For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉసిరికాయ: జుట్టుకు అందించే ప్రయోజనాలు & ఎలా ఉపయోగించాలి

ఉసిరికాయ: జుట్టుకు అందించే ప్రయోజనాలు & ఎలా ఉపయోగించాలి

|

ఉసిరికాయను ఇండియన్ గూస్బెర్రీ అని పిలుస్తారు. ఇందులో చాలా ప్రయోజనాలున్నాయి. ఉసిరికాయలో మనకు తెలిసిన అనేకు ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాదు, ఇందులో ఉండే పులుపు, వగరు లక్షణాలు జుట్టుకు కూడా అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తాయి. ఉసరికాయను అనేక జుట్టు సమస్యల తొలగించుకోవడానికి ఉపయోగిస్తారు. ముఖ్యంగా తలలో చుండ్రు నుండి జుట్టు రాలడం ఆగే వరకు ఇది ఉత్తమ ప్రయోజనాలను అందిస్తుంది.

ఉసిరికాయను విస్తృతంగా ఉపయోగించడం వల్ల జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఈ మూలికలలో యాంటీఆక్సిడెంట్స్ పాటు, యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండటం వల్ల జుట్టు శుభ్రంగా, ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతాయి. ఇంకా ఇది హెయిర్ టానిక్ లా పనిచేసి జుట్టును స్ట్రాంగ్ చేస్తుంది. అలాగే హెయిర్ పిగ్మెంటేషన్ తో పోరాడి, తెల్ల జుట్టును నివారిస్తుంది. ఉసిరికాయలో ఉండే విటిమిన్ సి తలలో పోషణను అందిస్తుంది. అనేకమైన ఇతర జుట్టు సమస్యలను అధిగమిస్తుంది. జుట్టును చైతన్యపరుస్తుంది.

Amla: Benefits For Hair & How To Use,

అద్భుతమైన ఈ అన్ని ప్రయోజనాల కారణంగా వివిధ రకాల జుట్టు సమస్యలను అధిగమించడానికి ఉసిరికాయను ఏవిధంగా ఉపయోగించాలో తెలుసుకునే ముందు, ఆమ్లా జుట్టుకు ఏవిధంగా సహాయపడుతుందో తెలుసుకుందాం..

జుట్టుకు ఉసిరికాయ అందించే ప్రయోజనాలేంటి?

జుట్టుకు ఉసిరికాయ అందించే ప్రయోజనాలేంటి?

  • జుట్టు రాలడం నివారిస్తుంది.
    • జుట్టు పెరగడాన్ని ప్రోత్సహిస్తుంది.
      • మీ జుట్టు స్ట్రాంగ్ గా మరియు హెల్తీగా పెరగడానికి సహాయపడుతుంది.
        • చుండ్రు తొలగిస్తుంది
          • జుట్టుకు కండీషనర్ గా పనిచేస్తుంది.
            • జుట్టుకు సరిపోయే మెరుపును అందిస్తుంది.
              • తెల్ల జుట్టును నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.
              • జుట్టును పునర్జీవంపచేస్తుంది.

                జుట్టుకు ఉసిరికాయను ఎలా ఉపయోగించాలి

                జుట్టుకు ఉసిరికాయను ఎలా ఉపయోగించాలి

                జుట్టు రాలడం ఆపడానికి

                పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ తలలో చర్మంలోని దుమ్మ, ధూళి ఇతర మలినాలను శుభ్రపరుస్తుంది .చర్మ రంద్రాలు తెరుచుకునే లా చేసి జుట్టు మొదళ్ళకు తగిన పోషణను అందిస్తుంది. జుట్టు రాలడం నివారిస్తుంది. తేనె లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు తలలో చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి జుట్టు రాలడం తగ్గిస్తుంది.

                కావల్సినవి

                2 టేబుల్ స్పూన్ల ఉసిరికాయ పొడి

                2 టేబుల్ స్పూన్ల పెరుగు

                1 టీస్పూన్ తేనె

                గోరువెచ్చని నీళ్ళు కొద్దిగా(అవసరం అయితే}

                ఎలా వాడాలి:

                • ఒక బౌల్లో ఆమ్లా పౌడర్ తీసుకోవాలి.
                • దీనికి సరిపడా గోరువెచ్చని నీటిని కలిపి మెత్తగా పేస్ట్ చేయాలి.
                • అలాగే కొద్దిగా పెరుగు కూడా జోడించి బాగా కలపాలి.
                • ఈ మిశ్రమాన్ని తలకు ముఖ్యంగా జుట్టుకు అప్లై చేయాలి.
                • అరగంట అలాగే ఉంచాలి.
                • తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి.
                • జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి

                  జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి

                  గుడ్డులో ప్రోటీన్లు మరియు మినిరల్స్ అధికంగా ఉంటాయి. ఇది జుట్టు మొదళ్ళకు పోషణను ఇచ్చి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

                  కావల్సినవి

                  1/2 ఆమ్లా పౌడర్

                  2 గుడ్లు

                  వాడే విధానం :

                  • గుడ్డును పగలగొట్టి లోపలి పదార్థాన్ని ఒక బౌల్లో తీసుకోవాలి,
                  • దీనికి ఉసిరి పొడి జోడించి రెండూ బాగా మిక్స్ చేయాలి.
                  • ఈ మిశ్రామన్ని జుట్టుకు బాగా పట్టించాలి.
                  • ఒక గంట సేపు అలాగే ఉంచాలి.
                  • తర్వాత చన్నీటితో తలను బాగా శుభ్రం చేయాలి.
                  • చుండ్రు నివారణకు

                    చుండ్రు నివారణకు

                    కొబ్బరి నూనె కుదుళ్ళలోకి బాగా చొచ్చుకుపోతుంది. దాంతో జుట్టు డ్యామేజ్ కాకుండా చుండ్రు వంటి సమస్యల నివారిస్తుంది,.

