For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ దీపావళికి ట్రెండీ హెయిర్ స్టైల్ తో ట్రెండీగా కనిపించండి..

భారతీయ సాంప్రదాయ దుస్తులతో ఎంతో అద్భుతంగా కనిపించే మరో రకమైన కేశాలంకరణ ఇది. ఈ అల్లికలో మీ కురులు చక్కగా కుదురుకుని ఉంటాయి.

|

దీపావళి పండుగ ప్రతి ఏడాది వచ్చే కాంతుల పండుగ. మన జీవితంలో చీకట్లను తొలగించి వెలుగులు నింపే ఈ పండుగకు మహిళలు ప్రత్యేకంగా కనిపించాలనుకుంటున్నారు. ఇందుకోసం వారు తమ మేకప్ కు తెగ మెరుగులు దిద్దుతారు. ఇక దక్షిణాది భారత మహిళల విషయానికొస్తే వీరంతా అలంకరణ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటారు. ఇందులో ముందుగా కేశాలంకరణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. దాని తర్వాతే దేనికైనా ప్రాముఖ్యత ఇస్తారు. ఎవరైనా సరే ఎంతమంచి డ్రస్ వేసుకున్నా, ఎంత మేకప్ చేసుకున్నా అందుకు తగ్గ కేశాలంకరణ లేకపోతే అది ఏ మాత్రం బాగుండదని చాలా మహిళలకు బాగా తెలుసు.

Diwali

ఇక ఈ పండుగ సందర్భంగా చాలా మంది అమ్మాయిలు వారి అభిరుచులకు తగ్గట్టు కేశాలంకరణ చేసుకుంటారు. కొంతమంది సాంప్రదాయ కేశాలంకరణను ఇష్టపడితే, మరికొందరు ట్రెండీ హెయిర్ స్టైల్స్ కోసం ప్రయత్నిస్తారు. ఈ సందర్భంగా మీరు మరింత అందంగా కనిపించడానికి కొన్ని ఆధునాతనమైన కేశాలంకరణల గురించి ఈ స్టోరీలో తెలుసుకోండి. మీరు కూడా ఈ కేశాలంకరణను ప్రయత్నించండి. అందరికంటే అందంగా కనిపించేందుకు మీ వంతు ప్రయత్నం చేయండి.

1) ట్విస్టెడ్ బన్ హెయిర్ స్టైల్..

1) ట్విస్టెడ్ బన్ హెయిర్ స్టైల్..

ఈ కేశాలంకరణ అన్ని రకాల సాంప్రదాయ దుస్తులతో చక్కగా అలంకరించుకుని మీరు పండుగ సందర్భంగా ఎక్కడికైనా వెళ్లడానికి సౌకర్యవంతంగా ఉంటుంది. పెళ్లి ఇతర కార్యక్రమాలకు ఈ కేశాలంకరణకు సల్వార్ కుర్తా లేదా చీర అయినా మీ మొత్తం రూపాన్ని మరింత అందంగా మారుస్తుంది. ఈ కేశాలంకరణను కొన్ని నిమిషాల్లో చేయవచ్చు.

2) ఫిష్ టైల్ అల్లిక..

2) ఫిష్ టైల్ అల్లిక..

భారతీయ సాంప్రదాయ దుస్తులతో ఎంతో అద్భుతంగా కనిపించే మరో రకమైన కేశాలంకరణ ఇది. ఈ అల్లికలో మీ కురులు చక్కగా కుదురుకుని ఉంటాయి. మీరు మీ ట్రెస్ ల గురించి ఎలాంటి ఆందోళన చెందకుండా ఈ పండుగను ఆస్వాదించగలుగుతారు. ఈ దీపావళి పండుగకు ఈ స్టైల్ తో అందరినీ అట్రాక్ట్ చేయండి.

3) పోనీ టైల్ హెయిర్..

3) పోనీ టైల్ హెయిర్..

ఈ దీపావళి పండుగ సీజన్లో అత్యంత అనుకూలమైన మరియు సులభమైనది ఈ కేశాలంకరణ. ఈ ప్రత్యేకమైన కేశాలంకరణ ఎల్లప్పుడూ ఒకే ధోరణిలో ఉంటుంది. అలాగే ఇది వివిధ రకాలైన వినూత్నమైన వస్త్రాలతో ఎక్కడికైనా బాగా తయారై వెళ్లవచ్చు. ట్రెస్ లను ఉంచడానికి కొన్ని బాబీ పిన్ లను ఉపయోగించండి.

4) సైడ్ స్విఫ్ట్ కేశాలంకరణ..

4) సైడ్ స్విఫ్ట్ కేశాలంకరణ..

