాన్ని చర్మానికి అప్లై చేయడం ద్వారా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. చర్మం స్మూత్ గా అందంగా మార్చుకోవచ్చు.

కండీషనర్ కు బదులుగా ఆయిల్ ను ఉపయోగించవచ్చు:

కండీషనర్ కు బదులుగా ఆయిల్ ను ఉపయోగించవచ్చు:

గోరువెచ్చని నూనెను తలకు రాసి, కొన్ని నిముషాలు మసాజ్ చేయాలి. రెండు మూడు గంటల తర్వాత రెగ్యులర్ షాంపుతో తలస్నానం చేయాలి. దాంతో మీ జుట్టు సాఫ్ట్ గా మరియు షైనీగా మెరుస్తుంటుంది. వేరే కండీషనర్ ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. ఇదే ఒక్కటే కాదు హెడ్ మసాజ్ వల్ల త్వరగా జుట్టు తెల్లబడకుండా, బట్టతలరాకుండా ఉంటుంది. ఒత్తిడి తగ్గిస్తుంది, తలనొప్పి నుండి ఉపశమనం కలిగించి మనస్సు ప్రశాంతంగా మార్చుతుంది.

English summary

Beauty Care Uses Of Sesame And Coconut Oil

Read on to know the beauty care uses of sesame and coconut oil
Story first published:Friday, September 13, 2019, 15:06 [IST]
Desktop Bottom Promotion