                    కావల్సినవి:

                    ఒక టేబుల్ స్పూన్ ఆమ్లా జ్యూస్

                    రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె

                    వాడే విధానం :

                    • ఉసిరికాయ రసాన్ని బౌల్లో తీసుకోవాలి.
                    • దీనికి కొబ్బరి నూనె జోడించి బాగా మిక్స్ చేయాలి.
                    • ఈ మిశ్రమాన్ని తలకు మరియు కుదుళ్ళకు బాగా అప్లై చేసి మసాజ్ చేయాలి.
                    • ఒక గంట సేపు అలాగే ఉండనివ్వాలి
                    • మీ రెగ్యులర్ షాంపుతో తలస్నానం చేయాలి.
                    • తెల్ల జుట్టు నివారణకు

                      తెల్ల జుట్టు నివారణకు

                      కావల్సినవి

                      రెండు టేబుల్ స్పూన్ల ఆమ్లా పౌడర్

                      3 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె

                      1 టేబుల్ స్పూన్ మెంతి పౌడర్

                      వాడే విధానం :

                      • ఒక బౌల్లో ఆమ్లా పౌడర్ తీసుకోవాలి.
                      • దీనికి కొద్దిగా కొబ్బరి నూనె అలాగే మెంతి పొడి జోడించి బాగా మిక్స్ చేసి, స్టౌపై సిమ్మర్లో పెట్టాలి.
                      • ఈ మిశ్రమం బ్రౌన్ కలర్ కు మారే వరకు ఉండనిచ్చి తర్వాత క్రిందికి దింపి చల్లబరచాలి.
                      • చల్లబడ్డ తర్వాత వేరొక బౌల్లోకి వడపోయాలి.
                      • ఇప్పుడు దీన్ని తలకు మరియు జుట్టుకు అప్లై చేయాలి.
                      • రాత్రిలో పెట్టుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
                      • రాత్రంతా అలాగే ఉంచి ఉదయం మన్నికైన షాంపుతో తలస్నానం చేసుకోవాలి.
                      • తలలో దురదను తగ్గించడానికి

                        తలలో దురదను తగ్గించడానికి

                        ఉసిరికాయలో ఉండే విటమిన్ సి , నూనెలోని యాంటీఆక్సిడెంట్స్ మరియు యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు జుట్టును స్మూత్ గా మరియు పోషణ అందేలా చేస్తుంది

                        కావల్సినవి

                        ఆమ్లా ఆయిల్

                        వాడే విధానం:

                        • చేతిలోకి కొద్దిగా ఆమ్లా ఆయిల్ తీసుకోవాలి,
                        • తలకు అప్లై చేసి, సున్నితంగా మసాజ్ చేయాలి. ఇది తలలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.
                        • అరగంట పాటు అలాగే ఉంచి తర్వాత రెగ్యులర్ షాంపుతో తలస్నానం చేయాలి.
                        • ఆయిల్ హెయిర్ కు

                          ఆయిల్ హెయిర్ కు

                          నిమ్మకాయలోని ఆస్ట్రిజెంట్ లక్షణాలు తలలో సెబమ్ ఉత్పత్తి కాకుండా కంట్రోల్ చేస్తుంది. దాంతో జుట్టు జిడ్డుగా మారకుండా నివారిస్తుంది

                          కావల్సినవి

                          2 టేబుల్ స్పూన్ల ఆమ్లా పౌడర్

                          1 టేబుల్ స్పూన్ నిమ్మరసం

                          నీళ్ళు (అవసరం అయితే)

                          వాడే విధానం :

                          • ఒక బౌల్లో ఆమ్లా పౌడర్ వేయాలి.
                          • దీనికి నిమ్మరసం జోడించి బాగా కలపాలి.
                          • అసరం అయితే కొద్దిగా నీళ్ళు కలపి మెత్గగా పేస్ట్ చేయాలి.
                          • ఈ పేస్ట్ ను తలకు అప్లై చేయాలి.
                          • అప్లై చేసిన తర్వత సున్నితమైన మసాజ్ చేయాలి. రాత్రి నిద్రించే ముందు ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
                          • ఉదయం రెగ్యులర్ షాంపుతో తలస్నానం చేసుకోవాలి.

English summary

Amla: Benefits For Hair & How To Use

Amla, also known as Indian gooseberry, is a superfood that has a lot of benefits to offer. Apart from its widely-known health benefits, did you know that this sour berry has lots to offer for your hair as well? In fact, it has been used for a long time to tackle different hair issues, from dandruff to hair loss.
Story first published:Thursday, September 12, 2019, 14:33 [IST]
Desktop Bottom Promotion