Just In
- 1 hr ago
Today Rasi Phalalu: మిథున రాశి వ్యాపారస్తులు తమ ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి..లేదంటే మోసపోతారు..
- 13 hrs ago
ధూమపానం మీ ఊపిరితిత్తులకే కాదు మీ శరీరంలో ఇతర అవయవాలకు కూడా ప్రమాదకరమని మీకు తెలుసా?
- 13 hrs ago
ఈ వ్యాయామాలతో ఆడవాళ్లను పిచ్చెక్కించే శక్తి మీ సొంతమవుతుంది
- 15 hrs ago
Night Sweats: పిల్లల్లో రాత్రి చెమట.. కారణాలేంటి? పరిష్కారమేంటి?
Don't Miss
- News
మూడోసారి.. స్పీకర్ పోచారంకు కరోనా పాజిటివ్.. స్టేబుల్గానే
- Sports
జింబాబ్వేతో వన్డే సిరీస్.. ప్రపంచ క్రికెట్కు మంచిదన్న శిఖర్ ధావన్..! కేఎల్ రాహుల్ కెప్టెన్సీపై స్పందిస్తూ..
- Movies
Karthika Deepam కార్తీక్ కోసం మార్చురీకి వెళ్లిన దీపం.. అసలేం జరిగిందంటే?
- Finance
DigiYatra: సులభతరంగా విమాన ప్రయాణం.. అందుబాటులోకి నయా టెక్నాలజీ.. హైదరాబాద్..
- Technology
Sony నుంచి సరికొత్త ఫీచర్లతో Mini LED TV విడుదల! ధర ఎంతంటే!
- Automobiles
ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ది కోసం మహీంద్రా అడ్వాన్స్డ్ డిజైన్ యూరప్ M.A.D.E ప్రారంభం!
- Travel
ఫ్లయింగ్ రెస్టారెంట్లో రుచులు ఆస్వాదించాలని ఎవరికుండదు చెప్పండి!
Hair tips: నెయ్యితో ఇలా చేస్తే జుట్టు నల్లబడుతుంది.. మీరూ ట్రై చేయండి
Hair tips: ఈమధ్యకాలంలో చాలా మందిలో తెల్ల వెంట్రుకలు కనిపిస్తున్నాయి. చిన్న వారిలోనూ ఈ సమస్య తలెత్తుతోంది. వైట్ హెయిర్ వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. కొద్దిగా తెల్లని వెంట్రుకలు వచ్చినా.. దానిని కవర్ చేసుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతుంటారు. హెయిర్ కలర్స్, డై, హెన్నా, గోరింటాకు ఇలా చాలా వాడుతుంటారు. సహజ సిద్ధమైన ఉత్పత్తులు వాడితే ఎలాంటి సమస్యా ఉండదు. కానీ దాని వల్లే ప్రయోజనం నామమాత్రం. అందుకే చాలా మంది జుట్టుకు కలర్స్ వేసుకుంటారు. దీని వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది. గ్రే హెయిర్ ను నల్లగా మార్చుకునేందుకు ఇక్కడ కొన్ని చిట్కాలు ఇస్తున్నాం వాటిని పాటిస్తే వైట్, గ్రే హెయిర్ పోయి బ్లాక్ హెయిర్ వస్తుంది.

వైట్, గ్రే హెయిర్ ఎందుకు వస్తుంది?
తెల్లని, బూడిద రంగులో జుట్టు వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. కానీ చూసేందుకు బాగుండదని చాలా మంది ఫీలైపోతూ ఉంటారు. సరైన జీవన విధానం, హార్మోన్ అసమతుల్యత వల్ల జుట్టు తెల్లగా మారుతుంది.

తెల్లని జుట్టుకు పరిష్కారం లేదా..?
తెల్లని జుట్టు వస్తే ఇక అది ఎప్పటికీ ఉండిపోతుందని.. కలర్స్ వేసుకుని మేనేజ్ చేయాల్సిందేనని చాలా మంది అనుకుంటారు. కానీ కొన్ని జాగ్రత్తలు పాటించడం సహా సరైన డైట్ పాటిస్తే వైట్ హెయిర్ ఆగిపోతుంది. కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ లేని చిట్కాలు పాటించడం వల్ల వైట్ హెయిర్ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