ఈ సైడ్ స్వీప్ కేశాలంకరణ అనేది మంచి సొగసును చూపెడుతుంది. ఈ కేశాలంకరణను మీ పొడవాటి జుట్టుతో సులభంగా చేయవచ్చు. సైడ్ స్వీప్ హెయిర్ డోను పరిపూర్ణంగా చేయడానికి, మీ కురులకు హెయిర్ స్ప్రేని వాడండి. ఈ దీపావళి ఇలాంటి ప్రత్యేకమైన కేశాలంకరణను ఎంచుకోవడం ద్వారా మీ స్టైల్ గేమ్ ను అప్ గ్రేడ్ చేయండి.

5) ఆధునాతనమైన కేశాలంకరణ..

5) ఆధునాతనమైన కేశాలంకరణ..

మీరు దీపావళి దీపం లాగా వెలిగిపోవాలంటే మీరు ఈ అధునాతనమైన కేశాలంకరణను ప్రయత్నించి చూడండి. దీనిని బ్యాక్ అప్ - డూ స్టైల్ అంటారు. దీని వల్ల మీ కురులతో పాటు మీ ఫేసు క్రాకర్స్ లో నుంచి వచ్చే కాంతుల్లా వెలిగిపోతుంది.

6) బీచ్ వేవ్స్..

6) బీచ్ వేవ్స్..

మీకు చిన్నగా లేదా మధ్యస్థ జుట్టు మాత్రమే ఉంటే మీ బీచ్ వేవ్స్ అలంకరణను సులభంగా చేసుకోవచ్చు. సాంప్రదాయ దుస్తులతో కూడిన ఈ వైవిధ్యమైన కేశాలంకరణ మీకు నమ్మశక్యం కానిదిగా అనిపిస్తుంది. ఈ రూపాన్ని పొందడానికి కర్లింగ్ లేదా స్ట్రెయిట్ హెయిర్ ను ఉపయోగించండి.

7) ఫిష్ టైల్ బన్..

7) ఫిష్ టైల్ బన్..

జుట్టు పొడవు ఎక్కువగా ఉన్న మహిళలకు ఈ ఫిష్ టైల్ బన్ సరైన ఎంపిక అవుతుంది. ఈ అధునాతన కేశాలంకరణ మీరు ధరించే ఏ దుస్తులలో అయినా మీ స్టైల్ ను ఇట్టే అట్రాక్ట్ చేస్తుంది. రాత్రిపూట సైతం ఈ కేశాలంకరణ చెక్కు చెదరకుండా ఉండేలా వీటిపై బాబీ పిన్స్ ను ఉంచండి.

8) మెస్సీ బన్..

8) మెస్సీ బన్..

ఈ మెస్సీ బన్ కేశాలంకరణ శైలిని చాలా మంది మహిళలు ఎక్కువగా ఇళ్లలో ఉన్నప్పుడు ఉపయోగిస్తుంటారు. ఇది చాలా సులభమైన మరియు అధునాతమైన కేశాలంకరణగా కూడా కనిపిస్తుంది. ఈ హెయిర్ స్టైల్ రాత్రిపూట ఉండేలా చూడటానికి దీర్ఘకాలం ఉండే హెయిర్ స్ప్రేను కూడా పిచికారీ చేయండి.

9) టాప్ నాట్..

9) టాప్ నాట్..

ఈ రకమైన కేశాలంకరణను ఎక్కువగా సినిమా హీరోయిన్లు, సెలబ్రిటీలు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. మీరు చాలా నీటిగా మరియు చక్కగా కనిపించాలనుకుంటే ఈ కేశాలంకరణ కచ్చితంగా మీకు సరిపోతుంది. ఈ శైలిని మీరు మరింత అందంగా పొందడానికి మీరు చక్కని దంతాల దువ్వెనను ఉపయోగించాలి.

10. హై పోనీ టైల్..

10. హై పోనీ టైల్..

ఈ కేశాలంకరణలో ఏ దుస్తలు ధరించినా మీరు నమ్మలేనంత అందంగా కనిపిస్తారు. ముఖ్యంగా ఈ దీపావళి పండుగ సీజన్లో చాలా మంది ఈ శైలిని ఇష్టపడతారు. ఎక్కువగా అనుసరిస్తారు. ఈ దీపావళి పండుగకు మీరు చాలా సౌకర్యవంతంగా ఉండటానికి మరియు అధునాతనంగా కనిపించడానికి మీరు ఈ హై పోనీ టైల్ శైలిని ప్రయత్నించి చూడండి.

English summary

Diwali 2019: Trendy Hairstyles To Try This Festival

No matter how pretty your dress is or how perfect your makeup looks, if your hairdo is not up-to-mark, then none of it matters. Furthermore, leaving your hair open on a day like Diwali can prove to be bothersome. Whether you'll be lighting diya or bursting crackers, it is best to wear your hair in a way that keeps you comfortable.
Story first published:Wednesday, October 23, 2019, 12:24 [IST]
Desktop Bottom Promotion