ఉసిరి(Amla):
ఆయుర్వేద వైద్యంలో ఉసిరిది ప్రముఖ స్థానం. ఎందుకంటే ఉసిరిని చాలా ఔషధాల తయారీలో వాడుతుంటారు. దీనిలో ఉన్న పోషకాలు, విటమిన్ల వల్లే దీనికి అంతటి ప్రాధాన్యత. ఉసిరి ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఉసిరి తీసుకోవడం వల్ల చర్మం సౌందర్యం కూడా పెరుగుతుంది. ఉసిరిలో ఉంటే పోషకాలు రోజూ తీసుకుంటే.. జుట్టు రంగు మారకుండా ఉంటుంది. మెటబాలిజంని సక్రమంగా ఉంచేందుకు ఆమ్లా చక్కగా పని చేస్తుంది. ఉసిరి తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు పదార్థాలు తొలగిపోతాయి. ఉసిరి కాయల నుండి జ్యూస్ తయారు చేయాలి. అంతకుముందు తలకు కొబ్బరి నూనెతో మసాజ్ చేయాలి. తర్వాత ఉసిరి జ్యూస్ ను తలకు పట్టించాలి. ఇలా తరచూ చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. జ్యూస్ కాకుండే ఉసిరి పొడి కూడా తలకు పట్టించవచ్చు. ఉసిరి జ్యూస్ ను తాగడం వల్ల కూడా లాభం ఉంటుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఆయుర్వేత మెడికల్ షాపుల్లో ఉసిరి పొడి అని అడిగితే ఇస్తారు.

కరివేపాకు(Curry leaves):
కరివేపాకును కూరల్లో వేస్తుంటారు. దీని వల్ల మంచి రుచితో పాటు పోషకాలు అందుతాయని వంటకాల్లో వాడుతుంటారు. కరివేపాకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కరివేపాకు వల్ల జుట్టు ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. కరివేపాకును పేస్ట్ లా చేసుకుని జుట్టుకు అప్లై చేసుకోవాలి. తలపై పెట్టుకున్న మిశ్రమం నుండి తేమ పోయే వరకు వేచి ఉండాలి. తర్వాత తక్కువ గాఢత ఉన్న షాంపుతో కడిగేయాలి. అలాగే కరివేపాకు రెమ్మలను తీసుకుని కొబ్బరి నూనెలో వేసి మరిగించాలి. నూనె బాగా మరిగి నల్లగా అయ్యేంత వరకు ఉంచాలి. తర్వాత ఆ నూనెను చల్లార్చి తలకు మసాజ్ చేసుకోవాలి. రాత్రంతా అలా వదిలేసి ఉదయాన్నే తక్కువ గాఢత ఉన్న షాంపు పెట్టుకుని తల స్నానం చేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.

బృంగరాజ్(Bhringraj):
బృంగరాజ్ ను జుట్టుకి రాజు అంటారు. ఈ నూనె వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. ఆయుర్వేద వైద్యంలోనూ బృంగరాజ్ ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. బృంగరాజ్ తో చేసే నూనె వాడటం వల్ల జుట్టు తెల్లబడకుండా ఉంటుంది. ఈ నూనెతో మంచిగా మసాజ్ చేస్తే రక్తప్రసరణ పెరిగి జుట్టు రాలదు. తలకు మంచిగా పట్టించి ఓ గంట సేపు వదిలేయాలి. తర్వాత తక్కువ గాఢత ఉన్న షాంపూతో కడిగేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే చక్కటి, నల్లని జుట్టు సొంతం అవుతుంది.

అలాగే ఈ జాగ్రత్తలు కూడా పాటిస్తే ఆరోగ్యకరమైన జుట్టు మీ సొంతం చేసుకోవచ్చు.
* ఆయిల్ తరచూ తలకు పెట్టుకోవాలి. వారానికి కనీసం రెండు సార్లు ఏదో ఒక నూనె పెట్టి చక్కగా మసాజ్ చేయాలి.
* రోజూ నిద్రపోయే ముందు ఆవు నెయ్యి 2 చుక్కలో ముక్కులో వేసుకోవాలి.
* వీలైనప్పుడు ఉసిరి జ్యూస్ ను తలకు పట్టించాలి.
* సరిపోయేంతగా నిద్ర పోవాలి.
* ఒత్తిడిని దూరం చేసుకోవాలి. ఒత్తిడి వల్ల జుట్టు రాలుతుంది.
* కొబ్బరి నూనె తలను చల్లబరుస్తుంది. కాబట్టి కొబ్బరి నూనె అప్పుడప్పుడు పట్టించాలి.

నూనెతో పాటు వీటిని తలకు పట్టిస్తూఉండాలి
అలోవెరా జెల్:
కలబంద గుజ్జు జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది. కొబ్బరి నూనెలో కొద్దిగా కలబంద గుజ్జు వేసి బాగా కలపాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని తలకు అప్లై చేసుకోవాలి. దీని వల్ల కొబ్బరి నూనె చల్లదనంతో పాటు కలబందలోని పోషకాలు జుట్టుకు లభిస్తాయి.

ఉసిరి పొడి:
రెండు టీ స్పూన్ల ఉసిరి పొడిని 3 స్పూన్ల కొబ్బరి నూనెలో కలిపి తలకు పట్టించాలి. ఇలా చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది.